యెఫ్తా జీవితము | Sevakula Prasangaalu Telugu Pdf | Biblesamacharam 1

అంశం :- యెఫ్తా జీవితము! 

Sevakula Prasangaalu Telugu Pdf

13 మంది న్యాయాధిపతులలో యెఫ్తా 9వ వాడు. యెఫ్తా అంటే “ఆయన తెరుచును” అని అర్ధం. ఎన్నికలేనివాడు, వేశ్య కుమారుడని తన సొంతవారిచే త్రోసివేయబడిన వానికి ఎన్ని ద్వారాలు తెరిచాడో దేవుడు! 

1..) తృణీకరింపబడ్డవాడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:1,2,3

1.గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.

2.గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతోనీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.

3.యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివ సింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితో కూడ సంచరించుచుండెను.

(తండ్రి ఒక్కడు, తల్లులు ఇద్దరు కల్గినవాడు యెఫ్తా. అందులోను ఒక వేశ్య కొడుకు ఇతడు. మరో తల్లికి పుట్టిన అన్నలు, తమ్ముణ్ణి (యెఫ్తాను) తిరస్కరించారు. “త్రోసివేసింది రాశికొస్తుంద”న్నట్టు యుద్ధంలో యెఫ్తానే దిక్కయ్యాడు వారికి – 1కొరింథీ 1:29, 1సమూయేలు 2:8, యెషయా 41:14,15 నీవు ఎన్నికలేనివాడవా? నీవు ఎన్నికలోకి వస్తావు భయపడవద్దు) 

2.) విశ్వాస వీరుడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:9,10

9.అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయినమీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధా నుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా

11:9 “యెహోవా…చేస్తాడనుకోండి”– యుద్ధంలో విజయం తన నేర్పు వల్ల కాక దేవుని కృపవల్లే వస్తుందన్న గుర్తింపు. హీబ్రూ 11:32 లోని విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తా కూడా చేరాడు.

10.గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.

(యుద్ధంలో దేవుడు నాకు శత్రువుపై విజయం దయచేస్తాడనే విశ్వాసం కలిగినవాడు. విశ్వాస వీరుల పట్టీలో యెఫ్తా పేరున్నది – హెబ్రీ 11:33; విశ్వాసమే విజయానికి నాంది) 

3.) . ప్రార్థనాపరుడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:11

11.కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

(ప్రార్థనకు మించింది ఏముంది? ప్రార్థనకు ప్రత్యామ్నాయం ఎక్కడుంది? పోరాటానికి బలమునిచ్చేదే ప్రార్థన) 

4.) దేవుడు న్యాయం తీర్చునని నమ్మాడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:27

27.ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక.

11:27 “న్యాయమూర్తి”– 1 సమూ 24:12-15. తమకు ఏది ఉండాలో ఏది ఉండకూడదో దేవుని నిర్ణయానికే వదిలేసేవారు జ్ఞానం గలవారు. న్యాయం తీర్చడం ఆయనకే వదిలేసేవారు వివేకవంతులు (ఆది 18:25; ద్వితీ 32:4; 2 దిన 19:7; కీర్తన 58:11; 71:9; 75:7; 89:14; 94:2). Sevakula Prasangaalu Telugu Pdf 

(నీకు జరుగుతున్న అన్యాయాలూ, అక్రమాలను బట్టి బాధపడ్తున్నావా? అసలు, ఈ లోకంలో న్యాయమే లేదు అనుకుంటున్నావా? దేవుడు గొప్ప న్యాయాధిపతి! గుర్తుంచుకో – 1 పేతురు 2:23; ఆది 18:25, 1సమూ 24:15) 

5.) అభిషేకం గలవాడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:29

29.యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.

(నీ అభిషేకమే నిన్ను నిలబెడ్తుంది. ఆత్మాభిషేకం లేనివాడు ఏమీ లేని అనాధ వంటివాడు) 

6.) యుద్ధమునకు సాగివెళ్లినవాడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:29

29.యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.

(శోధనలూ వేదనలూ ముంచుకొచ్చినప్పుడు “సాగి” పోటానికీ బదులూ “ఆగి” పోతున్నారు. సాగుట ఎదుగుదలకు అసలైన ప్రతీక! నిర్గమ 14:15) 

7.)  మాట తప్పనివాడు – యెఫ్తా.

 (న్యాయాధిపతులు) 11:30,31,32,33,34,35

30.అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల

31.నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

32.అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని

33.అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరా మీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేష ముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

34.యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.

35.కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపు కొని అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయలేననగా Sevakula Prasangaalu Telugu Pdf 

(దేవునికి మాట ఇచ్చాడు – అది కష్టమైననూ తప్పలేదు! ఇష్టమైతే కష్టమైనదానిని చేయటానికైనా వెనుకాడం కదా! – ప్రసంగి 5:4, కీర్తన15:4) 

  • పనికిరాదు అనుకున్నవాడు పనికొచ్చాడు. నాటి యెఫ్తాను లేపిన దేవుడు నేడు నిన్నూ లేపుతాడు. రా! ఆయనకు అందుబాటులోకి! 


All Pdf Files Download….Click Here

Leave a comment

error: dont try to copy others subjcet.