నారబట్ట దొరికింది | what Is Shroud of Turin Jesus Telugu 1

Written by biblesamacharam.com

Published on:

యేసు దేహానికి చుట్టిన నారబట్ట దొరికింది! 

 what Is Shroud of Turin Jesus Telugu

 ఇటలీలోని టురిన్ నగరంలో ఉన్న శాన్ జియోవన్నీ బ్రాటిస్టా కెథడ్రెల్లో స్టీల్, బుల్లెట్ ప్రూఫ్ అద్దపు పేటికలో 14 అడుగుల 3 అంగుళాల పొడవు, 3 అడుగుల 7 అంగుళాల వెడల్పు ఉన్న నారబట్ట అది! పురాతన కాలంలో రాజులను, పోప్లను; ప్రస్తుత కాలంలో చరిత్రకారుల్ని, జీవ రసాయన శాస్త్రజ్ఞుల్ని, బైబిలు పండితుల్ని, ఫోటోగ్రఫీ నిపుణుల్ని ఒకటేమిటి అన్ని రకాల ఆధునిక శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ; ఓ పట్టాన అంతుబట్టక మర్మముగానే మిగిలిపోయిన అపురూపమైన నారబట్ట అది! 

 ఇంతకీ ఈ నారబట్ట విశేషం ఏమిటి? – గడ్డం, పొడవాటి వెంట్రుకలు ఈ కలిగి ఉన్న ఒక మానవ శరీరం గుర్తులు ఆ బట్టపై ఉన్నాయి! పొడవుగా (చీరలాగా) ఉన్న ఆ గుడ్డపై ఆ శరీరాన్ని పడుకోబెట్టి తల మీదుగా గుడ్డ రెండవ సగాన్ని తీసుకొచ్చి కాళ్ళదాకా కప్పినట్టు ఆ గుడ్డపైన ముద్ర పడింది! అంటే ఆ గుడ్డను నిలువుగా పరిస్తే సగభాగం నుండి తల, వీపు, కాళ్ళ గుర్తులు; సగభాగం నుండి రెండవవైపుకు ముఖం, రొమ్ము, ముందుకు ముడుచుకొనియున్న చేతులు, కాళ్ళు వీటి వల్ల పడిన ముద్రలు ఉన్నాయి!what Is Shroud of Turin Jesus Telugu

 ఈ శరీరం ఎవరిదో! అతన్ని ఒళ్ళంతా కొరడాలతో కొట్టిన మచ్చలున్నాయి! అవి వాటి చివరి భాగంలో సీసపు గుళ్ళు లేక ఎముకల ముక్కలు కట్టిన కొరడాలు! ఆ కొన చర్మంపై పడిన చోట కొంత మేర చర్మం, కండ ఊడి వచ్చినట్టుగా తెలుస్తున్నది! చేతులు, కాళ్ళు, నడుము దగ్గర కాస్తంత ఎక్కువ రక్తం ఆ గుడ్డలోకి ఇంకిన గుర్తులు ఉన్నాయి! యేసుప్రభువు సిలువ మరణం తరువాత అరిమతమయ యోసేపు యేసు దేహానికి చుట్టిన నారబట్టే ఇది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం! 

 ఈ నారబట్టను మొదటిసారిగా ఫోటో తియ్యడం జరిగింది! సాధారణంగా ఫోటో తీసాక ఫిల్మ్ న్ను కడిగితే ముందు నెగెటివ్ వస్తుంది; దానిని ప్రింట్ చేస్తే మనం చూసుకొనే ఫోటో (పాజిటివ్) వస్తుంది! అయితే ఈ నారబట్ట ఫిల్ను కడిగినప్పుడు ఫోటో తీసిన వ్యక్తి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. నెగెటివ్కు బదులు, స్పష్టమైన పాజిటివ్ ఇమేజ్ కనిపించింది! అంటే ఆ నారబట్ట నెగెటివ్ ఇమేజ్! what Is Shroud of Turin Jesus Telugu

 1902లో వెస్ డీలేజ్ అనే సైంటిస్టు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. నారబట్టకు బోళము మొదలైన పురాతన కాలంలో వాడిన సుగంధ ద్రవ్యాలను పూసినప్పుడు ఆ గుడ్డ ఒక ఫిల్మ్ లాంటి గుణాన్ని పొందుతుందని, హింసలు పొంది చెమట కారిన మృతదేహాన్ని దానిలో చుట్టినప్పుడు ఆ మృత శరీరంపై ఉన్న చెమటలో నుండి అమోనియా ఆవిరి పుట్టి, నారబట్టపై శరీరం ముద్రలు పడతాయని నిరూపించాడు! దీనిని బట్టి ఆ నారబట్టలో చుట్టిన మృతదేహం క్రీస్తుదేనని అభిప్రాయ పడ్డాడు! 

 నారబట్టపై చేతుల ముద్ర పడిన స్థలములో రక్తంలాంటి ద్రవమేదో గుడ్డలోకి ఇంకిన గుర్తులు ఉన్నాయి! అయితే ఈ గుర్తులు సరిగ్గా అరచేతి ముద్ర దగ్గర కాకుండా, మణికట్టు ప్రాంతంలో ఉన్నాయి! 1930 ప్రాంతంలో డా॥ పియరీ బార్బట్ అనే జీవ శాస్త్రజ్ఞుడు అప్పుడే మరణించిన మానవ దేహాలతో ప్రయోగాలు జరిపి ఒక విషయాన్ని నిర్ధారించాడు. అరచేతుల్లో మేకులు కొట్టి ఒక దేహాన్ని వ్రేలాడదీస్తే అరచేతి ఎముకలు ఆ బరువుకు ఆగలేవు, చీరుకుపోతాయి! కాబట్టి అలా చెయ్యాలంటే మేకులను మణికట్టులో దించవలసి ఉంది! క్రీస్తు మరణించిన కొన్ని శతాబ్దాల తరువాత ఎవరైనా మోసగాడు ఈ నారబట్టను తయారుచేసాడను కొంటే అతనికి పైన చెప్పిన విషయం తెలిసే అవకాశం లేదు. బొమ్మల్లో ఉన్నట్టు, అందరూ అనుకొంటున్నట్టు మేకులు అరచేతిలోనే కొట్టారని నమ్మి, అరచెయ్యి ముద్రపడిన చోటనే రక్తం మరకలు వేసేవాడు కదా! అని డా॥ బార్బట్ వాదించాడు! 

 what Is Shroud of Turin Jesus Telugu

 అయితే ఇవన్నీ మనకు తెలియకపోయినా దేవుని వాక్యము ఉంది! “నార బట్టలు పడియుండుటయు, ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకు పోయి చూచి నమ్మెను” (యోహాను 20:7,8). దేవుని వాక్యము సత్యాన్ని బయలుపరచుచున్నది. మన ప్రభువు సజీవుడని మనము  ఎరుగుదుము!


All Pdf Files Download….Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted