చరిత్ర పూర్వకమైన గ్రంథము | Historical Book Bible Telugu

Written by biblesamacharam.com

Published on:

చరిత్ర పూర్వకమైన గ్రంథము 

Historical Book Bible Telugu

 ప్రపంచమందలి కొన్ని గ్రంథములు రంకు, బొంకు అనబడుచు కల్పితములై యుండగా పరిశుద్ధగ్రంథము మాత్రమే చరిత్రాత్మకమైన గ్రంథముగా నిలిచియున్నది.. 6000 సం॥ల చరిత్రను యే ఒక్క తప్పు లేకుండ బైబిల్ గ్రంథమందు నుండుట చరిత్ర పరిశోధకులు కనుగొని యున్నారు. టొలొమి యను ఐగుప్తు పరిశోధకుడు 18 మంది రాజుల పేర్లను గుర్తించియున్నాడు. అయితే ఏ ఏ పేర్లను. టొలొమి సూచించాడో ఆ పేర్లు పురావస్తు పరిశోధనలో గాని రాతి శేషనములో గాని మరియు వేరొక ఆధారములు కనిపించలేదు. అయితే పరిశుద్ధ గ్రంథములో సూచించబడిన ఇశ్రాయేలు గోత్రములు 40 మంది రాజుల పేర్లను మరియు వారి కాలమందు ఏలుచుండిన అన్య దేశపు రాజుల పేర్లు 26 మందిని గూర్చి భూగర్భ పరిశోధనలో కనిపెట్టబడియున్నవి. గిల్వమేష్ రాతి శేషణములు నోవహు దినములలో వచ్చిన జల ప్రళయము చరిత్రాత్మకమైనదని నిరూపిస్తోందని డా॥స్మిత్ అన్నారు. సిరియా దేశములోని EBLA ను స్థలమునందు చేయబడిన త్రవ్వకాలలో 40,000 మట్టి పలకలు దొరికాయి. అవి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సంఘటనలు సత్యము (చరిత్ర) యని నిరూపిస్తున్నాయి అని థామస్ నెల్సన్ చరిత్ర పరిశోధకులు అన్నారు. 

 అదే విధముగా 1948 సంవత్సరములో దొరికిన “Dead Sea Scrolls” బైబిల్ గ్రంథ చరిత్రను ధృవీకరిస్తున్నాయ్. చరిత్ర పరిశోధకులు ఏ చరిత్రను వ్రాయగలరంటే జరిగిపోయిన దానిని లేక జరుగుచూ వున్న దానిని మాత్రమే వ్రాయగలరు. అయితే పరిశుద్ధ గ్రంథము జరిగిపోయిన దాంతో మాత్రమే నిలిచిపోబోవు చరిత్రను కూడ వివరించింది. ఉదాహరణకు మహా చక్రవర్తియైన అలెగ్జాండరును బట్టి అతడు పుట్టుటకు 200 సం॥రాలకు పూర్వమే అతని గూర్చియు అతని ప్రభుత్వానికి తన తరువాత ఏమి జరుగునో దాని గూర్చి చక్కగా తెలియజేస్తుంది. 

 దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో దానియేలుకివ్వబడిన దర్శనమును గూర్చి వ్రాయబడియున్నది. అందులో దానియేలు దర్శనము చూచుచుండగా రెండు కొమ్ములు గల పొట్టేలును మరియు ఒక కొమ్ము గల మేక పోతును గూర్చి దర్శనము చూస్తూ ఈలాగు తెలిపాడు. రెండు కొమ్ములు గల పొట్టేలు కొమ్ములతో పశ్చిమముగాను, ఉత్తరముగాను, దక్షిణముగాను పొడుచుచుండుట చూచునంతలో పడమటి నుండి రెండు కన్నుల మధ్య ఒకే ఒక కొమ్ము గల మేక పోతు వచ్చి పొట్టేలును ఢీ కొని దాని కొమ్ములను పగులగొట్టి దాని ఓడించి విజయం సాధించి ఘనత వహించియుండగా దాని (మేకపోతు) ఒక కొమ్ము విరిగిపోయి దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టాయని చూచిన దానియేలు దర్శనము యొక్క భావమును తెలిసికొనుటకై ప్రార్థింపగా గబ్రియేలు దూత అతనికి ప్రత్యక్షమై ఈలాగు చెప్పెను. నీవు చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు మాదీయుల యొక్కయు, పారసీకుల యొక్కయు సామ్రాజ్యము. మరియు నీవు చూచిన మేకపోతు గ్రీకుల సామ్రాజ్యము. మేకపోతు యొక్క రెండు కండ్లు ‘మధ్య నున్న ఆ ఒక కొమ్ము గ్రీకుల ప్రధమ రాజని గబ్రియేలు చెప్పాడు. ఆ ప్రకారమే మాదియ పర్శియా సామ్రాజ్యాన్ని అర్బేల యుద్ధము ద్వారా అణచివేసిన అలెగ్జాండరు గ్రీకుల సామ్రాజ్యమును స్థాపించాడు. ఇది జగమెరిగిన చరిత్ర. అయితే దానియేలు ద్వారా దేవుడు పలికించిన భవిష్యత్ చరిత్ర అలెగ్జాండరు జీవితంలో జరిగిందా? పరీక్షించండి! సత్యాన్ని అన్వేషించండి!!  Historical Book Bible Telugu

 పంజాబును జయించి వెళ్ళుచున్న అలెగ్జాండరునకు విషపు జ్వరము వస్తుంది. అంచేత పక్క పట్టియున్న అలెగ్జాండరుని అడిగారట అయ్యా, మీ తరువాత మీ రాజ్యమును ఎవరికివ్వాలని అందుకతడు అది నా కుమారునికి కాదు బలవంతునికే చెందవల్సియున్నది. కావున నా సైన్యాధిపతులైన నలుగురికి పంచి పెట్టమన్నాడు. ఆ ప్రకారమే అలెగ్జాండరు చనిపోయిన తరువాత అతని రాజ్యమును అతని సైన్యాధిపతులైన 1) లైసిమాకస్ 2) సెల్యూకస్ 3) కసాండర్ 4) టొలొమి. నలుగురికి పంచివ్వడమైంది. అలెగ్జాండరు పుట్టుటకు 200 సం॥రాల ముందు అతని గూర్చి చెప్పబడిన ప్రవచనము ఒక్క మాటయైనను తప్పిపోకుండ ఆలాగే నెరవేర్చబడియున్నదంటే పరిశుద్ధ గ్రంథము చరిత్రాత్మకమైనది. ఆమేన్! 

ప్రప్రధమ పరిశుద్ధ గ్రంథము : ఆకాశములో కానివ్వండి, అవనిలో కానివ్వండి, విజ్ఞాన శాస్త్రము కానివ్వండి, చరిత్రలో కానివ్వండి ముద్రణలో కూడ పరిశుద్ధ గ్రంథమే ప్రధమమని స్పష్టమగుచున్నది. పుస్తకములు లేక కరపత్రములు ముద్రించుటకు ముద్రణాయంత్రము (Printing Machine) అవసరము. ముద్రణ యంత్రమును కనుగొన్న జాన్ గూడన్బర్క్, తన ముద్రణ యంత్రములో మొదటిగా ముద్రించినది పరిశుద్ధ గ్రంథము. దీనిని లాటిన్ వల్గేట్ అందురు. జాన్ గూడన్బర్క్ ముద్రించిన పరిశుద్ధ గ్రంథములు 21 ప్రతులు మాత్రమే యిప్పుడున్నాయని చరిత్ర పరిశోధకులు అంచనా. ఒక్కొక్క ప్రతి ఒక లక్ష డాలర్లు Newyork లో ఉన్న General Theological Seminary లో ఆ ప్రతులలో ఒకటి యింకా ఉన్నది. నాటి నుండి నేటి వరకు ప్రపంచ ప్రజల ద్వారా ప్రియముగా కొనబడు, చదవబడుచున్న ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. 

1968 డిశంబరు మాసం 24 వ తేదీన అంతరిక్ష పరిశోధకులగు Frank boreman, James Lowell, William Anderson (అపొలొ – 8) ను అంతరిక్ష వీరులు ఆ దినమున వారిచ్చిన భేటిలో వారు చదివి చెప్పినదేమనగా “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్యములు ప్రధమముగా ఆకాశమున చదువబడి యుండెను. అంత మాత్రమే కాదు తంతి విధానమును కనుగొన్నది Samuel F.B. Morse అనునతడు ప్రపంచములోనే ప్రధమముగాను అందులోను చాలా పెద్ద తంతి ఏదనగా పరిశుద్ద గ్రంథములోని సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వాక్యములో ఉన్న “ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును” వాక్యపు ఆధారముగా దేవుని కార్యములన్ని వరుస బెట్టి ఓ పెద్ద Telegram మొదటిగా పంపడమైండి. తంతి తపాల కారణ కర్తయైన Samuel F.B. Morse ఈలాగన్నాడు. నా జీవిత దినాలు ముగింపు సమీపమగు కొలది పరిశుద్ధ గ్రంథము యొక్క సత్యాలను చక్కగా తెలిసికొంటున్నానని సాక్ష్యమిచ్చాడు – అల్లెలూయా! 

ఆకాశవాణిలో పరిశుద్ధగ్రంథము : 1906 సం॥ము డిశంబరు మాసం 4వ తేదీన ప్రధమముగా రేడియో ప్రసారమైంది. విజ్ఞానియైన G. Marconi కనిపెట్టిన RADIO Telegraphy ద్వారా ప్రపంచములో మొదటి ప్రసారము కెనడా దేశమునకు చెందిన రెజినాల్డ్ పెసాండిన్ చేసారు. అయితే రేడియోలో ప్రధమముగా ప్రసారమైనదేంటో తెలుసా? లూకా సువార్తలోని 2వ అధ్యాయము 10వ వచనము చదివి క్రిస్టమస్ సందేశమిచ్చి క్రిస్టమస్ శుభాకాంక్షలతో ముగించాడు “రెజినాల్డ్”. ప్రపంచములో కొన్ని పుస్తకములను చదివే దిక్కు లేక మూలబడియుండగా పరిశుద్ధ గ్రంథము ప్రపంచ ప్రజల హృదయాలలో చోటు చేసికొనియున్నది. అంతటితో ఆగిపోలేదు. Nelson Gluek అనే భూగర్భ పరిశోధకుడు ఈలాగన్నాడు. ఇప్పటి వరకు 25,000 త్రవ్వకాలు (భూగర్భ పరిశోధనలో) జరిగించియున్నాము. మేము జరిగించిన 25,000పురావస్తు పరిశోధనలు పరిశుద్ధ గ్రంథములోని సత్యాలకు వేరుగానైనను, తారుమారుగానైనను ఉన్నట్టు చూడలేదన్నారు. అనగా శాస్త్రజ్ఞుల ద్వారా 25,000 పర్యాయాలు పరిశోధింపబడి సత్యమని నిరూపింపబడిన ఒకే ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. అన్నట్లు మీరు పరిశుద్ద గ్రంథాన్ని బహిరంగముగా చేతపట్టుకొని మందిరానికెల్లుచున్నారా? అనేక మంది సిగ్గు పడుతుంటారు. వారెవరో తెలుసా? పాపం మానలేని వారు, పూర్తిగా పాప క్రియలు విడవనివారు. నాకైతే బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొనుట ఎంతో ఆనందము “చేతి పుస్తకం హస్త భూషణం” అందురు. కీర్తనలు 149వ అధ్యాయము 9వ వాక్యములో “వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది; ఆయన భక్తులందరికి ఘనత యిదే” అని వ్రాయబడియున్నది. కావున అంతటి అమూల్య గ్రంథమగు బైబిలును చేత కలిగియుండుట నాకు దొరికిన భాగ్యమే. 

పరిశుద్ధ గ్రంథమును గూర్చి దేశాధిపతులు పలికిన గొప్పపలుకులు :

  1. ప్రపంచములో మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథములోనే యున్నది. అందుకై దాని (పరిశుద్ధ గ్రంథాన్ని) నిత్యము చదువుచుండవలెను. – రొనాల్డ్ రీగన్
  2. పరిశుద్ధ గ్రంథమును మరియు దేవుడును లేకుండ దేశమును సరియైనరీతిగా పరిపాలించుట అసాధ్యము. – జార్జి వాషింగ్టన్. 
  3. మానవ జాతికివ్వబడిన అతి ఉన్నతమైన బహుమానం పరిశుద్ధ గ్రంథము.అబ్రాహాం లింఖన్ 
  4. ఇటలిని విడిపింపగల బీరంగి పరిశుద్ధ గ్రంథమే – కరిబాలిటి
  5. ఎటు వెళ్ళాలి, ఏమి చెయ్యాలి అర్ధము కాని సందర్భాలు పలు పర్యాయాలునాకెదురయ్యాయి. ఆలాంటి సమయముల్లో బైబిల్ గ్రంథములోని నూతన నిబంధనను చదివి బలపరచబడినాను. – మహాత్మగాంధీ
  6. గొప్ప రచయితయిన V.E. గ్లాడ్ స్టోన్ (GLAD STONE) ఈలాగన్నాడు; నా దినములలో ఖ్యాతిగాంచిన 95 మందిని నేనెరుగుదును. వీరిలో 8/7 మంది పరిశుద్ధ గ్రంథమును అనుసరించు వారైయుండిరి. అట్టి విశిష్ఠమైన పరిశుద్ధగ్రంథముతో వేరే గ్రంథమును పోల్చినచో ఆ రెంటి మధ్య చెప్పనలవి కానంత తారతమ్యముంటుంది. పరిశుద్ధ గ్రంథముతో ఏది కూడా పోటీ పడచాలదు అని అన్నారు V.E. GLAD STONE.  Historical Book Bible Telugu
  1. ఇంగ్లాండ్ యొక్క మహిమకు కారణము పరిశుద్ధ గ్రంథమే.– విక్టోరియా మహా రాణి 
  1. పరిశుద్ధ గ్రంథమును చదివే ఏ ఒక్కరిని కూడా శారీరకముగానైనను లేక మానసికముగానైనను లోపరచుకొనుట అసంభవము, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము చదివే వారికి సత్యము తెలుసు. సత్యము తెలిసిన వాడు స్వతంత్రుడే గాని దాసుడు కాడు – గ్రాండ్. 
  1. ఇంగ్లాండ్ దేశములో రాజు (రాణి)గా పట్టాభిషేకము చేయు సమయములో పట్టాభిషేకము నొందబోవు రాజు యొక్క శిరస్సున రాజ మకుటముంచి పరిశుద్ధ గ్రంథమును చేతికిచ్చి – మహా ఘనత వహించిన రాజా, ప్రపంచములో బహు విలువైన శ్రేష్టమైన గ్రంథమును యిప్పుడు మేము మీ చేతికిచ్చి యున్నాము. ఇందులోనే జ్ఞానమున్నది మరియు రాజ్యాంగ చట్టమున్నది. మరి విశేషముగా ఇందులో దేవుని వాక్కులున్నవి; అని చెప్పి పట్టాభిషేకము చేయుదురు. Historical Book Bible Telugu

ఆహా! ఎంత గొప్ప గ్రంథమిది!! ఇట్టి గ్రంథమును మనకనుగ్రహించిన దేవునికి మహిమా ప్రభావములు సర్వకాలములు కలుగును గాక! 

Writer : Dr.J.Vasantha Babu Garu


All Pdf Files….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “చరిత్ర పూర్వకమైన గ్రంథము | Historical Book Bible Telugu”

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted