భయభక్తులు-ప్రయోజనములు | Pastors Best Messages In Telugu 4

   భయభక్తులు – ప్రయోజనములు

Pastors Messages In Telugu 4

  మనం భయపడవలసినవాడు కేవలం దేవుడే. భయపడటం అంటే పోలీసును చూచి నేరస్తుడు భయపడి పరుగెత్తినట్టు కాదు. ఆయనకు తగినట్టుగా, గౌరవపూర్వకంగా జీవించడం! ఆయన పద్ధతులకు విలువనివ్వటం! దేవుని యందు భయభక్తులు కలిగి యుంటే కలిగే మేళ్లు ఏమిటో చూద్దామా?

1. దేవుడు మనయందు ఆనందిస్తాడు.

 (కీర్తనల గ్రంథము) 147:11

11.తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.Pastors Messages In Telugu 4

147:11 A కీర్తన 33:18; 149:4; జెఫన్యా 3:17; మలాకీ 3:16-17; B యెషయా 62:4; C కీర్తన 35:27; D కీర్తన 33:22; సామెత 31:30; 1 పేతురు 1:13; E సామెత 11:20; 1 పేతురు 1:17

(దేవుణ్ణి ఆనందింపజేసేది మనలను ఆనందింపజేయాలి. మనం ఎవరియందైనా ఆనందిస్తే, వారికి ఎంతైన, ఏదైన యిస్తాం కదా! అలాగే దేవుడు కూడా!)

2. దీర్ఘాయువు కలుగుతోంది.

 (సామెతలు) 10:27

27.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.

10:27 వ 11; 9:10-11; ద్వితీ 11:9.

10:27 A సామెత 9:11; B యోబు 15:32-33; సామెత 3:2; C యోబు 22:15-16; కీర్తన 55:23; D కీర్తన 21:4; 34:11-13; 91:16; సామెత 3:16; ప్రసంగి 7:17; యిర్మీయా 17:11; లూకా 12:20

(దీర్ఘాయువు రెండు విధాలు : ఒకటి – భూమ్మీద దేవుని సాక్ష్యార్థమై ఎక్కువ సం.లు జీవించటం మరియు మన కాలానికి ముందుగానే పైకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటం! రెండవది – నిత్యత్వంలో ప్రవేశించడం!)Pastors Messages In Telugu 4

III. బహు ధైర్యము పుడుతుంది.

 (సామెతలు) 14:26

26.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

14:26 A కీర్తన 34:7-11; 115:13-14; సామెత 3:7-8; 18:10; 19:23; యెషయా 33:6; యిర్మీయా 32:39-40; B కీర్తన 112:1, 6-8; సామెత 3:25-26; మలాకీ 3:16-18; 4:2; అపొ కా 9:31; C ప్రసంగి 7:18; D ఆది 31:42; యెషయా 26:20-21

(చిన్న దావీదు పెద్ద గొల్యాతు పైకి అంత ధైర్యంగా యుద్ధానికి ఎలా వెళ్లగల్గాడు? – దేవునిలో భయభక్తులు ఉంచాడు! జీవితపు చిక్కులను ఎదిరించే ధైర్యం నీక్కావాలా? భయభక్తులు కలిగి యుండుము)

4.) అపాయము రాదు .

(సామెతలు) 19:23

23.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.

19:23 A సామెత 12:21; 14:26-27; యెషయా 58:10-11; మత్తయి 5:6; ఫిలిప్పీ 4:11-12; 1 తిమోతి 4:8; హీబ్రూ 13:5-6; B కీర్తన 85:9; 90:14; 91:16; 103:17; 145:18-20; సామెత 10:27; మలాకీ 3:16-17; 4:2; రోమ్ 8:28; 1 తిమోతి 6:6-9; C కీర్తన 25:13; 33:18-19; 34:9-11; 2 తిమోతి 4:18; D కీర్తన 19:9; అపొ కా 9:31

(దేవుడే మనకు రక్షణ కేడెముగా ఉంటే మనకెలా అపాయం వస్తుంది?)

5.) గొప్ప మేలు పొందుతాం.

(కీర్తనల గ్రంథము) 31:19

19.నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

31:19-22 మరోసారి నమ్మకం, ప్రార్థన విజయం సాధించాయి. విచారంలో ఉన్న మనస్సుకు ఆదరణ, ఆనందం తెచ్చాయి.

31:19 సంఖ్యా 23:23; కీర్తన 16:11; 23:5; 36:7-10; 68:28; 73:1, 24-26; 126:2-3; 145:7-9; యెషయా 26:12; 35:10; 64:4; విలాప 3:23-25; యోహాను 3:21; అపొ కా 15:12; రోమ్ 11:22; 1 కొరింతు 2:9; 2 కొరింతు 5:5; కొలస్సయి 3:2-4; హీబ్రూ 10:34; యాకోబు 2:5; 1 పేతురు 1:4-5; 1 యోహాను 3:1-2 Pastors Messages In Telugu 4

(అదేదో మామూలు మేలు కాదు – సిద్ధపర్చిన మేలు! అట! మైలపడ్డ మన బతుక్కి మేలు చేయకుండ ఉండలేడాయన)

6. కోరుకోవలసిన మార్గంను బోధిస్తాడు.

 (కీర్తనల గ్రంథము) 25:12

12.యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

(జీవితంలో అనేకసార్లు ఏ మార్గాన్ని కోరుకోవాలో తెలీని పరిస్థితిలో ఉండిపోతాం మనం. అన్నీ మనకు మంచి మార్గాల్లాగానే తోస్తాయి. అప్పుడు దేవుడు చేయి పట్టి నడవాల్సిన మార్గంలో నడిపిస్తాడు)

VII. కృప మనపై నిలుస్తుంది.

 (కీర్తనల గ్రంథము) 103:17,18

17.ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

103:17 మనిషి దౌర్భల్యాన్నీ, కొద్దిపాటి జీవితాన్నీ దావీదు దేవుని శాశ్వతమైన ఉనికికీ, నిత్యమైన అనుగ్రహానికీ పోలుస్తున్నాడు (25:6; యోహాను 10:29; 1 పేతురు 1:3-5).

103:17 A కీర్తన 100:5; ఎఫెసు 2:4-7; B నిర్గమ 20:6; 2 తిమోతి 1:9; C కీర్తన 136:1-26; అపొ కా 13:32-34; రోమ్ 1:17; 3:21-25; 8:28-30; 15:8; ఎఫెసు 1:4-8; 2 తెస్స 2:13-14; 2 పేతురు 1:1; D ద్వితీ 10:15; కీర్తన 22:31; 25:6; 89:1-2; 90:16; 118:1; యెషయా 41:8; 51:6; యిర్మీయా 31:3; 33:24-26; మీకా 6:5; E యెషయా 46:13; దాని 9:24

18.ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. Pastors Messages In Telugu 4

103:18 ఈ కీర్తనలో చెప్పిన మేళ్ళన్నీ ఒకే రకం వ్యక్తులకే – దేవుని పట్ల భయభక్తులు గలవారే (వ 11,13), ఆయనకు లోబడేవారే వీటిని పొందగలరు. మనం దేవుణ్ణి గౌరవించి ఆయనకు విధేయులుగా ఉండేందుకు ప్రయత్నించకపోతే ఆయన ఇచ్చే దీవెనలను పొందాలని చూడడం వ్యర్థం. దేవునిపై భయభక్తుల గురించి 34:11-14; 111:10; ఆది 20:11; సామెత 1:7 నోట్స్ చూడండి.

103:18 A ద్వితీ 7:9; కీర్తన 25:10; B నిర్గమ 24:8; సామెత 3:1; మత్తయి 28:20; లూకా 1:6; అపొ కా 24:16; C ఆది 17:9-10; నిర్గమ 19:5; ద్వితీ 4:23; 6:6-9; 2 దిన 34:31; కీర్తన 119:9-11; 132:12; హీబ్రూ 8:6-13; D 1 తెస్స 4:1

(విశ్వాసంలో ఎదుగునప్పుడు కృప అవసరం! సమస్యలను జయించుటకు కృప అవసరం! కృప మనపై నిలిస్తే, మనము విశ్వాసంలో నిలుస్తాం!)

  • భక్తియుంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా మ్రోగునో – భయము మరియు భక్తి రెండును మనలో ఏకము కావాలి.

బైబిల్లో మీకు తెలియని అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం క్లిక్ చేయండి…..CLICK HERE

Leave a comment

error: dont try to copy others subjcet.