బైబిల్ పరిశుద్ద మైనదా?
Is the Bible Holy telugu – Bible Question And Answers In Telugu
విమర్శ: బైబిల్ నందు పరిశుద్ధతను, పరిశుద్దులను గూర్చి మాత్రమే వ్రాయబడియున్నదా? పాపమును గూర్చియు, పాపులను గూర్చియు వ్యభిచారమును గూర్చియు దావీదు తదితరులు పొరుగు వాని భార్యను దోచుకొనుటయును, అపవిత్రమైన వాటిని గూర్చియు వ్రాయబడలేదా? ‘పాపులను గూర్చియు, పాపుల చరిత్రను గూర్చియు వ్రాయబడియున్న బైబిల్ గ్రంధము ఎట్లు పరిశుద్ధగ్రంథము కాగలదు?
జవాబు: నేటి క్రైస్తవులు ఎదుర్కొంటున్నట్టుగానే మన దేశ పితయైన గాంధీజీ కూడ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు తనను ప్రశ్నించిన స్వాతంత్ర పోరాట యోధులకు గాంధీజీ ఈలాగు ప్రత్యుత్తరమిచ్చారు “నేను బైబిల్ గ్రంధాన్ని పరిశుద్ధముగానే చూస్తాను. ఎందుకనగా అది పరిశుద్ధమైనది గనుక, అదేట్లు పరిశుద్దమైనది? బైబిల్ గ్రంథములోని భక్తులు పాపము చేయలేదా? అందులో పాపులను గూర్చి వ్రాయబడలేదా అంటే నిశ్చయముగా వ్రాయబడియున్నది” బైబిల్ గ్రంథ ప్రత్యేకత యేదనగా, భక్తులు చేసిన తప్పులను తప్పులుగానే గుర్తించి, వారు చేసిన తప్పులకు తగిన శిక్ష నిచ్చిన గ్రంథము గనుక అది పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతోందని మన దేశ పితయైన గాంధీజీ అన్నారు అంతమాత్రమే కాక పాపులను గూర్చి వ్రాయబడినను వారిని ఏ మాత్రము సమర్థించక వారికివ్వబడిన శిక్షను గూర్చియు వ్రాయబడియున్నది. ఎందుకనగా రానున్న తరము వారికి దృష్టాంతరముగా నుండునట్లు వ్రాయబడియున్నదయని లేఖనములు సాక్ష్యము లిచ్చుచున్నవి గమనింపుము. “అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారమును మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి” (1 కొరింథీ 10:5-6) మరియు “వారిలో కొందరివలె మీరు విగ్రహారాధికులై యుండకుడి. మరియు వారి వలె వ్యభిచరింపకయుందుము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే యిరువది మూడు వేలమంది కూలిరి” అని 1 కొరింధీ 10:7-8 వాక్య భాగమందున్నది. ఆ ప్రకారమే 11,12 వచనములను చూచినచో అందీలాగు వ్రాయబడియున్నది?
“ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నన్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” నేటి భక్తజనం భక్తిహీనులు కాకుండునట్లు పాపములు చేసిన వారిని గూర్చి వ్రాయబడినను అట్టి కార్యములను జరిగించిన వారిని, అట్టి కార్యములను ఎంత మాత్రము ప్రోత్సాపరచక నీచకార్యములు జరిగించిన వారికివ్వబడి శిక్షను గూర్చి వ్రాసియుండుటయే బైబిల్ గ్రంధము. పరిశుద్ధ గ్రంథమని పిలువబడుటకు ప్రధమ హేతువైయున్నది.
భక్త పౌలు రోమా 15:4లో ఈలాగు చెప్పుచున్నాడు “ఏలయనగా ఓర్పువలనను, లేఖనము వలనను, ఆధరణ వలనను, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి” అని సూచించెను. పరిశుద్ధగ్రంథము, పరిశుద్ధ గ్రంథము ప్రబోధిస్తున్న దేవుడును ప్రజలు పరిశుద్దులుగా వుండాలని సూచించుటయే తప్ప, పాపమును ప్రేమించుట లేదని గ్రహింప గోరుచున్నాను. Is the Bible Holy Telugu
“నేను పరిశుద్దడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తయందు పరిశుద్ధులైయుండుడి” (1పేతురు 1:14-16) ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్కులతో నిండిన పరిశుద్ధ గ్రంథము పాపిని ప్రేమించి పాపమును ద్వేషించుటయు, దోషము పరిహారించి దోషిని క్షమించి రక్షించుటయు మాత్రమే బైబిల్ గ్రంథమందు సద్విమర్శకుల కనుపించును, పాపము, అక్రమము, అనువాటిని కొంచెమైనను ప్రోత్సాహపరచక పాపమును ఖండించిన ఏకైక గ్రంథము బైబిల్ గనుక “పరిశుద్ధ గ్రంథము” అని పిలువబడుచున్నది. హల్లెలూయా!
ప్రపంచములోని గ్రంథములన్నియు జీవమొంది ఒక మహాసమా వేశమునకు వచ్చినచో ప్రపంచగ్రంథములన్ని వచ్చి పిమ్మట బైబిల్ గ్రంథము వచ్చినయెడల; దేవుని మందసపు పెట్టి దాగోను గుడిలో ప్రవేశించినప్పుడు, దాగోను గుడిలో వున్న దేవత విగ్రహములన్నియు ఏలాగు మందసపు పెట్టి యెదుట సాష్టంగా పడిపోయెనో ఆ ప్రకారమే, బైబిల్ ప్రవేశించిన వెంటనే మిగిలిన ప్రపంచ గ్రంథములన్నియు బైబిల్ గ్రంథము యెదుట సాష్టాంగా పడునని వందలాది విజ్ఞాన విధులను కనుగొన్న శాస్త్రజ్ఞుడు సర్ ఐజాక్ న్యూటన్ అన్నారు, విజ్ఞానమును గూర్చి పది లక్షల మాటలు వ్రాసిన న్యూటన్ బైబిల్ను గూర్చి పద్నాలుగు లక్షల మాటలు వ్రాసారు.
నెల్సన్ గ్లూయిక్- యితనొక భూగర్భ పరిశోధకుడు, తానంటాడు. మేము జరిగించిన 25 వేల త్రవ్వకాలలో యే ఒక్కటి కూడ బైబిల్ గ్రంధానికి వేరుగాను, తారు మారుగాను ఉన్నట్టు చూడలేదన్నారు అనగా యిరువదియైదు వేల పర్యాయాలు పరిశోధింపబడి సత్యము అని నిరూపింప బడినదంటే, బైబిల్ గ్రంథము పరిశుద్ధమైనది మాత్రమే కాక సత్యమైయున్నదని కూడ నిరూపించడమైంది.
కవిరాజు కణ్ణదాసన్ తను రచించిన “యేసు కావ్యము” అను గ్రంథములో నేను పాపినని, నా పాపముల నిమిత్తము పశ్చాతాపడాలని ప్రేరేపించింది పరిశుద్ధ గ్రంధమేనని పేర్కొన్నారు. పాస్టర్ బీకాన క్కు వుత్తరం వ్రాసిన డార్విన్ – తన లేఖలో- మిస్టర్ బికాన్ మా విజ్ఞానం ద్వారా మేము చేయలేని కార్యమును, మా ప్రాంతములో మీరు జరిగించిన 30 దినాల బైబిల్ సెమినార్ ద్వారా సాధించారు. అదేదనగా మా విజ్ఞాన శాస్త్రము ద్వారా ఒక త్రాగుబోతును కూడ మేము మార్చలేదు, అయితే మీరిచ్చిన బైబిల్ ప్రబోధనద్వారా సెమినార్లో పాల్గోన్న త్రాగుబోతులందరు మారిపోయారు. అందుకు నా కృతజ్ఞతలని వ్రాసారు. ఈలాగు బైబిలును చదివి ఆ వాక్యముల ద్వారా మార్చబడిన వారి సాక్ష్యములు లక్షలాది నేను చూపించగలను. అలాగు బైబిల్ వాక్యాలు త్రాగుబోతులను, వ్యభిచారులను, గుండాలను, దొంగలను మార్చగలుగుచున్నాదంటే, బైబిల్ గ్రంధము పరిశుద్ధమైనది కాక వేరేమవుతుంది? యిందులో పాపుల చరిత్రవుందంటే, పై నివ్వబడిన వాక్యాధారము (1 కొరింధీ 10:5 – 6,7,8,11,12, రోమా 15:4, 1 పేతురు 1:14-16) ప్రకారము మనలను పరిశుద్ధపరచుటకు లిఖింపబడిన హెచ్చరికలే. అంచేత బైబిల్ పరిశుద్ధ గ్రంథమని సత్యన్వేషుకులు అంగీకరింతురు. Is the Bible Holy Telugu
క్రీస్తు జీవిత చరిత్ర కొరకు .. click here