Jesus – గతానుభవ వేదిక – Bible Upamanalu Telugu 1

Written by biblesamacharam.com

Published on:

గతానుభవ వేదిక

Bible Upamanalu Telugu

 అది న్యూయార్కులోని ట్విన్ టవర్స్కి కొద్ది దూరంలో ఓ చిన్న పాతకాలం భవంతి. అది ఒక యూదుని వ్యాపారానికి సంబంధించిన గోడౌన్. అందులో ఒక టేబుల్ వేసి, దానిమీద ఓ క్రొవ్వొత్తుల స్టాండు పెట్టి ఉంది. దానిని యూదులు సమాజమందిరముగా వాడుచున్నారు. అంటే, వారి ప్రార్థనాలయము అన్నమాట. దానినే సునగోగు అని పిలుస్తారు. 

 అక్కడికే ప్రతీ నిత్యం చుట్టు ప్రక్కల ఆఫీసుల్లో పనిచేసే యూదులు వచ్చి, ఆఫీస్ కి వెళ్లబోయే ముందు తమ ఉదయకాలపు ప్రార్థనలు చేసుకొని (పాతనిబంధన లేఖనాలు, ధర్మశాస్త్ర గ్రంథం) చదివి వెళ్తారు. 

యూదులలో “మినియాన్” అనే పద్ధతి ఒకటి ఉంది. అంటే, కనీసం పదిమంది ఉంటే గాని సునగోగులో కలసి ప్రార్థన చేయకూడదు. పదిమంది కలిస్తే ఒక మినియాన్ ఏర్పడుతుంది. 

ఆ సోమవారం ఉదయం ఆ యూదా వ్యాపారి మరియు మరో ఎనిమిది మంది కలిసి మినియాన్ కోసం ఆ భవంతి బయట, తల పై టోపీలు ధరించి వేచి ఉన్నారు. వారంతా 50 ఏళ్లు పైబడిన నిష్టగల యూదులు. మినియాన్కు ఇంక ఒకరు తక్కువయ్యారు. అక్కడే వారు ఆతృతగా ఎదురుచూడసాగారు. ఒకరు వస్తే మినియాన్ గా ఏర్పడి ప్రార్థనలు చేసుకోవచ్చు.  Bible Upamanalu Telugu

వచ్చిన ఎనిమిది మంది కూడా ప్రొఫెషనల్స్. తమ ఆఫీసులో ఉదయం తొమ్మిదికల్లా ఉండాలి కాబట్టి అసహనంగా చేతి గడియారాల వంక చూసుకొంటూ “ఏం చెయ్యాలి?” అన్నట్లు ఒకరి వంక మరొకరు చూసుకోసాగారు. ప్రార్థన ఆరంభించుకోటానికీ ఇంకొకరి అవసరం ఉంది. 

“ఇలా ఎన్నడూ జరగలేదు” చెప్పారు ఒకరు. 

“సహనంతో ఎదురు చూడండి. పదో వ్యక్తి కొద్ది క్షణాల్లో వస్తాడు” నవ్వుతూ చెప్పాడు దేవునిపై నమ్మకం గల ఆ వ్యాపారి. 

వారిలో చాలామంది తమ ఆఫీసులకి వెళ్లాల్సిన సమయం దగ్గరపడ్తుంది. కానీ వారంతా మంచి విశ్వాసం గల యూదులు. మినియాన్ లేకుండా ప్రార్థించలేరు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వారికి . 

“ఇక లాభం లేదు. నేను వెళ్తాను” అంటూ ఒకడు నిస్సహాయంగా చెప్పాడు. 

అతను నాలుగు అడుగులు వేయగానే మిగతా వాళ్లు కూడా అతన్ని అనుసరించారు. అకస్మాత్తుగా వారికి గబగబ నడచి వస్తున్న ఒక వృద్ధుడు కనిపించాడు. నెత్తిమీద టోపీ, చేతిలోని గ్రంథమును బట్టి, అతడు యూదుడని అర్ధమవుతోంది. Bible Upamanalu Telugu

“ప్రార్థన అయిందా?” అంటూ ఆదుర్దాగా అడిగాడు ఆ వృద్ధుడు. “లేదు మీ కోసమే ఎదురు చూస్తున్నాం” చెప్పాడు వ్యాపారస్తుడు. “ఐతే పదండి. మనం ప్రార్ధన చేద్దాం. మీరింకా ప్రార్ధన మొదలు పెట్టనందుకు నాకు సంతోషంగా ఉంది” అన్నాడు. 

మామూలు పరిస్థితుల్లోనైతే, ఆ వృద్ధునితో ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడి ఆహ్వానించేవారు – ఆయన పేరు, ఎక్కడుంటాడు, టీ తాగుతారా మొదలైన వివరాలు అడిగేవారు. కాని ఆ రోజు వారంతా తొందరలో ఉండటంతో గబగబ లోపలికి దారి తీసారు. వచ్చిన ఆ వృద్ధుడు నెమ్మదిగా నడవడం మూలానా లోపలకి రావడం ఆలస్యమైంది. 

ఆయనకు మిగిలిన వారికి ఉన్న తొందర ఉన్నట్టు లేదు, ఏ పనీ లేనివాడు నిదానంగా పేజీలు తిరగేసినట్టూ, ఆయన పాత నిబంధన గ్రంథం యొక్క పేజీలు తన వ్రేళ్లతో తిప్పసాగాడు. 

మిగిలిన వారికి ఆయనంటే ఎంతో గౌరవం ఉన్నా, తమ ఉద్యోగాలకి వెళ్లాలనే తొందరలో అసహనంగా ఒకరి వంక మరొకరు చూసుకోసాగారు. 

“అయ్యా, మా ఉద్యోగాలకు ఆలస్యమవుతోంది” చెప్పాడు వారిలో ఒకరు. 

ఆ వృద్ధుడు నవ్వుతూ అతని వంక చూసి – “బాబూ! దేవుణ్ణి ఆరాధించడమే మనకి ప్రాముఖ్యమైన పని. మిగిలినవన్నీ తర్వాతే” అంటూ చెప్పాడు. 

ఆయన మొదటిసారి ప్రార్థన చేసి, లేఖనాలు చదివాడు. లేచి నిలబడి, ఆ లేఖనాలకు భాష్యం చెప్పసాగాడు. నిమిషాలు దొర్లిపోతున్నాయి. సమయం చక్రంలా వేగంగా గడచిపోతోంది. అందరి ముఖాల్లో నిరాశ, తొందర కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఉపదేశము కొనసాగుతూనే ఉంది – ఒకతను లేచి బయటకు నడిచాడు.  Bible Upamanalu Telugu

“ఆగు, స్నేహితుడా!” అంటూ అరిచాడు వృద్ధుడు. ఆయన మాట కాదనలేక అతడు ఆగిపోయాడు. ఆ ఉపదేశం ముగింపుకి వచ్చింది. అంతే, వారికి చెవులు చిల్లులు పడేంత పె…ద్ద శబ్దం వినిపించింది. వారు భయభ్రాంతులై బయటకు పరుగెత్తబోతూ ఉంటే ఆ వృద్ధుడు – “ఆగండి ఇంక చివరి ప్రార్థన చేయలేదు” అని అన్నాడు. 

ఐతే ఆ తొమ్మిదిమందిలో ఎవరూ ఆయన మాటని ఖాతరు చేయలేదు. బయటకు పరిగెత్తుకుని వెళ్లి చూస్తే, బయటంతా పొగ, దుమ్ము, మనుషుల అరుపులూ, కేకలూ వారి రోదనలూ… వారు నిర్ఘాంతపోయి తగలబడుతున్న ట్విన్ టవర్స్లోని వెస్ట్ టవర్ వంక చూసారు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి ఆఫీసుకి వెళ్లి ఉంటే తామంతా ఆ భవంతిలో ఆ మంటల మధ్య చిక్కుకొని కాలి బూడిదయిపోయి ఉండేవారమని వారికి అర్థం కాగానే ఒకరినొకరు చలించిన హృదయాలతో చెమ్మగిల్లిన కళ్ళతో ఆకాశానికేసి చూస్తూ – “దేవా! నువ్వెంత గొప్పవాడవు” అంటూ ఆయన్ను స్తుతించారు. 

నిజముగా ఆ వృద్ధుడే గనుక రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? కాబట్టి మనం ఆ వృద్ధుడుకి కృతజ్ఞతలు తెలియజేద్దామని లోపలికి వచ్చి చూడగానే – జరిగిన వింత ఏమిటంటే – “ఆ వృద్ధుడు అక్కడ లేడు!” 

ఉగ్రవాదుల దాడి జరిగిన ఆరోజు, ఆ వృద్ధుడు ఎక్కన్నుంచి వచ్చాడు? 

అది ఈనాటికీ మిస్టరీగానే మిగిలిపోయింది వారికి! 

ప్రియులారా! ఇది జరిగిన స్టోరీ. మన ప్రభువు మన యెడలను అద్భుతాలు అలానే చేస్తాడు. మనం ఎక్కవలసిన ట్రైన్ అంతలో మిస్సయిపోతుంది. విచారంగా… ఎందుకిలా జరిగింది? నేను అనుకున్న సమయానికంటే ముందే వచ్చానే అంటూ బాధపడతాం. ఆ ట్రైన్ వెళ్లిన కాసేపటికే మనం ఎక్కవలసిన ట్రైన్ పట్టాలు తప్పి పడిపోయింది అనే వార్త వింటాం. 

పిల్లలకు సమ్మర్ సెలవులు కదాని రేపు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మిమ్ములను రిసీవ్ చేసుకునే సోదరుడు – “రేపు కాదు, ఇవాళే రండి” అంటూ ఫోన్ చేసి త్వరపెట్టాడు. 

అప్పుడు మీకు ఎంతో అర్జంట్ పని ఉంది. పిల్లలూ, మీ ఆవిడ – “ముందు మనం వెళ్లాం. వచ్చాకనైన ఆ పని చేసుకోవచ్చు” అంటూ వారును తొందర చేసారు. 

చేసేదేమి లేక ప్రయాణం మొదలెట్టారు. మీరు వెళ్లి, మీ మిత్రుల్ని కలుసుకొని, సంతోషించి, భోజనాలు చేసిన తరువాత విశ్రాంతిలోకి వెళ్లబోయేముందు మీకు ఇంటి దగ్గర్నించి ఫోన్ వచ్చింది – “విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి, యిల్లు తగులబడిపోతుంది. ఆకాశానికి మంటలు ఎగసిపడ్తున్నాయి. త్వరగా రండి” అంటూ. Bible Upamanalu Telugu

ఒక్కసారిగా మీ హృదయం వణకసాగింది – “రేపు వెళ్లవలసిన ప్రోగ్రామ్కి, ఈరోజు మేము వెళ్లకపోయినట్లయితే ఏం జరిగి ఉండేది?” తలుచుకుంటేనే భయంగా ఉంటుంది కదూ! 

అనుకొనని సంఘటనల్లో జరిగే అంతులేని దైవకార్యాలూ యిలాగే ఉంటాయి. 

బైబిలు చెప్తోంది – “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” అంటూ (కీర్తన 34:19). 

మీ జీవితంలో యిటువంటి అద్భుతాలు మీరు చూసారా? యిట్టి అనుభవాలు మీకు ఉన్నాయా? ప్రభువుపై నమ్మకం ఉంచండి. అంతము మట్టుకు మిమ్ములను తన హస్తాలలో భద్రపరచే దేవుడు ఏ అపాయమును రానియ్యడు!  Bible Upamanalu Telugu

అపనమ్మకము వద్దు! విశ్వాసమే మన హద్దు!! 

అద్భుతాలు మన ముద్దు! జీవితంలో యింకేమి వద్దు!! 

 

 

 


మిషనరీ జీవిత చరిత్రలు .. click here 

 

 

 

 

 

 

 

 

Leave a comment