యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా ఇవ్వలేదా ?
Did Jephthah Actually Kill His Daughter
విమర్శ: దేవుడు.నరబలిని అంగీకరించునా? యిష్టము లేని పక్షమున, అబ్రాహాముతో తన కుమారుడైన ఇస్సాకును బలి యివ్వమని ఎందుకు కోరాడు? యెఫ్తా తన కుమార్తెను బలి యిస్తుంటే ఎందులకై మౌనము వహించాడు?
జవాబు : ఇస్సాకు విషయమైన వివరణ నేను వివరించనవసరం లేదు. ఆది 22 :1-12 చదివి కేవలము అబ్రాహామును పరిశోధించుటకే ప్రభువు అడిగెనని మీరే గ్రహించగలరు. కాని యెఫ్తా తన కుమార్తెను దహన బలి చేస్తుంటే దేవుడెందుకు చూస్తూ వూరుకున్నాడు? ఇస్సాకు విషయంలో అడ్డుకొన్నట్లు అడ్డుకోవచ్చును కదా? అనునదియే మీ ప్రశ్న. దీనిని తప్పించుకొనుటకు కొంతమంది సేవకులు – దేవుడు కోరలేదు. యెఫ్తా మ్రొక్కు కొన్నాడు. తాను చెల్లించాడు. అంతేనని సమస్య నుండి తప్పించుకొంటున్నారు. లేఖనాలను పరిశీలించండి. సత్యాన్ని అన్వేషించండి.
“అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చుచున్నప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును. మరియు దహనబలిగా దానినర్పించెదననెను” న్యాయాధి 11:27-31 మరియు 11:39 ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను” అని వ్రాయబడి యుండుట చేత ఆమె దహనబలిగా మార్చబడిందని అనేకుల భావన. దీనికి కారణం తొందరపాటే… శ్రద్ధగా గమనించినపుడు 31వ వచనములో నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునపుడు నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారము నుండి బయలు దేరివచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టతమగును. మరియు దహనబలిగా దాని నర్పించెదననెను. మీ బైబిలు తెరచి న్యాయాధి. 1:31 చూడండి. “మరియు” అను మాటకు పైన “సంఖ్య ఒకటి” వేయబడి యున్నది. దానిని క్రింద పాఠాంతరమున చూడండి. “లేదా” అని గుర్తించబడియున్నది. అనగా నా యింటి నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టతమగును లేదా దహనబలిగా మార్చబడును అన్నాడు. లేదా అను మాటకు కొన్ని ఉదాహరణలు చూడండి.
ఆంధ్ర క్రైస్తవ పుస్తకము లేదా సీయోను కీర్తనలు పుస్తకమైనా యివ్వు. మార్కెటుకు పోతున్న వ్యక్తితో యజమాని అంటున్నాడు. “పావు కేజి తెల్ల వుల్లిపాయలు తీసుకో లేదా యర్ర ఉల్లిపాయలు తీసుకో”. ఉపాధ్యాయులు పిల్లలతో “రేపు మీరు స్కెచ్ పెన్నులు తేవాలి లేదా కలర్ పెన్సిలయినా తేవాలి” అంటున్నారు. దీని భావమేమిటి? మొదట చెప్పింది వీలుకాకపోతే రెండవదైనా జరిగించుడని అర్ధము. యెప్తా ఏమంటున్నాడు? అది యెహోవాకు ప్రతిష్టతమగును.. “లేదా” దహన బలియగును. ఆలాగున యెహోవాకు మ్రొక్కుకొని యుద్ధరంగములో దిగాడు. విజయాన్ని సాధించాడు. జయశీలుడై యింటికి క్షేమంగా తిరిగి వస్తున్న తండ్రిని ఎదుర్కొన్న కుమార్తెను చూచిన వెంటనే జుట్టు పీక్కున్నాడు. వస్త్రములు చింపుకున్నాడు. పెద్దగా అంగలారుస్తూ యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుదీయలేనన్నాడు. దేవుని యందు భయభక్తులు తండ్రి గౌరవ ప్రతిష్టలు కాపాడుటకు శ్రద్ధాభక్తి కలిగిన ఆ కుమార్తె తన తండ్రితో “నా తండ్రి యెహోవాకు మాట యిచ్చియుంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ
శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొనియున్నాడని అతనితో చెప్పెను”. (న్యాయాధి 11: 36) యెఫ్తా నోటి నుండి బయలు వెళ్లిన మాట ఏమిటి? ద్వారమునుండి వచ్చునదేదో అది ప్రతిష్టతమగును లేదా దహన బలిగా అర్పించబడునని అన్నాడు. చేసిన ప్రమాణమును ఒప్పుకొన్న తీర్మాణమును తన కుమార్తె కు చెప్పినప్పుడు ఆమె ప్రతిష్టతను ఒప్పుకొన్నది. ఆలాగుఒప్పుకొనకపోయినట్లయితే దహనబలిగా యిచ్చేవాడేమో, కాని యెప్తా కుమార్తె తండ్రి మాట చొప్పున “యెహోవాకు ప్రతిష్టతమగుటకు ఒప్పుకొన్న కారణంగా ఆమె దహనబలిగా మార్చబడలేదని గ్రహింపగలము. ఆమెను బలి ఇవ్వకపోయిన యెడల యెప్తా ఎందుకు అంత పెద్ద పెట్టున ఏడవాలి? అనునది కొందరి ధర్మ సందేహం! ప్రతివారికి బైబిలు నందు చక్కగా సమాధానమున్నది. న్యాయాధి 11:30 లో యెఫ్తా మిస్పాలో నున్న తన యింటికి వచ్చుచున్నప్పుడు అతని కుమార్తె తంబురతోను, నాట్యముతోను బయలుదేరి అతని యెదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు అని వ్రాయబడియున్నది. అందులో ఆమె కన్యక. ఒక్కగానొక్క కుమార్తె మాత్రమే వుంటే ఆమె యెహోవా మందిరములో పరిచర్య చేయు నిమిత్తమై మరి యిక ఎన్నటికి వివాహము లేకుండునట్లు ప్రతిష్టత చేయబడుచున్న కారణంగా తానుకూడా మనుష్య రీతిగా ఏ సంతానము లేని కారణం చేత ఏడ్చాడు. బట్టలు చింపుకున్నాడు. కాని ఆ కుమార్తె తన తండ్రి యెహోవాకు ప్రతిష్టత యివ్వాలంటే నా కన్యాత్వమును గూర్చి రెండు నెలలు కొండల మీదకు పోయి నేను ప్రలాపించి వచ్చెదను. ఆ పై నన్ను ప్రతిష్టించమని కోరగా తండ్రియైన యెఫ్తా ఆలాగు సెలవిచ్చి ఆ రెండు నెలల అంతమందు తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున చేసెను (11:9). అనగా ఆమె తన జీవిత కాలమంతా యెహోవా సేవకు ప్రతిష్టించెను గాని, దహనబలి చేయలేదు. “నీవు బలి కోరువాడవు కాదు కోరిన యెడల నేను అర్పించుదును. దహనబలి నీకిష్టమైనది కాదు” (దా.కీ. 51:16). అని దావీదుగారంటున్నారు. కావున యెఫ్తా దహనబలి యివ్వలేదు. కేవలము ఆయన ప్రతిష్టత మాత్రమే చేసెను. Writer : Dr.J .Vasantha Babu Garu
For Pdf Download …..Click Here