12 నుంచి 30 సంవత్సర కాలంలో యేసు ఎక్కడికి వెళ్ళాడు |Where-was-Jesus-between-ages-12-and-30-What-was-he-doing-1

Written by biblesamacharam.com

Published on:

 

12 నుంచి 30 సంవత్సర కాలంలో యేసు ఎక్కడికి వెళ్ళాడు ?

 Where-was-Jesus-between-ages-12-and-30-What-was-he-doing-1

     ప్రశ్న : 12సం॥రాల వయస్సులో దేవాలయములో కనిపించిన యేసు మరల తన 30వ యేట నగపడుచున్నాడు. ఈ మధ్యకాలంలో యేసు ఎక్కడుండెను? ఏమిచేసెను? ఇందును గూర్చి బైబిలునందు ఏమి వ్రాయబడియున్నది. 

జవాబు : తెరచిన మనో(ఆత్మీయ) నేత్రముతోను, స్వస్థబుద్ధితోను పరిశుద్ధ గ్రంథమును చదివిన యెడల ప్రతి ప్రశ్నకు జవాబును, సమస్యకు సమాధానమును దొరుకుతుందియని జార్జిబుష్ తెలిపి యున్నాడు. కొందరనుకొనినట్లు ఆయన విద్యనభ్యసించుటకు భారత్ (ఇండియా) దేశమునకు రాలేదు. ఆయన (యేసుక్రీస్తు)కు 12 సం॥రాల వయస్సున్నప్పుడే “ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి (లూకా 2:47). ఆనాటి బోధకులు యేసునకు వేసిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబు వారినెల్లరిని ఆశ్చర్యచకితులను చేసింది. కావున ఆయన నేర్చుకొనుటకు ఎక్కడకు వెళ్ళనవసరములేదు. సద్విమర్శుకులు గ్రహింతురు. ఎందుకనగా “యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్దిల్లుచుండెను” (లూకా 2:52), 

12 సం రాలప్పుడు దేవాలయములో కనిపించిన యేసు ఆపై ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? 12-13 సం॥రాల మధ్య కాలవ్యవధిని పూర్తిచేయుటకు ఎన్నెన్ని కుతంత్రాలు పన్నుచున్నారో అసత్యవాదులు మీ బైబిలు తెరచి లూకా 2:51 చూడుడి. 

“అంతట ఆయన (యేసు) వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి (30సం॥రాల వరకు యుండెను). ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను”. 

12సం..రాలప్పుడు దేవాలయములో నుండి మరియ యోసేపులతో నజరేతుకు వెళ్ళిన యేసు వడ్రంగియైన తన తండ్రికి సహాయకుడిగా ఉంటూ వారికి లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చెను. యేసు తన 12వ యేట నుండి 30సం॥రాల వరకు యేసును చూస్తున్న యూదులు, ఆయనను గూర్చి ఇలాగంటున్నారు. “సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు (12 సం॥రాల నుండి 30సం॥రాల వరకు యేసుని చూచినవారు) ఆశపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి” (యోహాను 7:14-15). యూదులెందుకట్లు జెప్పుకొనిరి అనగా వారి కన్నులముందు మరియ యోసేపులకు లోబడి వడ్రంగి పనిలో తండ్రితో సహకరించిన ఈయన ఎప్పుడును ఎక్కడను విద్యనభ్యసించలేదే, ఈయనకెట్లు యింత పాండిత్యమని ఆశ్చర్యపోయిరి. Where-was-Jesus-between-ages-12-and-30-What-was-he-doing-1

సిరియ దేశపు రాయబారి (Ambassador) యను పొంతి పిలాతు మిత్రుడైన పబ్లియన్ వెంటులన్ అనబడు ఈయన యేసుక్రీస్తు సమకాలికుడు యేసును గూర్చి తానీలాగన్నాడు. 

“యేసు అనింధ్యుడు, యేసు తన 30వ సంవత్సరము వరకు తన తల్లిదండ్రులకు విధేయుడై 30వ సం॥రము నుండి పరమాత్ముని సేవను ప్రారంభించి రోగులను స్వస్థపరచెనని తెలియజేసాడు. మరియు ప్రపంచ ఖ్యాతిచెందిన “ఫ్లెవియస్ జోసిఫస్” క్రీస్తును గూర్చి ఇలా వ్రాసాడు. 

నా దినములలో యేసు అను ఒక సత్పురుషుని కనుగొంటిని.ఆయన చిన్నతనము నుండి దైవజ్ఞానం గలవాడు. యేసు తన బాల్యము నుండి దాదాపు 30 సం॥రాల వరకు తల్లిదండ్రులకు విధేయుడై ఆపై దైవసేవను కొనసాగించి ఎన్నో అద్బుతములు చేసెను  

ఆయన చేతులు రోగుల మీదుంచగా వారు స్వస్థతనొందిరి. చనపోయిన వారిని లేవనెత్తెను, ఎవరికి భయపడని నేను ఆయనకు భయపడితిని. ఎందుకనగా ఆయన సత్యమును బోధించెను, పరిశుద్ధునిగా జీవించెను. మాలోని కొందరి ఆలోచనలను బట్టి పిలాతు ఆయనను మాలోని కొందరి ఆలోచనలను బట్టి పిలాతు ఆయనను సిలువకు గొట్టి చంపెనని ఫ్లెవియస్ జోసిఫస్ తెలియజేసాడు. మరియు సిరియాదేశపు వాడైన హ్యూమర్ రచించిన ఇలీయాడ్ అను గ్రంథములో యేసునుగూర్చి ఈలాగు ప్రస్తావించి యున్నాడు. Where-was-Jesus-between-ages-12-and-30-What-was-he-doing-1

నజరేతు ఊరివాడైన యేసు తన 16వ సంవత్సరమున తన తండ్రియగు యోసేపుతో భారతదేశములోని మహారాష్ట్రమునకు వచ్చి (Teak Wood) కొనుగోలు చేసి, మరల తన తండ్రితోనే వచ్చినట్లు హ్యూమర్ తెలియ జేసాడు. వీటన్నిటిని బట్టి అర్ధమైనదేమిటి? 

యేసు తన 12 సం॥రాల నుండి 30 సం॥ల వరకు తల్లిదండ్రులకు లోబడి ఉంటూ 30సం॥రాల నుండి సేవను ప్రారంభించాడని స్పష్టమగుచున్నది. గనుక సద్విమర్శకులు సత్యాన్ని అన్వేషించి సత్యసారథియైన యేసుపై విశ్వాసముంచి పరలోకప్రాప్తి పొందండి.

ఆధారము : Complete Works of Josephus Dakes Bible Antiquity of the Jews 


సేవకులకు సంభందించిన ప్రశంగాల కోసం క్లిక్ చేయండి.. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted