ఆయన నక్షత్రము – Sevakula Prasangaalu Telugu

Written by biblesamacharam.com

Published on:

అంశం : ఆయన నక్షత్రము

Sevakula Prasangaalu Telugu

మూలవాక్యము : యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము “ఆయన నక్షత్రము” చూచి ఆయనను  పూజింప వచ్చితిమని చెప్పిరి.

 (మత్తయి సువార్త) 2:2

2.యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

2:2 రక్షకుడు, రాజు వస్తాడని పాత ఒడంబడికలో ఉన్న వాగ్దానాల గురించి ఈ జ్ఞానులకు కొంత తెలిసి ఉండాలి (యెషయా 9:6-7 మొ।।). క్రీ.పూ. 6 వ శతాబ్దంలో జరిగిన బబులోను చెర తరువాత పశ్చిమాసియా అనేక దేశాల్లో నివసించిన యూదుల మూలంగా ఈ సంగతి ఈ జ్ఞానులకు తెలిసి ఉండవచ్చు. ఎస్తేరు, దానియేలు పుస్తకాలు చూడండి. దాని 9:25-27లోని భవిష్యద్వాక్కులు ఆధారంగా వీరు క్రీస్తు జన్మించే కాలాన్ని లెక్కగట్టి ఉండగలిగేవారు. వీరు చూచిన నక్షత్రం ఏమిటో అది క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ఉన్నదని వీరికి ఎలా నమ్మకం కుదిరిందో మనకు తెలియదు. ఆ నక్షత్రం ఈ సందర్భం కోసమే దేవుడు సృష్టించిన ఒక ఆకాశ గోళమనీ, అది క్రీస్తు తార అని దేవుడు తన ఆత్మద్వారా ఈ జ్ఞానుల్లో నమ్మకం పుట్టించాడనీ ఈ నోట్స్ రచయిత నమ్మకం. వ 12 నోట్స్ చూడండి. వీరు కేవలం క్రీస్తును చూచేందుకూ, తమ కుతూహలాన్ని తీర్చుకునేందుకూ, ఆయన్ను గురించి వేదాంత చర్చలు జరిపేందుకూ వచ్చినవారు కాదు, ఆయన ఎదుట వంగి నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించేందుకు వచ్చారు.

1.ఆయన నక్షత్రము సాక్షిగా నిలచెను. నీవు సాక్షిగా నిలబడగలవా?

 (అపొస్తలుల కార్యములు) 1:8

8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. Sevakula Prasangaalu Telugu

1:8 5. ఇక్కడ బలప్రభావాలు అంటే దేవుడిచ్చే శక్తిసామర్థ్యాలు. ఇవి అస్వాభావికమైనవి, అమానుషమైనవి, మానవాతీతమైనవి. వారిని ఎదిరించే లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండేందుకూ, తగిన రీతిగా జీవించేందుకూ మాట్లాడేందుకూ సేవ చేసేందుకూ వారికి స్వభావసిద్ధంగా ఉన్న శక్తికంటే ఎక్కువ శక్తి అవసరం. కొత్త జన్మ మూలంగా (యోహాను 3:3, 5, 8) వారికి కలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి అవసరం. ఇప్పటికీ ఇది నిజం.

2.) ఆయన నక్షత్రము చీకటిలో ప్రకాశించెను. నీవు నిరంతరము ప్రకాశించగలవా?

 (దానియేలు) 12:2,3

2.మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

12:2 “లేస్తారు”– చనిపోయినవారు సజీవంగా లేవడం గురించి ఇక్కడ రాసి ఉంది. అంటే ఒకే సమయంలో పాపవిముక్తి పొందినవారు, పొందనివారు కూడా లేస్తారనా? ఇలా అని ఖచ్చితంగా ఏమీ రాసి లేదు. కేవలం పై రెండు గుంపులకూ చెందినవారు లేస్తారు అని మాత్రం ఉంది. ప్రకటన 20:4-6ను బట్టి చూస్తే రెండు పునరుత్థానాలున్నాయనీ, ఈ రెంటికీ మధ్య వెయ్యి సంవత్సరాల అంతరం ఉంటుందనీ అనిపిస్తుంది. మొత్తం మీద పాత ఒడంబడిక ప్రవచనాలు కొన్ని సంభవాలు, వేరు వేరు కాలాల్లో జరగవలసివుండగా వాటి మధ్య జరిగే కాలాన్ని సూచించకుండానే ఆ సంభవాల గురించి చెప్పడం కద్దు. ఈ దానియేలు గ్రంథంలో ఇందుకు మరి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 9:27 దగ్గర నోట్‌లో చివరి భాగం చూడండి.

3.బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. Sevakula Prasangaalu Telugu

12:3 “తెలివితేటలున్నవారు”– వ 10; 11:33; కీర్తన 111:10; సామెత 1:7; 3:35. ఇక్కడ రెండు రకాల వ్యక్తులు లేరు. తెలివితేటలున్నవారు ఎవరంటే అనేకులను న్యాయవంతులను చేసేవారే. వారి నిజమైన జ్ఞానం బయటపడే విధానాల్లో ఇదొకటి. సామెత 11:30 చూడండి. వారి ఉపదేశాలవల్ల, వారు న్యాయంగా బతికిన విధానంవల్ల చాలామంది న్యాయవంతుడైన దేవుని వైపుకు మళ్ళుతారు. తద్వారా ఆ చాలామంది కూడా న్యాయవంతులవుతారు. ఇలాంటి వివేకవంతమైన, న్యాయవంతమైన జీవితాన్ని గడిపేవారికి దక్కబోయే శాశ్వత ఫలం గురించి చిన్న సూచన మాత్రమే ఈ వచనంలో కనిపిస్తూవుంది.

3.) ఆయన నక్షత్రము ఆయనను స్తుతించెను. నీవు ఆయనను స్తుతిస్తున్నావా?

 (కీర్తనల గ్రంథము) 148:3

3.సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

148:3 సూర్యచంద్రులు వ్యక్తులు కాదు. వాటికి ప్రాణం లేదు. ఈ విషయంలో అవి కూడా మంచు, కొండలు మేఘాల్లాంటివే. వీటన్నిటినీ దేవుణ్ణి స్తుతించవలసిందని రచయిత పిలుస్తున్నాడు (వ 8,9). ఇది కావ్య భాష. రచయిత తనకు ఉల్లాసాన్ని కలిగించిన ఒక సత్యాన్ని బయట పెడుతున్నాడు అంటే అన్నిటినీ దేవుడే చేశాడు, తన మహిమకోసమే చేశాడు, వాటి మూలంగా ఆయనకు స్తుతులు కలుగుతాయి. Sevakula Prasangaalu Telugu

4.) ఆయన నక్షత్రము జ్ఞానులను యేసు నొద్దకు నడిపెను. నీవు యేసు యొద్దకు నడపగలవా?

 (యెహొషువ) 22:3

3.బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచి యున్నారు.

5.) ఆయన నక్షత్రము ఉద్దేశ్యము మంచిది. నీ ఉద్దేశ్యము ఏమైయున్నది?

 (అపొస్తలుల కార్యములు) 12:23

23.అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ప్రశ్నలు  – సమాధానాలు .. click here 

Leave a comment