నయోమి నడక
Telugu Christian Message Pastors
నయానో బయానో అందరికీ నయోమి తెలుసు. నయోమి పేరు నానమ్మ అన్నట్టు ధ్వనిస్తూ ఉంది కదూ! నయోమిలోని నాలుగు సంగతులు చూద్దాం.
1. స్వచిత్తంపై ఆధారపడింది.
(రూతు) 1:1
1.న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను.
“కరవు”– ఈ కరవును గురించి న్యాయాధిపతులు గ్రంథంలో రాసి లేదు. ప్రజలు తమ ఇళ్ళు, వారసత్వాలు వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయారంటే ఇది అతి దుర్భరమైన కరవై ఉండాలి. ఈ కరవుకు కారణమేదో ఇక్కడ రాసి లేదు. అయితే నాయకుల కాలంలో ప్రజలు తరుచుగా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఆజ్ఞలను మీరి విగ్రహాలను పూజించేవారు (న్యాయాధి 2:16-19). అందువల్ల ఈ కరవు రావడంలో ఆశ్చర్యం లేదు (లేవీ 26:25-26; ద్వితీ 28:15, 23, 25; 1 రాజులు 8:35; 2 రాజులు 8:1; యిర్మీయా 14:10-12; 24:10; యెహె 5:16; 14:21; ఆమోసు 8:11).
1:1 A ఆది 12:10; 26:1; B యెహె 14:13; C ఆది 43:1; న్యాయాధి 17:8; 2 రాజులు 8:1-2; కీర్తన 105:16; D లేవీ 26:19; ద్వితీ 28:23-24, 38; న్యాయాధి 2:16-18; 12:8; 19:1-2; 1 రాజులు 17:1-12; 18:2; కీర్తన 107:34; యిర్మీయా 14:1; యెహె 14:21; యోవేలు 1:10-11, 16-20; ఆమోసు 4:6; E 2 సమూ 21:1
(కనాను భూమిలో కరువు వస్తే కాదనుకుని మోయాబు దేశం వెళ్లారు. బయలుదేరినవారు నలుగురు. అక్కడకు చేరాక ఆరుగురు అయ్యారు. తిరిగి వచ్చేటప్పటికీ ఇద్దరయ్యారు. వీరి ప్రయాణం దేవుని చిత్తానుసారమైంది కాదు. స్వచిత్తం చావుకే మూడింది)
2. సమస్తమును పోగొట్టుకున్నది .
(రూతు) 1:3,4,5
3.నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.
1:3 A కీర్తన 34:19; హీబ్రూ 12:10-11; B 2 రాజులు 4:1; హీబ్రూ 12:6
4.వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
5.వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.Telugu Christian Message Pastors
1:5 A ద్వితీ 32:39; కీర్తన 89:30-32; యెషయా 49:21; యిర్మీయా 2:19; లూకా 7:12; B మత్తయి 22:25-27
(మోయాబు లోకమునకు గుర్తు. అన్య వివాహం పాపానికి గుర్తు. బేత్లహేము ప్రభువు సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధి విడిచి, లోకానికి మరలి, పాపంలో మునిగితే ఏమైంది నయోమికి? ఉన్నదంతా ఊడ్చి వేయబడింది)
III దేవునిపై ఆధారపడింది .
(రూతు) 1:6,7
6.వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.
“తిరిగి వెళ్ళడానికి”– నయోమి ఆమె కోడళ్ళు యూదాకు వెళ్ళిపోదామని ముందు నిర్ణయించుకుని ఉన్నట్టుంది. అయితే బయలుదేరిన తరువాత నయోమి తన మనస్సు మార్చుకుని ఉండవచ్చు. బహుశా భర్తలను కోల్పోయిన ఆ ఇద్దరు మోయాబు అమ్మాయిలకు ఇస్రాయేల్‌లో భవిష్యత్తు లేదని ఆమెకు అనిపించి ఉండవచ్చు.Telugu Christian Message Pastors
7.అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా
(తన తప్పును తాను గ్రహించింది. గత జీవితంతో పోల్చుకుంది. మరల ప్రభువు ఆహారం ఇచ్చుటకై బేత్లహేమును దర్శించిన సంగతి విన్నది. హుటాహుటిన ప్రయాణం ప్రారంభించింది. నాకిక్కడ ఎలాంటి పౌరహక్కులు లేవు అనుకుని, ప్రభువు దేశానికి, తన మనస్సాక్షియొక్క ఆదేశంతో బయలుదేరింది)
4. చరిత్రలో నిత్యము నిల్చింది.
(రూతు) 4:17
17.ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.
4:17 “ఓబేదు”– అంటే “సేవకుడు”. పిల్లవాడికి ఈ పేరు పెట్టడంలో అతడు దేవుని నిజమైన సేవకుడు కావాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక వెల్లడౌతున్నది.
(తిరిగి వచ్చిన తరువాత నయోమి యొక్క కోడలికి, బోయజుకి పెళ్లైంది. ఓ కొడుకు పుట్టాడు. అతడు నయోమికి కొడుకుగా ఎంచబడ్డాడు. అతడే దావీదు యొక్క తాత. ఆ దావీదు కుమారుడే యేసుక్రీస్తు. చూశారా – నయోమి నానమ్మకు దక్కిన దీవెనలు!!)
– కరువు, దు:ఖము, మరణముతో ప్రారంభమైన నయోమి జీవితము
– సుఖము, సంతోషము, సమాధానముతో ముగించబడింది. తెలియక తప్పులో నడిస్తే తప్పును తప్పించుకుని రాబోయే తిప్పలకు దూరమవడం తెలివైనవానికి తగిన పని.
క్రీస్తు జీవిత చరిత్ర subjcet నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. click here
Good massage
Thank you for sending good massages..