యేసుప్రభువు యొక్క జీవిత ప్రవచనములు | Pastors Messages In Telugu3

Written by biblesamacharam.com

Published on:

యేసుప్రభువు యొక్క జీవిత ప్రవచనములు.

Pastors Messages In Telugu

1.) పుట్టుక .

 (యెషయా గ్రంథము) 7:14

14.కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

7:14 ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను స్పష్టంగా తెలియజేసే ప్రవచనం ఇది. పవిత్రాత్మ మత్తయిచేత ఇలా రాయించాడు. కనుక ఈ విషయం మనకు తెలుసు. మత్తయి 1:18-25 చూడండి. ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు”. ఈ పేరు పరిపూర్ణంగా ఒక్క యేసుప్రభువుకే చెల్లుతుంది. కేవలం ఆయనే దేవుని అవతారం (యెషయా 9:6-7; యోహాను 1:1, 14; మొ।।). 700 సంవత్సరాల తరువాత జరిగిన ఒక మానవాతీతమైన అద్భుత సంభవానికి ఈ వచనం ఆశ్చర్యకరమైన ప్రవచనం, భవిష్యత్ వాక్కు. కన్యకు సంతానం కలగడం ఒక సూచనగా చెప్పబడింది. దేవుని నుండి వచ్చిన సూచన ఏదైనా నిజంగా ప్రత్యేకమైనదిగా, అసాధారణమైనదిగా ఉండాలి. ఒక యువతికి, పెండ్లికాని యువతికి అయినా సరే, పిల్లవాడు పుట్టడంలో పెద్దగా విశేషమేమీ లేదు. అయితే పురుషునితో సంపర్కం లేని యువతికి, బిడ్డ పుట్టడం దైవికమైన అద్భుతమే. ఇది కేవలం ఆహాజుకు కాదు దావీదు వంశమంతటికీ సూచన (వ 14లో మీకూ అంటూ బహువచనం ప్రయోగం కనిపిస్తుంది). ఈ వచనం రెండు విధాలుగా నెరవేరేది అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ తరువాత వచ్చే వచనాలు యెషయా కాలంలోని చారిత్రాత్మక విషయాల గురించినవి. కన్యకు కుమారుడు పుట్టడం అప్పట్లో జీవిస్తూ ఉన్న ప్రజలకు ఒక సూచనగా ఉండాలని వారి వాదం. బహుశా ఇది నిజమే కావచ్చు. అయితే యెషయా కాలంలో ఇది నెరవేరిన వైనాన్ని పవిత్రాత్మ మనకు వెల్లడించలేదు. ఆ కాలంలో ఇలా ఎవరైనా పుట్టడం, ఆ శిశువుకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడం గురించి ఎక్కడా రాసి లేదు. అది ఎలా ఉన్నా భవిష్యద్వాక్కులకు వెంటనే జరిగే నెరవేర్పూ దీర్ఘకాలం తరువాత జరిగే నెరవేర్పూ ఈ రెండూ ఉండవచ్చునని అనుకోవచ్చు. యెషయా 8:18 దీనికి ఒక ఉదాహరణ కావచ్చు.

7:14 A ఆది 3:15; యెషయా 8:8, 10; 9:6; యిర్మీయా 31:22; మత్తయి 1:23; లూకా 1:31, 35; యోహాను 1:1-2, 14; 1 తిమోతి 3:16; B ఆది 30:6; 1 సమూ 4:21; రోమ్ 9:5; C ఆది 4:1-2, 25; D ఆది 16:11; 30:8; 1 సమూ 1:20

2. పుట్టిన స్థలము.

 (మీకా) 5:2

2.బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

“పరిపాలించబోయేవాడు”– ఇది ఆయన కార్యకలాపాల గురించి చెప్తున్నది. ఈ భవిష్యద్వాక్కు అభిషిక్తుడైన యేసుక్రీస్తును గురించినది. ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వమే, మానవుడుగా ఆయన జన్మ స్థలాన్ని తెలియజేస్తున్నది. మత్తయి 2:4-6 చూడండి. దేవుని కుమారుడుగా ఆయన శాశ్వతుడు. ఉత్పత్తి, ఆరంభం అంటూ ఆయనకు లేవు – యెషయా 9:6; కీర్తన 90:2; యోహాను 1:1. మానవ చరిత్ర అంతటిలోనూ ఆయన తన చర్యలు జరిగిస్తూనే ఉన్నాడు.

3. పెరుగుట.

 (యెషయా గ్రంథము) 53:2

2.లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

53:2“లేత మొక్క”, “అంకురం”– 11:1. అభిషిక్తుణ్ణి ప్రవక్తల గ్రంథాల్లో అనేక సార్లు కొమ్మ మొదలైన పేర్లతో పిలవడం కనిపిస్తుంది. ఆయన దేవుని సన్నిధిలో పెరగడం గమనించండి. ఆరంభం నుండి అంతం వరకూ ఆయన జీవితం పూర్తిగా దైవ సంబంధమైనదే. ఎండిన భూమి బహుశా ఇస్రాయేల్‌వారి నిస్సారమైన ఆధ్యాత్మిక స్థితికి గుర్తుగా ఉంది.

“అందం గానీ…లేదు”– యేసుప్రభువు పేదవాడుగా, సేవకుడుగా, పేరు ప్రతిష్ఠలు లేనివాడుగా వచ్చాడు (మార్కు 6:3; లూకా 9:58; యోహాను 9:28-29; ఫిలిప్పీ 2:7). రాజోచితమైన వైభవం, ఆడంబరాలతో ఆయన రాలేదు. ఆయనలో రాజఠీవి లేదు. క్రీస్తు పట్ల ఆయన్ను చూచిన యూదులు చాలామందిలో ఏ భావన కలుగుతుందో ఇక్కడ యెషయాకు ఈ భావన కలుగుతున్నది. రోమ్ దాస్యమనే కాడి నుంచి తమ్మును విడిపించే శూరుడుగా తమ అభిషిక్తుడు రావాలని యూదులు ఎదురు చూశారు. లూకా 19:11 చూడండి. అయితే యేసు తన వైభవంతో తరలివచ్చే సొలొమోనులాగా రాలేదు. కన్నీరు మున్నీరుగా అయిన యిర్మీయా లాగా వచ్చాడు. మనుషులకు పేదరికం, శోకం ఆకర్షణీయం కావు.

4.) పరిచర్య.

 (యెషయా గ్రంథము) 9:1,2

1.అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2.చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.

9:2 A యోబు 10:21; కీర్తన 23:4; 107:10, 14; యెషయా 9:1; 50:10; 60:1-3, 19; మీకా 7:8-9; మత్తయి 4:16; లూకా 1:78-79; 2:32; యోహాను 8:12; 12:35, 46; ఎఫెసు 5:8, 13-14; 1 పేతురు 2:9; 1 యోహాను 1:5-7; B ఆమోసు 5:8

5.) శ్రమలు

 (కీర్తనల గ్రంథము) 69:21

21.వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.

69:21 మత్తయి 27:34, 48. బాధలు పడుతున్నవానికి నోట పెట్టుకోరానంత అరుచికరమైన పదార్థాలు పుచ్చుకునేందుకు ఇవ్వబడ్డాయి. ఈ వచనం పాత ఒడంబడికలో యేసు చనిపోకముందు నెరవేరిన ఆఖరు భవిష్యద్వాక్కు (యోహాను 19:28-30). యేసుప్రభువు మానవాళికి ఎన్నో శ్రేష్ఠమైన వాటితో వచ్చాడు. ప్రతిగా తమకు చేతనైనంత వ్యర్థమైన వాటిని వారాయనకు ఇచ్చారు.

69:21 A మత్తయి 27:34, 48; మార్కు 15:23, 36; లూకా 23:36; యోహాను 19:28-30; B యిర్మీయా 8:14; 9:15; C ద్వితీ 29:18; D యిర్మీయా 23:15

 (యెషయా గ్రంథము) 53:1,2,3,4,5,6,7,8,9,10,11,12

1.మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

2.లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.Pastors Messages In Telugu

3.అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.

4.నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

53:4భరించాడు”– మత్తయి 8:17లో దీని అర్థం ఇతరులను బాగుచేసే ఆయన సేవ అని తెలుస్తున్నది. అలాగైతే మన రోగాలను ఆయన బాగుచేశాడని రాసి ఉండాలి కదా. అంటే కేవలం బాగు చెయ్యడమే కాక మరింకేదో చేశాడని అర్థం కావచ్చు. వాటిని ఒక బరువులా ఆయన అనుభవించాడు. బాధపడుతున్నవారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు. మత్తయి 9:36 చూడండి. జాలి పడడమంటే బాధపడేవారి బాధను పంచుకోవడమని అర్థం. యేసు అనుభవించిన బాధలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకుందాం. ఆయన మన స్థానంలో వాటిని భరించాడు (63:9 చూడండి. 2 కొరింతు 11:28-29లో పౌలు మాటలను పోల్చి చూడండి).

5.మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.Pastors Messages In Telugu

53:5 గాయపడ్డాడు”– కీర్తన 22:16; యోహాను 19:18, 34; జెకర్యా 12:10. ఇక్కడ వాడిన హీబ్రూ పదానికి అర్థం పదునైన పరికరం వల్ల గాయాలు పొందడం. ఇక్కడ కూడా యేసు పొందిన వేదనలన్నీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన అనుభవించాడని నొక్కి చెప్పడం కనిపిస్తుంది. మనం భరించవలసినదాన్ని ఆయన భరించాడు. ఆయన గాయపడడానికీ, దెబ్బలు తినడానికీ కారణం మన పాపాలే. నలగ్గొట్టడం అనే పదం లోకమంతటి పాపాల భారం ఆయన మీద పడ్డాయని సూచిస్తూ ఉంది (యోహాను 1:29; 2 కొరింతు 5:21; 1 పేతురు 2:24).

6.మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

7.అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

8.అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?Pastors Messages In Telugu

9.అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

10.అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

11.అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.Pastors Messages In Telugu

12.కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

6.) మరణము.

 (కీర్తనల గ్రంథము) 22:1,6,7,14,18

1.నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

“చెయ్యి…విడిచిపెట్టావు”– మత్తయి 27:46. మనకోసం యేసు క్రీస్తు భరించిన బాధలన్నిటిలోకీ ఇది అతి భయంకరమైనది. ముళ్ళ కిరీటం కంటే, మేకుల కంటే మనుషుల అవహేళన, ద్వేషం కంటే ఇది ఎంతైనా బాధకరం. దేవుడే చెయ్యి విడిచిపెడితే అది నరక బాధ లాంటిదే (2 తెస్స 1:8-9). ఈ అనుభవాన్ని ఎదుర్కోక మునుపే యేసుప్రభువుకు తెలుసు – పాపుల స్థానంలో శిక్ష పొందడం, లోకమంతటి పాపాన్నీ మోయడం దుర్భరమని (యెషయా 53:5-6; యోహాను 1:29; 2 కొరింతు 5:21; 1 పేతురు 3:18), కానీ దేవుడు తనను విడిచిపెట్టడం అనే అతి దారుణమైన ఒంటరితనం, ఆధ్యాత్మిక దీనదశ ఎలాంటిదో ఆయనకు ముందుగా తెలిసి ఉండడం అసాధ్యం. దాన్ని తెలుసుకోవాలంటే అనుభవించి చూడవలసినదే. ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు మూలుగులు, దుర్భరమైన గాయం, వేదనతో తల్లడిల్లే హృదయంలో నుంచి “ఎందుకు” అనే ప్రశ్న వెలువడ్డాయి. అయితే మనం గుర్తుంచుకోవలసినది ఏమంటే ఈ బాధలంతటికీ పాత్రులం మనమే, ఆయన కాదు (1 పేతురు 3:18).Pastors Messages In Telugu

6.నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

22:6 ఇక్కడ యేసు తనను తాను పూర్తిగా అణచుకొని ఉన్నాడు. దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారికంటే, అసలు మానవులందరి కంటే అల్పుడినని యేసు చెప్పుకొన్నాడు. “ఉన్నవాడను” అనే మహా ఘనుడు (నిర్గమ 3:14-15; యోహాను 8:24, 58) “నేను పురుగును” అంటున్నాడు. పురుగు అంటే మనుషుల చెప్పుల క్రింద నలిగిపోయే అల్పజీవి. పురుగు కంటే బలహీనమైనదీ వికారమైనదీ మనుషుల తృణీకారానికి గురయ్యేది మరేదైనా ఉందా? అయితే తాను పురుగునని యేసు ఎందుకు చెప్పుకున్నాడు? ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు, హీనులు, బలహీనుల స్థానంలో ఉన్నాడు కాబట్టే గదా. పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానంలో నిలిచి ఉండబట్టే గదా.Pastors Messages In Telugu

7.నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.

14.నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.

18.నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

7.పునరుత్థానము.

 (కీర్తనల గ్రంథము) 16:10

10.ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవుPastors Messages In Telugu

16:10 A కీర్తన 49:15; అపొ కా 2:27-31; 13:35-38; ప్రకటన 1:18; 20:13; B యెషయా 5:14; 14:9; లూకా 16:23; అపొ కా 3:14-15; C లేవీ 19:28; సంఖ్యా 6:6; ద్వితీ 32:22; యోబు 11:8; కీర్తన 139:8; సామెత 15:11; 27:20; దాని 9:24; ఆమోసు 9:2; లూకా 1:35; 1 కొరింతు 15:42, 50-55; D కీర్తన 9:17; లూకా 4:34

8.) రెండవ రాకడ.

 (జెకర్యా) 14:4,5

4.ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

5.కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

9.) వెయ్యేండ్ల పరిపాలన.

 (యెషయా గ్రంథము) 11:3,4,5,6,7,8,9

3.యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4.కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపునుPastors Messages In Telugu

5.అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

6.తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7.ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8.పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9.నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.Pastors Messages In Telugu

10.) యేసు తీర్పు తీర్చుట.

 (యెషయా గ్రంథము) 11:3,4

3.యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4.కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును Pastors Messages In Telugu

11:4-16 ఈ వచనాల నెరవేర్పు క్రీస్తు మొదటి రాకడను దాటి ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిపాలించే సమయంలో జరుగబోతున్నది. ఈ వచనంలో ఉన్న వర్ణనకు సరిపోయినదేదీ ఇంకా జరగలేదు. అందువల్ల ఇది భవిష్యత్తులో నెరవేరవలసి ఉంది. భూమి పై క్రీస్తు పరిపాలిస్తాడని ఈ నోట్స్ రచయిత నమ్మకం. దీన్ని గురించి 2:1-4; 9:7; ప్రకటన 20:4-6 నోట్స్ చూడండి. ఇక్కడ మళ్ళీ పేదలపట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల దేవుని శ్రద్ధను చూడగలం.


మరిన్ని సేవకుల ప్రశంగాల కొరకు క్లిక్ చేయండి click here 

Leave a comment