ఎస్తేరు గ్రంధం వివరణ తెలుగులో | Book Of Esther Explanation In Telugu2

 

ఎస్తేరు గ్రంధం వివరణ తెలుగులో.

Book Of Esther Explanation In Telugu

పాత నిబంధనలో రెండు గ్రంథములు స్త్రీల పేర్లతో రాయబడినవి. అవి ఏమిటంటే ఒకటి – రూతు, రెండోది – ఎస్తేరు గ్రంథాలు; రూతు ఐతే, అధికారముగల ఆస్తిపరుడు బోయజును పెళ్లాడింది. ఇతడు ఒక యూదుడు. రూతు సుందరవతియైన అన్యురాలు. ఎస్తేరు ఐతే అధికారముగల భాగ్యవంతుడు మరియు అన్యుడైన అహష్వేరోషు రాజును పెళ్లాడిన ఒక యూదురాలు.

ఎస్తేరు అనేది పారశీక భాషాపదము. ఎస్తేరు అనే పేరుకు “నక్షత్రము” లేదా “దాచబడిన” అని అర్థం. ఎస్తేరునకు మరియొక పేరు కూడా ఉన్నది. అది “హదస్సా” అనే పేరు. ఈ పదము హెబ్రీ భాషాపదము. హదస్సా అంటే “గొంజిచెట్టు” లేదా “పరిమళ వృక్షము” అనే అర్థములు కలవు.

ఎస్తేరు గ్రంథమునందలి సంభవాలు క్రీ. పూ. 484 – 465 సంవత్సరముల మధ్య కాలంలో జరిగాయి. ఈ గ్రంథములో యూదుల మత సంబంధమైన వృత్తాంతాలు మరియు బబులోను పారశీక దేశములయందు కాపురముండిన యూదుల వివరాలు వ్రాయబడి యున్నాయి. Book Of Esther Explanation In Telugu

కొంతమంది యూనివర్శిటీ విద్యార్ధుల్ని ఈ మధ్య ఒక ప్రశ్న అడిగారు. మానవజాతి చరిత్రలో మీరు జీవించే అవకాశాన్ని ఎంపిక చేసుకోవలసి వస్తే ఏ తరాన్ని. మీరు ఎంపిక చేసుకుంటారు? వారిచ్చిన కొన్ని జవాబులు….

  1. ఆదాము అవ్వలతో ఏదెను తోటలో
  2. జల ప్రళయానికి ముందు తరంలో 3. అబ్రాహాము తరంలో
  3. దావీదు రాజు హయాంలో
  4. యేసుక్రీస్తు భూమ్మీద సంచరించే కాలంలో
  5. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో
  6. ఈ శతాబ్దం అంతంలో

మరి మీరైతే దేన్ని ఎంపిక చేసుకోనేవారు? ఎస్తేరు గ్రంథం ప్రకారం దేవుని దృష్టిలో నీ జీవిత కాలాన్ని ఎంపిక చేసుకోకపోతే నీవు పరీక్ష తప్పినట్టే. వాస్తవంగా యూదుల చరిత్రలో ఎస్తేరు కాలమంత చిమ్మచీకటి రోజులు మరెన్నడూ రాలేదు. దానికి కారణం? హామాను అనే దయ్యం పట్టిన రాజకీయవేత్త. చరిత్రలోని మొదటి నరమేధాన్ని తలపెట్టాడు. యూదుల పేరు భూమ్మీద లేకుండా తుడిచెయ్యాలనుకున్నాడు. Book Of Esther Explanation In Telugu

ఎస్తేరు నిరాశ చెంది మరొక తరంలో పుడితే బావుండు అనుకుందా? లేదు. తీసుకుంది. అందుకు భిన్నంగా మొద్దెకై చెప్పిన మాటలు విన్నది. తీసుకోవలసిన చర్యలు తన ప్రజలను రక్షించింది. మొరెకై ఆమెకు గుర్తు చేసిన మాటల్ని దేవుడు నేడును మనకు జ్ఞాపకం చేయుచున్నాడు…

“ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము” (ఎస్తేరు 4:14).

క్రీ.పూ. 486-465 లో పారశీక సామ్రాజ్యాన్ని ఏలిన ఒకటవ “జెరిజిస్” (Xerxes) ఎస్తేరు గ్రంథంలో కనిపించే అహష్వేరోషు అనే రాజు. హెబ్రీభాషలో “అహష్వేరోషు” అంటారు. పారశీక భాషలో – ‘క్షాయర్షా” అని అందురు. గ్రీకు వ్రాతలో ఇతని పేరును “జెరిజిస్” అని పలుకుతారు.

చరిత్రను బట్టి చూస్తే జెరిజిస్ అనగా, అహష్వేరోషు తన పరిపాలన 3వ యేట గ్రీసు దేశంపై దండెత్తడానికి వ్యూహరచనలో భాగంగా తన ప్రధానులను, సామంతులను, సేనాధిపతులను పిల్చి విందులూ సంప్రదింపులూ జరిపాడు ( ఈసంగతి చరిత్రకారుడైన హెరోడోటస్ కూడా రాసాడు).

ఎందుకంటే జెరిజిస్ తండ్రి దర్యావేషు “మారాథాన్” అనే చోట గ్రీకుల చేతుల్లో ఓడిపోయాడు. జెరిజిస్ (అహష్వేరోషు)కు తన తండ్రి ఆశయం నెరవేర్చాలనీ, సాధించాలనీ పట్టుదల కలిగింది. ఇతడు తన పరిపాలన 7వ సంవత్సరంలో (ఎస్తేరు 2:16) అంటే గ్రీకులతో యుద్ధం తరువాతనే ఎస్తేరును పెళ్ళి చేసుకున్నాడు. (ఆ యుద్ధంలో ఇతడు ఓడిపోయి తిరిగి వచ్చాడు. ఈ యుద్ధం క్రీ.పూ. 480లో “సలామిస్” అనే చోట జరిగింది).

యూదులకు వ్యతిరేకంగా హామాను కుట్ర అహష్వేరోషు పరిపాలన 12వ యేట జరిగింది. ఈ కుట్రను దేవుడు ఎలా ఫెయిల్ చేశాడో ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూరీము పండుగ పుట్టు పూర్వోత్తరాలు వివరించడమే.

హెబ్రీ కేలండరులో ఆదారు నెల ఆఖరుది. ఇది మన ఫిబ్రవరి – మార్చి నెలల్లో వస్తుంది. ఆ నెల 14,15 వ తేదీలలో జరిగే యూదుల పండుగ పూరీము. “పూరు” ‘అనే నామవాచకానికి బహువచనం – పూరీము! పూరు అంటే “చీటి” అని అర్థం.Book Of Esther Explanation In Telugu

ఈ పండుగ మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించింది కాదు. ఈ పండుగ కారణం, దాని పుట్టుపుర్వోత్తరాలు ఎస్తేరు గ్రంథంలోనే కనిపిస్తాయి. అది మతపరమైన పండుగ కాదు. అది జాతీయ ఉత్సవం. అంటే మన ఆగష్టు 15 లాగా అన్నమాట!

అగాగీయుడైన హామాను (1 సమూ. 15:8,32) అహష్వేరోషు యొక్క ప్రధానమంత్రి. ఇతడు యూదులకు శత్రువు. యూదులందరినీ సమూలంగా తుడిచిపెట్టేయ్యాలని భయంకరమైన పన్నాగం ఒకటి పన్నాడు. దానిని ఆచరణలో పెట్టడానికి తన (మూఢ) నమ్మకం చొప్పున ముహూర్తం నిర్ణయించడానికి చీట్లు వేయించాడు. ఆ చీటి ఆదారు నెల 13వ తేదీన పడింది.

ఆ తర్వాత త్వరితంగా జరిగిన సంఘటనల వల్ల అతడి ఆలోచన భగ్నమయ్యింది. మొరైకై ఎస్తేరుల ధైర్యం, విశ్వాసాల ఫలితంగా అహష్వేరోషు కొత్త ఆజ్ఞను వెలువరించి, అంచె తపాలా పద్ధతిని రాజ్యం నలుమూలలకూ పంపించాడు. యూదులు నాశనమైపోవలసిన దినాన వారు సంఘటితమై ఆత్మ రక్షణార్ధం ఆయుధాలు ధరించి పోరాడాలన్నదే ఈ ఆజ్ఞ. షూషను కోటలో 14వ తేదీన కూడా అదనంగా ఈ అనుమతి ఇయ్యబడింది.

యూదులు తమ ప్రత్యర్థులపై పగ తీర్చుకున్నారు (9:11-16). ఈ అద్భుత దినాలను బట్టి వారు పర్వదినాలుగా పండుగ జరుపుకోవాలని మొరకై యూదులను ప్రోత్సహించాడు (9:20 – 22).

పాత, కొత్త నిబంధన మధ్య కాలంలో మక్కాబీ వంశం వారు యూదులను పరిపాలించారు. ఈ కాలంలో పూరీము పండుగను “మొరైకై దినోత్సవం” అని పిలిచేవారు. ఈ పండుగ సమయంలో యూదులు అధికంగా మద్యపానం చేసేవారు. “హామాను దుష్టుడు, మొర్లైకై ధన్యుడు” అని పదే పదే అంటూ… మత్తులో తడబడి “హామాను ధన్యుడు, మొద్దెకై దుష్టుడు” అనేవారట.

పూరీము యూదులకు అతి ప్రియమైన పండుగ. ఆదారు నెల 13 వ దినాన “ఎస్తేరు ఉపవాసం” జరుపుకుంటారు. ఆ సాయంత్రం అంతా సమాజమందిరానికి వెళ్తారు. అక్కడ రబ్బీ ఎస్తేరు గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. హామాను అనేపేరు వచ్చినప్పుడెల్లా – “ఆ పేరు ఆకాశం క్రింద లేకుండా తుడిచిపెట్టుకు పోవును గాక!” అంటారు. బాలబాలికలు తాము వెంట తెచ్చుకున్న గిలకలతో చప్పుడు చేస్తారు. చదువుతున్న రబ్బీ హామాను కొడుకుల పేర్లన్నిటిని (9:7-9) ఒక్కపెట్టున గుక్క తిప్పుకోకుండా చదివేస్తాడు. వారందరినీ ఒకే ఉరికొయ్యపై ఉరితీసారని సూచించడానికి ఇలా చేస్తారు. Book Of Esther Explanation In Telugu

మరుసటి ఉదయం (ఆదారు నెల 14 వ తేదీ) సమాజమంతా మళ్లీ సమావేశమై పవిత్ర సభ జరుపుకుంటారు. ఇక మిగిలిన సమయమంతా ఉల్లాసంగా, విందు వినోదాలతో గడిపేస్తారు.

పూరీము పండుగలో ఒక ముఖ్య విషయం పేదలకు ఆహార పదార్థాలూ, కానుకలు పంపించడం (9:19).

ఎస్తేరు గ్రంథంలోని సంఘటనలు చోటు చేసుకున్న 1400 సంవత్సరాల తర్వాత రష్యాలో అదే సంఘటనలు పునరావృతమయ్యాయి. 1953 మార్చి 1వ తేదీన 60 లక్షల మంది యూదుల నరమేధం జరిగి దాదాపు 8 సంవత్సరాలవుతుండగా, సోవియట్ రష్యాలోని 30 లక్షలమంది యూదులను అంతమొందించాలని కంకణం కట్టుకున్నాడు జోసెఫ్ స్టాలిన్.

మార్చి 9న ఆ కిరాతక ప్రణాళిక అమలు పరచబడవలసి ఉంది. అయితే, అది ఎన్నడు జరుగలేదు. స్టాలిన్ దానిని ప్రతిపాదించిన తరువాతి రోజే గుండెపోటుతో మరణించాడు.

ఈ అద్భుత గాథను “లడ్మిలా లుఫానోస్” అనే యూదురాలు కాని సోవియట్ లైబ్రేరియన్ బహిర్గతం చేసింది. మాస్కోలోని రహస్య పురావస్తు శాఖలో చాలా సంవత్సరాలు ఆవిడ పని చేసింది. ఆమె ఈ నమ్మశక్యంగాని గాధను అందించింది. ఒక ప్రతి యెరుషలేములోని యూదా ప్రెస్కు అందింది.

స్టాలిన్ యూదులకు బద్ధ శత్రువు. 1930 దశకంలో వేలాది మంది యూదులను మట్టుబెట్టాడు. వారితో “బోల్షవిక్ ఉద్యమం” ప్రారంభం నుంచి తన సహచరులు, నమ్మకమైన మిత్రులు కూడా ఉన్నారు. Book Of Esther Explanation In Telugu

యూదుల సమాజ పార్టీలోని ఒక వర్గమైన “యెవెసెక్టిజియాను” రూపుమాపటమే గాక, దాని నాయకులను కూడా అంతమొందించాడు. యుద్ధం వచ్చి యూదుల విషయంలో తన పథకం కొంతకాలం నిలిచిపోయింది. మాస్కోకు వచ్చిన మొట్టమొదటి ఇశ్రాయేలు రాయబారి “గోల్డామీర్”కు సోవియట్ యూదులు ఘనంగా స్వాగతించడం చూచిన స్టాలిన్ కోపంతో రెచ్చిపోయాడు.

అతడు యూదు కవులను, రచయితలను, కళాకారులను కూడా మట్టుబెట్టాడు. స్వద్దేశాభిమానం లేనివారు, దేశద్రోహులని వారిపై అభియోగాలు మోపి ఉరితీసినప్పుడు లోకం నివ్వెరపోయింది. యూదుల నరమేధానికి పరాకాష్ట దుష్ట “డాక్టర్ కుట్ర” అని చెప్పవచ్చు.

తోలుబొమ్మల్లాంటి కమ్యూనిస్ట్ నాయకుల నుంచి ఖండనలు వెలువడ్డాయి.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, “యూదులూ”, “కాస్మోపాలిటినిజమ్”, “సీయోను ఉద్యమం” డాక్టర్లను ఉరితీస్తే, సోవియట్ ప్రజలు ఎగబడి 30 లక్షల మంది యూదులలో రెండు వంతుల మందిని ప్రజలు చంపేస్తారని స్టాలిన్ భావించాడు.

మిగిలిన వారిని సైబీరియా మైదానాలకు చిత్రహింసలు పెట్టే శిబిరాలకు (కాన్సంట్రేషన్ క్యాంప్లు) పంపితే వారు అక్కడ చస్తారు.

అది 1953 మార్చి 1వ తేదీ.

స్టాలిన్ క్రెమ్లిన్లో పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి, యూదులను నాశనం చేసే తన ప్రణాళికను చదివి వినిపించాడు. రహస్య సమాచార పత్రం ప్రకారం అతడు చెప్పిందేమంటే…

“తెల్ల జాకెట్లలో వున్న హంతకులు (డాక్టర్లు) తమ నేరం అంగీకరించారు. మార్చి 9వ తేదీ రెడ్ స్క్వేర్లో అందరి ఎదుట వారిని ఉరితీయడం జరుగుతుంది. అయితే ఆ శిక్ష ఒక్కటే సరిపోదు. అది సోవియట్ ప్రజలను తృప్తిపరచదు… సమూహాల కోపం చల్లారదు. ప్రజలు తమ పవిత్ర కోపాన్ని వెళ్లగక్కి మూడు రోజుల పాటు యూదుల నాయకులను నామరూపాలు లేకుండా చేస్తారు.

మూడు రోజుల తరువాత యూదుల నాయకులు రాత పూర్వకంగా తమ సామూహిక నేరం ఒప్పుకొని, పూర్తిగా మమ్మును తుడిచిపెట్టివెయ్యకుండా ప్రభుత్వాన్ని వేడుకోవాలి.

ఈ అభ్యర్థన వచ్చిన తరువాత ప్రభుత్వం మౌనంగా ఉండదు. జాతి వైషమ్యాలు సృష్టించే యూదుల నుంచి రష్యా ప్రజలను వేరు చేయడానికి యూదులను ప్రత్యేక రైళ్లలో ఉత్తరాది చివరనున్న సైబీరియా మైదానాలకు తరలించడం జరుగుతుంది. అయితే, ప్రత్యేక రైళ్లలో బయలుదేరిన చోటెల్లా ప్రజల ఆగ్రహానికి బలి అవుతారు. Book Of Esther Explanation In Telugu

లైబ్రేరియన్ చెప్పిన మాటల ప్రకారం స్టాలిన్ ఈ ప్రతిపాదన చదవటం ముగించినప్పుడు, గదిలో నిశ్శబ్దం తాండవం చేసింది. స్టాలిన్ ఉగ్రుడై, తన మంత్రి వర్గసభ్యులను నిందించి, ధడాలున తలుపు వేసి బయటకు వెళ్లిపోయాడు.

మార్చి 2వ తేదీ!

అంటే యూదులను హతమార్చాలని వివరించిన మరుసటి రోజు, ముప్పై లక్షల మంది యూదులను హతమార్చడానికి వారం ముందు స్టాలిన్ గుండెపోటుతో  మరణించాడు. అతణ్ణి మార్చి 9న భూస్థాపితం చేసారు!

అది యూదుల సెలవు రోజు పూరీము.

అహష్వేరోషు చక్రవర్తి షూషను కోటలో జరిపిన 7 రోజుల విందులో తన రాణి వప్తిని పిలువనంపించగా రానన్నందుకు ఆమెను పట్టపురాణిగా ఉండకుండా తొలగించాడు – ఇది మొదటి అధ్యాయం చెబుతున్న విషయం.

వప్తి స్థానంలో ఎస్తేరు రాణి అయింది. చక్రవర్తి హత్యకై జరిగిన కుట్రను మొద్దెకై కనుగొని తెలియపరిచాడు. దాంతో కుట్ర భగ్నమైనది ఇది, రెండవ అధ్యాయం  చెబుతోంది.

కొత్తగా ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన హామానును మొరెకై గౌరవించనందువల్ల, అతని జాతినంతటినీ మట్టు బెట్టాలని హామాను తలంచాడు. పూజారులు ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చే ముహూర్తం కోసం చీటీ వేసారు. 11 నెలల తర్వాత ఆదారు నెల 13వ తేదీ ఖరారు అయింది – ఇది, మూడవ అధ్యాయంలోని విషయం.

ఈ విషయంలో జోక్యం కలుగజేసుకోవాలని మొరైకై ఎస్తేరును ఒప్పించాడు. షూషనులోని యూదులందరు ఉపవాసం ఉండాలని ఎస్తేరు కోరింది. రాజు పిలువనంపించకుండానే అతని వద్దకు వెళ్లడానికి సిద్ధపడింది – ఇది, నాల్గవ అధ్యాయం వివరణ.

ఎస్తేరు – రాజును, హామానును విందుకు పిల్చింది. మొరైకైని ఉరితీయడానికి ఎత్తైన ఉరికొయ్య చేయించమని హామాను భార్య హామానుకు సలహానిచ్చింది. ఆ విందులో మరుసటి దినం కూడా వారు విందుకు రావాలని ఎస్తేరు కోరింది. మొర్లైకైని ఉరి తీసి చంపడానికి ఉదయాన్నే రాజు పర్మిషన్ కొరకు రాజమందిరానికి వెళ్ల నిర్ణయించుకున్నాడు హామాను – ఇది, 5వ అధ్యాయం చెబుతున్న సమాచారం.

నిద్రపట్టని రాజు రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకొని వింటుండగా తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను మొద్దెకై బయటపెట్టినప్పుడు అతనికేమి ప్రతిఫలం లభించలేదని గ్రహించి హామాను చేత మొరెకైని ఘనపరచి ఊరంతా ఊరేగించేలా ఆజ్ఞాపించాడు అహష్వేరోషు ఇది, 6వ అధ్యాయంలోని వర్తమానం.

రెండవ విందు రోజున యూదులకు వ్యతిరేకంగా హామాను పన్నిన కుట్రను ఎస్తేరు బయట పెట్టింది. మొకై కోసం సిద్దపర్చిన ఉరికొయ్యపై హామానును ఉరితీయండని ఆజ్ఞాపించాడు రాజు – ఇది, 7వ అధ్యాయం మనకిస్తున్న సందేశం.

ఆ తరువాత హామాను స్థానంలో రాజు మొద్దెకైని ఉంచాడు. యూదుల వధ దినమున వారు తమ శత్రువులను ఎదిరించేలా మొరైకై తాకీదులు పంపించాడు. దీని ఆధారంగా యూదులు తమ శత్రువులను హతమార్చారు. ఎస్తేరు మరుసటి దినం కూడా ఇందుకోసం రాజును అనుమతి అడిగింది. ఆదారు 14, 15 దినాలలో మొరైకై పూరీము పండుగ స్థాపించాడు. చివర్లో, రాజు మొరెకైల గొప్పతనాన్ని క్లుప్తంగా ప్రస్తావించడం కనిపిస్తుంది – ఇది, 8, 9, 10 అధ్యాయాలు మనకందిస్తున్న వివరణ.

ఈ గ్రంథంలో మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ గ్రంథంలో “దేవుడు” అనిగాని, “యెహోవా” అని గాని మనకు కనిపించదు.

అయితే ప్రతీ పేజీలో, ప్రతి పేరాలోను దేవుని అదృశ్యమైన హస్తం దాగియుంది. తల్లిదండ్రులు లేని ఓ అనాధ బాలిక ఆనాటి ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన పారశీక సామ్రాజ్యానికి మహారాణి కావడంలోని వెనుక ఎవరి హస్తం దాగివుంది? నిశ్చయంగా దేవుని హస్తమే గదా!

ద్వారపాలకులిద్దరు రాజును చంపాలనుకొన్నప్పుడు అది మొరైకైకి తెలియడం, దానిని మొరైకై ఎస్తేరుకు చెప్పడం, ఎస్తేరు రాజుకు చెప్పడం, రాజు దానిని విచారణలోకి తేవడం, ఆ ద్వారపాలకులిద్దరినీ చంపడం, మొరెకై ద్వారా జరిగిన మేలంతటినీ రాజు రాజ్య సమాచార గ్రంథంలో రాయించడం, మొరెకైకి అప్పటికప్పుడే బహుమతి ఇయ్యడం మర్చిపోవడం దీనివెనుక దైవహస్తం దాగిలేదా!

రాజుకు నిద్రపట్టకపోవడం, ఆ రాత్రి రాజ్య సమాచార గ్రంథాన్నే తెప్పించి. చదివించుకోవడం, చదివిస్తే చదివించుకున్నాడు గాని మొరైకై చేసిన మేలును గూర్చిన భాగమే రావడం, ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకోవడం… ఇదంతా దేవుని హస్తం అని మీకు అనిపించుటలేదా? Book Of Esther Explanation In Telugu

ఏ రాత్రి అయితే రాజుకు నిద్రపట్టలేదో, ఆ రాత్రే హామాను మొరైకైని చంపాలని బిజీగా ఉండి పెద్ద ఉరికొయ్యను భార్య సలహా మేరకు సిద్ధపర్చి, తెల్లవారి రాజమందిరానికి వచ్చి అతడు నోరు తెరువకముందే – రాజే కలుగజేసుకొని మొరెకైని ఘనపర్చమని చెప్పడం… ఇదంతా ఏమిటీ? దైవహస్తం కాదంటారా?

రాజైన అహష్వేరోషు యొద్దకు ఎస్తేరు అనుమతి లేకుండా వెళ్లినప్పటికీ రాజు తన చేత నున్న బంగారు దండం చాపడం దేవుని సంకల్పం కాదా! ఒకవేళ రాజు ఆ దండం చాపకపోతే పారశీక రాజ్య చట్టాల ప్రకారంగా ఎస్తేరు మరణశిక్ష పొందియుండేది. Book Of Esther Explanation In Telugu

ఈ విధంగా ఎస్తేరు గ్రంథంలో ప్రతి పుటలో దేవుని హస్తాన్ని చూడవచ్చు!

ఈ చిన్న గ్రంథంలో దేవుని సార్వభౌమత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంతకూ దేవుని సార్వభౌమత్వం అంటే ఏమిటి?

“దేవుడు సింహాసనాసీనుడై యున్నాడు” సమస్త దేశాలూ, ప్రభుత్వాలూ, జాతులూ ప్రజలూ, పరిస్థితులూ ఆయన ఆధీనంలో, ఆయన అదుపులో నున్నాయి. ప్రకృతి శక్తులన్నీను ఆయన నియంత్రణలో ఉన్నాయి అని చెప్పడమే దేవుని సార్వభౌమత్వం! Book Of Esther Explanation In Telugu

ప్రియ విశ్వాసీ! ఇంక నువ్వెందుకు కలవరపడతావు? నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంభవం వెనుకాల దేవుని అదృశ్యమైన హస్తం దాగియున్నది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కలవరపర్చవచ్చునేమో గాని ఆయన్ను ఒక్క అంగుళం కూడా. కదిలించలేవు. చరిత్రలోని సంఘటనలను బట్టి ఆయన ఆశ్చర్యపోడు! ఎందుకంటే ఆయన చరిత్రకే మూలం! ఆయనకు ఆది నుండి అంతం వరకు జరిగినది, జరుగుచున్నది, జరగబోవునది అంతయు చరిత్రలా ఆయన కన్నుల ముందు కదలాడుతూ ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుందోనని ఆయన కాళ్లు చాపి కనిపెట్టడు. ఎవరెన్ని కుట్రలు చేసారో … ఫలాని దేశం ఏ తీర్మానం చేయనై యుందో తెలుసుకోవాలన్న ఉబలాటంతో దేశాధినేతల ఉపన్యాసాలు అసలు ఆయన వినడు! Book Of Esther Explanation In Telugu

ఎస్తేరు, మొద్దెకైల ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాడో చదివితే ఆశ్చర్యం కలుగక మానదు. విధేయులైన వారిని ఈనాటికీ ఆయన వాడుకోవాలని ఆశిస్తున్నాడు. మన విశ్వాసానికి సవాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఈ గ్రంథం తెలియజేస్తుంది. Book Of Esther Explanation In Telugu

విభజన :

  • పిశాచ సంబంధమైన కుట్ర వికసించుట….1నుండి 3 అధ్యాయాలు
  • పైశాచికమైన ఆ కుట్ర భగ్నం అగుట….4నుంచి 7 అధ్యాయాలు
  • దేవుని ప్రజల విజయం, మొద్దెకై అభివృద్ధి….. 8నుండి 10 అధ్యాయాలు

ప్రియులారా! ఎస్తేరు మొద్దెకైల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడే నీ దేవుడు. ఆయనలో మార్పు లేదు. నేడు మన జీవితాలలో కూడా అదే రీతిగా పనిచేస్తాడు. విశ్వాసం ఆయనకు ఎంతో ప్రియమైనది. నీవు విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండడుగులు ఆయన నీవైపు వచ్చి అనూహ్యకార్యాలు చేస్తాడు. 

రా! విశ్వాస విజయాలు నీ కోసం ఎదురుచూస్తున్నాయి!!!


ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.