గ్లేడిస్ ఐల్వార్డ్
Gladys Aylward Missionary
చైనా ప్రభుత్వం యొక్క భయంకరమైన ఆంక్షలు, రోజురోజుకీ పెరిగిపోతున్న అరాచకత్వం వంటి వ్యతిరేక పరిస్థితుల్లో సైతం తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని చైనా దేశంలో క్రీస్తు నామాన్ని మారుమ్రోగించిన ధీరవనిత బ్లేడిస్ ఐల్వార్డ్.
గ్లేడిస్ ఐల్వార్డ్ ఒక సామాన్యమైన క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కుటుంబ పరిస్థితులను బట్టి, చిన్నచిన్న పనులు చేసి, కుటుంబ భారాన్ని మోయవలసి వచ్చింది. భక్తి విషయంలో అంత ఆసక్తి కనుపరిచేది కాదు. అయితే “యంగ్ లైఫ్ క్యాంపెయన్” అను ఒక క్రైస్తవ సంస్థ నిర్వహించిన కూడికలలో పాల్గొని క్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. చైనా దేశం యొక్క భారం ఆమె మీద వేసుకుంది. ఆత్మల రక్షణార్థమై కన్నీటితో ప్రార్థించేది. మిషనరీ తర్ఫీదు కొరకు ఒక మిషనరీ సొసైటీలో చేరి శిక్షణ పొందింది. అయితే సరైన విద్యార్హతలు లేవన్న కారణం చేత ఆమెను పంపుటకు అధికారులు నిరాకరించిరి. అయితే ఓ భక్తిగల వైద్యుని గృహంలో “హౌస్ కీపర్”గా చేర్చబడింది. ఆ వృద్ధ భార్యభర్తలు దేవునియందు చూపించే భక్తి విశ్వాసములను బట్టి గ్లేడిస్ ఆ గృహంలో దేవునిలో మరింత ఎత్తుకు ఎదిగింది. దేవుని నుండి (ఆది. 12:1-2) వాక్యములను వాగ్ధానాలుగా పొందుకొని చైనా దేశానికి ప్రయాణం కట్టింది. కష్టపడి పనిచేసి, టిక్కెట్కి ఖర్చుపెట్టవలసిన సొమ్ము సంపాదించుకుంది. చైనాలో అప్పటికే 73 సం॥ల వృద్ధురాలై దేవుని పరిచర్య చేస్తూ, ఒక యౌవనస్థురాలి ఆసరా కొరకు ఎదురుచూస్తున్న మిసెస్ లాసన్ యొద్దకు చేరింది. అడుగడుగునా ప్రభువు నుంచి శక్తిని పొందుకుని, ఒంటరితనం అయినప్పటికీ దేవుని అద్భుతకార్యాలు చూడగలిగేది.
“యంగ్చెన్” అనే అందమైన పట్టణంలో తన సేవా జీవితాన్ని మొదలు పెట్టింది. అక్కడ భయంకరమైన పురాతన చైనీయుల దేవాలయాలు ఉండేవి. కంచర గాడిదలను తోలేవారికి రాత్రిపూట బస ఏర్పాటు చేసి, వారికి దేవుని గురించి బోధించేది మిసెస్ లాసన్. క్రీస్తు ప్రేమను వారికి చూపి, వారిని క్రీస్తు లోనికి నడిపించే ఈ విధానం గ్లేడిసన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆదివారం గ్రామాలకు పోయి సేవచేసేవారు. తెల్లవారిని చూడగానే ఆ గ్రామస్థులంతా ఆశ్చర్యంతో ప్రోగుపడేవారు. అనారోగ్యానికి గురైన మిసెస్ లాసన్ భారం మరియు ‘యంగ్చెన్’ పట్టణం యొక్క రక్షణభారం యౌవనురాలైన గ్లాడిస్ మీద బహుభారంగా ఉండెను. ఆయా గృహాలను దర్శిస్తూ, వైద్యసహాయం అందిస్తూ మిషన్ హాల్స్లో ఆరాధన జరిపిస్తూ ఉండేది. రానురానూ సత్రంలో చేరే పురుషులను బట్టి, ఒంటరియైన మరియు యౌవనురాలైన గ్లేడిస్కు కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. ప్రభువే తోడుండి బ్లేడిస్ ను రక్షించేవారు. Gladys Aylward Missionary
సువార్త ప్రకటించుట కొరకు మాండరిన్ అనే ఒక ప్రముఖమైన అధికారితో ఓ కఠినమైన నిబంధనకు కూడా ఒప్పుకొంది. అదేమంటే చైనాదేశంలో చిన్నబిడ్డలకు పాదాలు పెరగకుండా పసితనంలో కట్టేస్తారు. అటువంటి పద్ధతిని షాన్సీ అంటారు. అయితే ప్రభుత్వం దానిని నిర్మూలించాలని మాండరిన్ కు ఆదేశాలను పంపించింది. ఈ విషయంలో తనకు సహకరించాల్సిందిగా అతడు బ్లేడిసన్ను కోరాడు. గ్లేడిస్ ఈ పని నిర్వహిస్తూ ఇద్దరు సైనికులను వెంటబెట్టుకుని, సువార్తను బోధిస్తూ ఉండేది. అనతి కాలంలోనే గ్రామస్థులంతా బ్లేడిస్ కు సొంత బంధువుల్లా మారారు. సాంఘిక దురాచారాల్ని నిర్మూలించే అధికారం కూడా ఆశ్చర్యరీతిగా గ్లేడిస్కు లభించింది. పిల్లల్ని అమ్ముతూ ఉన్న తల్లులకు తగిన జ్ఞానాన్ని నేర్పించి, పిల్లల అమ్మకాన్ని కూడా అరికట్టగలిగింది. అలా అమ్ముడుపోయే పిల్లలను విడిపించి, తన దగ్గరకు చేర్చుకుంది. వారికి ఒక సంరక్షకురాలిని కూడా ఏర్పాటు చేసి, వారిని చిన్నతనం నుంచీ దేవుని భయంలో పెంచుతూ ఉండేది. కోపిష్టుడైన ఒక వృద్ధుడు బ్లేడిస్ పరిచర్యలో రక్షించబడి ఆ పిల్లలందరికీ వంట చేయడానికి సమర్పించుకొనెను. జైళ్ళకు వెళ్ళి ఖైదీలకు కూడా సువార్త ప్రకటించేది. వ్యాధిగ్రస్తులను ఆదరించి, స్త్రీలకు ప్రసవ సమయాలలో సహకరిస్తూ ఉండేది.
చైనా, జపాన్ మధ్య ఘోరయుద్ధం జరుగుతున్న సమయంలో గాయపడినవాళ్ళకు, క్షతగాత్రులకు కావలసిన రెడ్ క్రాస్ సంస్థలుగానీ, ఫీల్డ్ ఆసుపత్రులు కూడా ఏమీ లేవు. క్రైస్తవ పాస్టర్లు, ఉపాధ్యాయులు సువార్తికులు వారికి సేవచేస్తూ ఉండేవారు. ఆ సమయంలో తన దగ్గరున్న మనుష్యులనుపయోగించి గ్లేడిస్ వారికెంతో పరిచర్య చేసింది. ఆదరించబడుతున్న క్షతగాత్రుల కోసం ఉజ్జీవసభలు ఏర్పాటు చేసేది. అనేకసార్లు యుద్ధం సమయంలో భయంకరమైన బాంబు వర్షాలు కురిసేవి. గ్లేడిస్ నడిపిస్తున్న సత్రంపై బాంబుపడి, ఆ సత్రం పూర్తిగా కూలిపోయింది. యుద్ధ సమయంలో పారిపోయి వచ్చిన శరణార్ధులందరినీ ఆదరించి, కొన్ని శరణాలయాలను కూడా ఏర్పాటు చేసింది. కొన్నిసార్లు ఆ ప్రాంతాన్ని వదలిపోవాలి అనే హెచ్చరికలు విన్నప్పటికీ, ఏమాత్రం బెదరకుండా దేవుడు తనను ఏర్పాటు చేసిన స్థలంలోనే కడ ఊపిరి వరకూ ఉండాలని నిశ్చయించుకుంది. Gladys Aylward Missionary
ఒకరాత్రి సువార్త పరిచర్యకై ఒక ప్రాంతానికి వెళ్ళివస్తుండగా జపాన్ సైనికుల కళ్ళల్లో గ్లేడిస్ బృందం పడింది. మారుమాట్లాడకుండా ఒక సైనికుడు కాల్పులను ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా తన దళసరి కోటుకు తుపాకీ గుండు గుచ్చుకోవడం వల్ల ఆ కాల్పుల నుండి తప్పించుకుంది. పరుగు పరుగున అనేక రాత్రంతా తుపాకీ కాల్పుల నుండి తప్పించుకుంటూ తెల్లవారు సమయానికి ఓ మారుమూల గ్రామానికి చేరుకున్నారు. చాలారోజులు ఆహారం లేకుండా, త్రాగడానికి కనీసం నీరు లేకుండా అనేక పాట్లు పడాల్సి వచ్చింది. ఈ కారణం చేత బ్లేడిస్ అనారోగ్యానికి గురి అయ్యింది. అయినప్పటికీ కొంతమంది దేవుని బిడ్డల సంరక్షణలో తిరిగి ఆరోగ్యమును పొందుకుంది. తన దగ్గర పెరుగుతున్న బాలబాలికలు 12 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి పనులు చేసి డబ్బులను సంపాదించేవారు. అవి బ్లేడిస్ పరిచర్యకు ఎంతో ఉపకరించేవి. పర్వత శిఖరాగ్రాన లామాల మఠాలు చాలా వైభవంగా ఉండేవి. పులి తోళ్ళ రగ్గులు, మంచి రుచికరమైన భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో అలసటను తీర్చేదిగా ఉంది. ఆ స్థితిలో వారందరికీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను ప్రకటించింది.
ఈ విధంగా బ్లేడిస్ ఖైదీల మధ్య, కుష్టు రోగుల పాళెములలో పరిచర్య చేస్తూ సంఘభారం కూడా కలిగి ఉంటూ కన్నీటితో ప్రార్థిస్తూ సంఘ సభ్యులను, రక్షించబడిన విశ్వాసులనూ బలపరుస్తూ ఉండేది. అనేకమంది బందిపోటు దొంగలు అనేకులు రక్షించబడి గ్లేడిస్ సేవలో చక్కని పరిచారకులైనారు. గుంపులు గుంపులుగా విద్యార్థులు చేరి ప్రార్థనలు చేస్తుండేవారు. కమ్యూనిస్టు గార్డులు వారిని చిత్రహింసలకు గురిచేస్తుండేవారు. వారందరి విశ్వాసం బలపరచబడునట్లు గ్లేడిస్ భారంగా ప్రార్థించేది. Gladys Aylward Missionary
ఇంగ్లాండ్ వనిత అయినప్పటికీ అన్నిరీతులుగా గ్లేడిస్ చైనా దేశస్థురాలిగా మారింది. భాషలోనూ, తలంపుల్లోనూ, పేరులోనూ, వస్త్రధారణలోనూ చైనా దేశపు స్త్రీగా మారింది. ఇంగ్లండ్ దేశమును విడిచి, చైనాలో సువార్త జ్వాలను రగిలించినప్పటికీ, ఇంగ్లాండ్ గురించి తెలిసి గ్లేడిస్ చాలా తల్లడిల్లింది. ఇతర విగ్రహాలకు పూజిస్తూ దేవునికంటే ధనసంపద, విందు, వినోదాలకే సమయం ఇస్తూ, చల్లారిపోయిన భక్తి ఇంగ్లాండ్ అంతా నిండిపోయింది. మరలా ఇంగ్లాండ్ బయలుదేరింది. తాను వేసిన సువార్త బీజం చైనీయుల విశ్వాసంలో స్థిరపరచబడి, కమ్యూనిస్టుల భయంకర శ్రమలను సైతం సవాలు చేసేదిగా ఉంది. అయితే బ్రిటన్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. చాలా ప్రయాసపడి ఆయా సంఘాలను, సంఘ నాయకులనూ దర్శించి, వారిని ఆత్మీయంగా బలపరచి, ప్రార్థించి ఇంగ్లండ్లో ఉజ్జీవ జ్వాలను రగిలించింది. మరలా చైనాకు చేరి సువార్త పరిచర్యను ఆయా రంగాలలో అధికపరచింది. ఈ విధంగా ఓ సామాన్య యువతి మరియు విద్యా విహీనురాలైన ఓ స్త్రీ యొక్క సమర్పణ కరడుగట్టిన కమ్యూనిస్టు దేశాన్ని దేవుని పాదాల చెంతకు చేర్చగలిగింది. Gladys Aylward Missionary
కాబట్టి నా ప్రియా అక్కా, అన్నా! నీవున్న పరిధిలో నీ సమర్పణ ఏవిధంగా ఉంది? నీవు చేసే సమర్పణను బట్టి దేవుని కార్యాలను చూడగలవని గమనించు. నీ ధనమును, నీ సమయమును, నీ బలమును అవసరమైతే నీ సంపూర్ణ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే అజ్ఞానంధకారంలో మగ్గిపోతున్న మన భారతదేశాన్ని అతి సులువుగా దేవుని హస్తాలలో పెట్టగలం. గ్లేడిస్ ఐల్వార్డ్ వలె గొప్ప సమర్పణ జీవితాన్ని దేవుడు నీకిచ్చును గాక! ఆమెన్.
పిడిఎఫ్ డౌన్లోడ్ కొరకు .. click here