Chronicles 2 – 2 దినవృత్తాంతములు గ్రంథ వివరణ – Chronicles 2 Bible Books Telugu

2 దినవృత్తాంతములు గ్రంథ వివరణ. 

Chronicles 2 Bible Books Telugu

 1. దేవాలయం – ఆరాధన
 2. శాంతి సమాధానాలు
 3. ప్రార్థన
 4. సంస్కరణ
 5. జాతిపతనం,

 ఈ గ్రంథంలో జాతిని ఉజ్జీవంగా ఉంచటానికీ, ధర్మశాస్త్రబద్ధంగా జీవించడానికీ, ప్రజలను ఏకీకృతం చేయడానికీ కేంద్రంగా ఆలయ నిర్మాణం, ఆరాధన, ప్రార్థన మొదలగునవి జరిగాయి. 

 దేవుని ఆజ్ఞలు అనుసరించినంత కాలం శాంతి సమాధానాలు విస్తరిల్లడం, దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ప్రార్థించడం – ప్రజల్ని సంస్కరించడం రాజులు చేసేవారు. 

 ఏం చేసినా, ప్రజల్లో భ్రష్టత్వం పెరిగిపోతూనే పోయి చివరికి దేశము పరాయి రాజ్య పాలనలోకి వెళ్లిపోయింది. దీనికంతటికి కారణం – దేవుణ్ణి సేవించడంలో అస్థిరత్వం. 20 మంది యూదా రాజుల పరిపాలనలో ఒకరాజు మత భ్రష్టుడుగా ఉంటే, ఇంకోరాజు దేవునికి విధేయుడుగా ఉండేవాడు. ఈ పరిస్థితి ప్రజల్ని అతలాకు తలం చేసింది. 

 కంచె చేను మేస్తే, చేనుకు భద్రతేముంటుంది? 

 ఈ గ్రంథంలో ఒక ముఖ్య పదం కనిపిస్తుంది – “తన దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనుట”(2దిన. 30:19). అలానే ఈ గ్రంథంలో మంచి సందేశం కూడా ఉంది – “ఆధ్యాత్మిక జీవిత విజయ రహస్యం యెహోవాను వెదకి సేవించడంలోనే ఉంది” అనేదే. 

 ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఒకే ఒకమాట పదే పదే కనిపిస్తుంది. “యెహోవాను వెదకుడి” (7:14; 11:16; 14:4,7, 15:2,4,12,13,15,17:4; 19:3; 20:34; 22:9; 26:5; 30:19; 31:21; 34:3) యెహోవాను వెదకటం అంటే ఆశీర్వాదం, సాఫల్యత, విజయం అన్నమాట. 

అంతేకాదు – ఈ గ్రంథంలో యెహోవాకు ప్రార్ధించండం, ఆయనపై ఆధారపడటం ఆశీర్వాదానికి మూలమని వివరంగా తెలియజేయబడింది (1:1; 13:18; 14:6,11; 15:9; 20:27; 26:6,7; 27:6; 32:8,22; 28:6,19; 20:20). క్రీ.పూ. 970 నుంచి అంటే సొలొమోను పరిపాలన ప్రారంభం నుంచి బబులోను చెఱయొక్క మూడవ ఘట్టమైన క్రీ.పూ. 586 వరకు జరిగిన సంఘటనలు ఈ 2వ దిన వృత్తాంతము గ్రంథంలో రాయబడి వున్నవి. 

 రాజులకు తీర్పు తీర్చు కొలబద్దను చూపిస్తూ, నిజమైన దేవుని యొద్దకు ప్రజలను మళ్లించుట, యూదాలో నీతిమంతులైన రాజులను వారి పాలనలో జరిగిన ఆత్మ సంబంధమైన ఉజ్జీవమును చూపించుటతో పాటూ దుష్టరాజుల పాపములను కూడా ఎత్తి చూపించడం ఈ గ్రంథంలో మనం చూడగలం. 

 దేవుని ప్రజలు దేవుని త్రోసివేసి, తమ సొంత మార్గములకు మళ్లినప్పుడెల్లా దేవుడు తన ఆశీర్వాదమును వెనుకకు తీసుకొనేవాడు. ఆయనపై ఆధారపడి ధర్మశాస్త్రమును గైకొనునప్పుడు “గెలుపుబాట”లో నడిపించుచున్నాడన్న విషయం, ఈ గ్రంథంలో అనేకసార్లు చెప్పబడినవార్త.  Chronicles 2 Bible Books Telugu

 సమూయేలు రెండవ గ్రంథము, రాజులు రెండు గ్రంథాలు కలిసి ఇశ్రాయేలీ యుల రాజకీయ చరిత్రను తెలియజేస్తున్నాయి. అయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము వారి యొక్క ఆధ్యాత్మిక చరిత్రను తెలియజేస్తూ వుంది. 

 ఇది సొలొమోను మందిర మహిమతో ప్రారంభమై, పునర్నిర్మాణము నిమిత్తమై కోరేషు యిచ్చిన ఆజ్ఞతో ఈ గ్రంథం ముగిసింది. 

ఈ గ్రంథంలో 5 ఉజ్జీవాలు ఉన్నాయి. 

 1. ఆసా కాలంలో (14:1-16:14)
 2. యెహోషాపాతు కాలంలో (17:1 – 20:37)
 3. యోవాషు కాలంలో (22:10 – 24:27)
 4. హిజ్కియా కాలంలో (29:1-32:33)
 5. యోషీయ కాలంలో (34:1-35:27)

  సొలొమోను వైభవంతో చేసిన పరిపాలన – యేసుప్రభువు వెయ్యేండ్ల పరిపాలనకు సాదృశ్యముగా నున్నది. 

 రాజుల గ్రంథములలో మానవ మాత్రులైన రాజుల యొక్క పతనం వ్రాయబడి యుండగా, ఈ గ్రంథంలో ఆ పతనాన్ని మించిన దేవుని కృప మరియు రారాజైన యేసుక్రీస్తు జన్మించనైయున్న దావీదు వంశం యొక్క స్థిరతను గూర్చి రాయబడియున్నది.  Chronicles 2 Bible Books Telugu

 ఎన్నో కుట్రలూ, కుతంత్రాలూ, ఇశ్రాయేలు రాజులూ మరియు అష్షూరు రాజులు చేశారు గాని దావీదు వంశం నిలువబడియున్నది. 

దేవుని వాగ్దానాలనూ ఆయన యొక్క నిబంధనలనూ ఎవరు వమ్ముచేయలేరు. ఆయన తన భాగమును, తన శేషమును కాపాడుకొంటాడు. 

 ఈ గ్రంథంలోని దేవాలయం కూడా క్రీస్తును సూచించుచున్నది. యేసుప్రభువు తన్ను గూర్చి – “దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉ న్నాడు” (మత్తయి 12:6) అంటూ చెప్పుకొన్నాడు. యోహాను సువార్తలో ఆయన తన శరీరమును దేవాలయము తో పోల్చి మాట్లాడుచున్నాడు -“ఈ ఆలయమును పడగొట్టుడి, మూడు దినములలో దానిని లేపుదును” (2:19).  Chronicles 2 Bible Books Telugu

 అంతేకాదు – ప్రకటన 21:22లో – యేసుక్రీస్తువారు ఆలయముగా ఉండుటను చూచుచున్నాం. “దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియగు దేవుడు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు” అంటూ రాయబడియున్నది. 

ఆయనే రేపు పరలోకంలో మనకు దేవాలయం! 

విజయమునకు కారణమైన కొన్ని సూచనలు ఈ గ్రంథంలో మనకు దొరుకుతాయి. అవి ఏమిటో పరిశీలన చేద్దాం. 

 1. ఆర్భాటము : ఆర్భటించినప్పుడే యూదా శత్రువులు నిలువలేకపోయారట! (2దిన.13:15). స్తుతులతో ఆర్భటిస్తే జయం మన సొంతం అవుతుంది.
 2. యెహోవాను ఆశ్రయించుట : స్వంత బలంపై ఆనుకొనుట ఎన్నటికైన ముప్పే.యూదావారు దేవున్నే ఆశ్రయించారు కనుక జయ మొందారు (13:18).
 3. మిశ్రిత మతమును నాశనం చేయుట : ఒకవైపు దేవుడైన యెహోవాను పూజించుచూ, మరోవైపు విగ్రహములను పెట్టుకొంటే జయం ఎప్పుడూ రాదు. మనకు ధనమొక విగ్రహం, అందం ఒక విగ్రహం… యిలా ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలెయ్యాలి (14:2 – 6), కొలస్సీ 3:5, 1యోహాను 5:21 చదవండి. Chronicles 2 Bible Books Telugu
 4. బలిపీఠంపై దహనబలి అర్పించుట : దహనబలి అర్పణ ఆరంభమగుటతోనే యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను (29:27). క్రీస్తే మన పరిమళవాసన వంటి దహనబలి (ఎఫెసీ 5:2). ఆయనతో మనం కలిసిపోతే, ఎక్కడికి వెళ్ళినా సువాసన గలవారమై విజయోత్సవముతో ఊరేగింపు చేసినట్లుగా నడిపించబడతాం (2కొరి. 2:14). చివరికి మనమే ఆ బలిపీఠం మీద దహన బలి అయిపోవాలి (రోమా 12:1,2).

పై నాలుగు సంగతులు మన ఆధ్యాత్మిక విజయానికి అత్యవసరమైన సంగతులు! 

 2వ దినవృత్తాంతముల గ్రంథము, రెండు ముఖ్యమైన భాగాలను కలిగియున్నది. 1నుంచి 9వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క పరిపాలనను తెలియజేస్తుంది. 10వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు – రాజ్య విభాగం నుంచి చెఱవరకు ఉన్న విషయాలు లిఖించబడి యున్నాయి. Chronicles 2 Bible Books Telugu

సొలొమోను జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయములు ఈగ్రంథంలో ఉన్నవి. 

 1. రాజ్యపరిపాలన, 2. జ్ఞానము, 3. వైభవం, 4. పతనం వంటి విషయాలుచూడగలం. 

అలాగే సొలొమోను కార్యములు కూడా నాలుగు విధాలుగా చూడగలం.

 1. దేవుని వలన సొలొమోను రాజు అని స్థిరపరచబడుట – 1:1-17;
 2. సొలొమోను మందిరం కట్టుట – 2:4-5;
 3. సొలొమోను మందిరం ప్రతిష్టించుట – 5:2 నుంచి 7:22 వరకు
 4. సొలొమోను సంపద మరియు వైభవం – 8:1 నుంచి 9:31 వరకు

ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మిన్ను విరిగి మీద పడినా…. దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఈ గ్రంథంలో స్థిరపరచియున్నాడు. మన ఆడంబరాలూ మన అట్టహాసాలూ కాదు, దేవునికి కావలసినది. మనం కావాలి మన జీవితాలు కావాలి దేవునికి.  Chronicles 2 Bible Books Telugu

ఒక మనుష్యుని యొక్క ఆధ్యాత్మిక చరిత్రే దేవునికి అత్యంత ప్రధానమైన విషయం! 


PDF Files Download  కొరకు క్లిక్ చేయండి click here 

Leave a comment

error: dont try to copy others subjcet.