యేసుక్రీస్తు శిష్యులు
జెబెదయి కుమారుడైన యాకోబు (మత్తయి 10:2)
James Son of Zebedee Telugu
1.) యాకోబు అను మాటకు మోసపుచ్చువాడు అని అర్థం: యేసుక్రీస్తు ప్రభువు శిష్యరికంలోనికి రానంతవరకు అతని జీవితం మోసయుక్తమైనదని మనం’ గ్రహించవచ్చును. (యిర్మీయా 17:9) ప్రకారం హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది అని మనం గ్రహిస్తున్నాం (తీతు 3:3) ప్రకారం సాతాను చేత మనం మోసగించబడ్డాము. దేవుని యొక్క తిన్నని మార్గం నుండి తొలగించబడ్డాము. ఏదేను వనములో హవ్వను మోసపుచ్చి ఆదాము హవ్వల నుండి దేవుని మహిమను దొంగిలించిన ఆ సాతానే నేడు వెలుగుదూత వేషముతో విశ్వాసి, అవిశ్వాసి అనే భేదం లేకుండా ప్రతీ ఒక్కరినీ మోసగించుచున్నాడు. తద్వారా మనిషి ఇతరులను మోసపుచ్చుతూ తమకు తెలియకుండానే తమ్మును తాము మోసగించుకొనుచున్నాడు. అపొ. 5:3లో అననీయ, సప్పీరాలు పరిశుద్ధాత్మను మోసపుచ్చి వారి జీవితాలు అంతం చేసుకొనినారు. మోసకరమైన నాలుక కలిగి (కీర్తన 120:3) శిక్ష అనుభవించవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరీ! మోసయుక్తమైన జీవితాన్ని విడిచిపెట్టు, మోసగించవద్దు, మోసపోవద్దు.
2.) బైబిల్ గ్రంథంలో 4గురు యాకోబులను చూడగలము
- ఎ) ఇస్సాకు కుమారుడైన యాకోబు (ఆది 25:26)
- బి) జెబెదయి కుమారుడు (మత్తయి 10:2)
- సి) అల్పయి కుమారుడు (మత్తయి 10:3)
- డి) .ప్రభువు సహోదరుడు (మార్కు 6:3)
3.) జెబదయి కుమారుడైన యాకోబు : జెబదయి అనగా “యెహోవా దానము” మోసయుక్తమైన మన జీవితాలను బాగుచేయుట కొరకు మన తండ్రియైన దేవుడు మనకిచ్చిన దానములు
- ఎ) తన సొంత కుమారుని అనుగ్రహించెను (రోమా 8:32)
- బి) శుభప్రదమైన రక్షణ (ఎఫెసీ 2:8)
- సి) పరిశుద్ధాత్మ (రోమా 5:5)
4.) యాకోబు తల్లి పేరు సలోమి : ఈ సలోమి దైవభక్తి కలిగిన స్త్రీ (మార్కు 15:40). తన కుమారుల యొక్క ఆధ్యాత్మిక విషయాలలో ఎంతో భారం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుతో తన ఇద్దరు కుమారులను చెరోప్రక్క ఉంచాలని ఆశించండంలోనే దేవుని విషయంలో ఆమెకున్న ఆసక్తి మనకు అర్థమవుతుంది. సలోమి అనగా సమాధానం అని అర్థం.
- మనము హృదయంలో సమాధానం కలిగి ఉండాలి (మార్కు 5:34) స్వస్థపరచబడిన స్త్రీకి ప్రభువు సమాధానమనుగ్రహించెను.
- దేవునితో మనలను సమాధానపరిచెను (రోమా 5:1) ఆయనతో సహవాసం చేసిన యెడల మనకు సమాధానం కలుగుతుంది (యోబు 22:21)
- మనుష్యులతో సమాధానం కలిగి ఉండాలి (హెబ్రీ 12:14) అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి (కీర్తన 57:18) శత్రువులతో సమాధానం కలిగి ఉండాలి (కీర్తన. 120:6) కలహప్రియుని యొద్ద దావీదు చిరకాలం జీవించిననూ అతడుసమాధానమునే కోరుకొనెను.
5.యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడిన పేతురు, అంద్రెయలతో పాలిభాగస్తుడయ్యెను (లూకా 5:10). మన ప్రభువు ఎన్నికలేని మనలను అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో మనలను కూడా పాలిభాగస్తులనుగా చేసెను.
- పరలోక పిలుపులో (హెబ్రీ 3:1)
- దైవ స్వభావంలో (2 పేతు 1:4)
- పరిశుద్ధాత్మలో (హెబ్రీ 6:14)
- ఆయన మహిమలో (1 పేతు 5:1)
- ఆయన పరిశుద్ధతలో (హెబ్రీ 12:10)
- పరిశుద్దుల స్వాస్థ్యములో (కొలస్స 1:12)
- క్రీస్తులో (హెబ్రీ 3:15)
- శ్రమానుభవములో (2 తిమో 1:3)
6.) యాకోబుకు మరియొక పేరు బోయనెర్గేసు : బోయనెల్గెసు అనగా ఉరుము (మార్కు 3:15). బైబిల్ గ్రంథంలో ఉరుము మొదటిగా ప్రార్థనకు జవాబుగా కనిపిస్తుంది (1 సమూ 12:17), రెండవదిగా ఉరుములో నుండి దేవుని స్వరం వినబడును (యోబు 37:1-3), మూడవదిగా ఉరుము దేవుని మహిమను సూచించును (నిర్గమ 19:16, ప్రక 4:5), నాల్గవదిగా ఉరుము దైవశక్తికి సూచనగా కనిపిస్తుంది (కీర్తన 29:3-5), ఐదవదిగా దేవుని శిక్షకు సూచనగా కనిపిస్తుంది (1 సమూ 2:10);
7.) యాకోబు మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియునిగా ఉండెను (మత్త 17:1, మార్కు 9:2). ప్రియులుగా ఉండుట ఎంతో భాగ్యము.
- దానియేలు బహు ప్రియుడు (దాని 10:11)
- దావీదు ప్రియుడు (కీర్తన 91:14)
- బర్నబా, పౌలు అను ప్రియులు (అపొ.కా. 15:26)
- ప్రియురాలైన పెర్సిస్సు (రోమా 16:12)
- ప్రియుడైన తుకికు (ఎఫెసీ 6:21)
- ఒనేసీము (కొలస్సీ 4:9)
- తిమోతి (2 తిమో 1:2)
- నా ప్రియ కుమారుడు (మత్త 3:17). ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అనగా దేవుని పోలి నడిచేవారు ప్రియులుగా ఉండగలరు (ఎఫెసీ 5:1)
పౌలు పరిచర్యలో అనేకమంది ప్రయాసపడి ప్రియులుగా ఎంచబడిరి. నీవును దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండుట కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో !
8.) యాకోబు క్రీస్తు కొరకు హతసాక్షి ఆయెను:- ప్రభువు ఆరోహణానంతరము తోటి శిష్యుల మాదిరిగానే యాకోబు గొప్ప పరిచర్య చేసెను. అనేక చోట్ల సంఘస్థాపన చేసెను. మరి ముఖ్యంగా స్పెయిన్ దేశంలో క్రీస్తు సువార్తను బహుగా ప్రకటించి ఎంతో ప్రయాసపడెను. యాకోబు క్రీ.శ. 44లో హేరోదు చేత శిరచ్ఛేదనము చేయబడెను (అపొ.కా. 12:1-2). శిరచ్ఛేదనం తదుపరి శిష్యులు యూదులకు భయపడి ఆయన మొండెమును ఎత్తుకు పోయి ఒక దోనెలో వుంచగా అందరూ ఆశ్చర్యపడురీతిగా దేవుని శక్తి ఆ దోనెను స్పెయిన్ తీరమునకు నడిపించెను. “లూపా” అనే రాణి అతని మొండెమును ఓ బండిపై పెట్టి కుటిలబుద్దితో బండిని తోలింపచేసింది. కాని ఆ ఎడ్లు చక్కగా తోలి రాజసభలోనికి నడిపించినవి. ఈ గొప్ప కార్యమును చూచి అనేక రాజకుటుంబాలు, ప్రజలు ప్రభువును విశ్వసించిరి. స్పెయిన్లో గొప్ప చంద్రకాంత శిలాఫలక సముదాయంతో కూడిన చర్చి నిర్మించబడియున్నది. ఇసుక వేస్తే రాలనంత జనం నేటికి లక్షలు లక్షలుగా వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ “యాకోబు జీవితం” యెడల దేవుని యెడల వారికున్న అభిమానమును కనుపరుస్తుంటారు.
ప్రత్యక్ష గుడారం మేటీరియల్ కొరకు…………Click