ఛార్లెస్ జి ఫిన్నీ|జీవిత చరిత్ర | Charles G Finney Telugu Life History Telugu

ఛార్లెస్ ఫిన్నీ

Charles G Finney Telugu Life History Telugu

 ఛార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రములో ఉన్న వారెన్ నగరములో 1792 ఆగష్టు 29 వ తేదీన జన్మించెను. ఇతని తండ్రి పేరు సెల్వష్టర్ ఫిన్నీ. ఛార్లెస్ ఫిన్నీకి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు న్యూయార్క్ లోని ఒనిడా అనే స్థలానికి సైనిక ఉద్యోగి అయిన ఇతని తండ్రి ఇతని తోడుకొని పోయెను. ఆ ఎడారి వంటి స్థలములో సరియైన విద్య, సంస్కృతి, దైవభక్తి లేకుండుట వల్ల ఫిన్నీ తన ఇష్టానుసారంగా పెరిగెను. 

 పదహారేండ్ల ప్రాయం వచ్చేసరికి, సాధారణ విద్య ముగించి, తన ఇరవయ్యవ యేట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టెను. విద్యపై ఆసక్తి కలిగిన ఫిన్నీ లాటిన్, గ్రీకు, హెబ్రీ భాషలను నేర్చుకొనెను. తన ఇరవై ఆరవయేట “లా” చదువుకొనుటకు కాలేజిలో చేరెను. ఇతడు “లా” చదివే దినాలలో నేటి న్యాయశాస్త్రానికి ఆధారమైన బైబిల్ లోని పది ఆజ్ఞలను గురించి చదివెను. 

 న్యాయశాస్త్ర గ్రంథాలలో బైబిల్ భాగాలను గురించిన ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాటిని పరిశీలనగా చూడాలని ఆశ కలిగి ఒక బైబిల్ను కొనుక్కొనెను. 

 బైబిల్ చదివే కొలది ఆసక్తి, ఆధ్యాత్మికమైన ఆకలి ప్రారంభమై శ్రద్ధగా చదివి ధ్యానించుట మొదలు పెట్టెను. అర్థం గాని సంఘటనలను అక్కడ సంఘకాపరి “గెల్” గారితో సంప్రదించుచుండెను. ‘చనిపోయిన తరువాత జీవితమున్నది’ అన్న విషయము తెలిసినప్పుడు ‘అయ్యో, నేనా జీవితము కొరకు సిద్ధపడలేదే!’ అని వాపోయెను. నేను చనిపోతే నరకమునకు పోవుదును అని గుర్తించెను. పశ్చాత్తాపము అంటే ఏమిటి? విశ్వాసము అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబులు కనుగొనుటకు మరింత ఎక్కువగా బైబిల్ చదువుట ప్రారంభించెను. ఆచారభక్తి, స్వనీతి పరలోకమునకు మార్గము కావని గ్రహించెను. క్రొత్త నిబంధన చదువుచుండగా యేసే మార్గమని గుర్తించెను. 

 1821 వ సంవత్సరము అక్టోబర్ నెలలో ఒక ఆదివారము ఆత్మ రక్షణ పొందాలని నిశ్చయించుకొనెను. సోమ, మంగళ వారములు కూడా ప్రార్థన, బైబిల్ పఠనంలో ఎక్కువ సమయం గడపగా తన ప్రధాన పాపము గర్వము అని ప్రభువు బయలు పరచెను. తాను ప్రార్థన చేయునప్పుడు, బైబిల్ చదువునప్పుడు ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకొంటారేమోనని రహస్యంగా ప్రార్థిస్తూ; బైబిలు చదువుచున్నప్పుడు ఎవరైనా వస్తే న్యాయశాస్త్ర పుస్తకములను బైబిల్ పైకి లాగి వేయుచుండెడివాడు.  Charles G Finney Telugu Life History Telugu

 తన స్థితిని గుర్తిస్తూ ప్రార్థిస్తున్న ఫిన్నీకి కన్నుల ముందు సిలువ దర్శనమును పరిశుద్ధాత్ముడు ప్రత్యక్ష పరచెను. మారుమాట్లాడలేక మోకాళ్ళపై పడ్డ ఫిన్నీ గట్టిగా కేకలు వేసి ఏడ్చుచు; తన గర్వమును, పాపములను ఒప్పుకొని ప్రార్థించెను! “లోకంలో మనుషులంతా వచ్చి చూసినా, నరకములోని పిశాచాలన్నీ నన్ను చుట్టుముట్టినా నేను ఈ స్థలములో నుండి లేవను; మోకాళ్ళపై నుండి ప్రార్థించుట మానను” అని కేకలు వేసెను. తన పాప స్థితికి లోతుగా పశ్చాత్తాపపడి ఒప్పుకొని ప్రార్థించెను. నూతన హృదయమును పొందెను. ఆ రోజు 10-10-1821 అతను లేచి గదిలోనికి వెళ్ళగా గది అంతయు వెలుగుమయమై ఉండెను. ప్రభువును ముఖాముఖిగా చూసెను. ఫిన్నీ హృదయము బ్రద్దలై, పసిపిల్లవాడివలె ఏడుస్తూ, ప్రార్థించి తన జీవితమును పూర్తిగా ప్రభువుకు అప్పగించుకొనెను; గొప్ప శాంతి అతని హృదయములోనికి వచ్చెను. ఆ దినమంతయు చెప్పశక్యము గాని సంతోషముతో అతని హృదయము నిండి యుండెను. ఏ పని చేయ బుద్ది కాలేదు. ఆహారము మీద ధ్యాస లేక పోయెను. ప్రభువును స్తుతిస్తూ, పాడుతూ, సంతోష హృదయంతో ఆనంద భాష్పాలను కార్చుచుండెను. పరిశుద్ధాత్మ శక్తి అతనిని ఆవరించి నూతనమైన జీవితమును అనుగ్రహించెను. ఆ తరువాత ఆత్మల కొరకు హృదయము భారముతో నిండియుండెను. గనుక ఎక్కువగా ప్రార్థించుచుండెను.  Charles G Finney Telugu Life History Telugu

 ఫిన్నీ ఆత్మల రక్షణకొరకు, సువార్త ప్రకటన కొరకు ఎంత ఆసక్తి గలిగి ఉండేవాడంటే, ఆయన పెండ్లి అయిన అయిదవ రోజున బజారు చేసుకొని రమ్మని భార్య సంచిని చేతికిస్తే, సంచిలో బైబిలు పెట్టుకొనిపోయి మూడు నెలల వరకు సువార్త చెప్పుచూ ఆ తరువాత తనకు పెండ్లి అయిన సంగతి గుర్తుకొచ్చి తిరిగి ఇంటికొచ్చాడట! 

 ఫిన్నీ దేవుని ఉజ్జీవ పనిముట్టుగా వాడబడుచుండెను. ఫిన్నీ మాట్లాడిన ప్రతి వ్యక్తి పాపపు ఒప్పుకోలులోనికి వచ్చుచుండెను. దేవుని వాక్యము అందించు నప్పుడు పరిశుద్ధాత్మ దిగి అనేక ఆత్మలను దర్శించుచుండెను. గొప్ప ఉజ్జీవ అగ్ని రగులుకొని అన్యులు మారుమనస్సు పొందుచుండిరి. ఫిన్నీ బోధిస్తూ ఉంటే, వినేవారి హృదయంలోనికి దేవుని వాక్యము వాడియైన బాణాలుగా దూసుకుపోయి జొరబడేవి. అతడు ధైర్యముగా, సూటిగా మాట్లాడేవాడు. ఈయన ప్రసంగము వినేవారితో వ్యక్తిగతంగా మాట్లాడుచున్నట్లు, సంతోషించేటట్లు ఉండేవి; చివరిగా ఒక తీర్మానానికి నడిపించేవిగా ఉండేవి. 

 ఫిన్నీ గొప్ప ప్రార్థనాపరుడు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మ శక్తితో కూడిన అతని బోధ వినేవారి హృదయాలపై గాఢమైన ముద్ర వేసి పని చేసేది. అతడు ఒక మాట మాట్లాడినా, వాక్యం ఎత్తి చూపినా, సంజ్ఞ చేసినా, చూసినా, పరిశుద్ధాత్మ శక్తి అధికముగా కుమ్మరింపబడేది. ఆ స్థలములో పశ్చాత్తాపంతో కూడిన మాటలు వినవచ్చేవి, కన్నీళ్ళు కానవచ్చేవి. 

 ఈయన సభలలో రక్షించబడిన వారిలో నూటికి నలభై ఐదు మంది చివరి వరకు దేవునికి నమ్మకముగా ఉండిరి. ఈయన ఉజ్జీవ కూటముల ద్వారా ఐదు లక్షల మంది మారు మనస్సు పొంది రక్షించబడిరని అంచనా! ఫిన్నీ ఇంగ్లాండులో దేవుని పనిముట్టుగా బహుగా వాడబడ్డాడు.   Charles G Finney Telugu Life History Telugu

 1868లో తన జీవిత చరిత్ర వ్రాసి ముగించాడు. తన వృద్దాప్యములో వేదాంత కళాశాలలో విద్యార్థులకు బైబిలును బోధించుచు గొప్ప సేవ చేసెను. తన 83వ ఏట అనగా 1875 ఆగష్టు 16వ తారీఖున ఫిన్నీ ఈ లోక యాత్రను ముగించి, తాను ప్రేమించిన పరలోకం చేరుకున్నాడు. 


Download All Pdf Files….Click Here

Leave a comment

error: dont try to copy others subjcet.