చార్లెస్ ఫిన్నీ సేవకులకు ఇచ్చిన సలహాలు|Charles Finney’s Advice to Servants|2

Written by biblesamacharam.com

Updated on:

చార్లెస్ ఫిన్నీ సేవకులకు ఇచ్చిన సలహాలు.

Charles Finney’s Advice to Servants

    క్రైస్తవ సంఘ చరిత్రలో ఎంతో బలమైన పరిచర్య జరిగించిన దైవజనులు ఎందరో ఉన్నారు. వారు సజీవ యాగముగా బలిపీఠంపై తమ్మును తామే అర్పించు కున్నారు. వారిలోంచి అగ్ని బయలుదేరింది. ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రవాహము వలె ప్రజలు రక్షణ పొందారు. దేవుని చేతిలో బహుబలముగా వాడబడిన వారిలో అగ్రగణ్యుడు_చార్లెస్ ఫిన్నీగారు! 

     ఇతడు కాపరులకు, సువార్తీకులకు ఇచ్చిన సూచనలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. వాటిని యథాతథంగా ఇక్కడ మీకు తెలియజేయడం గొప్ప మేలు అని భావించి మీకు అందజేస్తున్నాం. 

* సువార్తను క్రీస్తువలె ప్రేమించి ప్రకటించండి – (రోమా 2:16) 

* పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని సేవ చేయండి – (అపొ. 1:4,8) 

* మీ పిలుపు, వాక్యజ్ఞానం తలకు గాక, హృదయానికి చెందినదై  యుండనీయండి-(యెష 61:1-3) 

* దేవునితో కలసి నడవండి; కలసి పనిచేయండి! – (యోహాను 5:19) 

* మోకరించి బైబిల్ చదవండి; పరిశుద్ధాత్మ వెలుగు కోసం కనిపెట్టండి-  (కీర్తన119:105-130) 

* వ్యాఖ్యానాల మీద ఆధారపడవద్దు! పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఆత్మలో వివేచించండి! తరువాత అవసరాన్ని బట్టి వాటిని చూడండి – (1యోహాను 20:20, 5:20) 

* తలంపుల్లో, తీర్మానాల్లో, అనుభూతుల్లో, మాటల్లో, క్రియల్లో పరిశుద్ధముగా ఉండండి! (1తిమోతి 4:11-12) 

* పాపుల పట్ల ప్రేమ, కనికరము కలిగి; వారి రక్షణకై ఆసక్తి కలిగి యుండండి (మార్కు 6:34) 

* ఆత్మల రక్షణార్థమై ఎంతటి త్యాగానికైనను మీరు సిద్దపడి యుండండి!    (అపొ. 20:24) ఏలాగు ఆత్మల్ని రక్షించగలను? ఏలాగు వారిని పెంచగలను? అనే అంశాలను

* పద్ధతులను అన్వేషించండి (రోమా 1:14,15, 2 కొరింథీ 11:28)  దేవుడు నిన్ను తనసేవకు పిల్చాడు గనుక ఆ పనికి అవసరమైన శక్తి, కృప * మొదలగునవి ఇమ్మని దేవుణ్ణి గోజాడండి! – (రోమా 8:32) దేవుని పనులు నిర్లక్ష్యముతోను, తేలికభావముతోను చూడవద్దు! భారం గల కార్య నిర్వాహకుడిగా పనిచేయుము! యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు

* శాపగ్రస్తుడు అగును – (యిర్మియా 48:10)  నీ సంఘస్థులందరు నీకు తెలిసియుండాలి. గొర్రెను గూర్చిన భారం కాపరిదే!

* వారి అధ్యాత్మిక స్థితిగతులు నీవు గ్రహించినవాడవై యుండాలి!                         

* మొహమాటం, నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనవి! ప్రసంగ వేదిక మీదను, బయటను ఒక్కలాగే ఉండు! అప్పుడే ప్రజలు నీ మాటలు గౌరవిస్తారు. వెలకట్టి అంగీకరిస్తారు! 

* నీ బోధ నీ జీవితములో అప్పటికే జీవిస్తూ ఉండేదై యుండాలి! స్త్రీలతో మాట్లాడేటప్పుడు నీ పవిత్రతను కాపాడుకో! లేశమాత్రమైనా అపవిత్రతను అంటనీయవద్దు. 

* నీ బలహీనతల్ని కప్పిపెట్టవద్దు! దేవుని కృపతో వాటిని సరిచేసుకో!    (సామె. 28:13)

* నీలో కలుపుగోలుతనం లేకుంటే, పరిశుద్ధాత్మ ద్వారా అలవర్చుకో! నీవు ఎవరివో, ఎలాంటివాడవో అలాగే జీవించు! అప్పుడు ఇతరులను నమ్మించే బాధ తప్పుతుంది! 

* నిరాడంబరత, యథార్థత నీ జీవిత చిహ్నంగా ఉండనీయుము! 

* సాధారణమైన జీవితమూ, ఉన్నతమైన ఆలోచన నీ గురిగా ఉండనిమ్ము! ఒక మంచి విశ్వాసి ప్రార్థనకంటే, నీ ప్రార్థన నాలుగు రెట్లు అధికముగా ఉండనీయుము! 

* వాక్య భాగమును నిర్ణయించి బోధించడానికి పరిశుద్ధాత్మకు పూర్తి అధికారము ఇవ్వు!

* ప్రతి ప్రసంగం తలనుంచి కాక, హృదయం నుంచి పుట్టనీయండి! 

* పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి మాత్రమే బోధించు! ప్రతి ప్రసంగానికి ముందు నీవు ప్రార్థన గదిలో నుంచి బయటకు రావాలి! 

* అప్పుడు నీ సందేశం శక్తిగలిగినదై ఆత్మలను చేరునదై యుంటుంది. నీ హృదయం వాక్యములతోను, క్రీస్తు ప్రేమతోను నిండిపోనివ్వు! అప్పుడు   * భారముతో మాటలు ఊటలవలె వస్తాయి. 

* మనుష్యులకు కాక, దేవునికి భయపడి నిర్మోహమాటంగా వాక్యాన్ని ప్రకటించు! నీ ప్రసంగమును ఎవరో మెచ్చుకోవాలని ఆశించవద్దు! ఎలా ఉంది? అని కూడా అడగవద్దు! సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లించు! 

* నీ పేరు ప్రఖ్యాతులుగాని, నీ జీవితం గాని, సంఘం యొక్క అంగీకారం గాని, లేదా వారియొక్క కోపం గాని నీ ప్రసంగాన్ని అడ్డగించనీయకు! నీ ప్రజల్ని నీవు నిజంగా గద్దిస్తే, నీ సంఘం ఏమి పలచబడదు – అయితే దానికి భిన్నంగా వర్థిల్లుతోంది. నీవు వెనకాడితే వారు నశిస్తారు. అప్పుడు          

 * దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. నీ బోధ మరియు నీ జీవితం ప్రతివాని మనస్సాక్షిని తాకాలి! ఈ విధంగా నిన్ను నీవు సాధకం చేసుకో! 

* నీవు పేరొందిన ప్రసంగీకుడవు కావచ్చు! ధారాళంగా వాక్యాన్ని వివరించగల ఆ వక్త్రవు కావచ్చు! ఆత్మల సంపాదకుడవు కాకపోతే కేవలం నీ పరిచర్య వ్యర్ధమే! ప్రపంచములో మనుషులను పట్టే జాలరివి కావడానికి ముందు నీవు వాక్యమును వెంటాడే వేటగాడివి కావాలి! 

* నరకమునకు వెళ్లకుండా తప్పించుకోవడానికి దారి ఉంది కాని నరకములో పడిన తరువాత తప్పించుకోవడానికి మాత్రము దారిలేదని గుర్తుపెట్టుకో! ప్రార్థించడానికి మనము మోకాళ్లను వంచినట్లయితే, వినడానికి దేవుడు తన చెవులు వంచుతాడు. ఓడ సముద్రంలో ఉంటుంది, గాని సముద్రము ఓడలో ఉండదు – అటువలె నీవు లోకములో ఉండొచ్చు, గాని లోకము నీలో ఉండకుండా చూసుకో!   

* నీవు ఏది చేసినప్పటికీ ఆత్మల రక్షణ, క్షేమాభివృద్ధి, దేవునికి మహిమ అనే గురిని కలిగియుండుము. 

* మీరును గొప్ప ఉజ్జీవ ప్రభంజనాన్ని సృష్టిస్తారు! ఈ తరంలోని ప్రజలు నీ ద్వారా ప్రభావితులు అవుతారు! లే, నీ శక్తికి మించిన పరిచర్య నీ కొరకు సిద్ధమై యుంది! 


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

Leave a comment