క్రైస్తవులు టీవీ చూడవచ్చునా|Can Christians Watch Tv-Telugu1

క్రైస్తవులు టీవీ చూడవచ్చునా?

Can Christians Watch Tv-Telugu

విమర్శ: క్రైస్తవులు టి.వి కార్యక్రమాలు, సినిమాలు చూడవచ్చునా? కొందరు చూడటం లేదు మరికొందరు చూడటం తప్పులేదు అంటున్నారు. కానీ దానిని గూర్చి బైబిలు ఏమంటుంది? 

జవాబు : టి.వి లు చూడవచ్చును టి.వి లు చూడవలెననునది బైబిలు ప్రవచనమైయున్నది. ఆశ్చర్యపడుచున్నారా? పూర్తిగా చదవండి, ఏట్లనగా ప్రకటన 11:1-9 వచనముల వరకు చదివిన యెడల… దేవుని దగ్గర నుండి యిద్దరు సాక్షులు వచ్చుచున్నారు. వారి సాక్ష్య కాలము పూర్తి కాగానే కౄరమృగము వారితో యుద్ధము చేసి వారిని చంపి వారి శవములను ఆ మహా పట్టణపు సంత వీధులలో పడవేయగా ఆ శవములను ప్రపంచములో నున్న ఆయా భాషలు మాటాడువారు సకల జాతివారు మూడు దినములన్నర వరకు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. యెరూషలేము సంత వీధిల్లో పడియున్న శవములను ఎంత మంది చూడ గలరు? మనమందరం యెరూషలేముకు వెళ్ళగలమా? చూడలేము అయితే చూడవచ్చును.. ఎలా? ఇంగ్లాండ్ – శ్రీలంక లాంటి ఇతర దేశాల్లో ఆడుచున్న క్రికెట్ కార్యక్రమములను మీరు మీయిల్లలో నుండే చూస్తున్నారు గదా? ఎలా చూస్తున్నారు? ఆలాగే వారి యొక్క శవములను మూడు దినములన్నర వరకు ప్రతిభాషికులు సకల జాతివారు టి.వి ద్వారానే చూడాలి గనుక ఆ శవములను చక్కగా చూచునట్లు మీ యిండ్ల లోని బ్లాక్ & వైట్ టి.వి లాంటి వాటిని కలర్ టి.వి లుగా మార్చుకోండి. టి. విలు చూడడం తప్పు కాదు కాని మీరు చూస్తున్న కార్యక్రమాల పైన తప్పు, ఒప్పు ఆధారపడి వుంది. ఎందుకనగా దా॥కీ. 101:3 లో నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును వుంచుకొనను అని 119:37లో వ్యర్ధమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుమని దావీదు మహారాజు తాను వ్రాసిన కీర్తనల యందు వ్రాయుచున్నాడు. కాబట్టి దుష్కార్యమును వ్యర్ధమైన వాటిని చూడకుండా మీ కన్నులను త్రిప్పుకొనుడి. సినిమాలలో అసభ్యకరమైన సంభాషణలు ద్వందార్ధపు పాటలు వికారపు చేష్టల నృత్యాలు హింసాత్మకమైన ఫైటింగ్స్ లేని సినిమా లేనే లేదు. అవన్నీ జీవితానికి అవసరమా? నేటి యువతరం తమ నిజ జీవితాలలో తప్పుటడుగు వేయడానికి అవియే కారణమైయున్నవి. కాబట్టి సినిమా వలన ఎలాంటి ప్రయోజనము లేదు. వాటిని చూచుట మంచిది కాదు. టి. విలంటే వ్యర్ధమైన వాటిని కాకుండ, నీ జీవితానికి సంబంధించిన జ్ఞానాభివృద్ధికి కావలసిన ఆసక్తికరమైన ప్రయోజనకరమైన వాటిని మాత్రమే చూడవలెను. కాబట్టి సినిమాలకు వెళ్ళకూడదని, టి.వి లలో దుష్కార్యమును వ్యర్ధమైన వాటిని చూడకుండ జ్ఞానాభివృద్ధికి, ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన వాటిని చూడవలెనని తెలుసుకొనిన మీరు సత్యాన్ని గ్రహించి క్రీస్తుకు తగిన పిల్లలుగా వుంటారని ఆశిస్తున్న!


ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

3 thoughts on “క్రైస్తవులు టీవీ చూడవచ్చునా|Can Christians Watch Tv-Telugu1”

Leave a comment

error: dont try to copy others subjcet.