ఆరోగ్యం పాడైతే మందులు వాడొచ్చా – Bible Question And Answers Telugu

ఆరోగ్యం పాడైతే మందులు వాడొచ్చా?

Bible Question And Answers Telugu

అనారోగ్యం సంభవించినా మందులు వాడుతున్నాం. ఆరోగ్యం పొందుకుంటున్నాం. ఇంతకీ ఆరోగ్యం పాడైతే మందులు వాడొచ్చా? వాడకూడదా? ఏది వాక్యానుసారమైనది? 

 జవాబు: రోగం వచ్చినప్పుడు మందులు వాడకూడదని బైబిల్ గ్రంథమందు ఎక్కడా వ్రాయబడలేదు. ‘ ఎంతో ఉపయోగపడుతున్న మందులన్నీ ఆకుల ద్వారా, చెట్ల ద్వారా మనకు లభ్యమవుతున్నవి. 

 ఇది దేవుడు మనిషికి అనుగ్రహించిన కృప. (ఆది 1:29) బైబిల్ గ్రంథమందు పుత్రదాత వృక్ష ఫలములు రాహేలు లేయాను అడిగినట్లు మనం చదువుతాం. “రాహేలు నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా…” (ఆది 30:14) హిజ్కియా రోగియైనపుడు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసుకొని హిజ్కియా పుండుకు కట్టమని చెప్పెను. (యెషయా 38:21) “రోగులకే గానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదని” యేసయ్య వైద్యాన్ని సమర్థించెను. (మత్తయి 9:12) మంచి సమరయుడు దొంగల చేతిలో గాయాలొందిన వానికి “నూనెయు, ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టినట్లు” (లూకా 10:33,34)లో చూస్తున్నాము. వైద్యుడైన లూకా (కొలస్సీ 4:14) అని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడంటే అతని ద్వారా విశ్వాసులు మేలు పొంది యుండవచ్చు. “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్ధన చేయవలెను.” (యాకోబు 5:14)లో చూస్తాము. నూనె వ్రాయుట అనునది గ్రీకులో ‘అలియోపో’ అంటే ‘అభిషేకం’ అని అర్ధం. వారు ఆ రోజుల్లో రోగిని నూనెతో అభిషేకించి అతని శరీరాన్ని మర్ధన చేసేవారు. అలాగే నూనె దేవుని శక్తికి సాదృశ్యమే. Bible Question And Answers Telugu

 యెహెజ్కేలు చూచిన దర్శనములో: “ఆ వృక్షములు ఆకులు ఔషదమునకును వినియోగించును.” (యెహె 47:12) అని వ్రాయబడినది. ఈ విధముగా బైబిల్ గ్రంథమందు రోగికి వైద్యము అవసరమని గ్రహిస్తున్నాము. కానీ కొంతమంది మందుల ద్వారా స్వస్థత నొందుకొంటే దేవునికి మహిమ రాదని తలుస్తారు. ఇది సరైన ఆలోచన కాదు. మనం మన చేతులతో కష్టపడి ఏదో కంపెనీలో పని చేస్తున్నాము. ఆ కంపెనీ వారు నెలకు జీతం ఇస్తున్నారు. అందుకని దేవునికి వందనాలు చెల్లించమా? దేవున్ని మహిమ పరచమా? దేవున్ని మహిమ పరుస్తాము కదా! అలాగే మందులు వాడినప్పుడు పొందుకున్న ఆరోగ్యమునుబట్టి దేవున్ని మనం స్తుతించవచ్చును. Bible Question And Answers Telugu

 కొంతమంది ఆత్మీయులు అసలు మందులు ముట్టనే ముట్టరు. వారిది గొప్ప విశ్వాసమే. కానీ, అటువంటి వారు ఇతరులమీద వారి విశ్వాసాన్ని రుద్దకూడదు. నీకున్న విశ్వాసము దేవుని యొదుట నీమట్టుకు నీవే ఉంచుకొనుము. (రోమా 14:22) అందరికీ సమాన పాళ్ళలో విశ్వాసము వుండకపోవచ్చు. తల్లిదండ్రులు వారి బిడ్డలకు అవసరమైన పోలియో చుక్కలు, టీకా మొదలైనవి వేయించకపోవడం ద్వారా వారి బాధ్యత విస్మరించినట్లే. నేను అసలు మందులు ముట్టనే ముట్టనని బహిరంగముగా గొప్పలు చెప్పి, కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికున్న రోగాలను బట్టి రహస్యముగా మందులు వాడుతూ సిగ్గుపడుతున్నారు. ప్రసంగీకులు ప్రాముఖ్యముగా స్వస్థత వరాలు కలిగిన దైవజనుల ఆరోగ్యం పాడైతే వైద్యులను సంప్రదించుటకు మొహమాటపడవద్దు. అది ప్రజలకు తెలుస్తుందేమోనని సిగ్గుపడవద్దు. మనం కూడా సామాన్య మనుషులమేనని మృతతుల్యమైన శరీరాన్ని కలిగి యున్నామని ప్రజలకు తెలియనివ్వండి. (గలతీ 1:13) మీకు కంటి చూపు మందగిస్తే ప్రార్ధన చేసుకొని కళ్ళ డాక్టరును కలవండి. కళ్ళద్దాలు పెట్టుకొని వాక్యాన్ని చదవండి. పళ్ళు పాడైతే పంటి డాక్టర్ని కలుసుకొని పళ్ళు కట్టించుకొండి. దుర్వాసనకు దూరం కండి. వైద్యులు దేవుడిచ్చిన బహుమానం (యిర్మియా 8:22) అని మరువకండి.  Bible Question And Answers Telugu


All Pdf Files Download….Click here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.