చెదరగొట్టు కొమ్ములు.
Sevakula Prasangaalu Telugu
ప్రవక్తయైన జెకర్యా తన దర్శనంలో చెదరగొట్టు నాలుగు కొమ్ములను చూసాడు. ఈనాడు విశ్వాసులను చెదరగొట్టే ఆ నాలుగు కొమ్ములేమిటో చూద్దాం….
1.) మొదటి కొమ్ము – స్వయం !
(యోహాను సువార్త) 7:18
18.తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
7:18 యేసు ఇక్కడ రెండు వేరువేరు రకాల మతోపదేశకుల గురించి మాట్లాడుతున్నాడు. తమకే గౌరవ ప్రతిష్ఠలు కలగాలని చూచేవారు తమ ఉపదేశం సత్యమో కాదో దాని గురించి పట్టించుకోరు. మనుషులకు నచ్చి, తద్వారా వారు తమను గౌరవిస్తారనుకుంటే మనుషులు కల్పించిన సిద్ధాంతాలను నేర్పించేందుకు వారు సిద్ధమే. కానీ దేవునికే ఘనత కలగాలని చూచేవారికి ఆ సత్య దేవునికి సత్యమే ఘనత కలిగించగలదని తెలుసు (కీర్తన 31:5). మనుషులకు నచ్చినా నచ్చకపోయినా దేవుని సత్యాన్ని నేర్పించాలనే నిర్ణయం వారు తీసుకుంటారు (గలతీ 1:10). యేసుప్రభువుకు తాను ఈ రెండో కోవకు చెందిన ఉపదేశకుణ్ణని తెలుసు (8:49-50).
7:18 A యోహాను 5:41; B 1 కొరింతు 10:31-33; C యోహాను 13:31-32; 17:4-5; ఫిలిప్పీ 2:3-5; 1 తెస్స 2:6; D నిర్గమ 32:10-13; సంఖ్యా 11:29; సామెత 25:27; మత్తయి 6:9; యోహాను 3:26-30; 8:49-50, 54; 11:4; 12:28; గలతీ 6:12-14; 1 పేతురు 4:11
(సాతాను బలమైన ఆయుధాలలో ఒకటి స్వయం. స్వయం అంటే – నేను, నాది అనే స్వార్ధము. స్వకీయ ఆలోచన దేవునికి బద్ధ శత్రువు. దీనా స్వయమును అనుసరించే చెడిపోయింది – ఆది 34:1)
2.) రెండవ కొమ్ము – నేత్రాశ.
(దానియేలు) 8:5
5.నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.
8:5 21 వ వచనం ప్రకారం ఈ మేకపోతు గ్రీసును సూచిస్తున్నది. ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కొమ్ము గ్రీసు మాసిదోనియ సామ్రాజ్యం మొదటి రాజు అలెగ్జాండరు.
8:5 A దాని 8:21; B దాని 8:8; 11:3; C దాని 2:32, 39; 7:6
(“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నారు. సకల అవయవాలన్నిటిలో కన్ను ముఖ్యమైనది. సంసోను ఏ కన్నులతో చూసి మోహించాడో… అవే కన్నులపైకి దేవుని తీర్పు దిగొచ్చింది. పెరికివేయబడ్డాయి – మత్తయి 5:28,29)
III. మూడవ కొమ్ము – కోపము.
(కీర్తనల గ్రంథము) 37:8
8.కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
37:8 A యోబు 5:2; సామెత 14:29; 16:32; ఎఫెసు 4:26, 31; కొలస్సయి 3:8; యాకోబు 1:19-20; 3:14-18; B యోబు 18:4; కీర్తన 31:22; యోనా 4:1, 9; లూకా 9:54-55; C 1 సమూ 25:21-23; యిర్మీయా 20:14-15; D కీర్తన 73:15; E కీర్తన 116:11
(మనకు శత్రువు ఎవరో కాదు – తన కోపమేనట. 5 నిమిషాలు కోప్పడితే, అర ఎకరం పొలం దున్నినవాడు అలసిపోయినంతగా బలహీన మౌతామట బాబోయ్ – ఆది. 49:7, మత్తయి 5:22)
4.) నాలుగవ కొమ్ము – గర్వం (అహంకారం)
(సామెతలు) 16:18
18.నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
16:18 A సామెత 11:2; 18:12; 29:23; యెషయా 2:11-12; ఓబద్యా 3-4; రోమ్ 11:20; B సామెత 17:19; 1 తిమోతి 3:6; C దాని 4:30-37; D ఎస్తేరు 7:10; దాని 5:22
(అతిశయం, అహంకారం పరలోకం నుంచి పాతాళంలో తేజో నక్షత్రమనబడే సైతానుని పడగొట్టేసింది – దానియేలు7:8, యెషయా 14:12- 15, సామెతలు 16:5, 29:23, గర్వించిన నెబుకద్నెజరుని దేవుడు అడవులకు తరిమికొట్టాడు)
ఎద్దుకు బలం కొమ్మేగదా! సాతాను ఈ 4 కొమ్ములతో కుమ్మి, భక్తి జీవితంలో నుంచి పడగొడతాడు. మనం చెప్పుకున్న పై నాలుగు విషయాలు – పాపాలుగా కనిపించని మహా పాపాలు అని వర్ణించాడు బిల్లీగ్రహం గారు.
All Pdf Files Download…….Click Here