Sevakula Prasangaalu – ఆశ్రయించువారికి దొరికే ఆశీర్వాదాలు

ఆశ్రయించువారికి దొరికే ఆశీర్వాదాలు 

Sevakula Prasangaalu

పిల్ల తల్లిని ఆశ్రయిస్తుంది. రోగి డాక్టరును ఆశ్రయిస్తాడు. భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించాలి! ప్రభువును ఆశ్రయిస్తే కల్గి ఆశీర్వాదాలు… 

1.) ఆశ్రయిస్తే – బ్రతుకుతారు.

 (యిర్మీయా) 17:17

17.ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.

17:17 A యిర్మీయా 16:19; నహూము 1:7; B యోబు 31:23; కీర్తన 59:16; 88:15-16; C కీర్తన 41:1; 77:2-9; యిర్మీయా 17:7, 13; D ఎఫెసు 6:13

(యాయీరు ప్రభువును ఆశ్రయించాడు. చచ్చిన చిన్నది చటుక్కున లేచింది 

 (మత్తయి సువార్త) 9:18,19,20,21,22,23,24,25

18.ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.

19.యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.

20.ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ

21.నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.

22.యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను.

23.అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి

24.స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.

25.జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.

2.) ఆశ్రయిస్తే – సంతోషము.

 (కీర్తనల గ్రంథము) 5:11

11.నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

5:11 A కీర్తన 2:12; 40:16; 68:3; రోమ్ 8:28; 1 కొరింతు 2:9; యాకోబు 1:12; ప్రకటన 18:20; 19:1-7; B యోబు 38:7; కీర్తన 35:27; 58:10; 65:13; 69:36—70:4; యెషయా 65:13-16; జెకర్యా 9:9; C న్యాయాధి 5:31; కీర్తన 47:1-5; యాకోబు 2:5

(అందాన్ని, డబ్బును, అమ్మాయిని, ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తే సంతోషం రాదు ప్రభువును ఆశ్రయిస్తే సంతోషం పొంగిపొరలుతోంది) 

3. ఆశ్రయిస్తే – నెమ్మది.

 (రెండవ దినవృత్తాంతములు) 14:7

7.అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసియున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగావారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.

14:7 A 2 దిన 14:6; 1 పేతురు 3:12; B 1 దిన 28:9; యిర్మీయా 29:12-14; యోహాను 12:35-36; C యెహో 23:1; 2 దిన 8:5; 14:4; 32:5; కీర్తన 105:3-4; మత్తయి 11:28-29; యోహాను 9:4; అపొ కా 9:31; హీబ్రూ 3:13-15

(కోట్లు కూడబెట్టి నెమ్మది లేకుండా ఉంటే, దానికి మించిన దరిద్రపు బతుకు ఇంకొకటి ఉండదు) 

4.) ఆశ్రయిస్తే – జయము.

 (రెండవ దినవృత్తాంతములు) 13:18

18.ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయ మొందిరి.

13:18 A 1 దిన 5:20; 2 దిన 14:11; B 2 రాజులు 18:5; 2 దిన 16:8-9; 20:20; కీర్తన 22:4-5; 146:5; దాని 3:28; నహూము 1:7; C ఎఫెసు 1:12

(యూదావారు ప్రభువును ఆశ్రయించి జయం పొందారు. అపజయాలతో ఇంత వరకు గడిపిన నీ జీవితంలో ఒక్కసారి ప్రభువును ఆశ్రయిస్తావా?) 

5.) ఆశ్రయిస్తే – సురక్షితముగా ఉంటారు.

 (సామెతలు) 18:10

10.యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

“క్షేమంగా”– 14:26; 29:5; కీర్తన 18:2; 27:5; 32:7; 2 తిమోతి 4:18. ఈ విశ్వమంతటిలో చూస్తే క్షేమకరమైన చోటు యెహోవా దేవునిలోనే ఉంది. ఇప్పుడు గానీ మరెన్నడైనా గానీ భద్రత అనేది మరెక్కడా లేదు.

(జలప్రళయంలో నోవహు ఓడను ఆశ్రయించాడు, వినాశనం నుంచి తప్పించబడ్డాడు – నీవు రక్షణ ఓడను ఆశ్రయించుము) 

6.) ఆశ్రయిస్తే – స్థిరంగా ఉంటారు.

 (కీర్తనల గ్రంథము) 112:7

7.వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.

(ప్రభువును ఆశ్రయించువానిని ఏదియు కదిలింపనేరదు. ఏ శక్తీ, ఏ శ్రమయు వానిని భయపెట్టజాలదు! స్థిమితంగా ఉండలేని వారు దేవున్ని ఆశ్రయిస్తే స్థిరులైపోతారు) 

7. ఆశ్రయిస్తే – ఆయన కేడెమై ఉంటాడు.

 (సామెతలు) 30:5

5.దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

(ఎదుటినుంచి మనలను ఎదిరించే శత్రువునుంచి మనలను కాపాడునది కేడెము! ప్రభువే కేడెముగా ఉంటే, సాతాను ఓడిపోవడం ఖాయం!) 

  • యెహోషాపాతు దేవున్ని ఆశ్రయించాడు. అంతేగాని స్వశక్తిని, పరశక్తులను కాదు! అందుకే శత్రువు చిత్తు అయిపోయాడు!

All Pdf Files….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.