కయ్యూను భార్య ఎవరు?
cains wife telugu
విమర్శ: ఆదాము హవ్వలకు కయీను మరియు హేబెలు అను యిద్దరు కుమారులని ఆదికాండము 4 వ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. వీరిద్దరిలో పెద్ద వాడయిన కయీను చిన్న వాడైన హేబెలును చంపి దేవుని సన్నిధికిని తల్లిదండ్రులకు దూరముగా వెళ్ళగొట్టబడి యున్నాడు కదా! వీనికి వెనువెంటనే పెండ్లాడు నట్లు భార్య ఎట్లు వచ్చెను? ఆ స్త్రీ ఎవరి వలన సృజింపబడెను?
జవాబు: “ఒకడు తన ఊహను బట్టి చెప్పుట (వ్రాయుట) వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను” (2 పేతురు 1:20) ఈ గ్రహింపు దేవుని ప్రజలకు యెంతో అవసరమైయున్నది. ఈ గ్రహింపున్నప్పుడే అన్యుడో, నాస్థికుడో, లేదా నిజంగా సత్యాన్ని తెలుసుకొన గోరువాడో ఎవ్వరు అడిగినను ధైర్యముగా సమాధాన మివ్వగలరు.
యెషయా 28:13 లో ఈలాగు వ్రాయబడియున్నది చూడుడి. “కొంత ఇచ్చుట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును” అనుంది. కావున కొంత ఇచ్చుట కొంత అచ్చుట వచ్చిన యెహోవా వాక్యము సరిగా జత చేసి చూచినట్లయితే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతోంది. ప్రపంచములో మనలనెదుర్కొనుచున్న ప్రతి సమస్యకు పరిష్కారము పరిశుద్ధ గ్రంథములోనే యున్నది. అందుకు దాని మనము శ్రద్ధగా చదువవలెనని అమెరికా మాజి రాష్ట్రపతి 5వ జార్జిబుష్ అన్నారు. అలాగు చేయండి. ప్రతి సమస్యకు పరిష్కారము పొందండి. కయీను, హేబెలు ఇరువురు దేవునికి కానుకలర్పించు జ్ఞానము గల వయస్సు వచ్చినప్పుడు వారిరువురు అర్పించిన అర్పణములలో హేబెలు అర్పించినది దేవుడు అంగీకరించుట చూచిన కయీను అసూయ గలవాడై తన తమ్ముడైన హేబెలు చంపినందున; దేవుడు కోపగించి కయీనును తన సన్నిధి నుండి వెళ్ళగొట్టినప్పుడు అతడు నోదు దేశమునకు వెళ్లి తన భార్యను కూడెను. “కయీను తన భార్యను కూడినప్పుడు” అను ఈ మాటను బట్టి ఆత్మీయముగా బలహీనులైన వారిని పడగొట్టుటకు సాతాను అడుగుచున్న ప్రశ్న, ఆదాము హవ్వలకు కయీను, హేబెలులే కదా పుట్టిరి అతను పెండ్లాడునట్లు ఆ స్త్రీ ఎట్లు వచ్చెనని ప్రేరేపించును.
నాడు, నేడు కూడ యూదులు వంశావళి పట్టికలో స్త్రీలను, వారిపేర్లను చేర్చరు స్త్రీ, పురుషలలో ఎవరు పిల్లలను కందురో మనమెరుగుదముగదా మత్తయి 1:1,16వరకు గల లేఖనభాగములను చూడుడి అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకుయాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. (దీనను గుర్తించకుండుట గమనార్హము) దీనినిబట్టి యూదా లేఖికులు వంశావళుల జాబితలో స్త్రీలను చేర్చరు మరియు పైవాక్యములో యాకోబు యూదాను అతని అన్నదమ్ములను అని వ్రాస్తూ కుమార్తెయైన దీనాను గూర్చి వ్రాయలేదు అనగా యూదులు తమకు కుమార్తెలు పుట్టినను వారిపేర్లను వంశావళిలో చేర్చబడరు కావున దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన కయీను వంశావళిలో చేర్చబడక యుండిన తన సహోదరిలలో ఒకరిని పెండ్లాడియున్నాడు. వెంటనే కొందరిని అపవాది ప్రేరేపించి ఆదామునకు కుమార్తెలు పుట్టినట్లయిన అక్కడ వ్రాయబడలేదుకదా? యని అడుగును నిజమే అక్కడ వ్రాయబడలేదు కాని పైన మీరుచదివిన లేఖనమును బట్టి “కొంతఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకువచ్చును” (యెషయా 28:13) కాబట్టి ఆదామునకు కుమార్తెలు పుట్టినారా? పుట్టలేదా? పరీక్షంచండి సత్యాన్ని అన్వేషించండి; బైబిల్ గ్రంధమును తెరచి యీదిగువనిచ్చుచున్న వాక్యభాగమును చూడుడి. “షేతును కనినతర్వాత ఆదాము బ్రతికిన దినములుఎనిమిదివందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికినదినములన్నియు తొమ్మిది వందల యేండ్లు అప్పుడతడు మృతిపొందెను. (ఆదికాండం 5:4, 5) ఆదాము బ్రతికిన తొమ్మిది వందల ముప్పది ఏండ్లలో కుమారులను కుమార్తెలను కనియున్నాడు. కుమార్తెల పేర్లు వంశావళిలో చేర్చబడనేరవు గనుక దేవుని ఆత్మతో దీనిని రచించిన మోషే కుమార్తెలు పుట్టిరియని వ్రాసెను. గనుక ఆదాము కనిన ఆ కుమార్తెలలో నొకరిని పెండ్లాడియున్నాడు కయీను. వెంటనే అపచారమొకటి జరిగినట్టు అపవాది అందుండి యింకోప్రశ్న లేవదీస్తాడు ఎట్లనగా సహోదరిని పెండ్లాడుట సబాబుకాదు కదా?యని నిజమే నేనైన మీరైనను అట్లుచేయుట అసహ్యమే ఎందుకనగా నేడు వివాహనియామవిధులు, చట్టాలు మనకున్నవిగనుక, అయితే ఆదినాల్లో వారికట్టి విధులు నియమాలు ఆజ్ఞలులేవు “ఆజ్ఞాతిక్రమమే పాపము” ఆజ్ఞ లేనప్పుడు పాపము లేదు కావున, కయీను తన తండ్రి కుమార్తెను పెండ్లాడాననుటకు యింత కంటే ఎక్కువ ఆధారమును సత్యవాదులు, హేతువాదులు అడగరు. కాని వితండవాదులు ఎదుటివారి వాదము నొప్పుకొనకూడదను సిద్దాంతము గలవారు గనుక భక్తపౌలుగారు తిమోతికి వ్రాసినట్టు నా పాఠకులైన మీకు ప్రేమతో వ్రాయుచున్నాను. “ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను, జ్ఞానమని అబద్దముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగాఉండుము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక” (1తిమోతి 6:20-21) నేర్చుకొనగోరువారు, తెలిసికొనుటకై అడిగిన యెడల తెలియ జేయండి. కయీనుకు భార్య ఎట్లు వచ్చెనను సంగతి తెలిసినంత మాత్రమున వాదోపవాదాలకు దిగి విశ్వాస విషయంలో తప్పిపోకుండునట్లు పరిశుద్ధ గ్రంథములో మీకర్ధము కాని వాటిని మాకు వ్రాయండి. ప్రార్థించి దైవాత్మ మూలముగా ప్రతి సమస్యకు సమాధాన మిచ్చి దేవుని మహిమ పరచగలము.
Good explanation brother