tabernacle |telugu |complete |history|- ప్రత్యక్షపు గుడారము చరిత్ర [పార్ట్ 2] తెలుగులో-2023

Written by biblesamacharam.com

Updated on:

ప్రత్యక్ష గుడారం పార్ట్ 2

Tabernacle

III మందిరము యొక్క ద్వారము, తెర (నిర్గమ 26:31-37) 

మందిరమునకు మూడు ప్రక్కల ’48’ పలకలును, తూర్పు వైపున ‘5’ స్తంభముల మీద వ్రేలాడు తెర ద్వారము నున్నవి. 

ప్రత్యక్షపు గుడారమునకు మూడు ముఖ్య ద్వారములున్నవి : 

1) ప్రాకారపు ద్వారము  (నిర్గమ 27:16) 

2) మందిరపు తెర ద్వారము (నిర్గమ 26:36) 

3) పరిశుద్ధ స్థలమునకును, అతి పరిశుద్ధస్థలమునకును మద్యనున్న తెర ద్వారము (నిర్గమ 26:31-33) వీటన్నిటికి వేరు వేరు తెరలున్నవి. గనుక మొదటి తెర, రెండవ తెరయని పేరున పిలువ బడుచున్నవి. (హెబ్రీ 9:3). 

1) ఈ తెరలకు కొలత ఒకే విధము :- 

  1. ప్రతి ఇశ్రాయేలీయుడు తనకు పవిత్రస్థలమైన ప్రాకారములో ప్రవేశించు ద్వారము (యోహాను 10:9)
  2. యాజకుడు ఆరాధన కొరకు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు ద్వారము (యోహాను 10:7) మరెవ్వరు ప్రవేశింప రాదు. 
  3. ప్రధాన యాజకుడు సంవత్సరమునకొక సారి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు ద్వారము. వీటన్నిటి కొలత ఒక్కటే (యోహాను10:2;హెబ్రీ 10:19). 

2) ఆరాదన ద్వారము :- (యోహాను 10:2) దేవుని బిడ్డలు ఈ ద్వారమును  ప్రవేశించి దేవుని ఆరాధించవలెను. 

3) ఈ ద్వారము ఇశ్రాయేలీయులు సమాజముగా కూడుకొను ద్వారము. వారందరు సమాజముగా కూడుకొనుటకు వెండి బూరలూదవలయును. అప్పుడు సమాజముగా జనులు కూడు కొందురు (సంఖ్యా 10:3; మత్తయి 18:20). 

4) మూడవ ద్వారము దైవ సానిధ్యమున్న ద్వారము. దేవుడు జనులతో మాట్లాడు సమయములో షేఖీనా మేఘము అచ్చట ప్రత్యక్షమగును (సంఖ్యా 16:13-19; కీర్తన 84:10; సామె 8:32-36). 

  1. 5) A. ఈ తెర 5 స్తంభముల మీద వ్రేలాడు చున్నది:- ఈ తెర పలురంగుల దారములతో విచిత్రాలంకారముగా చేయబడినది. ఇది క్రీస్తుకు గురుతుగా నున్నది (కీర్తన 139:13,14). 
  2. ఐదు స్తంభములు :- విచిత్రమైన తెరయొక్క అందమును అలంకారము చూపించుటకు వేడుకగాతెరను తెరచి యుందురు. ఈ స్థంభములు దేవుని వాక్యమునకు గుర్తు.
  3. ఈ స్తంభములు కర్రతో చేసి బంగారముతో పొదిగింప వలయును :- స్తంభమును, దేవుని వచనమును వ్రాసిన వారు వట్టి కర్రలేగాని (మనుషులు) బంగారమునకు గురుతుగా యున్న పరిశుద్ధాత్మ శక్తితో వ్రాసియున్నారు (II తిమోతి 3:16; II పేతురు 1:20,21). 
  4. ఈ స్తంభములను వెండి దిమ్మల మీద నిలువ బెట్టవలయును :- దేవుని వాక్యము పరిశుద్దమును,సదాకాలము నిలుచునదియునై యున్నది (కీర్తన 119:89; మత్తయి 5:18) 

6) ఈ స్తంభములు క్రీస్తు అను ద్వారపు తెరయొక్క అందమును చూపించు చున్నవి. 

IV మందిరమును కప్పు తెరలు (నిర్గమ 26:1-14, 36:8-19) 

మందిరమునకు మూడు వైపుల పలకలును, ఒకవైపు తెరయు ఉన్నది. దీనిని కప్పుటకు తెరలు కావలెను.

A.) మందిరమును కప్పుటకు నీలి ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చేయబడిన తెరలు కావలెను.

1.) మందిరము:-దేవుని నివాస స్థలము గొప్ప మహిమతో కూడినదై యుండవలెను. 

2.) పదితెరలు :- మందిరమును కప్పుటకు 28 మూరలు పొడవుగల పది తెరలు  కావలయును. 

3) ఈ తెరలలో కెరూబులుండ వలెను :- పలు విధములగు రంగులతో పేనిన దారముతో నీవు తెరను అల్లునప్పుడు, వాని మీద కెరూబులు, రెక్కలు చాచి యెగురు నట్లుగా నేయవలెను (కీర్తన 91:4; 17:8,9, 36:7; యెషయా 40:31; యోహాను 17:16; హెబ్రీ 11:33-39). 

4) ఈ తెరలు యేసు శరీరమునకు సాదృశ్యము :- (హెబ్రీ 10:6) ఈ కప్పు తెర ఆయన సంఘమునకు సాదృశ్యము (ఎఫెసీ 2:7; గల 3:1) 

5) కొలుకులు, గుండీలు :- (నిర్గమ 26:4-6) తెరలు మందిరమునకు కప్పుగా యుండునట్లు ఒక ప్రక్క కను రెండవ ప్రక్క 5ను వేసి ఆ తెరలను కొలుకులతోను గుండీలతోను బిగించి, మందిరమును కప్ప వలయును. 

నీలి దారపు కొలుకులు :- నీలము దేవుని కృపావరమునకు గుర్తు. 

బంగారపు గుండీలు :- క్రీస్తు యొక్క రాజత్వమునకు గుర్తు. 

ఇత్తడి గుండీలు :- దేవుని న్యాయపు తీర్పును సూచిస్తున్నది. 

  1. మేక వెంట్రుకల తెరలు :- (నిర్గమ 26:7) ఇవి సన్నపు నార తెరపైన వేయుదురు. 30 మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు గలిగిన అయిదు తెరలు ఒక వైపునను, 6 తెరలు రెండవ వైపునను వేసి ఆ తెరల కున్న గుండీలకు కొలుకులను తగిలించి వాటిని కూర్చి సన్నపు నారతెరపై వేయవలెను. ఈ తెరల సంఖ్య సన్నవార తెరల సంఖ్య కంటె ఒకటి యెక్కువ యున్న ఆరవ తెరను గుడారపు యెదుట భాగమున మడవ వలెను.
  2. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళతోళ్ళు :- (నిర్గమ 26:14) ఇది 3వ కప్పు తెరయై యున్నది. ఎరుపు యేసురక్తమునకు గుర్తు.
  3. సముద్ర వత్సల తోళ్ళు :- (నిర్గమ 26:14) ఇది నాలుగవ కప్పు. ఈ తోళ్ళ మీద వర్షము, అరణ్యము నుండి గాలి సూర్యుని వేడిమి మరి యేమి వచ్చి పడినను క్రిందనున్న వాటికి దుమ్ము మొదలగునవి, తగిలి పాడై పోకుండ పడిన దంతయు వీటి పైననే నిలిచిపోవును.

     ఈ సమస్తమైన గుడారపు పనికొరకు దాదాపు 24,41,277 రూపాయలు ఖర్చు చేయబడియున్నది. దానిలో పటములు, మనోహరములైన వస్తువులు మిక్కిలి విలువైనవిగా నున్నవి. దాని విలువ లోపల నున్న యాజకులకు తప్ప మరెవ్వరికిని తెలియదు. 

సముఖపు రొట్టెలు – బల్ల (నిర్గమ 25:23-30; 37:10-16; లేవీ 24:5-9)

1) మందిరము లోనికి వచ్చినప్పుడు 2 మూరల పొడవు 1 మూర వెడల్పు 1 1/2 మూర ఎత్తుగా నుండి కర్రతో చేయబడి బంగారంతో పొదగ బడిన ఒక బల్లయు దాని మీద రెండు దొంతరులుగా పెట్టబడిన 12 రొట్టెలును ఉన్నవి. కర్ర-మనుషత్వము, బంగారము – దైవత్వము సముఖపు రొట్టెలు కూడ క్రీస్తుకు సాదృశ్యము (యోహాను 6:51-58; I కొరింథి 10:16). 

  1. మెత్తని గోధుమ పిండితో చేయవలెను. (లేవీ 24:5)
  2. పులియని రొట్టెలుగా నుండ వలెను. (లేవీ 2:4-11)
  3. పులిసిన జీవితము – అపవిత్రత (I కొరింథి 5:6-8)
  4. పులిసిన బోధ – దుర్బోద (మత్తయి 16:6-12; గలతి 5:9)
  5. ఈ రొట్టెలు యాజకులు మాత్రమే తినుటకు అర్హులు (లేవీ 24:9)
  6. పరిశుద్ధ స్థలములోనే రొట్టెలు తినవలెను. (లేవీ 24:9; మత్త 18:20)
  7. ఏడు దినములు రొట్టెలు బల్ల మీద నుండవలెను (నిర్గమ 25:30)
  8. ఈ రొట్టెలు చాలా విలువైనవి (లేవీ 24:5, 2:5). ఒక్కొక్క రొట్టెను పేరు పేరు పిండితో చేయవలయును. సమృద్ధిగా భుజించి తృప్తి చెందుటకు సరిపోవును. దైవాలయములో పరిచర్య చేయు పరిచారకుల అర్థ ఆకలితో జీవించాలని దేవుడు అనుకోడు (యోహా 6:10-14).
  9. ఒక్కొక్క దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాణి నుంచ వలయును. (లేవీ 24 :7; 2కొరింథి 2:14,15)
  10. 12 రొట్టెలు సమానముగా నుండవలెను (ద్వితీ. 32:9) ఒక దాని మీద ఒకటి పెట్టవలెను. 12 గోత్రాలకు సాదృశ్యము.

2) బల్లకు చుట్టూ బెత్తెడు వెడల్పు గల బంగారు జవగల బద్దను చేయవలెను. ఈ బల్లకు సంబంధించిన యుపకరణములు పెట్టుటకుపయోగించవలెను. సమస్తమును జీవపు రొట్టెయైన క్రీస్తులో దొరుకును. 

3) ద్రాక్షారసము బల్ల మీద నున్న గిన్నెలో నుంచవలెను (కీర్తన 104:15) ఈ ద్రాక్షరసమును త్రాగకుండ నేల మీద పారబోయుదురు. 

4) మోత కర్రలు, ఉంగరములు :- విశ్వాసి అరణ్య యాత్రలో ఈ బల్ల రొట్టెతో ప్రయాణము చేయవలెను (కీర్త 1:2; 19:8) దేవుని వాక్యము ప్రతి నిమిషము భుజింప వలయును. 

విశ్వాసి జీవితంలో ఈ రొట్టె ప్రాముఖ్యత 

  1. విశ్వాసి యొక్క నూతన జన్మకు గురుతు. మెత్తని గోధుమ పిండివలె విశ్వాసి జీవితం విరిగి, నలిగినదిగా వుండాలి (కీర్తన 51:17)
  2. 12 రొట్టెలు కొలతలోను, తూకములోను సమానముగా వున్నవి. దేవుని యెదుట చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ సమానులే అన్న విషయాన్ని సూచిస్తుంది.
  3. రొట్టెలపై సాంబ్రాణి ఉంచబడినందు వల్ల ఎల్లప్పుడు సువాసనలు వెద జల్లబడుతూ వుంటాయి. దుర్గంధమునకు స్థానమే లేదు. రక్షించబడిన విశ్వాసి జీవితము ఎల్లప్పుడు సువాసనా భరితముగా వుండ వలయును (పరమ. గీ. 4:11; ఎఫేసీ 5:3-5; తీతు 2:14)
  4. నిరంతరము (రొట్టెలు) భుజించుట వలన ఎదుగుదల, శక్తి, అందము వచ్చును. జీవపు రొట్టెను ప్రతి దినము తినే విశ్వాసి ప్రభువులో ఎదుగుచూ క్రీస్తునందు ప్రతి దినము బలమును పొందుదురు. అయోగ్యముగా తినరాదు. అలాగు తింటే బలహీనులౌతారు (2 కొరింథి 11:27,30)

VIదీప వృక్షము (నిర్గమ 25:31-40, 37:17-24, 27:20, 21; లేవీ 24:1-4; సంఖ్యా 4:9,10, 8:1-4; జకర్యా 4:1-4; ప్రకటన 1:12-20, 2:1-8, 4:5; హెబ్రీ 9:2) 

   ఈ దీప వృక్షము పరిశుద్ధ స్థలములోని బల్ల దగ్గర నుండును. దీనికి సువర్ణ దీప వృక్షమని పేరు. ప్రకటన 1:12వ వచనములో ఏడు దీప స్థంభములను చూడ గలము. ఆ దీపస్తంభములు దేవుని సంఘమని ప్రకటన 1:20లో కనబడుచున్నది. ప్రకటన 4:5లో ఏడు దీపములు దేవుని ఏడు ఆత్మలు అనియున్నది. 

1) ప్రకాండము, శాఖలు 

  1. ప్రకాండము : – ఇది యేసు ప్రభువుకు గురుతుగా నున్నది. శాఖలు క్రీస్తులో నుండి వచ్చిన విశ్వాసులకు సూచన (యోహాను 15:1-6) ఈ దీప వృక్షము నందు ప్రకాండమును, శాఖలు కూడా ప్రకాశించు చున్నవి.
  2. శాఖలు ప్రకాండములో నుండి రావలయును. విశ్వాసికూడా ఈయనలో నుండి జన్మింప వలెను (యోహాను 3:1-5; 1 యోహాను 3:9).

2) నగిషీ పని. ఈ దీపవృక్షమునకు శాఖలు, కలశములు, మొగ్గలు, పువ్వులు మొదలగునవి సుత్తితో సాగగొట్టి చేయవలెను ( హెబ్రీ 2:18; కొలసీ 1:24) 

3) ప్రకాండము శాఖలును ఒకే రూపమున నుండ వలయును. 

4) ప్రకాండమునకు శాఖల కంటే ఒక కలశ మెక్కువగా నుండవలెను.(నిర్గమ 25:33-34; 1 యోహాను 3:2; II కొరింథి 4:4-6) 

5) శాఖలు ప్రకాండములో నుండవలెను. ప్రకాండము తనలో నున్న శాఖలను మోయును (యోహాను 15:4; యెషయా 46:4) 

6) దీపముల ప్రకాశత తిన్నగా పైకి వ్యాపించు చున్నది. (పిలిప్పీ 3:11; మత్తయి 5:15-16; 2కొరింథి 5:15)

7) ఒక తలాంతు మేలిమి బంగారము (40 వీశెల బంగారము) నిర్గమ 37:24) 

8) సాయంకాలమునుండి ప్రాతఃకాలము వరకు ఇది వెలుగు చుండవలెను. (లేవీ 24:3; నిర్గమ 27:20)

9) దీపములో నూనె పోయుట :- (నిర్గమ 27:20-21; Ps 49:7; హెబ్రీ 1:9) 

10) యాజకుడు కత్తెర నుపయోగించును :- నూనె లేక కాలిపోయిన వత్తిని, ప్రధాన యాజకుడు కత్తెరతో శుబ్రముగా కత్తెరించుటకు యెల్లప్పుడు సిద్ధముగా నుండును. కత్తెరించిన పిదప నూనె పోసి తిరిగి వెలిగించును. 

11) మందిరములో నున్న వారికే ఈ దీపము వెలుగు నిచ్చును. 

12) ఈ దీపము నిత్యము వెలుగు చుండవలెను (II థెస్స 2:7) ప్రకాశము పెంతెకోస్తు దినము నుండి, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చువరకు ప్రకాశించును. 

     దీప వృక్షము సంగమునకు సాదృశ్యముగా వున్నది. వెలుగు, సూర్యరశ్మి పడటానికి అవకాశము లేనందువలన దీపవృక్షము పరిశుద్ధ స్థలములో వుండవలయును. అందకారమయమైన ఈ లోకమునకు వెలుగు అనుగ్రహించుటకు దేవుడు సంఘమును ఏర్పరచెను (రోమా 13:12-13; మలాకీ 4:2) నీతి సూర్యుడుదయించువరకు సంఘము లోకమునకు వెలుగివ్వవలెననెడిది దేవుని చిత్తమైయున్నది. వెయ్యేండ్ల పరిపాలన కాలములో ఆయన ప్రత్యేకతను గూర్చి నీతి సూర్యుడు ఉదయించును అని వ్రాయబడి వుంది. దీపవృక్షము దేనికి సాదృశ్యమో కొన్ని విషయాలను పరిశీలిద్దాం. 

1) దీప వృక్షము దేవుని ఆత్మకు సాదృశ్యము (జెకర్యా 4:1-14). జెకర్యా తన దర్షనములో సువర్ణమయమైన దీప స్తంభమును చూచెను. దేవుని ఆత్మకు సాదృశ్యముగా చెప్పుచున్నాడు. ఏడు దీపములు ఏడు ఆత్మలు (ప్రకటన 1:4; 4:5) దేవుని ఆత్మ అందకారములో వెలుగు నిచ్చుచున్నది. 

2) ఒలీవ నూనెచే దీపము వెలుచుచూ నుండెను. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. మన ప్రభువు కలువరి సిలువలో నలుగ గొట్ట బడినందు వల్ల పెంతెకోస్తు నూనె క్రుమ్మరింపబడింది (అ.కా. 1:5). యేసు అభిషేకింప బడిన వాడు                           (అ.కా. 4:27,28). యెహోవా నన్ను అభిషేకించెను (యెషయా 61:1) దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెను                         (అ.కా. 10:38) కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును (యోహాను 3:34) 

3) దీపవృక్షము దేవుని వాక్యమునకు సాదృశ్యముగానున్నది (కీర్తన 119: 105,127, 19:8; యోహాను 1:14) 4) దీపవృక్షము యేసుక్రీస్తుకు సాదృశ్యము. నేను లోకమునకు వెలుగైయున్నాను (యోహాను 8:12, 9:5, 12:35,36,46) చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి (యెషయా 9:2; మత్తయి 4:15) ప్రతీ మనుష్యుని వెలిగించే యదార్థ వెలుగు యేసే. 

5) దీప వృక్షము విశ్వాసులకు సాదృశ్యము. మీరు లోకమునకు వెలుగై యున్నారు ( మత్తయి 5:14; యోహాను 15:5; IJn 1:7; ఎఫెసీ 5:8) 

VI దూప వేదిక ( నిర్గమ 30:1-10, 37:25-29; 30:34-38; కీర్తన 141:2; ప్రకటన 8:3-5) 

     అతి పరిశుద్ధ స్థలము యొక్క ద్వారమునొద్ద దూపవేదిక నుండును. ఇది ప్రభువైన యేసు దేవుని కుడి పార్శ్యమున మనకొరకు మధ్యవర్తిగా నున్నాడను విషయమును బయలు పరచు చున్నది (రోమా 8:34). దూపము = ప్రార్థనకు, స్తోత్రయాగమునకు గురుతు (ప్రకటన 8:3; ప్రకటన 5:5-8; కీర్తన 141:1). 

1) ఈ దూప వేదిక కర్రతో చేయబడి మేలిమి బంగారుతో పొదగబడియున్నది (నిర్గమ 31:1). కర్ర మనుష్యత్వమునకును, మేలిమి బంగారము దైవత్వమునకును సూచనగా నున్నది. 

2) దీని యెత్తు రెండు మూరలు 

3) మోత కర్రలు, ఉంగరములు :- విశ్వాసులు అరణ్యమును ఈ లోక జీవిత యాత్రలో ప్రార్థన స్తుతి యాగములను ధూపవేదికను ఎల్లప్పుడును మోసికొని పోవలయును (హెబ్రీ 13:15). 

  1. ప్రార్థన దూపము (కీర్తన 141:2)
  2. స్తుతి యాగము (కీర్తన 50:14)
  3. ఉపకారము, ధర్మము చేయు యాగములు (హెబ్రీ 13:16)
  4. అన్యజనులు అనుఅర్పణ (యాగము)(రోమా 15:15,16)
  5. విశ్వాస యాగము (ఫిలిప్పీ 2:17)

4) నాలుగు కొమ్ములు : – ఈ కొమ్ములు శక్తికి గురుతు ద్వితీ. 33:17; కీర్తన 75:10, 7:8

5) ధూపము వేయుట : – ధూపవేదిక క్రీస్తు ప్రభువే ( ధూపము = ప్రార్థన – స్తోత్రములు) 

  1. అగ్నిద్వారా దహింపబడిన ధూపము యొక్క పరిమళమగు వాసన పైకి పోవుచుండెను (లేవీ 10:1,2;యూదా 20).
  2. ధూప వేదికలో ధూపము వేయునప్పుడెల్ల బలి పీఠము నుండియే అగ్నిని తీసుకొని రావలెను.
  3. ప్రధాన యాజకుడు సంవత్సరమునకొకసారి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు నప్పుడు రక్తమునుదూపవేదిక కొమ్ములకు చిలకరింపవలెను.

6) యాజకుడు మాత్రమే దూపము వేయవలెను – ఇతరులు వేసిన యెడల శిక్షపొందుదురు (II దిన. 26:16) మన ప్రభువైన యేసు గొప్ప ప్రధాన యాజకుడై యున్నాడు (హెబ్రీ 3:1-4, 4:14, 5:5, 7:26, 9:26-28) 

7) దూప ద్రవ్యములు :- జటమాంసి, గోపిచందనము, గంధపు చెక్క సాంబ్రాణి, ఉప్పు మొదలగున వన్నియు కలిపి పొడి చేసి ధూప ద్రవ్యముగా వుపయోగింప వలెను. 

VIII పరిశుద్ధ, అతి పరిశుద్ద స్థలమునకు మధ్యతెర (నిర్గమ 26:31-33, 36:32) 

   ఈ తెర రెండు స్థలములను వేరు చేయుచున్నది. దీనికి రెండవ తెరయని పేరు. ఇది నాలుగు స్థంభములపై వ్రేలాడు చుండును. ఈ తెర నీల ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నారతో నేయబడి వున్నది. ఇది యేసు శరీరమునకు గురుతు .(హెబ్రీ 10:19,20). 

1) వేరు పరచుట :- ఈ తెర పరిశుద్ధ స్థలములో నుండి, అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు వీలు లేకుండా అడ్డముగా నున్నది. ఈ తెర యున్నంతకాలము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు మార్గము తెరవబడియుండలేదు (హెబ్రీ 9:8). యేసు సిలువ వేయబడినప్పుడు ఆకాలములో పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకును మద్య నున్న అడ్డు తెరపై నుండి క్రిందికి చినిగియున్నది. ఆతెర 40 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 1 1/2 అంగుళము దళసరిని గలిగి యున్నది. 300 మంది యాజకుల చేత వ్రేలాడు నట్లు ద్వారమందు అమర్చి యుండెనని యూదుల చరిత్ర యందుగలదు (యెషయా 53:10). 

2) 4 స్థంభములున్నవి : నాలుగు సువార్తలను చూపిస్తున్నవి. ఎందుకనగా యేసు క్రీస్తును నాలుగు సువార్తలు మోయుచున్నవి (I కొరింథీ 1:30). 

IX మందసము (నిర్గమ 25:10-22) 

   అతి పరిశుద్ధ స్థలమునందు ఒక ఉపకరణము మాత్రమే యున్నది. అదే ఈ మందసము రెండు మూరలు పొడవు, మూరెడునర వెడల్పు, మూరెడునర ఎత్తుగలిగి యున్నది. తుమ్మకర్రతో చేసి, మేలిమి బంగారము లోపలను వెలుపలను పొదిగింపబడి యున్నది. 

మందసమునకు ఇవ్వబడిన పేర్లు : 

1) సాక్ష్యపు మందసము (ని.కా. 25:22) శాసనములుగల మందసము

2) నిబంధన మందసము (సంఖ్యా. 10:33) 

3) యెహోవా మందసము (I రాజు 2:26) 

4) సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనా మందసము (యెహోషు 3:13) 

5) దేవుని మందసము (1 సమూ 3:3) 

6) పరిశుద్ధమైన మందసము (II దిన . 35:3) 

7) బలసూచకమైన మందసము (కీర్తన 132:8) 

దీనిలోని వస్తువులు :- దీనిలో 2 పలకలున్నవి (నిర్గమ 25:21, 34:1; హెబ్రీ 8:10). మన్నాగల బంగారు పాత్ర (హెబ్రీ 9:4; నిర్గమ 16:32-34) అహరోను యొక్క చిగిర్చిన కర్ర (సంఖ్యా 17:10). ఈ ఉపకరణములన్నియు మందసములో నుండ వలయును. 

చేయు విధము : – (నిర్గమ 25:10-22, 37:1-9). 

వెళ్ళిన స్థలములు : – యెహోషువా 3:9-15; న్యాయా 20:27-37; 1 సమూ 3:3,4, 4:1-11, 5:1-11, 7:12; II సమూ 6:11,12, 7:2, 5:24-29; II దిన. 35:3, 36:17; II రాజు 24:13; ప్రకటన 11:19. 

1) ఈ పెట్టె తుమ్మ కర్రతో చేయబడినది. 

2) ఈ పెట్టె మీద సర్వోన్నతుడైన దేవుడు ఆసీనుడగును. ఈ మందసముపైన దేవుడు కృపాసీనుడై యుండును. అచ్చటకి సంవత్సరమున కొక సారి మాత్రమే ప్రధాన యాజకుడు (అహరోను) వెళ్ళును. ఇది దేవుడును మనుష్యుడును సంధించు స్థలము యెహోవాను మనము యేసు అనుమార్గము ద్వారా సంధించగలము.I తిమోతి 2:5. 

3) మందసములో నున్న వస్తువులు :- 

A.)  పది ఆజ్ఞల పలకలు రెండు వెలుపలను, లోపలను వ్రాయబడియున్న ధర్మశాస్త్రపు చుట్టను ఉండును 

(నిర్గమ 31:3) ధర్మ శాస్త్ర ప్రమాణములు (ద్వితి. 9:10; కీర్తన 40:7,8). 

B.) మన్నా : – (హెబ్రీ 9:4) ఇది ఇశ్రాయేలీయులు అరణ్యములో నుండగా తినిన పరలోకపు మన్నా, అనగా దూతల ఆహారమును తెలియ జేయుచున్నది (నిర్గమ 16:1-36; సంఖ్యా 11:7; ద్వితీ. 8:3-16; యెహోషువా 5:12; నెహేమ్యా 9:15; యోహాను 6:27-35; 1 కొరింథి 10:3; ప్రకటన 2:17).

C.)  చిగిరించిన అహరోను కర్ర :- (సంఖ్యా 17:1-11; హెబ్రీ 9:4)

4) కరుణా పీఠము :- కరుణా పీఠము పడిపోకుండు నట్లు మందసము చుట్టు బంగారు జవ యుండవలయును. కరుణా పీఠము దాని పైనుండి తొలిగిన యెడల, ధర్మ శాస్త్రము బయటికి కనబడి దానిని చూచిన వారు నశింతురు. బెత్తెమెషువారీ విధముగా చేసినందు చేత, ఏబది వేల డెబ్బది మంది నశించిరి (I సమూ 6:19,20) 

5) మోత కర్రలు, ఉంగరములు:- ఇశ్రాయేలీయులు పాళెమును మార్చుచు వెళ్ళునప్పుడు వారితో కూడ మందసమును మోసికొని పోవలయును. అందుకే ఇవి యుండ వలయును ఇశ్రాయేలీయులు మోత కర్రలు చూచినప్పుడు పాళెము విడచి బయట వెడల వలయునవియు తమతో కూడ మందసమున్నదనియు గ్రహింతురు (హెబ్రీ 13:5-8). 

6) విచిత్రమైన తెర, నీల వర్ణపు తెర, సముద్ర వత్సల చర్మపు తెర:- ఈ మందసము యొక్క ప్రయాణములో దానిపైన మూడు విధములైన కప్పులుండును. 

      కరుణా పీఠముల పై రెండు కెరూబులు, రెక్కలు విప్పి ఒక దాని కొకటి యెదురు యెదురుగా నుండి, క్రిందికి చూచునట్లు కూర్చుండి యుండెను. దాని మధ్యషఖీనమేఘమును దేవుని సాన్నిధ్యము ఆసీనమై యుండును. ప్రయాణము చేయునప్పుడు మనుష్యులీ మహిమను చూడకుండు నట్లు కప్పబడెను. ఆమహిమ నెవరైన చూచిన యెడల తాళ లేక చనిపోయెడివారు (నిర్గమ 33:1-23). ఆయన మహిమను కొంత చూచినవారు సహితము, భరింపలేక పడిపోయెడి వారు (యెహెజ్కేలు 1:28; దాని 10:9; అ.కా. 9:3; ప్రకటన 1:17). పరలోకములో నున్న దూతలు కూడా ఆయన మహిమను చూడలేక తమ ముఖములు రెక్కలతో కప్పుకొను చున్నవి. 

7) కెరూబులు :- మందసము పై నీకెరూబులు రెక్కలు చాచి క్రిందికి చూచునట్లుగా కూర్చుండి యుండును. కెరూబులను గూర్చి కొన్ని చోట్ల మాత్రమే కనబడును (ఆది. 3:24; నిర్గమ 25:1-32; 1 రాజు 6, 7 అధ్యాయ॥; యెషయా 6వ అధ్యాయ॥; ప్రకటన 4,5 అధ్యాయ॥) . 

  1. వానికి ఆరు రెక్కలు ఎగురుటకున్నవి. వీరు విశ్వాసులకు సాదృశ్యము
  2. కెరూబులు తమ చేతులతో అగ్ని ఖడ్గములు ఎత్తుకొని యున్నట్లు (ఆది.3:24)కనబడును. విశ్వాసులు వాక్యమనే ఖడ్గము పట్టుకోవాలి  (హెబ్రీ. 4:12). 
  3. కెరూబులకు అసంఖ్యాకములైన కన్నులుండెను (ప్రకట 4:6).
  4. ఈ కెరూబులు కరుణా పీఠము నొద్ద నివాసముచేయు చున్నవి (ఎఫెసీ 2:7; కొలస్సీ 3:1) 

X యాజకత్వము (నిర్గమ 28:1-43, 39:1-4; లేవీ 8వ అధ్యాయము) 

1) ప్రధాన యాజకడు : – యాజకులను ప్రతిష్టించు నప్పుడు నీళ్ళతో వారిని కడుగ వలయును. ఈ నీళ్ళు నూతన నిబంధనలో దైవవాక్యమునకు సాదృశ్యము (తీతు 3:6; యాకోబు 1:18; I పేతురు 1:23; యోహాను 3:5,7). 

2) ధరించు వస్త్రములు :- 

1.) నిలువు టంగీ ప్రధాన యాజకులు ఉద్యోగపు దుస్తులకు లోపలనది ధరింపవలయును. దీనిలోపల షరాయి వేసికొన వలయును (కీర్తన 104:2,3). 

2.) నీల వర్ణపు చొక్కాయి :- ఇది కుట్టులేకుండా ఏకముగా నేయబడవలయును (నిర్గమ 28:31-35). దీనికి తల దూరుటకు ఒక రంధ్రమున్నది దాని ప్రక్కన దానిమ్మ పండును ఉండులాగున అంచుచుట్టును అమర్చవలయును. ఆగంటలు ధ్వనినీయవలయును. దానిమ్మ పండ్లును నీలధూమ్ర రక్తవర్ణములు గలవిగా చేయవలెను. 

నీల ధూమ్ర రక్త వర్ణములు = దేవుని కృపా రాజత్వము 

బంగారు గంటలు = దేవుని సంఘమునకిచ్చు వరములు (I కొరింథి 12:4-11; ఎఫెసీ 4:7-12; 1 కొరింతి 12:28; రోమా 12:6-8). 

దానిమ్మపండ్లు = ఆత్మఫలములు (గలతీ 5:22) 

ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి యాజక ధర్మము జరిగించు నప్పుడు యాజకుడు జీవించు చున్నాడా? లేదా? యని బయటనున్న ప్రజలకు తెలియుటకు గంటలు మ్రోగవలయును. 

  1. ఏఫోదు బంగారు, నీల, రక్త, సన్నపునార యను దారములతో విచిత్రపు పనిగా చేయ వలయును. ఆ ఏఫోదును భుజముపై పెట్టవలయును. యాజకుని కుడి భుజము మీద ఒక గోమేధికమును, దానిలో ఆరుగోత్రముల పేర్లును ఎడమ భుజము పై ఒక గోమేధికమును దానితో ఆరు గోత్రముల పేర్లు వ్రాయవలెను.
  2. దట్టీ :- బైబిలులో దట్టి సేవ చేయుటను చూచించును (నిర్గమ 12:1; 1 రాజులు 18:46; లూకా 12:35; యోహాను 13:41; ఎఫేసీ 6:14).
  3. న్యాయవిధాన పతకము :- ఈ పతకము ఏఫోదుపైన రొమ్ము భాగమున ధరించును దీనిని కూడా ఏఫోదు ఆకారముగానే చేయవలయును. దానిలో నాలుగు వరుసలుగా ఒక్కొక్క వరుసకు మూడుచొప్పున పండ్రెండు వజ్రములను అమర్చవలయును. ఈ పండ్రెండు రత్నములు 12 గోత్రములకు సాదృశ్యము.

       ఈ రత్నములన్నిటిని బంగారు జవతో పొదగవలెను (నిర్గమ 28:17-21). ఈ పతకములో ఊరీము (ప్రకాశము) తుమ్మీము (సత్య సంపూర్ణము) అను వాని నుంచవలయును. 

ఊరీము, తుమ్మీము : -ఇది దేవుని యొక్క నడిపింపు తెలిసి కొనుటకై ప్రయోజన కరముగా నున్నది (సంఖ్యా 27:21; కీర్తన 43:3). 

4.) తల పాగ :- తల పొగకు ముందు భాగమున యెహోవా పరిశుద్ధుడు. అని చెప్పబడిన మేలిమి బంగారు రేకును నీతి సూత్రముతో కట్టవలెను (నిర్గమ 28:26)

         ఈ వస్త్రములన్నియు విచిత్రముగా దేవుని జ్ఞానమును బట్టి చేయవలెను. యాజకులు దేవుని సేవకొరకు వెళ్ళునప్పుడు ఈ విధమైన వస్త్రములను ధరించుకొన వలయును. 

5.) అభిషేకము : – (లేవీ 8:12) దీనికి ఆనంద తైలమని పేరు ఈ తైలాభిషేకము లేకుండా యాజక వృత్తి చేయకూడదు. 

5.) యాజకుల అవయవములకు రక్తము పూయబడి శుద్దీకరింపబడుట :- కుడి చేయి, కుడి చెవి, బొటనవ్రేలు కుడి కాలి బొటన వ్రేళ్ళలో రక్తమును చమర వలయును. 

కుడి చెవి =  దేవుని శబ్దమును వినుట 

కుడి చేయి బోటన వ్రేలు = దేవుని సేవ చేయుట 

కుడి కాలి బొటన వ్రేలు = దేవుని మార్గములో నడుచుట 

సమస్తమును రక్తము ద్వారా =  పరిశుద్ధ పరచవలయును. 

6) యాజకులు గుడారములలో ఉండి భుజింపవలయును యాజకుడు బయట తినకూడదు. 

7) యాజకుని పని :- యాజక ధర్మములు 

A.) ఎల్లప్పుడు దేవుని మందిరములోనే నివసింపవలయును (లేవీ. 10:7; హెబ్రీ 3:12; 7:21-28, 8:1) 

B.) బలి అర్పించుట (లేవీ 9:2-22)

C.) ప్రజలను ఆశీర్వదించుట (లేవీ 9:23; సంఖ్యా 6:22-26)

D.) ఉప దేశించుట (లేవీ 10:11; ద్వితీ 33:10; హెబ్రీ 1:1; మత్తయి 28:20).

E.) దీపములు క్రమపరచుట :- సంఘమును, దీపమును క్రమపరచుట

   (లేవీ 24:2-4; ప్రకటన 2:11; 3:22). 

F.) సముఖపు రొట్టెలు దొంతరలుగా పెట్టుట (లేవీ 24:5-9)

G.) ధూపములు వేయుట (ద్వితీ 33:10; 1 యోహాను 2:1).

H.) అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట (లేవీ 16:5)

I.) ప్రధాన యాజకుడు దేవునికి మనుష్యులకును మద్య రక్తమును చేతులతో పట్టుకొని యుండుట(లేవీ 16:14)

J.) అతి పరిశుద్ద స్థలము నుండి తిరిగి వచ్చుట (హెబ్రీ 9:3)


ప్రసంగ శాస్త్రం subjcet కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted