పరిశుద్దాత్ముని తొమ్మిది ఆత్మ వరాలు .
9 Gifts Of Holy spirit In Bible Telugu
ఈ మూడు అధ్యాయాల్లోనూ అంటే 1కొరింథి 12,13,14 అధ్యాయాల్లో పౌలు ఈ విధంగా పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసుల సమూహానికి వ్రాస్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్ముడు ఈ వివిధ వరాలను (మానవాతీత సామర్థ్యాలను) సంఘానికి ఎందుకు ఇస్తున్నాడో పౌలు వివరిస్తున్నాడు. ఘనుడైన క్రీస్తు పరిచర్య ఆయన దేహం (సంఘం) లోని సభ్యుల మూలంగా ఈ లోకంలో జరగాలి. పరిచర్యకు ఆరాధనకూ దేవుని ప్రజలను శక్తిమంతుల్ని చేసే దేవుని యొక్క మానవాతీత కార్యం ఇది.
అనుకూలత గురించి మనం ఈ 9 ఆత్మ వరాలను మూడు వర్గాలుగా విభజిస్తాం. ఒక్కొక్క వర్గంలో మూడేసి వరాలున్నాయి. అవేమిటంటే
వెల్లడింపు వరాలు – బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మలను వివేచించే వరం.
శక్తి వరాలు – విశ్వాస వరం, స్వస్థతా వరాలు, అద్భుతాలు చేసే వరం
ప్రేరణా పూర్వకంగా మాట్లాడే వరాలు భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచన వరం.
1.) వెల్లడింపు వరాలు:
అ) బుద్ధివాక్యం. ఇది సహజంగా లేక నేర్చుకున్న తెలివితేటలను విస్తరింపజేసే వరం కాదు. ఇది దేవుని సర్వ శక్తిలో ఒక చిన్న భాగాన్ని ఆయనమానవాతీతంగా విశ్వాసికి వెల్లడి చేయడం. ఇది పరిశుద్దాత్ముని వరం. 9 Gifts Of Holy spirit In Bible Telugu
ఆత్మ పూర్ణుడైన ఒక విశ్వాసికి దేవునికి తెలిసిన విషయాలలో ఒకదానిని అద్భుతమైన రీతిలో అందజేయడం జరుగుతుంది. నీకున్న తెలివిలో ఒక చిన్న భాగాన్ని నీవు పలికే ఒక మాట వ్యక్తపరచవచ్చు. అందువల్ల “బుద్ధివాక్యం” అంటే దేవుని అనంత జ్ఞానంలో ఒక చిన్న అంశం. అప్పటికి ఉన్న అవసరతను తీర్చడానికి ఇది చాలు.
మనం పరిశుద్దాత్ముని అభిషేక శక్తి క్రింద ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు వెల్లడి పరిచే వాక్కు. ఇది ఒక సంఘటనకు సంబంధించిన ఎరుక గానీ లేక ఒక వ్యాధి ఎందుకు వచ్చిందో గ్రహించగలిగే అంతర్దృష్టి గానీ (ముఖ్యంగా స్వస్థతా పరిచర్యలో) అయి ఉండవచ్చు. కొన్ని పరిస్థితులను ఎరుగ గలిగే సామర్థ్యాన్ని ఇది ఇవ్వవచ్చు. వేరొక విధంగా మనం పొందలేని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇది ఇస్తుంది.
ఈ భూమిపై క్రీస్తు శరీరం అయిన సంఘంలో జరగవలసిన పరిచర్యలో అనేక అవసరతలు ఉంటాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన అవసరతను తీర్చడానికి దేవుడు మానవ హృదయంలో వెల్లడి పరిచే ఆయన యొక్క అనంత జ్ఞానంలోని ఒక చిన్న భాగమే ఈ బుద్ది వాక్కు.
ఎవరి కుతూహలాన్నైనా సంతృప్తి పరచడానికి ఈ బుద్ధివాక్కును దేవుడు ఇవ్వడు. ఇతర ఆత్మ వరాలను ఎందుకిస్తాడో అందుకే దీన్ని కూడా ఇస్తాడు. “ఈ అనుగ్రహం అందరి మేలు కొరకే” (1కొరింథి 19:7). ఆత్మపూర్ణులైన విశ్వాసులు యేసు ప్రభువు యొక్క అద్భుత పరిచర్యను కొనసాగించడానికి ఈ వరం వారిని సమర్థులుగా చేస్తుంది. 9 Gifts Of Holy spirit In Bible Telugu
ఆ) జ్ఞానవాక్కు. ఇది సహజ జ్ఞానం కాదు. వేదాంతులకు, మేధావులకు ఉండే జ్ఞానం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చేమానవాతీత సామర్థ్యం. ఆత్మపూర్ణుడైన విశ్వాసికి దేవుడు తన జ్ఞానంలో చిన్న భాగాన్ని అద్భుత రీతిలో అందించడమే ఈ జ్ఞాన వాక్కు.
మీకున్న జ్ఞానంలోని ఏదో ఒక చిన్న భాగాన్ని మీరు ఒక వాక్కు ద్వారా వ్యక్తపరుస్తారు. “జ్ఞానవాక్కు” కూడా అంతే. దేవుని అనంత జ్ఞానం లోని ఒక చిన్న భాగాన్ని అది వ్యక్తపరుస్తుంది. అది అప్పటి అవసరతను తీరుస్తుంది. ఈ వరం కలిగి ఉన్నవారు ఇది ఒక ప్రత్యేకమైన అవసరం నిమిత్తం మానవాతీతమైన రీతిలో వచ్చిందని గ్రహిస్తారు. మనం పరిశుద్దాత్మ అభిషేకం పొంది ఉంటేనే దీనిని అభ్యసించగలం.
ఈ వరం సాధారణంగా బుద్ది వాక్యంతో కలసి దానిని అనుసరించి పనిచేస్తుంది. జ్ఞానవాక్కు మూలంగా మనం (ఆత్మ మూలంగా మనకున్న ఎరుకను (బుద్ధి వాక్కు మూలంగా మనకు తెలిసిన సమాచారాన్ని) ఏ విధంగా (ఆచరణాత్మకంగా) అన్వయించుకోవాలో నిర్ణయించుకోగలం. ప్రతి స్థానిక సంఘంలోనూ నాయకత్వానికి పరిచర్యకూ ఈ జ్ఞానవాక్కు ఎంతైనా అవసరం.9 Gifts Of Holy spirit In Bible Telugu
ఇ) ఆత్మల వివేచన. దీన్ని తరచుగా వివేచనా వరం అని పొరపాటుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కాని ఈ ఆత్మల వివేచన వరం కేవలం ఆత్మల లోకానికే పరిమితం అయింది. దీని మూలంగా ఒక అద్భుతం లేక ఒక ప్రత్యక్షత పరిశుద్ధాత్ముని మూలంగా కలిగిందా, మానవాత్మ మూలంగా కలిగిందా లేక దురాత్మ మూలంగా కలిగిందా అని గ్రహించగలుగుతాం. ముఖ్యంగా దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్యలో ఇది సహాయకరం (మార్కు 16:17మొదలైనవి). “వివేచించడం” అని తర్జుమా చేసింది “డయాకైసిస్” అనే గ్రీకు పదం. అంటే ఒక విషయాన్ని గురించి కూలంకషంగా వివేచించి తీర్పు తీర్చడం. లేక అంచనా వేసి నిర్ణయించడం అని అర్థం. పరిశుద్దాత్ముడిచ్చే ఈ వరం దయ్యం పట్టినవారి పరిస్థితిని సంపూర్ణంగా బేరీజు వేసేందుకు సహాయపడుతుంది. ఆ దయ్యం యొక్క పేరు, స్వభావం, శక్తి సామర్థ్యాలను గ్రహించి యేసు నామంలో దానిని వెళ్ళగొ ట్టేందుకు శక్తిని సమకూరుస్తుంది.
తరచుగా మానసిక, శారీరక వ్యాధులు కొన్ని చీకటి శక్తుల మూలంగా కలుగుతాయి. నేటి విడుదల పరిచర్యలో ఈ ఆత్మల వివేచన వరం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు.
2. శక్తి వరాలు
అ) విశ్వాస వరం. క్రైస్తవులందరికీ వారి మానవ ఆత్మలలో ఒక సామర్థ్యంగా విశ్వాసం ఉంటుంది. మనుషులందరి హృదయాలలో విశ్వాసం పుడుతుంది. కొందరిలో అల్ప విశ్వాసం, కొందరిలో ఊగిసలాడే విశ్వాసం ఉంటుంది. మరి కొందరిలో గొప్ప విశ్వాసం ఉంటుంది. అయితే విశ్వాస వరం అన్నది దేవుడిచ్చే ఎదిరింప శక్యంకాని విశ్వాసం. ఆత్మపూర్ణుడైన విశ్వాసి యొక్క హృదయంలో దేవుడు దీనిని మానవాతీతంగా కలుగజేస్తాడు. ఇది ఒక ప్రత్యేక ప్రయోజనం నిమిత్తం దేవుడు కలిగించే ప్రత్యేక విశ్వాసం. 9 Gifts Of Holy spirit In Bible Telugu
యేసు ప్రభువు ఆరంభించిన అద్భుత పరిచర్యను కొనసాగించడానికి ఇది మానవాతీతంగా లభించే సామర్థ్యత. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే వరం. పరిశుద్దాత్ముని అభిషేకం క్రింది ఈ వరాన్ని అభ్యాసం చేయవచ్చు. వ్యక్తిగతంగా విశ్వాసులు, స్థానిక సంఘాలు ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు.
ఆ) స్వస్థతా వరాలు. శారీరక వ్యాధులను నయం చేయడానికి లేక స్వస్థపరచడానికి ఈ వరాలుఉపయోగపడతాయి. అనేక విధాలుగా మనుషుల వ్యాధులను బాగుచేయవచ్చు. వైద్య సంబంధంగా బాగు చేయవచ్చు. లేక సహజంగా ప్రత్యేకమైన ఆహార పదార్థాల ద్వారా బాగు చేయవచ్చు. రుజువైన, సరియైన, ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాలను పెంపొందించుకోవడం ద్వారా బాగు చేసుకోవచ్చు. లేక ప్రార్థన ద్వారా, ఇతరులు విశ్వాసం మూలంగా వ్యాధులు బాగవుతాయి. ఈ పద్ధతులు వేటిల్లో కూడా స్వస్థతా వరాలు ఇమిడి లేవు.
ఆత్మపూర్ణుడైన విశ్వాసిలో పరిశుద్దాత్ముని యొక్క శక్తి మూలంగా ఈ శక్తి వరాలు మానవాతీతంగా అనుగ్రహించబడతాయి.యేసు ప్రభువు యొక్క స్వస్థతా పరిచర్యను కొనసాగించడానికి విశ్వాసికిది సామర్థ్యం అనుగ్రహిస్తుంది. రోగిలో విశ్వాసం ఉండనక్కర లేదు అన్నంతగా ఈ వరాలు పనిచేయవు. విశ్వాసం కనిపించని చోట యేసు ప్రభువు స్వస్థతలు జరిగించలేకపోయాడు (మార్కు 6:5,6).
అయినప్పటికీ సువార్త పరిచర్యతో పాటు స్వస్థతా వరాలు ఉంటే దానిని విశ్వాసం ద్వారా స్వీకరించగలిగిన వారందరికీ స్వస్థతా శక్తి అందుబాటులో ఉంటుంది.
పౌలు స్వస్థతా వరాలు అని బహు వచనాన్ని ఎందుకు ఉపయోగించాడో చాలా మందికి అర్థం కాలేదు. ఒకవేళ వేరు వేరు వ్యాధులకు వేరు వేరు రకాల వరాలు అవసరమేమో. వైద్య శాస్త్రంలో కూడా ఇంతే కదా. వివిధ వ్యాధులకు వివిధ నిపుణులు ఉంటారు. 9 Gifts Of Holy spirit In Bible Telugu
స్వస్థతా వరాలు సంఘ పరిచర్యతో విడదీయరాని అంతర్భాగాలు అని గమనించడం అవసరం. అవి సంఘంలో ఉంచబడినాయి (1 కొరింధీ12:28).
ఇ) అద్భుతాలు చేసే వరం. దీనికి ఉపయోగించబడిన గ్రీకు పదం “ఎనర్జిమో డునామిస్.” దీనికి అక్షరాలా శక్తి యొక్క శక్తి అని అర్థం.ఈ ఆత్మ వరం దేవుని శక్తిని ప్రదర్శించడానికి ఇవ్వబడింది. కొన్ని అత్యద్భుతమైన స్వస్థతల్లో ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు విరిగిన ఎముకలు తక్షణమే తిరిగి అతుక్కోవడం, కేన్సర్ ఉన్నది ఉన్నట్టుగానే మాయంకావడం. అయితే ఇది భౌతిక ప్రపంచాన్ని మించి వెళ్తుంది. ప్రకృతిపై దేవుని శక్తిని ప్రదర్శించే చర్యలు జరుగుతాయి. ఉదాహరణకు అంజూరపు చెట్టును శపించడం (మార్కు 11) లేక పంచ భూతాలను శాసించడం. ఉదాహరణకు నీటిని ద్రాక్షా రసంగా మార్చడం (యోహాను2), తుఫానును గద్దించడం (లూకా8) మొదలైనవి.
ఈ యుగాంతం సమీపిస్తున్న కొద్దీ, పరిశుద్దాత్ముని కుమ్మరింపు అధికమౌతున్న కొద్దీ ఈ అద్భుతాలు చేయడం అనే ఆత్మ వరం మూలంగా ఎన్నెన్నో విజయాలు సాధించబడటం మనం చూస్తాం. ఆధునిక ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా అద్భుతాలు జరుగుతాయి.
3. ప్రేరణా పూర్వకంగా మాట్లాడే వరాలు
అ) భాషలు. కొందరు ప్రతిపాదించినట్లుగా ఇది ఇతర భాషలను నేర్చుకొని మాట్లాడటం కాదు. విదేశాలలో సువార్త ప్రకటించేందుకు ఈ వరం ఇవ్వబడింది అనడం కూడా సరికాదు. పెంతెకొస్తు దినాన (అపొ.కా. 2) 120 మంది శిష్యులు ఆత్మతో నింపబడి, ఇతర భాషలతో మాట్లాడారు. ఇతర దేశాల నుండి యెరూషలేముకు వచ్చినవారు వారి మాతృభాషల్లో యేసు ప్రభువు సందేశాన్ని కొంత వరకు వినగలిగారు. 9 Gifts Of Holy spirit In Bible Telugu
అయితే వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి, వారికి సువార్తను బోధించడానికి పేతురు లేచి నిలువబడి ఆ ప్రాంతంలో అందరూ మాట్లాడే అరమేయిక్ భాషలోనే మాట్లాడాడు. ఇందు మూలంగా 3,000 మంది పశ్చాత్తాప పడి మారు మనస్సు పొందారు.
పేతురు ప్రకటించిన సువార్తను వారు అర్థం చేసుకున్నారనడంలో సందేహం లేదు. కాబట్టి ఇతర భాషలు అనేవి పరిశుద్ధాత్ముని నింపుదలకూ ఆత్మ అనుగ్రహించే శక్తికీ సాక్ష్యంగా ఉన్నాయే గాని విదేశీయులకు సువార్త ప్రకటించడానికి కాదు. 1 కొరింథి 14:2 లో పౌలు అంటున్నాడు, “తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. మనుషులతో కాదు.” 4 వ వచనంలో “తెలియని భాషలో మాట్లాడేవాడు తనకే అభివృద్ధి కలిగించుకుంటాడు” అని కూడా వ్రాశాడు.
5 వ వచనంలో “మీరంతా భాషలలో మాట్లాడాలని నా కోరిక” అనీ, 18 వ వచ నంలో “మీ అందరి కంటే నేను భాషలలో ఎక్కువగా మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞత చెపుతున్నాను” అనీ, 39 వ వచనంలో “భాషలతో మాట్లాడడం అడ్డగించకండి” అని పౌలు వ్రాశాడు.
అపొస్తలుల కార్యములు గ్రంథంలో 2,10,19 అధ్యాయాలలో వ్యక్తులు పరిశుద్ధాత్మను పొంది ఫలితంగా ఇతర భాషలలో మాట్లాడారు. ఆత్మ నింపుదలకు ఆరంభ సూచకంగా సాధారణంగా కనిపించే సూచన ఇదే.
1కొరింథి 12-14 అధ్యాయాలలో పౌలు భాషల వరాల గురించి వ్రాస్తున్నాడు. ఒక సభలో భాషలతో మాట్లాడడం, దీనికి జతగా ఆ భాషలకు అర్థం చెప్పడం గురించి పౌలు వ్రాశాడు. 1కొరింథి 14:27 లో పౌలు వ్రాస్తూ. “భాషలకు అర్థం చెప్పేవాడు గనుక ఉంటే ఒక సమావేశంలో ఇద్దరు ముగ్గురు ఇతర భాషలలో మాట్లాడవచ్చు. భాషలకు అర్థం చెప్పే వాడెవడూ లేకపోతే వారు మౌనంగా ఉండి తమలో తాము లేక దేవునితో మాట్లాడుకోవాలి” (1కొరింథి 14:27,28). కొత్త నిబంధనలో ఈ క్రింది వాటిలో తేడా ఉన్నదని కొందరు బోధిస్తారు.
- పరిశుద్దాత్ముని నింపుదలకు ప్రథమ సూచనగా భాషలు.
- ఆరాధనకు, విజ్ఞాపణకు ఉపయోగపడేభాషలు. వీటిని వ్యక్తిగత ధ్యానం సమయాల్లో ఉపయోగించాలి.
* ఏదైనా సభలో ఉపయోగించదగిన భాషల వరం. దీనికి వెనువెంటనే ఆ
భాషలకు అరం చెప్పడం కూడా ఉండాలి. తద్వారా అందరూ క్షేమాభివృద్ధి నొందుతారు.
విశ్వాసులకు సరిగ్గా ఉపదేశించి ఈ వరానికి సంబంధించిన అనుభవాన్ని వారు పొందగలిగితే పైన చెప్పిన మూడు అంశాలలోనూ ఈ వరాన్ని ఉపయోగించవచ్చు అని మేము గ్రహించాం.
పౌలు కూడా ఎవరైనా భాషలో మాట్లాడుతున్నారంటే అతని అవగాహన (మనస్సు) ఏ విధంగానూ లాభం పొందదు అని వివరించాడు. అతడి ఆత్మ (మనసు కాదు) దేవునితో మాట్లాడుతున్నది (1కొరింథి 14:14,15). “కనుక తెలియని భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్పే సామర్థ్యం కోసం ప్రార్థన చేయాలి “(1కొరింథి 14:13).
అన్ని భాషలకు కర్తయైన పరిశుద్ధాత్ముడు మనుషుల ఆత్మలను కదిలించి, ప్రేరేపించి మాట్లాడే వాడిని అంతకు ముందు తెలియని భాషలో మాట్లాడిస్తాడు. ఇది పరిశుద్దాత్మ వరం. ఇంతకు ముందు చెప్పిన అన్ని వరాల్లాగే మానవాతీత సామర్థ్యం.
ఆ) భాషలకు అర్థం చెప్పే వరం. ఇంతకు ముందు చెప్పిన వరానికి ఇది “కవల” (Twin) వరం. 1కొరింథి 14:5 లో పౌలు ఇలా వ్రాశాడు. “మీరంతా భాషల్లో మాట్లాడాలని నా కోరిక గానీ మీరు దేవుని మూలంగా పలకాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. సంఘానికి అభివృద్ధి కలిగేలా భాషలలో మాట్లాడేవాడు అర్థం చెబితేనే తప్ప అతడికంటే దేవుని మూలంగా పలికే వాడే గొప్పవాడు.“ భాషలు మాత్రమే పలికితే మాట్లాడేవాడికి మాత్రమే ప్రయోజనం (వచనం 4)దానికి అర్థం చెబితేనే గాని ఇతరులకు ప్రయోజనం లేదు. దైవ ప్రేరణ మూలంగా వచ్చిన సందేశం సంఘాని కంతటికీ అర్థం కావాలం టే ఇదొక్కటే మార్గం.
ఈ కారణం వల్లే 13 వచనంలో పౌలు ఇలా వ్రాశాడు, “కనుక తెలియని భాషలో మాటాడేవాడు అర్థం చెప్పే సామర్థ్యం కోసం ప్రార్ధన చేయాలి.” ఈ సామర్థ్యం కలిగితే భాషల్లో మాట్లాడేవాడు దానితోపాటు అర్థం చెప్పే వరాన్ని కూడా అభ్యసించడం మూలంగా సంఘానికంతటికీ క్షేమాభివృద్ధికలిగిస్తాడు. 9 Gifts Of Holy spirit In Bible Telugu
భాషలకు అర్థం చెప్పే వరం కూడా భాషల్లో మాట్లాడే వరం లాగే లేక ఇతర ఆత్మ వరాల్లాగే ఒక మానవాతీత వరం. ఈ వరాన్ని ఎవరైనా నేర్చుకోవడం సాధ్యం కాదు. భాషల్లో మాట్లాడే వరాన్ని దయచేసే పరిశుద్ధాత్ముడే వాటి అర్థాన్ని చెప్పే వరాన్ని కూడా ఇస్తాడు. 9 Gifts Of Holy spirit In Bible Telugu
ఇది కేవలం అనువాదం మాత్రమే కాదు. అనువాదం అంటే సాధారణంగా అన్య పదాలకు అర్థం ఇచ్చుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా వేరే భాషలో చెప్పడం. అయితే భాషల అర్థాన్ని చెప్పే వరం భాషలో ఇవ్వబడిన సందేశాన్ని వ్యాఖ్యానించి వివరిస్తుంది. పరిశుద్దాత్ముడే 9 Gifts Of Holy spirit In Bible Telugu
భాషల్లో చెప్పబడిన దాన్ని వివరిస్తాడు. అంటే భాషలో పలుకబడిన కొన్ని మాటలలోని భావాలను విస్తరించి వివరించి చెప్పడం ఉంటుందన్నమాట.
భాషల్లో ప్రార్థన చేస్తే దానికి అర్థం చెప్పడం తెలిసిన భాషలో అదే ప్రార్థనను వల్లించడం అన్నమాట. లేదా, అర్థం చెప్పడం, అంటే ఆ ప్రార్థనకు దేవుని జవాబును తెలపడం కూడా కావచ్చు. అంటే ఆ ప్రార్ధన ఫలితంగా దేవుడు ఏమి చేయబోతున్నాడో వినేవారికి తెలియజెప్పడం. అంతేగాక ఆ ప్రార్థన నెరవేరాలంటే ముందుగా నెరవేరవలసిన కొన్ని షరతులను కూడా దేవుడు దీని ద్వారా తెలుపవచ్చు. 9 Gifts Of Holy spirit In Bible Telugu
భాషల్లో మాట్లాడేవాడికి ఆ భాషలకు అర్థం చెప్పేవాడికీ మధ్యన ఉండి నడిపించేది ఆ ఇద్దరినీ ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడే.
ఇ) ప్రవచన వరం. చివరిగా ప్రవచన వరం అనే ఈ మూడవ వరం గురించి నేర్చుకుందాం. ఇది బోధించడం కాదు. ఒక్కొక్కసారి బోధించడం కూడా ఈ స్థాయికి చేరవచ్చు. అలాంటప్పుడు మాట్లాడేవాడు ప్రవచన పరం మూలంగా బోధిస్తున్నాడన్నమాట (1కొరింథి 14:6). “బోధించడం” అనే పదాన్ని తెలపడానికి గ్రీకులో రకరకాల పదాలు వాడబడ్డాయి.
అయితే ప్రవచించడం అంటే “వేరొకని ప్రేరణ క్రింద మాట్లాడటం”, “ప్రేరణాత్మకంగా పలకడం”, “ముందుగా అనుకోకుండా, సిద్ధపడకుండా మాట్లాడడం.” తక్కిన 8 ఆత్మ వరాల వలే ప్రవచన వరం కూడా మానవాతీతమే. 9 Gifts Of Holy spirit In Bible Telugu
సహజమైన మానసిక జ్ఞానంతో సిద్దపడి ఇచ్చిన సందేశం ప్రవచన వరం అనిపించుకోదు. లోనున్న ఆత్మ మూలంగా వచ్చినదే ప్రవచనం. దీని ప్రయోజనం 3 రకాలు: “క్షేమాభివృద్ధి (కట్టడం), హెచ్చరిక (లేపడం), (ప్రోత్సాహపరచడం) (1కొరింథీ 14:3). 9 Gifts Of Holy spirit In Bible Telugu
ప్రవచనం అనేది ప్రేరిత వాక్కు అయినప్పటికీ ఇదెప్పుడూ మాట్లాడేవాడి అదుపులోనే ఉంటుంది. అందుకనే 1కొరింథి 14:32 లో ఈ విధంగా వ్రాసి ఉంది.”ప్రవక్త ఆత్మ ప్రవక్త వశంలో ఉంది.” 9 Gifts Of Holy spirit In Bible Telugu
అంటే ఒక వ్యక్తి యొక్క సంకల్పం, జ్ఞానేంద్రియాలు ఈ ఆత్మ వరాన్ని అభ్యసించడంలో తోడ్పడతాయి. ఇంగ్లీషు లివింగ్ బైబిల్లో లో పై వచనాన్ని ఈ విధంగా అనువదించారు “గుర్తుంచుకోండి, దేవుని నుండి ఒక సందేశాన్ని పొందిన వ్యక్తి తనకు అవకాశం వచ్చే వరకు మౌనంగా ఉండగలగడం అతని ఇష్టమే.“
ఈ విధంగా ప్రేరితమైన వాక్కుకు సంబంధించిన మూడు వరాలను ఇక్కడ సంక్షిప్తంగా చర్చించాం. అవేవంటే భాషలు, భాషలకు అర్ధం చెప్పడం, ప్రవచనం.
ఈ వరాలు ప్రతి సంఘంలో కూడా అభ్యాసంలో ఉండాలి. కొత్త నిబంధన సంఘానికి ఇవి ప్రధాన లక్షణాలు. నేటి సంఘానికి కొత్త నిబంధన నమూనా ఇదే.
సేవకుల ప్రసంగాలు కొరకు క్లిక్ చేయండి…క్లిక్ హియర్