Is Jesus God ?-యేసు దేవుడా దేవుని కుమారుడా – Bible Question Answers Telugu 2

యేసు దేవుడా? దేవుని కుమారుడా? 

Bible Question Answers Telugu

  విమర్శ: క్రైస్తవ ప్రపంచములో వివిధ సిద్ధాంతములను బోధించుచున్న క్రైస్తవ సంస్థలున్నాయ్! వీటిలో కొన్ని యేసు దేవుడని చెబితే కొన్ని కాదు ఆయన దేవుని కుమారుడేనని అంటున్నాయ్. వీటిలో ఏది నిజం? దేవుడా? దేవుని కుమారుడా? 

  జవాబు : ఈ ప్రశ్నకు జవాబుకావాలంటే యేసు క్రీస్తును గూర్చిన కనీసపు అవగాహన కావాలి. పరిశుద్ధ గ్రంథములోని యోహాను 1:1 లో ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. అని వ్రాయబడియున్నది; వాక్యమును వినగలమేగాని వాక్యము (స్వరము)ను చూడలేము అనగా వాక్యము (శబ్ధము) నకు రూపము లేదు. సృష్టిని సృజించిన విధమును గమనించినచో, నరుని తప్ప మిగిలిన సృష్టినంతటిని కలుగునుగాక, కలుగునుగాక! యంటు వాక్యము (మాట) చేత మాత్రమే కలుగజేసెను. 

  గనుకనే యోహాను 1:1 లో ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడైయుండెనని చూచుచున్నాము. ఆదియందు ఏమియుండెను? వాక్యముండెను. వాక్యము ఏమైయుండెను. వాక్యమే దేవుడైయుండెను. ఆలాగే యోహాను 1:14ను గమనించినచో ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. ఏ వాక్యము ఆదియుందుండెనో, ఆ (ఎ) కృపాసత్య సంపూర్ణుడుగా (బి) మనమధ్య నివసించినప్పుడు; శరీరధారియైన ఆ వాక్యమునకు “యేసు” అను నామము కలిగెను. Bible Question Answers Telugu

  ఆది వాక్యమైయున్న దేవుడు శరీరధారియై ఈ లోకానికి వచ్చుటకు దాదాపు 750 సంవత్సరాలకు ముందుగానే ఈ రీతిగా ప్రవచింపబడియున్నది. 

  “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును “(యెషయా 9:6) ఆదియందు వాక్యమైయుండి శరీరధారియై నరరూపు దాల్చి కుమారుడని పిలువబడుచున్న యేసుక్రీస్తు వారి నామములను గమనించుడి. 1. ఆశ్చర్యకరుడు 2. ఆలోచనకర్త 3. బలవంతుడైన దేవుడు 4. నిత్యుడగు తండ్రి 5. సమాధనకర్తయగు అధిపతి అనగా శిశువుగా పుట్టి కుమారునిగా పిలువబడుచున్న ఈ యేసే బలవంతుడైన దేవుడనియు అంత మాత్రమేగాక ఈ యేసే నిత్యుడగు తండ్రియని బైబిల్ చక్కగా వక్కాణిస్తుంది. అయినను ఒప్పుకొనుటకు మనస్సు లేనివారు యింకా వాదిస్తూ క్రొత్తనిబంధనలో యేసు దేవుడని ఎక్కడున్నదో చూపమంటారు! అలాగడిగినను చూపించగలము. కొందరైతే; వారి సంస్థ నాయకులు చెప్పిందే వేదవాక్కంటు, వారు వ్రాసిన పుస్తకాలు, వారు చెప్పిన బోధనలనే వెంబడిస్తుంటారు.  Bible Question Answers Telugu

  రోమీయులకు వ్రాసిన పత్రిక 9:5ను చూడండి! “పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన (క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమెన్!” 

  తీతుకు 2:13లో “అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రదుకుదుము.” అని వ్రాయబడియున్నది. రోమా 9:5 లో సర్వాధికారియైన దేవుడనియు తీతుకు 2:13 లో మహా దేవుడనియు తెలియజేస్తుండగా, యేసు దేవుడుకాడనియు, నూతన నిబంధనలో అలాగు లేదని వాదించుట ఎంతమట్టుకు న్యాయమో మీరే యోచించుకొనుడి. 

  అట్లయితే అనేక పర్యాయాలు నా దేవా, నా తండ్రి మొదలగు మాటలను యేసు ఎందులకు నుచ్చరించాలి? ఇదేగా మీ ప్రశ్న ఆదియందు వాక్యమైయున్న యేసు శరీరధారిగా ఈ లోకానికెందుకొచ్చాడు? దైవాజ్ఞను ఉల్లఘించి ఉగ్రతకు గురికానున్న మానవ జాతిని రక్షించుటకును, మానవునికి దైవాజ్ఞలను అనుసరించుట ఎట్లు అనునది నేర్పించుటకు (ఉపాధ్యాయుడుగా)ను ఈ లోకమునకు వచ్చెను. ఈ క్రమములో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈలాగు చెప్పెను. “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” (యోహాను 13:15) ఈ వాక్యములో “మీకు మాదిరిగా అను మాట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఎందుకనగా ఆయన ఏమి ఉచ్చరించినను, ఏది జరిగించినను మనకు మాదిరిగా చేసెను. ఒక ఉపాధ్యాయుడు విధ్యార్ధికి నేర్పుతూ; పలక బలపం చేత పట్టుకొని అ, ఆ, ఇ, ఈ అని వ్రాసినందున; ఉపాధ్యాయుని విధ్యార్ధినిగా చేసి ఆయన అ, ఆ, ఇ, ఈ వ్రాసాడు, నేను చూసాను అంటే నేనేమందును. ఆ ప్రకారమే యేసు, నాదేవా, నా తండ్రి మొదలగు మాటలను మనకు మాదిరిగా ఉచ్చరించారని అంగీకరించగలిగిన సద్విమర్శకులు పరిశుద్ధ గ్రంథములోని యెషయా 9:6, రోమా 9:5 తీతుకు 2:13 యింకనేకమైన లేఖనములు యేసు దేవుడని సాక్ష్యమిస్తుండగాను, అపొస్తులు అంగీకరించుండగాను సత్యాన్వేషుకులు యేసును దేవునిగా ఒప్పుకొనక తప్పదు ఎందుకనగా ప్రభువిట్లు సెలవిస్తున్నాడు. Bible Question Answers Telugu

  “(యేసు) “నేను ఆయన (తండ్రి) నని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదరని వారితో చెప్పెను. (యోహాను 8:24) కావున నీవు అవిశ్వాసి కాక విశ్వాసివైయుండినట్లు తోమాను పోలి ఆయనతో నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకొని పిలువుము. (యోహాను 20:2) ఎందుకనగా ఆయన సర్వాధికారియైన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు ఆమెన్. (రోమా 9:5) Bible Question Answers Telugu


ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.