వేదములలో క్రీస్తు.
Veadamulalo Kreesthu
అసతోమా సద్గమయా-తమసోమా జ్యోతిర్గమయా- మృత్యోర్మా అమృతంగమయా
ఈ శ్లోకము బృహదారణ్యకోపనిషత్తులోనిది! శతాబ్దాల క్రిందట మన పూర్వీకులు వెలుగును, సత్యాన్ని, అమరత్వాన్ని అన్వేషిస్తూ వ్రాసిన ప్రార్థన, చేసిన తపస్సు ఇది!
యోహాను 8:12లో యేసుప్రభువు అన్నాడు- ‘నేను లోకానికి వెలుగును; నన్ను వెంబడించినవారు చీకటిలో నడువరు గాని, వారికి జీవకాంతి ఉంటుంది’. మరోసారి యోహాను 11:25, 26లలో ఆయన అన్న మాటలు- ‘పునరుత్థానమును, జీవమును నేనే; నా మీద నమ్మకం ఉంచినవారు చనిపోయినా జీవిస్తారు, బ్రతికి యుండి నా మీద నమ్మకం ఉంచేవారు ఎన్నటికీ చనిపోరు’.
వేదాలు హిందూ సోదరులకు ప్రామాణిక గ్రంథాలు! చింతనాపరులైన మన ప్రాచీన మహర్షులు తమకు తెలియకుండానే రాబోయే ప్రజాపతిని గురించిన భావనలను వ్యక్తం చేసారు. ప్రజాపతి అంటే దేవాది దేవుడు! తాండ్య మహా బ్రాహ్మణంలో ద్వితీయ భాగం ఏడవ అధ్యాయములో “ప్రజాపతిః దేవేద్య ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చత్” అని వ్రాసి ఉన్నది! ప్రజాపతి యజ్ఞబలి అయిపోయాడు! తద్వారా ప్రాయశ్చిత్తార్ధ యజ్ఞం వల్ల దేవుడిని తృప్తిపరిచాడు. దేవుడే బలైపోవటం గొప్ప విశేషం!
ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రజాపతిని ఆది పురుషుడని పేర్కొన్నారు! ఈ పురుషుడు ప్రజాపతిగా అవతరించిన ‘లోగోస్ వాక్కు అయిన యేసుప్రభువునే సూచిస్తున్నాడు! కెనోసిస్ సూత్రం ప్రకారం యేసు తనను తాను రిక్తునిగా చేసుకొన్నాడు. లోకపాపాల కోసం యేసు బలైపోయాడు (హెబ్రీ 10:10).
యేసుప్రభువు యొక్క సిలువ మరణ పునరుత్థానములు ప్రజాపతి పురుషుడి దివ్యబలి సంకేతాలు! ఋగ్వేదం, శతపథ బ్రాహ్మణంలో ప్రతిపాదించబడిన యజ్ఞబలి నవ విధాలుగా గోచరిస్తున్నది!
వేదములలో క్రీస్తు
- యజ్ఞ పశువు నిష్కళంకమైన గొట్టెపిల్ల!
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అని ప్రభువు చెప్పెను. (యోహాను 8:46)
- యజ్ఞ పశువు తలకు బలుసు కంప చుట్టాలి!
సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి, ఆయన తల మీద పెట్టిరి (యోహాను 19:2)
- బలిపశువును యూపస్థంభానికి బంధించాలి!
యేసును సిలువకు బంధించారు!
- బలిపశువు నాలుగు కాళ్ళు గాయపరచబడి, రక్తం చిందాలి!
బంట్రౌతులు యేసు కాళ్ళు, చేతులకు మేకులు కొట్టగా, రక్తము కారెను.
- యజ్ఞబలి పశువును కప్పిన వస్త్రము రుత్విజులు పంచుకొంటారు!
బంట్రౌతులు యేసు వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకొన్నారు (యోహాను 19:23).
- దాని ఎముకలు విరుగకూడదు!
బలు వచ్చి, యేసు అంతకు ముందే చనిపోయాడని చెప్పి కాళ్ళు విరుగ గొట్టలేదు (యోహాను 19:33).
- బలిపశువుకు సోమరసం (చేదైన ద్రావకం) త్రాగించాలి!
యేసుక్రీస్తుకు చేదు చిరక త్రాగనిచ్చారు (యోహాను 19:29)
- బలిపశువు చనిపోయాక, దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి!
యేసు చనిపోయి, లేఖనానుసారంగా తిరిగి లేచెను (1 కొరింథీ 15:38)
- బలిపశువు మాంసాన్ని తినాలని శతపథ బ్రాహ్మణంలో నిర్దేశించింది.
1 కొరింథీ 11:24 ప్రకారం ప్రభువు ‘దీనిని తినండి, ఇది మీ కోసమై విరిగిన నా శరీరమే’ అనెను.
గమనించాలి! వేదగ్రంథాలు క్రీస్తుకు పూర్వమే వ్రాయబడినవి! క్రీ.పూ. 2000- 1200 ప్రాంతంలోని రచనలు ఇవి! ఇవన్నియు క్రీస్తునందు నెరవేరటం ఆశ్చర్యమని పిస్తోంది గద్దూ! హిందూ వేదాలలో పరోక్షంగా క్రీస్తునందలి మోక్షం ప్రవచించబడింది. అందరూ క్రీస్తును నేరుగా కలుసుకోవచ్చు! వేదారణ్య భూమిలో వెదకనక్కరలేదు. ఆయన అవతరించాడు, మన మధ్య జీవించాడు, సిలువ మీద చనిపోయాడు. క్రీస్తు అనే ప్రజాపతి రక్తబలిని అంగీకరించి అన్వయించుకొన్నవారు ధన్యులు! మతం మార్పిడి కాదు, మనస్సు మారాలి. అంతే! నిన్ను నాశనం చేసిన పాపం విషయమై మారుమనస్సు కలగాలి! పాపము నుండి నీ రక్షకుడి వైపు రావాలి! రక్షకుడు, ప్రజాపతి పురుషుడు అయిన యేసుక్రీస్తును అంగీకరించండి! Veadamulalo Kreesthu
యోహాను 14:6 ప్రకారం యేసు- నేనే మార్గము, సత్యము, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. గలతీ 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు, స్త్రీ గర్భవాసాన పుట్టాడు! ‘అసతోమా సద్గమయా’ అనే ఆకాంక్ష యోహాను 14:6 లో నెరవేరింది. ‘తమసోమా జ్యోతిర్గమయా’ అనే ప్రార్ధన యోహాను 8:12లో నెరవేరింది. ‘మృత్యోర్మా అమృతంగమయా’ అనే అభ్యర్థనను యోహాను 11:25,26 నెరవేర్చింది. దేవునికి స్తోత్రం! Veadamulalo Kreesthu
ముగింపులో అపొ. కార్య. 17:30,31 చదవండి! ‘ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లున్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుష్యు లందరికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన లోకానికి తీర్పు రోజు నిర్ణయించాడు. యేసును తీర్పరిగా నియమించాడు. యేసు పునరుత్థానమే దీనికి ఋజువు! సోదరా! సోదరీ!! దీనికి నీ జవాబేమిటి! – కీ.శే. ఆచార్య ఆరార్కే మూర్తి
For More Pdf Download click here