దేవుని సేవకులు కొరకు గృహాలు తెరిచినవారు|telugu-messages-sermons-for-pastors|1

Written by biblesamacharam.com

Updated on:

 దేవుని సేవకులు కొరకు గృహాలు తెరిచినవారు

telugu-messages-sermons-for-pastors

 దేవుని (సేవకులు కొరకు గృహాలు తెరిచినవారు ఆతిథ్యం ఇయ్యడం మర్చిపోవద్దు. దానిని చేసిన వారు – లెక్కించలేని దీవెనలు ఎన్నో పొందారు. కొంతమందిని చూద్దాం!

1.) అబ్రాహాము – కుమారుని పొందాడు (ఆది. 18:14)

 (ఆదికాండము) 18:14

14.యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

18:14 “చేయలేనిది”– యిర్మీయా 32:17, 27; మత్తయి 19:25-26; లూకా 1:37.

18:14 A సంఖ్యా 11:23; యోబు 42:2; యిర్మీయా 32:17, 27; మత్తయి 19:26; మార్కు 10:27; లూకా 1:37; రోమ్ 4:21; ఎఫెసు 3:20; ఫిలిప్పీ 4:13; B ఆది 17:21; 18:10; ద్వితీ 7:21; 30:3; 1 సమూ 14:6; 2 రాజులు 4:16; మీకా 7:18; జెకర్యా 8:6; మత్తయి 14:31; లూకా 1:13; 8:50; ఫిలిప్పీ 3:21; హీబ్రూ 11:19; C 2 రాజులు 7:1-2; యోబు 36:5; కీర్తన 95:3; మత్తయి 3:9; D కీర్తన 90:13; 93:1; లూకా 1:18

 (కంటికి కనబడే మనిషి రూపంలో దేవుడు వస్తే ఎదురుబోయి సాగిలపడి రమ్మని పిల్చి కంటికి రెప్పలా చూచుకున్నాడు. వెళ్తూ వెళ్తూ వచ్చే సంవత్సరము నీకు కొడుకు పుడ్తాడు అన్నాడు దేవుడు! అలాగే పుట్టాడు)

2. షూనేమి స్త్రీ – బిడ్డను పొందినది (2రాజులు 4:15, 16)

 (రెండవ రాజులు) 4:15,16

15.అందుకతడు ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.

16.ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా యేలిన వాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.

4:16 A ఆది 17:16-17, 21; 18:10, 12-15; 1 రాజులు 17:18; 2 రాజులు 4:28; లూకా 1:13, 30-31; B లూకా 1:18-20; C 1 రాజులు 18:9; 2 రాజులు 2:19; కీర్తన 116:11; D 2 రాజులు 5:10-11

(ఎలీషాకు గది, మంచం, బల్ల, పీట మరియు దీపస్థంభం సిద్ధపర్చి ఇచ్చింది ఆమె ఎంతిచ్చినా, అంత కంటే విలువైన బిడ్డను దేవుడు ఇచ్చాడు ఇచ్చువానికి ఇయ్యబడును – ఇది మారని దేవుని యొక్క నియమం)

 

 

3. సారెపతు విధవరాలు -కరువులో పోషింపబడింది.

(మొదటి రాజులు) 17:13,14,15

13.అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను-భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.

17:13 అద్భుతాలు చేసే నిజ దేవుని శక్తిని గురించి తెలుసుకునేందుకు ఆమెకు ఒక అవకాశం వచ్చింది. ఆమె నమ్మకం ఉంచి, దాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకొంది (వ 15). మనందరికి కూడా అలాంటి అవకాశాలు రావచ్చు. లూకా 6:38 చూడండి.

17:13 A 1 పేతురు 1:7; B ఆది 22:1-2; నిర్గమ 14:13; న్యాయాధి 7:5-7; 2 రాజులు 6:16; 2 దిన 20:17; సామెత 3:9; యెషయా 41:10, 13; మలాకీ 3:10; మత్తయి 6:33; 10:37; 19:21-22; 28:5; అపొ కా 27:24; C హీబ్రూ 11:17

14.భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని

17:14 A 2 రాజులు 3:16; 4:2-7; B మత్తయి 15:36-38; C 1 రాజులు 17:4; 2 రాజులు 4:42-44; 7:1; 9:6; మత్తయి 14:17-20

15.ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పినమాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.

17:15 A మత్తయి 15:28; మార్కు 12:43; హీబ్రూ 11:17; B ఆది 6:22; 12:4; 22:3; 2 దిన 20:20; యోహాను 11:40; రోమ్ 4:19-20; హీబ్రూ 11:7-8

(బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు పిండి – పాపం! ఎవరికని పెడ్తుంది ఆవిడ? ఏలీయాగారికి తలుపు తెరిచింది. నెలలు తరబడి పోషింపబడింది లేమి కలిమిగా మారింది)

4. రాహాబు – తాను, తన యింటివార్ని రక్షించుకొంది.

 (యెహొషువ) 2:12,13,14

12.నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి

2:12 A యెహో 2:18; B యాకోబు 2:13; C ఆది 24:3, 9; నిర్గమ 12:13; యెహో 2:13; 9:15, 18-20; 1 సమూ 20:14-17; 24:21-22; 30:15; 2 దిన 36:13; ఎస్తేరు 8:6; యిర్మీయా 12:16; యెహె 9:4-6; మార్కు 14:44; రోమ్ 1:31; 1 తిమోతి 5:8; 2 తిమోతి 1:16-18

13.నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించు నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.

14.అందుకు ఆ మనుష్యులు ఆమెతోనీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.

2:14 A మత్తయి 5:7; B ఆది 24:49; న్యాయాధి 1:24-25; సామెత 18:24; C సంఖ్యా 10:29-32; యెహో 6:17, 25; 1 సమూ 20:8; 2 సమూ 9:1; 1 రాజులు 20:39

 (వేగులవారిని చేర్చుకున్న రాహాబు – తన ఇంటివారినందరిని రక్షించుకుంది. దేవుని సేవకులను పిల్చి ఇంటికి ఆహ్వానిస్తే, వారు వాక్యం చెబుతారు. అందరూ రక్షణ పొందుతారు. సేవకులను పిల్చి, వాక్యం చెప్పించుకునే టైమెక్కడుంది మాకు అని అనకండి)

 

5. లూదియ-ఐరోపా ఖండానికి దీపమైంది.

 (అపొస్తలుల కార్యములు) 16:14,15

14.అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

16:14 దేవుడు ఏ ఆసియా రాష్ట్రంలో పౌలు ప్రవేశించకుండా చేశాడో ఆ ఆసియాలో లూదియ సొంత ఊరు తుయతైర ఉంది. ఒకవేళ లూదియ తుయతైరలోని యూదుల ద్వారా నిజ దేవుణ్ణి గురించి విని ఆయనను ఆరాధిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు దేవుడు క్రీస్తును గురించిన సందేశాన్ని ఆమె విని నమ్మేలా ఆమె హృదయాన్ని తెరిచాడు (లూకా 24:45 పోల్చి చూడండి). ప్రభువు తనమీద నమ్మకం పెట్టసాగిన ప్రతి ఒక్కరికీ ఇలా చేస్తాడు. ఆయనే గనుక మన హృదయాలను తెరవకపోతే అవి ఏ మాత్రం తెరుచుకోవు. చెరసాల తలుపులను తెరవడం ఎంత అద్భుతమో (వ 26; 5:19) మనుషుల హృదయాలను తెరవడం అంత అద్భుతం.

16:14 A యెషయా 50:5; లూకా 24:45; యోహాను 6:44-45; 1 కొరింతు 3:6-7; 2 కొరింతు 3:14-16; ఎఫెసు 1:17-18; ప్రకటన 3:20; B అపొ కా 11:21; 18:7; రోమ్ 9:16; 2 కొరింతు 4:4-6; ఫిలిప్పీ 2:13; ప్రకటన 3:7; C ప్రకటన 2:18-24; D కీర్తన 110:3; పరమగీతం 5:4; యోహాను 12:20; అపొ కా 8:27; 10:2; యాకోబు 1:16-17; ప్రకటన 1:11

15.ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

16:15 A అపొ కా 11:14; 16:33; B ఆది 19:3; లూకా 24:29; హీబ్రూ 13:2; C రోమ్ 16:23; 1 కొరింతు 1:13-16; 2 కొరింతు 5:14; 12:11; గలతీ 6:10; ఎఫెసు 1:1; ఫిలిప్పీ 1:7; ఫిలేమోను 17; 1 పేతురు 5:12; 2 యోహాను 10; 3 యోహాను 5, 8; D లూకా 9:4-5; 14:23; అపొ కా 8:12, 38; 18:8; E ఆది 18:4-5; 33:11; న్యాయాధి 19:19-21; 1 సమూ 28:23; 2 రాజులు 4:8; మత్తయి 10:41; లూకా 10:5-7

(లూదియ హృదయం తెరిచింది. పౌలు సీలలకు ఇంటి తలుపులూ తెరిచింది. అంతే – ఆమె ఐరోపా ఖండానికి తొలి ఆధ్యాత్మిక దీపమైంది. నీవొక్కడివే నీ యింటిలో ప్రభువును అంగీకరించావా? అయితే నీ ఇంటివారును దేవుని వెలుగులోకి వస్తారు – అపొ. 16:31)

* సేవకులు మీ ఇంటిలో అడుగుపెట్టడం మీకు ఆశీర్వాదకరం! వారితో సహవాసం చేయడం మరింత ఆశీర్వాదకరం! వారి యథార్థతలో పాలుపొందడం చెప్పలేనంత ఆశీర్వాదకరం!


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి

our youtube chanel click here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “దేవుని సేవకులు కొరకు గృహాలు తెరిచినవారు|telugu-messages-sermons-for-pastors|1”

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted