శ్రమ వస్తే – Sevakula Prasangaalu Telugu

Written by biblesamacharam.com

Published on:

శ్రమ వస్తే.

Sevakula Prasangaalu Telugu

మూలవాక్యము : క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి  మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

 (మొదటి పేతురు) 4:1

1.క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

4:1-2 మనల్ని పాపంనుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడు (2:24; 3:18). పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో బాధలనెదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఈ మనస్తత్వం ఉంటే అది మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక ఆయుధంలాగా ఉంటుంది. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఏకత్వాన్ని గుర్తించి, క్రీస్తులో తాము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించాలి. రోమ్ 6:5-13 చూడండి. క్రీస్తు బాధలను దృష్టిలో ఉంచుకుని చూస్తే పాపాల విషయంలో మనకెలాంటి జోక్యమూ ఎప్పుడూ ఉండకూడదు. మన కోరికలను నెరవేర్చుకోవడానికి కాక దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మనం జీవించాలి (రోమ్ 8:5, 12; 12:1-2; కొలస్సయి 1:9; 4:12; 1 తెస్స 4:3; హీబ్రూ 13:21).

4:1 A యెషయా 1:16; రోమ్ 6:2, 7, 11; 13:12-14; గలతీ 2:20; 5:24; ఎఫెసు 6:13; ఫిలిప్పీ 2:5; కొలస్సయి 3:3-5; హీబ్రూ 12:3; 1 పేతురు 3:18; B హీబ్రూ 4:10

1.శ్రమ వస్తే ఆశ్చర్యపడకూడదు.

 (మొదటి పేతురు) 4:12

12.ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

“ఆశ్చర్యపడకండి”– కష్టాలు హింసలు వస్తాయని క్రీస్తు, ఆయన రాయబారులు కూడా పదే పదే హెచ్చరించారు (2:20-21; 4:1; యోహాను 10:33; అపొ కా 14:22; రోమ్ 8:17; 2 తిమోతి 3:12).

2.) శ్రమ వస్తే సంతోషించాలి.

 (మొదటి పేతురు) 4:13

13.క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

“మహానందంతో ఉప్పొంగి”– మత్తయి 5:11-12; అపొ కా 5:3; రోమ్ 5:3; కొలస్సయి 1:24; యాకోబు 1:2. విశ్వాసులకు విషమ పరీక్షలు ఎదురైతే దేవుడు వారికి చెప్పేది ఇదే. వాటి పట్ల మన మనస్తత్వం చాలా ప్రాముఖ్యం. పరీక్షలూ బాధలూ అనుభవించేటప్పుడు సణుక్కోకూడదు. సోలిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. మన విషయంలో మనకు మేలు జరగడానికి ఏమి చెయ్యాలో దేవునికి బాగా తెలుసని దేవునిలోనే నమ్మకం పెట్టుకుని రోమ్ 8:28లో రాసి ఉన్నదాన్ని ఎరిగి సంతోషంగా ఉండాలి. అగ్నివంటి బాధలను భరించడం అంటే క్రీస్తు పడిన బాధల్లో పాలు పంచుకోవడమేనని గుర్తించండి (2 కొరింతు 2:5).

4:13 A రోమ్ 5:3; 8:17; 2 కొరింతు 1:7; 4:10; ఫిలిప్పీ 3:10; యాకోబు 1:2-3; B 2 తిమోతి 2:12; 1 పేతురు 1:5-8; 5:10; C యెషయా 35:10; మత్తయి 16:27; 25:23; లూకా 6:22-23; అపొ కా 5:41; 2 కొరింతు 4:17; 12:9-10; 1 పేతురు 5:1; ప్రకటన 1:9; D యెషయా 25:9; 51:11; మత్తయి 5:12; 25:21, 31, 34; అపొ కా 16:25; కొలస్సయి 1:24; 1 పేతురు 1:13; E మార్కు 8:38; లూకా 17:30; 2 తెస్స 1:7-10; ప్రకటన 1:7

 

3.) శ్రమ వస్తే దేవుని మహిమపరచాలి.

 (మొదటి పేతురు) 4:16

16.ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

4:16 “సిగ్గుపడకూడదు”– అపొ కా 5:41; హీబ్రూ 11:26 పోల్చి చూడండి. క్రీస్తు పేరును ధరించినందుచేత క్రైస్తవులెందుకు సిగ్గుపడాలి? మనం జీవిస్తున్న లోకం అలాంటిది (యోహాను 15:18-25; 16:1-4). లోకం తన ఇష్ట పూర్వకంగా చీకటిలో ఉంటూ, ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరిస్తూ ఉంది. (యోహాను 3:19-20).

4.) శ్రమ వస్తే ప్రార్థన చేయవలెను.

 (యాకోబు) 5:13

13.మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

“ప్రార్థన”– ప్రార్థనకు జవాబుగా దేవుడు మనల్ని ఆ కష్టాలనుంచి తొలగించనైనా తొలగిస్తాడు, లేక ఓపిగ్గా దాన్ని సహించే బలాన్నైనా ఇస్తాడు. అయితే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చెయ్యాలని యాకోబు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోరాదు (ఎఫెసు 6:18; 1 తెస్స 5:17).

5:13 A కీర్తన 50:15; ఎఫెసు 5:19; ప్రకటన 5:9-14; 19:1-6; B అపొ కా 16:24-25; 1 కొరింతు 14:26; హీబ్రూ 5:7; ప్రకటన 14:3; C హోషేయ 6:1; మత్తయి 26:30; 2 కొరింతు 12:7-10; కొలస్సయి 3:16-17; D న్యాయాధి 16:23-25; 1 దిన 16:9; 2 దిన 33:12-13; యోబు 33:26; కీర్తన 18:6; 91:15; 95:2; 105:2; 116:3-5; 118:5; 142:1-3; విలాప 3:55-56; దాని 5:4; యోనా 2:2, 7; మీకా 4:5; లూకా 22:44; 23:42; E ప్రకటన 7:10

 

5.) శ్రమ వస్తే అనుభవించుటకు నియమింపబడితిమని ఎరగాలి.

 (హెబ్రీయులకు) 3:4

4.ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.

6.) శ్రమ వస్తే విశ్వాసములో నిలవాలి.

 (హెబ్రీయులకు) 3:8

8.నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

7.) శ్రమ వస్తే అధైర్యపడకూడదు.

 (ఎఫెసీయులకు) 3:13

13.కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములైయున్నవి.

“క్రుంగిపోవద్దని”– పౌలు దేవుని నిజ సేవకుడే అయితే అతనికి కష్టాలెందుకని వారు అనుకోవచ్చు. లేక అతనికే కష్టాలు వస్తున్నాయి. కాబట్టి తమకు కూడా వస్తాయనుకోవచ్చు. ఏది ఏమైనా వారు నిరుత్సాహపడకూడదని పౌలు చెప్తున్నాడు. ఇక తన విషయమైతే క్రీస్తు కోసం బాధలు అనుభవించడంలో తనకు ఆనందం ఉంది – కొలస్సయి 1:24; 2 కొరింతు 12:10; రోమ్ 5:3.

8.) శ్రమ వస్తే ధైర్యము తెచ్చుకోవాలి.

 (యోహాను సువార్త) 16:33

33.నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

“ధైర్యంగా ఉండండి”– రెండు సంగతుల మూలంగా వారు ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. అంతిమ విజయం క్రీస్తుకూ, క్రీస్తులో వారికీ చెందుతుందని వారు తెలుసుకోగలరు. ఈ లోక బాధల స్థానంలో శాశ్వత మహిమ వారికి చేకూరుతుంది (2 కొరింతు 4:17).

 

9.) శ్రమ వస్తే మేలు అని తలచాలి

 (కీర్తనల గ్రంథము) 119:71

119:71 వ 65,75; ద్వితీ 8:2-5; హీబ్రూ 12:5-11. బాధలు అనుభవించడం మంచిదంటున్నాడు. మంచిది గానీ సుఖకరమైనది కాదు. దేవుని వాక్కులోని సత్యాన్ని, రమ్యతను చూచేలా మన కళ్ళు తెరిచేదీ, దానికి విధేయులమయ్యేలా చేసేదీ ఏదైనా సరే, మంచిదే. రచయిత కష్టాలు మనుషుల మూలంగా కలిగాయి గాని దేవుడు వాటిని అతని మేలుకే ఉపయోగించాడు (ఆది 50:20; రోమ్ 8:28 చూడండి). దేవుడు వ్యాధిలోనుంచి ఆరోగ్యాన్ని పేదరికంలోనుంచి ఐశ్వర్యాన్ని, బలహీనతలోనుంచి బలాన్ని తెస్తాడు. మనల్ని పరలోకానికి చేరువ చేసేది మనం మోయవలసిన సిలువే.

71.నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

10.) శ్రమ వస్తే ఆయన పక్షమైనదని ఎరగాలి.

 (ఫిలిప్పీయులకు) 1:30

30.క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

1:30 A అపొ కా 16:19-40; 1 తెస్స 2:2; B రోమ్ 8:35-37; ఎఫెసు 6:11-18; 2 తిమోతి 2:10-12; 4:7; హీబ్రూ 12:4; C యోహాను 16:33; 1 తిమోతి 6:12; హీబ్రూ 10:32-33; ప్రకటన 12:11; D 1 కొరింతు 4:9-14; 15:30-32; కొలస్సయి 1:29—2:1; 1 తెస్స 2:14-15; 3:2-4; ప్రకటన 2:10-11

Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu


ప్రశ్నలు – జవాబులు కొరకు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted