29వ కీర్తన
29 Psalms Explanation In Telugu
దావీదు రచించెను. అద్భుతంగా సృష్టిని సృష్టించిన సృష్టికర్తయైన దేవుని ప్రభావముగల నామాన్ని స్తుతించాలని మరియు దేవుని స్వరము ఎంత బలము, ప్రభావము గలదో గుర్తించి ఆ మహాదేవునిని ఆరాధించాలని దావీదు రాజు ఈ కీర్తనలో కోరుకుంటున్నాడు.
దేవుడు తన ప్రజలను… కీర్తన 29:11
దేవుడు తన ప్రజల యెడల ఎంత దయగలవాడో, తన ప్రజల యెడల ఆయన చేయు మేలులు ఎంత గొప్పవో చూచెదము.
- బైబిల్ చెప్పుచున్నది :
1.) మనము దేవుని ప్రజలము.
(కీర్తనల గ్రంథము) 100:3
3.యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
100:3 రచయిత లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడు తున్నాడు. యెహోవా ఒక చిన్న జాతికి చెందిన చిల్లర దేవుడు కాదు. ఆయన ఏకైక నిజ దేవుడు, అన్నిటినీ సృజించినవాడు. మనుషులంతా ఇది తెలుసుకోవాలని ఆయన కోరిక. ఎందుకంటే ఇది తెలియకుండా దేవునికి నిజమైన సేవ మనుషుల్లో ఉండదు. నిజమైన ఆనందం కూడా ఉండదు. లోకమంతా ఇది తెలుసుకున్నప్పుడైతే, అంతా ఆయన ప్రజలు, ఆయన గొర్రెలు అయినప్పుడైతే ఏమి ఆనందం, ఏమి స్తుతిగానాలు ఈ విశాల ప్రపంచంలో మారు మోగుతాయో! (98:3; యెషయా 11:9; 45:6; హబక్కూకు 2:14).
100:3 A ద్వితీ 4:35; కీర్తన 46:10; 79:13; 95:6-7; 119:73; యెహె 34:30-31; యోహాను 17:3; 1 కొరింతు 6:19-20; ఎఫెసు 2:10; 1 పేతురు 2:25; 4:19; 1 యోహాను 5:20; B ద్వితీ 4:39; 7:9; 1 సమూ 17:46-47; 1 రాజులు 18:36-39; 2 రాజులు 19:19; యోబు 10:8-13; కీర్తన 74:1-2; 78:52; 139:13-24; 149:2; యోహాను 10:26-28; గలతీ 4:8-9; C యెషయా 40:9-11; 63:11, 19; యిర్మీయా 10:10; యెహె 34:11; యోహాను 10:14-16; అపొ కా 17:23-24; 20:28-29; D యోబు 10:3; కీర్తన 95:3; ప్రసంగి 12:1; 2 కొరింతు 4:6; 1 పేతురు 2:9; 5:2-4; E కీర్తన 12:4
2. మనము దేవుని సొత్తయిన ప్రజలము.
(మొదటి పేతురు) 2:9
9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
2:9 “ఎన్నికైన”– ఎఫెసు 1:4, 11; యోహాను 15:16.
3.) దేవునిని అంగీకరించువారు తన ప్రజలు.
(యోహాను సువార్త) 1:12
12.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
1:12 బైబిలంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుషులు సహజంగా దేవుని పిల్లలు కారు. వారు ఆయన పిల్లలుగా కావలసి ఉంది. 3:6; 8:44; ఎఫెసు 2:1-2; మొ।। పోల్చి చూడండి. స్వభావ రీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడి, దేవునికి వేరైన జీవులు (యిర్మీయా 17:9; ఆది 8:21; యెషయా 24:5; 59:1-2; రోమ్ 3:9-19). దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, వాక్కు, రక్షకుడు, ముక్తిదాత అయిన యేసుప్రభువును స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు. ఆయన్ను స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం. “నమ్మకం” ఈ శుభవార్తలో అతి ప్రాముఖ్యమైన పదాల్లో ఒకటి. “నమ్మకం అని తర్జుమా చేసిన గ్రీకు పదం రకరకాల ప్రయోగాలు ఈ శుభవార్తలో సుమారు 100 సార్లు కనిపిస్తాయి. బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు ఈ మాట కన్పించదు. మనం ఆయన్ను నమ్మకం ద్వారానే స్వీకరిస్తాం, నమ్మకం ద్వారానే దేవుని పిల్లలమౌతాం (3:15-16, 36; 5:24; 6:47; అపొ కా 16:31; రోమ్ 10:9; గలతీ 3:26). ఆయన పేరు మీద నమ్మకం ఉంచడమంటే ఆయన పై నమ్మకం ఉంచడమే, బైబిల్లో వెల్లడి అయిన ఆయన గుణశీలాలపై, లక్షణాలపై నమ్మకం ఉంచడమే.
4.) సొత్తుగా చేసుకొనుటకు.
(తీతుకు) 2:14
14.ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
“తన సొంత ప్రత్యేక ప్రజగా”– యోహాను 6:37; 17:6; 1 కొరింతు 6:19-20; 1 పేతురు 2:9-10. నిర్గమ 19:5 పోల్చి చూడండి.
5.) గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత.
(మొదటి పేతురు) 1:19
19.అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
1:19 మనల్ని విమోచించి తనవారిగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన వెల ఇది (మత్తయి 20:28; 26:28; అపొ కా 20:28; రోమ్ 3:24-25). ఇది మాటకందనంత ప్రశస్తమైనది.
- తన ప్రజల యెడల దేవుని మేలులు.
1.) దేవుడు తన ప్రజలను చేరదీయును ఎన్నడు విడువని దేవుడు.
(కీర్తనల గ్రంథము) 27:10
10.నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.
27:10 68:5; యెషయా 49:15; హోషేయ 14:3. తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన విశ్వాసులకు యెహోవాయే తల్లిగా తండ్రిగా ఉంటాడు. మానవ మాత్రుడెవరికీ సాధ్యపడని విధంగా ఆయన వారిని ప్రేమించి పోషిస్తాడు.
2.) దేవుడు తన ప్రజలను కరుణించును.
(మొదటి సమూయేలు) 12:22
22.యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
12:22 “పేరు”– నాటికీ నేటికీ దేవుని పేరు ప్రతిష్ఠలు ఆయన ప్రజలతో ముడిపడి ఉన్నాయి (సంఖ్యా 14:13-16; కీర్తన 23:3; 25:11; యెషయా 48:9; యిర్మీయా 14:21; యెహె 20:9, 23).
(సంఖ్యాకాండము) 6:25
25.యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
3.) దేవుడు తన ప్రజలకు సమాధానమిచ్చును.
(కీర్తనల గ్రంథము) 29:11
11.యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
29:11 గాలివానలో ప్రశాంతి, ఎలాంటి కల్లోలం చెలరేగినా ప్రశాంతి – ఇదే తన ప్రజల విషయంలో దేవుని సంకల్పం. శాంతి సమాధానాలు దేవుడు ఉచితంగా ఇచ్చినవే (సంఖ్యా 6:26; యోహాను 14:27; 16:33). అన్నిటి మీదా దేవుని రాచరికాన్ని గుర్తించేవారికి ఇది కలుగుతుంది (10 వ; ఫిలిప్పీ 4:6-7).
(సంఖ్యాకాండము) 6:26
26.యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
4.) దేవుడు తన ప్రజలకు బలము అనుగ్రహించును.
(కీర్తనల గ్రంథము) 29:11
11.యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
29:11 గాలివానలో ప్రశాంతి, ఎలాంటి కల్లోలం చెలరేగినా ప్రశాంతి – ఇదే తన ప్రజల విషయంలో దేవుని సంకల్పం. శాంతి సమాధానాలు దేవుడు ఉచితంగా ఇచ్చినవే (సంఖ్యా 6:26; యోహాను 14:27; 16:33). అన్నిటి మీదా దేవుని రాచరికాన్ని గుర్తించేవారికి ఇది కలుగుతుంది (10 వ; ఫిలిప్పీ 4:6-7).
- నూతన బలము పొందుదురు.
(యెషయా గ్రంథము) 40:31
31.యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
40:31 ఈ పతిత లోకంలో పవిత్రంగా నడుచుకోవాలంటే, జీవిత యాత్ర ఆనందంగా ముగించాలంటే, దేవునికిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యం కావాలంటే మన బలం చాలదు. మన అల్ప బలానికి మారుగా దేవుని అమిత బలాన్ని పొందడం నేర్చుకోవాలి (వ 28,29. ఎఫెసు 1:18-21 చూడండి – విశ్వాసులకు క్రీస్తులో దొరకగల బలం ఎలాంటిదో తెలుస్తుంది). విశ్వాసంతో దేవునివైపు చూస్తేనే ఇది దొరుకుతుంది. మనలో మనకోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మత్తయి 11:28-30 యువకులైనా, వృద్ధులైనా అలసిపోయినవారికి మరి కొన్ని ఆదరణ వాక్కులున్నాయి.
5.) దేవుడు తన ప్రజలకు తోడుండి నడిపించును.
(కీర్తనల గ్రంథము) 78:52
52.అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను
6.) దేవుడు తన ప్రజలకు కిరీటముగా వుండును.
(యెషయా గ్రంథము) 28:5
5.ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.
నోట్ : దేవుని బిడ్డా! నీవు ఎంత ధన్యుడవో గుర్తెరిగితివా!
29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms 29 Psalms
ప్రసంగ శాస్త్రం కొరకు .. click here