నీనెవెనా లేక తర్షీషునా – Bible Upamanalu Telugu

Written by biblesamacharam.com

Published on:

నీనెవెనా లేక తర్షీషునా

Bible Upamanalu Telugu

 దేవుని చిత్తమునకు అవిధేయులముగా జీవించుట అనేది మనకే కాదు, మనతో నున్న వారికీ క్షేమం కాదు. నీవొక కుటుంబ యజమానివైతే, నీ కుటుంబం తక్షణం పతనం వైపుకు పరుగు పెడుతుంది. నీవొక సంఘకాపరియైతే, సంఘము తన త్రోవ తప్పిపోతుంది. నీవొక ఇల్లాలువైతే, నీ పిల్లలపై ఆ ప్రభావం తరతరాలుగా ఉండిపోతుంది. 

 దేవుడు యోనాను నీనెవె వెళ్ళి, దానికి తీర్పు రాబోతుందని ప్రకటించమని చెప్పాడు. ఐతే యోనా ఏం చేసాడు? నీనెవె వెళ్ళాడా? లేదు! తర్షీషుకి బయలుదేరాడు. యొప్పేకు పోయి కేవు యిచ్చి తర్షీషు పోయే ఓడ ఎక్కాడు. యెప్పే నుంచి నీనెవె కేవలం 600 మెళ్ల దూరము మాత్రమే ఉంటుంది. మరి తర్షీషు ఐతే, 1800 మైళ్ల దూరము ఉంటుంది. అంటే, దేవుడు వెళ్లుము అని చెప్పిన నీనెవెనే దగ్గరన్నమాట. దేవుడు యోనాకు చెప్పింది చాలా సుళువు. అంత రిస్క్ పడాల్సింది ఏమి లేదు. ఆ మాటకొస్తే, యోనా ఎన్నుకున్న తర్షీషు ప్రయాణమే చాలా కష్టమైనది. బహు దూరమైనది. 

 చాలాసార్లు దేవుని చిత్తం మనం అందుకునే స్థితిలో ఉన్ననూ, మనస్సులో మరొకటి ఉంచుకొని వేరొక దాని కొరకై బహు ప్రయాసపడతాం. ఎందుకంటే, అది మనకిష్టమైనది కాబట్టి. మన యిష్టాలూ ఎప్పుడూ దేవుని ఇష్టాలుగా మారవద్దు. దేవుని ఇష్టమే మన యిష్టముగా మారిపోవాలి. 

 కొన్నిసార్లు దేవుని యిష్టము కురూపిగానూ, చేదుగానూ ఉండవచ్చు. అయిననూ మనం దానిని అనుసరించాలి. అది మనకు క్షేమమూ మరియు లాభము. 

 యోనా సొంత ఆలోచనకు చోటిచ్చాడు. సొంత తీర్మానం యోనాను మరియొక దిశవైపుకు మళ్లించింది. దేవుడు సంకల్పించిన స్థలమునకు యోనా దూరమయ్యాడు. దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో లేని “తర్షీషు” యోనాకు ముఖ్యాంశమై పోయింది. అది అతనికి సొంత అజెండా అయిపోయింది. 

 ప్రియులారా, మనం మన జీవితములో ఎన్నిమారులు “తర్షీషు” కి వెళ్లి నష్టపోలేదు!? అప్పుడు మనం తరీషే తగినది అనుకున్నాం. తీరా తప్పు జరిగి తల్లడిల్లిపోయినప్పుడు, “అయ్యో, నేను ఈ మార్గములో నడువకపోతే ఎంత బావుండేది! ఈ నిర్ణయం నేను తీసుకోకుండా ఉంటే యిలా జరిగియుండేది కాదు కదా!” అంటూ పశ్చాత్తాపపడుతూ ఉంటాం. 

యోనా జీవితములో జరిగింది అదే! 

 ప్రియ దేవుని బిడ్డా… నీ వివాహం విషయంలో “నీనెవె” ప్రాముఖ్యత సంతరించుకున్నదా? “తర్షీషు” ప్రధానమైపోయిందా? అలాగే నీ స్టడీ? 

 నీ ఉద్యోగం? నీవు కట్టే ఇల్లూ? నీవు కాపురం ఉంటున్న ప్రాంతం? నీ ఆలోచనలూ? నీ తీర్మానాలూ… తర్షీషుకి సంబంధించి ఉన్నాయా? లేక నీనెవెకి చెందినవిగా ఉన్నాయా? 

 నీ నిర్ణయం నీ భవిష్యత్తుకి బంగారు బాటయైనా కావచ్చు, లేదా నీ నాశనానికి హేతువైనా కావచ్చు! నిర్ణయం నీదే, నీ చేతిలోనే ఉంది అంతా కూడా. 

 యోనా ఆ విధంగా తన ‘సొంత నిర్ణయంపై ఆధారపడి నందున, తనకు మాత్రమే కాదు, ఓడలో ఉన్నవారందరి మీదకి ప్రమాదం ముంచుకు వచ్చింది. సముద్రం ఉప్పొంగింది. తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అత్యవసరమైన సరుకులు అన్నీను సముద్రం పాలైపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే అంతా వృథా ప్రయాసే అయింది. ఎందుకనీ? అసలు కిటుకు వాళ్లలో లేదు. అడుగు భాగములో ఆదమరచి నిద్రబోతున్న మన “యోనా” లో ఉంది. 

 లాబాను ఒకమారు తన అల్లుడైన యాకోబుతో – “నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను” అంటూ చెప్తాడు. అవును, ఒకరిని బట్టి మరొకరికి ఆశీర్వాదం వస్తే… ఒకరిని బట్టి మరొకరికి నాశనం రాదా? తప్పక వస్తుంది. ఓడలోని వారికి అదే జరిగింది. యోనాను “బట్టి” ఓడలోని ప్రయాణీకులందరికీ కీడు, నష్టం వాటిల్లింది. 

 ఒక మనుష్యుడు తన ద్వారా ఇతరులను ప్రభావితులుగా చేస్తాడు. అది మంచిదే కావచ్చు. చెడుకి సంబంధించిందే కావచ్చు. ప్రభావితం అనేది తప్పనిసరి! 

 యోనా దేవుడు చెప్పినప్పుడే, విధేయుడై యుంటే ఎంత బావుండేది! యీ నష్టాలన్నీ జరక్కుండా మానేవి. జరిగిన ప్రమాదమును అంచనా వేస్తే, నేటి మన లెక్కల్లో ఎన్నివేల డాలర్ల ఆస్తి నష్టం జరిగియుంటుంది? ఓడను తేలిక చేయటానికి అందులోని వస్తువులన్ని సముద్రంలో విసిరేసారట! 

 అమెరికా దేశములో దేవుని చేత బహు బలముగా వాడబడిన సేవకుడు ఒకడు కలడు. అతనిపేరు – లెస్టర్ సోమరాల్. ఒక దినమందు అతడు ప్రార్థనలో ఉండగా – “నీవు బయలుదేరి ఫిలిప్పైన్స్ దేశమునకు వెళ్లుము” అంటూ స్వరం వినిపించింది. వెంటనే తను సమస్తమును చక్కపెట్టుకొని, ఎంతో ప్రయాసపడి స్థాపించిన పరిచర్యను వదలి ఫిలిప్పైన్స్ దేశమునకు బయలుదేరాడు. అచ్చట ఎన్నో నెలలు ప్రయాసపడినను ఫలితం శూన్యము. 

 ఒక ఉదయకాలం రేడియో వినుచుండగా ఒక ప్రకటన విన్నాడు. దురాత్మ పట్టిన ఒక స్త్రీ కేకలను రేడియోలో ప్రసారం చేయటం గమనించాడు. రెండు దురాత్మలు నల్లని రూపంలో కనబడి ఆమెను హింసిస్తూన్నాయట. అపవిత్రాత్మ దాడిచేసినప్పుడు భయంకరముగా కేకలు వేయుటను రేడియో ద్వారా వినిపించారు. 

 “ఎవరైనా ఈమెను కాపాడగలరా? ఈ దురాత్మలు వెళ్లగొట్టగలరా?” అంటూ మనవి చేసారు. 

 తక్షణము లెస్టర్ సోమరాల్ స్పందించాడు. దేవుడు నన్ను నడిపించు చున్నాడని గ్రహించి ఆమె కోసం వెళ్లి ప్రార్థించగా, అపవిత్రాత్మలు ఆమెను విడిచి వెళ్లిపోయాయి. 

 ఫిలిప్పైన్స్ దేశపు అధ్యక్షుడు లెస్టర్ సోమరాల్ని ఆహ్వానించి అభినందించాడు. పరిచర్యకు మూడు ఎకరాల స్థలము కూడా ఇచ్చాడు. అందులో పెద్ద మందిరమును కట్టి పరిచర్య జరిగించండి అని చెప్పాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత మహాద్భుతం!! కొన్ని దినములలోనే మూడు లక్షల మంది రక్షణ పొందారు. 

 లెస్టర్ సోమరాల్ మూడు లక్షల మందిని దేవుని కోసం గెలుచు కున్నాడు. అదెలా జరిగింది? దేవుడు చెప్పిన నీనెవెకు అతడు వెళ్లాడు. 

 ఒక సేవకుడు దేవునికి విధేయుడు అగుట మూలాన ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు! ఐతే, మరొక సేవకుడు తన సొంత మార్గమును వదలకుండ ఉన్నందువలన ఎంత మంది ప్రమాదపు అంచులకు చేరిపోయారు?! ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బట్టి ఆశీర్వాదమా? లేక శాపమా? 

 నీనెవె నిన్ను పిలుస్తోంది! రక్షణ వార్త తెమ్మంటోంది! తర్షీషులో పనేమి లేదు గనుక నీ చేరువలో నున్న నీనెవె నీకు కేకపెడ్తుంది! 

నిర్ణయించుకో – నీనెవెనా? లేక తర్షీషునా?? 

 

 

 

Bible Upamanalu Telugu Bible Upamanalu Telugu Bible Upamanalu Telugu Bible Upamanalu Telugu Bible Upamanalu TeluguBible Upamanalu Telugu Bible Upamanalu Telugu Bible Upamanalu Telugu Bible Upamanalu Telugu


బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted