ఏమని ప్రార్థించవలెను ?
What should be prayed for Telugu
1.) ఆశీర్వదించమని ప్రార్థించవలెను.
(ఆదికాండము) 32:26
26.ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
32:26 “దీవిస్తేనే”– తాను పట్టుకుని ఉన్నదెవరినో చివరికి యాకోబు గుర్తించినట్టున్నాడు. యాకోబుకు ఇప్పుడు దీవెనలు కలగాలంటే తనను తాను (తన స్వభావాన్ని) గుర్తించి తానేమై ఉన్నాడో ఒప్పుకోవాలి (25:26; 27:36). “పేరు” అంటే అతని స్వభావం, గుణాలు.
2.) నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను.
(కీర్తనల గ్రంథము) 119:18
18.నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.
119:18 ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో ఉన్నా దేవుడు మన మనోనేత్రాలు తెరిచేటంతవరకు వాటిని మనం చూడలేము. ఇక్కడ రచయిత ప్రార్థించినట్టు మనమూ ప్రార్థించడం మంచిది. లూకా 24:45; ఎఫెసు 1:17-18 చూడండి.
119:18 A యెషయా 29:18; 32:3; 35:5; మత్తయి 13:13; అపొ కా 26:18; 2 కొరింతు 4:4-6; ఎఫెసు 1:17-18; ప్రకటన 3:18; B కీర్తన 119:96; మత్తయి 16:17; యోహాను 9:39; 2 కొరింతు 3:13-18; C హీబ్రూ 8:5; 10:1; D యెషయా 29:10-12; హోషేయ 8:12
3.) జ్ఞానము దయచేయమని ప్రార్థించవలెను.
(యాకోబు) 1:5
5.మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
1:5 మనం ఎదుర్కొనే విషమ పరీక్షలు, మన నమ్మకానికి శోధనలు కొన్ని సార్లు మనల్ని తికమకపెట్టి అయోమయ స్థితిలో పడవేస్తుంటాయి. మన స్వంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో, వాటిని మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేము. పరీక్షలనూ జీవితంలోని వివిధ పరిస్థితులనూ ఎలా ఎదుర్కోవాలో తెలిసేందుకు దేవునినుంచి జ్ఞానం మనకు అవసరం. దానికోసం దేవుణ్ణి అడుగుదాం. దాన్ని మనకు, ఇతరులకు కూడా ఇమ్మని వేడుకుందాం. దాన్ని ఇవ్వడం ఆయనకెంతో ఆనందం – కొలస్సయి 1:9; 2:3; ఎఫెసు 1:17; 1 కొరింతు 1:31; 2:6-10; దాని 2:20-21; సామెత 1:20; 2:6; 8:1; కీర్తన 51:6; 111:10. ఈ జ్ఞానాన్ని యాకోబు 3:17లో వర్ణిస్తున్నాడు.
4.) స్వస్థపరచమని ప్రార్థించవలెను.
(యాకోబు) 5:14,15
14.మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
5:14 మనుషులందరికీ, క్రీస్తులో నమ్మకం ఉంచినవారికి కూడా, జబ్బు చేయడం సహజమే. మనకు జబ్బు చేసినప్పుడు ఏమి చెయ్యాలో యాకోబు చెప్తున్నాడు. తన ప్రజల వ్యాధుల నివారణ కోసం దేవుడు చేసిన ఒక సదుపాయం ఇది. విశ్వాసులు ఎంత కొద్దిమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. బైబిలును నమ్మే సంఘాలన్నిటిలోనూ యాకోబు ఇక్కడ చెప్తున్నదాన్ని వాడుకగా పాటించాలి.
“ప్రభువు పేర”– ప్రతి ఒక్కరూ ఎవరికైనా వ్యాధి నివారణ కలిగించేది తమ శక్తి గానీ తమ మాటల్లోని శక్తి గానీ నూనెలో ఉన్న శక్తి గానీ కాదని గుర్తించాలి. జబ్బు నయం చేసేవాడు ప్రభువే. అది ఆయన పేర్లలో ఒకటి – నిర్గమ 15:26.
15.విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును.
5:15 తన సేవకులు జబ్బు పడితే దేవుడు ఎల్లప్పుడూ వెంటనే వారిని నయం చేస్తాడనుకునేందుకు వీలు లేదన్నది స్పష్టం (ఫిలిప్పీ 2:26-27; 1 తిమోతి 5:23; 2 తిమోతి 4:20). అలాంటి సందర్భాల్లో వారికి వెంటనే నయం కావాలని నమ్మకంతో ప్రార్థించడం సాధ్యం కాదు. ఎవరైనా సంఘం పెద్దలను పిలిపించుకుంటే, దేవుడు అతణ్ణి లేక ఆమెను వెంటనే బాగు చేయదలచుకుంటే, ఆ వ్యక్తికి తిరిగి ఆరోగ్యం చేకూరుతుందని ఆ పెద్దలలో ఒకరికి లేక ఎక్కువమందికి నమ్మకాన్ని ఇస్తాడు.
“పాపాలు చేసివుంటే”– కొందరి విషయంలో (అందరి విషయంలో కాదు) ఆ రోగి చేసిన పాపాలకు ఫలితంగా ఆ వ్యాధి రావచ్చునని యాకోబు చెప్తున్నట్టుంది. 1 కొరింతు 11:30 పోల్చి చూడండి. కొన్ని రకాలైన పాపాలకు ఈ బలహీనతలూ వ్యాధులూ దేవుడు పంపించే తీర్పు అని అర్థం చేసుకోవచ్చు.
5.) చెడ్డవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుమని ప్రార్థించవలెను.
(కీర్తనల గ్రంథము) 119:37
37.వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
6.) నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని ప్రార్థించవలెను –
(కీర్తనల గ్రంథము) 119:37
37.వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
119:37 రచయిత తన చూపులను తానే మరల్చుకోలేడా? కండ్ల కోరికలెంత బలమైనవో అతనికి తెలుసునన్నమాట (1 యోహాను 2:16-17). దేవుడొక్కడే ఆ శక్తిని బద్దలు కొట్టగలడని కూడా తెలుసు. రచయిత తన బలహీనతను సూచిస్తూ, నూతన జీవం, బలం తనకు అవసరమని ఒప్పుకుంటున్నాడు.
7.) పాపమునుండి తప్పించమని ప్రార్థించవలెను.
(కీర్తనల గ్రంథము) 119:13
13.నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.
What should be prayed for Telugu What should be prayed for Telugu What should be prayed for Telugu What should be prayed for Telugu What should be prayed for Telugu What should be prayed for Telugu
బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here