మిస్సింగ్ డే | Nasa Found Joshuas Missing Day In Telugu 1

Written by biblesamacharam.com

Published on:

     మిస్సింగ్ డే ?

Nasa Found Joshuas Missing Day In Telugu

     అమెరికా దేశంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దదైనది. దీనిని “నాసా” (NASA) అని పిలుస్తారు. అనగా National Aeronautics and space Adminis- tration అన్నమాట. నాసా స్పేస్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్గా పని చేస్తున్న గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు హెరాల్డ్ హిల్ (Herald Hill) గారు తన అధ్యక్షతన కొంతమంది శాస్త్రవేత్తల బృందంతో అంతరిక్షాన్ని పరిశీలన చేయటమే ఆయనపని. అమెరికా దేశంలోని మేరీల్యాండ్లోని పరిశోధన కేంద్రంలో అనేక సూపర్ పవర్ కంప్యూటర్ల ద్వారా పరిశోధనలు సాగించి ఒక అద్భుతమైన విషయాన్ని వారు ఆవిష్కరించారు. 

రాబోయే 100 మరియు 1000 సంవత్సరాలలో సూర్య చంద్ర నక్షత్రాల కదలికలూ మరియు గ్రహాలూ వాటి కదలికలూ, వాటి వాటి స్థాన చలనాలను అంచనా వేయడమే వాళ్ళ పరిశోధన. రాబోయే భవిష్యత్తులో ఆకాశ నక్షత్ర స్థానాలను అంచనా వేయడం చాలా కీలకమైన అంశం. ఈ కీలకమైన అంచనాల ఆధారంగానే కొన్ని వందల మానవ నిర్మిత శాటిలైట్స్ వాటి యొక్క నిర్ధిష్టమైన కక్ష్యలలో అంతరిక్షమందు పనిచేస్తుంటాయి. Nasa Found Joshuas Missing Day In Telugu

ఈ శాటిలైట్స్ సెకండ్లు గాని, మిల్లీ సెకండ్లుగాని తేడా లేకుండా ఖచ్చితంగా నిర్ధిష్టంగా వాటి వాటి కక్ష్యలలో తిరుగుతుంటాయి. అలా లేకపోతే అంతరిక్షంలో అవి గ్రహాలను ఢీకొనే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో గ్రహాల కదలికలూ – వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు. గడచిన కొన్నివేల సంవత్సరాలలో గ్రహాలు ఏ దినమున, ఏ స్థానములో ఉండినవో ఖచ్చితంగా లెక్కగట్టగలిగే శక్తివంతమైన కంప్యూటర్లు నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నాయి. తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు గడుతున్న సమయంలో ఒక “ప్రత్యేకమైన దినము” పై రెడ్ సిగ్నల్ కనిపించింది. అంటే, వారి లెక్కల ఆధారంగా గడచిన సంవత్సరాలలోని “ప్రతీ దినము” గ్రీన్ లైట్ను చూపించిన వారి కంప్యూటర్లు ఒక “ప్రత్యేకమైన దినము” దగ్గరకు రావడంతో రెడ్ మార్కు చూపించాయన్నమాట! 

ఒకటికి రెండుసార్లు వారు ఈ సంగతిని పరిశీలించి చూచినప్పటికీ ఈ మిష్టరీ యొక్క అంతు చిక్కలేదు. కాలగమనంలో 

ఒక దినము నమోదు కాకుండా పోయింది – ఇదెలా జరిగింది? ఒక దినము ఎటు పోయినట్టు? అంతటితో మిస్ అయిపోయిన ఆ దినము యొక్క అంతు తేల్చాలని శాస్త్రవేత్తల బృందం పనికి పూనుకుంది. ఈ తర్జన భర్జనలో ఆ శాస్త్రజ్ఞుల బృందంలో ఒక క్రైస్తవ సైంటిస్టుకి ఒక ఆలోచన తట్టింది. అతడు బైబిలు బాగుగా చదివినవాడు. ఇంచుమించు ఒకనాడెల్ల సూర్యుడు అస్తమించలేదనే విషయము అతనికి గుర్తుకు వచ్చింది – అది యెహోషువ గ్రంథంలో రాయబడిన సంగతిని కూడా అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. Nasa Found Joshuas Missing Day In Telugu

ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అమోరీయులతో యుద్ధం చేస్తున్న దినాలవి. అమోరీయులు రాజనీతి తెలియని ప్రజలు. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం విరమించుకొని ఎవరి గుడారమునకు వారు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి – అది రాజనీతి. మూర్ఖులూ కఠిన స్వభావులైన ఈ అమోరీయులకు అలాంటి నీతి ఏమి అక్కరలేదు. గెరిల్లా యుద్ధాలు చేస్తారు. దొంగ దెబ్బ తీయడం వారికలవాటు. దానిని గమనించిన యెహోషువ దేవునికి ప్రార్థించాడు. యెహోషువ 10వ అధ్యాయం 12,13వచనాలలో – “యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు – సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి యున్నది గదా. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించుమించు ఒకనాడెల్ల అస్తమింప త్వరపడలేదు” అని రాయబడి వున్నది. 

పైన మనం చెప్పుకున్న క్రిష్టియన్ సైంటిస్ట్ యిదే విషయాన్ని హెరాల్డ్ హిల్ అను తమ నాయకునితోను తక్కిన శాస్త్రవేత్తల బృందంతోను పంచుకున్నాడు. చరిత్రలో మిస్సైన దినానికీ యెహోషువ గ్రంథంలో చెప్పబడిన సూర్యుడు ఒక దినమంతయు ఆగిపోయిన సంగతికీ ఏమైన సంబంధం గలదేమోనని ఆలోచించమని చెప్పాడు. అదే క్రమంలో వారంతా పరిశోధనకు పూనుకోవడం జరిగింది. Nasa Found Joshuas Missing Day In Telugu

కాలం తన పరుగులో ఒక దినం ఆగిపోయిందనీ, సూర్యుడు దేవుని మాటకు లోబడి ఒక రోజంతా అస్తమింప త్వరపడలేదనీ – ఈ సత్యమునే కంప్యూటర్లు అన్నీ సమర్ధించాయి. ఆశ్చర్యచకితులైన నాసా శాస్త్రజ్ఞులు మరింత పరిశోధనలు చేయగా – “ఆగిపోయిన సమయం” కేవలం 23 గంటల 20 నిమిషాలు మాత్రమేనని తేలింది. మళ్ళీ వాళ్ళంతా ఆశ్చర్యంలో పడ్డారు. ఇదేమిటి? రోజుకు 24 గంటలు సమయం కదా! అలాగైతే 23 గంటల 20 నిమిషాలను మాత్రమే కంప్యూటర్లు చూపిస్తున్నాయెందుకు అంటూ ఆందోళనలో పడిపోయారు. 

వారు మళ్లీ బైబిలును పరిశోధన చేయటం జరిగింది. బైబిలులో వారి దృష్టికి వచ్చిన మాట వారికి ఊరటనిచ్చింది. “ఇంచుమించు ఒకనాడెల్ల” అనే మాట దగ్గర వారు ఆలోచనలో పడిపోయారు. ఇంచుమించు అంటే “ఖచ్చితంగా” కాదు అని మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి 23 గంటల 20 నిమిషాలను గూర్చి – బైబిల్లో “ఇంచుమించు ఒకనాడెల్ల” అనే పదముతో సూచించడం జరిగిందని వారు అర్థం చేసుకున్నారు. 23 గంటల 20 నిమిషాలు ఒక రోజు అవ్వదు కదా! ఇంక 40 నిమిషాలు దానికి కలిపినచో ఒక రోజు (దినము) అవుతుంది. మరి, ఈ 40 నిమిషాలను గూర్చిన మిస్సింగ్ ఎక్కడ? అన్న సమస్య వారికి ఏర్పడింది. ఈ 40 నిమిషాల తేడా సరిచేయబడనిచో ఆకాశంలో యాక్సిడెంట్లు తప్పవు. శాస్త్రవేత్తలు మరల బైబిలును వెదికారు. మతిపోయే మరొక సత్యం రెండవ రాజులు గ్రంథంలో వారు కనుగొన్నారు. వారి పరిశోధన ఇలా సాగింది… 

హిజ్కియా అనే రాజుగారికి మరణకరమైన జబ్బు వచ్చింది. ప్రవక్త అయిన యెషయా అతని గూర్చి ప్రార్థించాడు. “అతడు చనిపోడు. 15 సంవత్సరముల ఆయుష్షు పొడగింపబడుతుంది. 3వ దినమున దేవుని మందిరానికి ఎక్కిపోతాడు” అని దేవుడతనికి సెలవిచ్చాడు. అప్పుడు హిజ్కియా – “నేను బాగయ్యి, మూడవ దినమున యెహోవా మందిరానికి ఎక్కిపోతాను అనటానికి సూచన ఏమిటి?” అని అడిగాడు. అందుకు దైవజనుడైన యెషయా ప్రవక్త – “నీడ పదిమెట్లు ముందుకు నడిచెను గదా? అది పదిమెట్లు వెనుకకు నడిచిన యెడల అవునా?” అన్నాడు. అందుకు హిజ్కియా యిట్లన్నాడు – “నీడ పదిమెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడచిన చాలును”. Nasa Found Joshuas Missing Day In Telugu

అప్పుడు ప్రవక్తయగు యెషయా దేవునికి ప్రార్థన చేశాడు ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను (2రాజులు 20:1 – 11 మీరు చదవండి) 

ఆ రోజులలో గడియారాలు లేవు. వారు కాలమును నీడ ఆధారంగా కొలిచేవారు. అందుకు అనుగుణంగా వారు ఆహాజు ఎండ గడియారమును తయారుచేసుకున్నారు. దానికి మెట్లు (గడులు) ఉన్నాయి. ఒక్కొక్క మెట్టుకి – “ఇంత టైమ్” అని వారు ఫిక్స్ చేసుకున్నారు. ఎండ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు వెళ్తూ వుంటే వారు సమయం ఎంతైనదో సులువుగా తెలుసుకునేవారు. గడియారపు పలకమీద గడులను శాస్త్రవేత్తల బృందం డిగ్రీలతో సహా లెక్క గడితే 40 నిమిషాల సమయం వారికి అత్యద్భుతంగా వారి కన్నుల ముందు ఆవిష్కరింపబడింది. అంటే 10 గడుల నీడ యొక్క సమయము ఖచ్చితంగా 40 నిమిషాలు అన్నమాట! యెహోషువ గ్రంథంలోని 23 గంటల 20 నిమిషాలు మరియు ఆహాజు ఎండ గడియారపు పలకమీద 10 గడులకు సంబంధించిన 40 నిమిషాలూ – ఈ రెండు కలిపితే తేలిన లెక్క – వచ్చిన లెక్క – 24 గంటలు. ఎంత ఆశ్చర్యం! Nasa Found Joshuas Missing Day In Telugu

ఆ విధంగా గడచిన చరిత్రలో మిస్సైన దినము నాసా శాస్త్రజ్ఞులకు దొరికింది. ఆ మిస్టరీని ఛేదించి హెరాల్డ్ హిల్గారు ప్రపంచానికి వెల్లడించడం జరిగింది. దేవుని మాట ఎంత గొప్పదో – దేవుని వాక్యము ఎంత సత్యమో ఇందును బట్టి మనకు అర్థమవుతుంది. విశ్వాన్ని శాసించగల్గిన దేవుని వాక్కు యొక్క మహాత్మ్యమును ఈ ప్రపంచము ఎప్పుడు గ్రహిస్తుందో!! 


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి click చేయండి.. click here 

Leave a comment