యేసుక్రీస్తు రెండవ రాకడ  నిజంగా వస్తుందా |Bible Question Answers Telugu 2

Written by biblesamacharam.com

Published on:

యేసుక్రీస్తు రెండవ రాకడ 

నిజంగా వస్తుందా?

Bible Question Answers Telugu

  విమర్శ: తాత ముత్తాతల కాలమునుండి క్రైస్తవ ప్రసంగీకులు యేసుక్రీస్తు రెండవ రాకడ నేడోరేపో అని చెప్పుచున్నారే గాని ఆయన యింత వరకు రాలేదు కదా? యేసుక్రీస్తు యింకొకమారు వస్తున్నది నిజమా? లేక ప్రజలను భయపెట్టుటకు మతబోధకులు చేయుచున్న మాయా? 

జవాబు: “యేసు ఒక నాస్తికుడు” అను గ్రంథమునందు “నీది నేసన్” ఈలాగు విమర్శించి యేసుక్రీస్తు రెండవ రాకడ వట్టిదని నిరూపింప ప్రయత్నించాడు. దీని పురస్కరించుకొని ఆయా ప్రాంతములలో యేసు బస్సులో వస్తాడా? రైలుబండిలో వస్తాడా? లేకపోతే విమానములో వస్తాడా? అని అపహాస్యముగా గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి క్రీస్తు రెండవ రాకడను చులకనగా చేసి విస్మరిస్తున్నారు.Bible Question Answers Telugu

 క్రీస్తు ప్రభువుని నమ్మని వారే ఆలాగు చేస్తున్నారనుకొంటే క్రైస్తవ సోదరులుకూడ ఆయన మరల వస్తాడా? అన్నటువంటి అనుమానముతోనే పరిచర్యను చేయుచున్నారు. 

  యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఏమి వ్రాయబడియున్నవి. లేఖములను పరిశీలించుదుమా? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణముగూర్చి 175 సారులు, ఆయన పునరుత్థానమును గూర్చి 104 మారులు, మరియు యేసుక్రీస్తుయొక్క ఆరోహణమును గూర్చి 33 పర్యాయాలు వ్రాయబడియున్నది. అయితే క్రీస్తుయొక్క రెండవ రాకడను గూర్చి గమనించినప్పుడు పాతనిబంధన 929 అధ్యాయాలలో 845 పర్యాయాలు క్రొత్తనిబంధన 260 అధ్యాయాలలో 318 సారులు ఆయన రెండవ రాకడును గూర్చి వ్రాయబడి, ప్రవచించబడి, పలుక బడియున్నదంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మరింత నిశ్చయమని యిందు మూలముగా గ్రహించగలము. అంతమాత్రమే కాకుండా భక్తులు పరిశుద్ధులు యిస్తున్న సాక్ష్యములను లేఖనముల ద్వారా పరిశీలింతుము.Bible Question Answers Telugu

   యోహాను సాక్ష్యము: “కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి” 1 యోహాను 2:28. 

  యాకోబు సాక్ష్యము: “సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును కదా! ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి” యాకోబు 5:7-8 

  పేతురు సాక్ష్యము: “ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, యెవడును నశింపవలెనని యిఛ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు. అయితే ప్రభువు దినము (రెండవ రాకడ దొంగవచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును” 2పేతురు 3:8-10 

  పౌలు యొక్క సాక్ష్యము: ఈయన తత్వజ్ఞాని (Philosophy) మరియు Poetry of Greeks and Jewish Law ను అభ్యసించిన గొప్ప మేధావి యూదామతపరమై విద్యా జ్ఞానముగలవాడు పౌలు. ఇతని సాక్ష్యమును పరిశీలించి సత్యాన్ని అన్వేషించుము. 

  “మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు” 1 థెస్సలోనికయులకు 4:15-16.Bible Question Answers Telugu

  “మన పౌరస్థితి పరలోకమందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము” అని భక్త పౌలు ఫిలిప్పీయులకు 3:20లో సాక్ష్యమిస్తున్నాడు. 

 సిలువలో దొంగ సాక్ష్యము: ఆయన (యేసు)ను చూచి – యేసూ, నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను” లూకా 23:42 

  దేవదూతల సాక్ష్యము: ఆయన (ఆరోహణమై) వెళ్ళుచుండగా, వారు ఆకాశమువైపు తేరిచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన (యేసుక్రీస్తు) తిరిగి వచ్చునని వారితో చెప్పిరి” అపొ॥ కార్యములు 1:10 – 11 

  పండితులు, పామరులు, దొంగలు, అపొస్తులులు, ప్రవక్తలు వీరు మాత్రమే కాక దేవుని దూతలు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి సాక్ష్యమిస్తున్నారంటే, ఆయన రాకడ మరి నిశ్చయమైయున్నది. వీటిన్నిటికి పైగా నేనే, మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసు, తన యొక్క రెండవ రాకడను గూర్చి తానేమని సాక్ష్యమిస్తున్నాడో పరిశీలింతుము. 

  యేసుక్రీస్తు సాక్ష్యము: “నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును వుండులాగున మరల వచ్చి నాయొద్దనుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును” యోహాను 14:3 

  “తనమహిమతో మనుష్యుకుమారుడును ఆయనతోకూడ సమస్తదూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును” మత్తయి 25:31. మరియు పరిశుద్ధ గ్రంథములో ఆఖరి పుస్తకము ప్రపంచ విధిని గూర్చియు యోహానునకు చెప్పి యేసుక్రీస్తు వ్రాయించిన ప్రకటన గ్రంథములో ఆయన సాక్ష్యమేమిటో గమనింపుము. 

  ” నేను వచ్చు వరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి” ప్రకటన 2:25 “నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలెవచ్చెదను” ప్రకటన 3:3. 

“నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింప కుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము” ప్రకటన 3:11 

  “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించు చున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” ప్రకటన 16:16. Bible Question Answers Telugu

“ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు” ప్రకటన 22:7. Bible Question Answers Telugu

“ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వానివాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్దపరచిన జీతము నా యొద్ద నున్నది” ప్రకటన 22:12. 

  “ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు” ప్రకటన 22:20. అంత మాత్రమే కాక మత్తయి 24, 25 అధ్యాయాలు, మార్కు 13వ అధ్యాయము లూకా 17,21 అధ్యాయాలు, యోహాను 14,17 అధ్యాయాలు సంపూర్ణముగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి ప్రస్తవించబడియున్నది. యేసు ఏ మాత్రము అబద్దములాడని సత్యదేవుడు గనుక ఆయన తాను సెలవచ్చిన ప్రకారము తప్పక వస్తాడు. ఎప్పుడొస్తాడు? ఏమి సంభవించాక వస్తాడు? ముఖ్య ప్రవచనముల నెరవేర్పులును గుర్తించి ఆయన రాకకు ఆయత్త పడగోరిన యెడల నేను రచించిన “యుగాంతము క్రీస్తు రాజ్య స్థాపన” పుస్తకము చదవండి. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి పాత నిబంధనలోని 929 అధ్యాయాలలో 845 పర్యయాలు, క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలలో 318 సారులు అనగా బైబిల్ గ్రంథమంతటిలో యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి 1163 పర్యాయాలు వక్కానించి వ్రాయబడియున్నావంటే; యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రవచనములు ఏలాగు నెరవేరాయో ఆ ప్రకారమే ఆయనను గూర్చి చెప్పబడిన రెండవ రాకడ కూడ తప్పక సంభవిస్తుంది. నిర్లక్ష్యము చేసి దేవుని రాజ్యమును కోల్పోకుము మాట యిచ్చిన దేవుడు మాట తప్పక వస్తాడు. సిద్దపడి అనేకులను సిద్ధపరచుము. జగద్రక్షకుడైన క్రీస్తుప్రభువు మిమ్మును దీవించి మేలుతో నింపును గాక! 

రచయిత : DR.VASANTHA BABU GARU {CHENNAI}


సేవకుల ప్రసంగాలు కొరకు క్లిక్ చేయండి.. క్లిక్ హియర్ 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted