మా యుద్దోపకరణములు | Pastors Messages In Telugu 2

మా యుద్దోపకరణములు.

Pastors Messages In Telugu

   ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశించే వారు తప్పనిసరిగా ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడవలసి యున్నది.ఏ ఆయుధములను చేబూని పోరాడగలం? ఇవిగో…

1.) యేసు నామము.

 (ఫిలిప్పీయులకు) 2:9,10,11

9.అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

“పేరు” అన్ని పేరులకంటే పై పేరు ఏది? “యేసా” (వ 10)? లేక “ప్రభువా” (వ 11)? అది “ప్రభువు” అని పౌలు ఉద్దేశమై ఉండాలి, ఎందుకంటే తండ్రి తన కుమారుణ్ణి అవమానం నుంచీ మరణం నుంచీ హెచ్చించకముందే “యేసు” అనే పేరు ఆయనకు ఇచ్చాడు. దేవుడు యేసును హెచ్చించిన సమయంలో ఆయనకు ఇచ్చిన పేరును పౌలు మనసులో ఉంచుకుని ఇక్కడ రాసినట్టుంది. అపొ కా 2:36 పోల్చి చూడండి. “పేరు” అధికారాన్ని సూచించవచ్చు. యోహాను 14:13-14 చూడండి. Pastors Messages In Telugu

10.భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11.ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

(అధికారము గల ఏకైకనామం -యేసునామం! ఈ నామం వలననే దయ్యాలు పారిపోతాయి. కుంటివాడు బాగయ్యాడు. స్వస్థతలు జరిగాయి. ఆఖరికి పరలోకం కూడా ఈ నామము వల్లనే దొరుకుతుంది నిర్గమ 3:14,15; 1 సమూయేలు 17:14, యోహాను 14:14, 16:23, హెబ్రీ 13:15, ఎఫెనీ 5:20; అపొ.కా.4:12, 3:16; సామె. 18:10, మార్కు 16:17,18) Pastors Messages In Telugu

2. కన్నీరు.

 (యిర్మీయా) 9:1

1.నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

9:1 వ 10; 8:21; 13:17; 14:17; కీర్తన 119:136. యిర్మీయాను విలపించే ప్రవక్త అన్నారంటే అందుకు తగిన కారణం లేకపోలేదు.

(దేవుడు దేనిని దాటి వెళ్లినా, మన కన్నీటిని చూసి ఆయన దాటి వెళ్లడు – 1సమూ 1:10, హెబ్రీ 5:7, యోహాను 11:35, హోషే 12:4, కీర్తన 84:6, ఆది. 21:16, కీర్తన 55:8, 1సమూ 30:4)

9:1 A యెషయా 22:4; యిర్మీయా 13:17; B కీర్తన 119:136; యిర్మీయా 6:26; 8:21-22; విలాప 2:11; C కీర్తన 42:3; యెషయా 16:9; యిర్మీయా 4:19; 14:17; విలాప 2:18-19; 3:48-49; యెహె 21:6-7

III. దేవుని వాక్యము.

 (ఎఫెసీయులకు) 6:17

17.మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

“పవిత్రాత్మ ఖడ్గం” ఖడ్గాన్ని మనల్ని రక్షించుకొనేందుకు, శత్రువును గాయపరచేందుకు కూడా వాడవచ్చు. మత్తయి 4:1-11లో యేసుప్రభువు సైతానుకు వ్యతిరేకంగా ఈ ఆత్మ ఖడ్గాన్ని ఎలా ప్రయోగించాడో చూడండి. క్రీస్తు విశ్వాసులు ఈనాడు కూడా ఇదే చెయ్యగలరు. అయితే వారికి దేవుని వాక్కు తెలిసి, అర్థమై ఉండాలి. వారికి ఎదురయ్యే విషమ పరీక్షల విషయాల్లో ఆ వాక్కును వారు ఉపయోగించుకోగలగాలి. అందువల్ల బైబిలుపై నమ్మకం ఉంచు, అదంటే ప్రీతి కలిగి చదివి, మన మనసులో హృదయంలో నింపుకుని, దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి – 4:13-14; కొలస్సయి 3:16; 2 తిమోతి 2:15; 3:16-17. బైబిల్లో దేవుని వాక్కును ఆత్మ ఖడ్గం అని ఎందుకు అన్నారు? ఎందుకంటే పవిత్రాత్మ దాన్ని రాయించాడు. దాన్ని అర్థం చేసుకుని, వాడగలిగే సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు (1:17-18; యోహాను 16:13; 1 కొరింతు 2:10-14). సైతాన్ను ఓడించాలంటే మనకు అవసరమైనది ఏది? వాడు మన మనసులో ప్రవేశపెట్టే సలహాలు, సందేహాలు, దుష్‌ప్రేరణలు వీటికి వ్యతిరేకంగా దేవుని వాక్కును ఉపయోగించాలి.Pastors Messages In Telugu

6:17 “పాపవిముక్తిని శిరాస్త్రాణంగా”– 1 తెస్స 5:8; యెషయా 59:17. శిరస్త్రాణం అంటే తనకు ధరించే హెల్మెట్. దేవుని ఆధ్యాత్మిక సైనికులంగా మన మనసులను పాపవిముక్తి, రక్షణ అసలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం పాపం నుంచి మనం విముక్తి పొందామని తెలుసుకుని ఉండాలి (1:7; 2:5). రాబోయే కాలంలో మన విముక్తి, రక్షణ పరిపూర్ణం అవుతుందన్న సజీవమైన ఆశాభావం మనలో ఉండాలి (రోమ్ 8:23-25). యేసుప్రభువు తానే తన ప్రజలకు విముక్తి, రక్షణ. మనం ఆయన్ను ధరించుకోవాలి (కీర్తన 18:2-3, 17; 27:1; యిర్మీయా 3:23; లూకా 2:30; 1 కొరింతు 1:31; 2 తిమోతి 2:10).

(చేతిలో బైబిలు పట్టుకొని వెళ్లిన ఓ సేవకుణ్ణి ఒకావిడ – “బైబిలును చేతిలో కాదు, గుండెలో పెట్టుకోవాలి” అన్నది. వాక్యము ద్వారానే ప్రభువు సైతానును జయించాడు కీర్తన 119:11, మత్తయి 4:4,7,10; దేవుని వాక్యము గొప్ప యుద్దోపకరణము)

4. దేవదూతలు.

 (హెబ్రీయులకు) 1:14

14.వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?

1:14 క్రీస్తు మనుషులకు ప్రభువు (వ 10; రోమ్ 14:9; ఫిలిప్పీ 2:9-11). కానీ దేవదూతలు మాత్రం క్రీస్తు విశ్వాసులకు పరిచర్య చేసేందుకు పంపబడ్డవారు. ఆ విశ్వాసులే “మోక్ష రాజ్య వారసులు”– రోమ్ 8:17; 1 పేతురు 1:4; మొ।।. దేవదూతలు మనకు చేసేPastors Messages In Telugu

1:14 A ఆది 32:1-2; కీర్తన 34:7; 91:11-12; 103:20-21; దాని 3:28; 6:22; 10:11-12; మత్తయి 1:20; 13:49-50; 18:10; లూకా 1:19; 2:9, 13; 16:22; అపొ కా 5:19; 10:3-4; 12:7, 23; 27:23; B కీర్తన 104:4; యెషయా 6:2-3; దాని 9:21-23; మత్తయి 2:13; 1 పేతురు 1:12; C ఆది 19:15-16; ప్రకటన 5:6; D యోబు 1:6; దాని 7:10; మత్తయి 13:41; 24:31; 25:34; లూకా 1:23; రోమ్ 13:6; 2 కొరింతు 9:12; ఎఫెసు 3:6; 2 తెస్స 1:7; తీతు 3:7; హీబ్రూ 6:12, 17; 1 పేతురు 1:4; యూదా 14; E ఆది 32:24; 1 రాజులు 22:19; అపొ కా 11:22; 13:2; 16:26; రోమ్ 8:17; 15:16, 27; గలతీ 3:7, 9, 29; ఫిలిప్పీ 2:17, 25; హీబ్రూ 5:9; 8:6; 10:11; యాకోబు 2:5; 1 పేతురు 3:7 పరిచర్య ఏమిటో రచయిత చెప్పలేదు. దేవదూతల గురించి నోట్ ఆది 16:7. ఈ మాటలతో రచయిత తన మొదటి ముఖ్యాంశాన్ని ముగించాడు. దేవుడు తన స్వభావంలో పాలు వున్న తన స్వంత కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుడు మనుషులందరి కన్నా, దేవదూతలందరి కన్నా ఎంతో గొప్పవాడు. తన కుమారుని ద్వారా దేవుడు తన గురించి, రక్షణ గురించి, అదృశ్య లోకం గురించి తెలియజేసిన సత్యాలు ఆఖరివి అని నిస్సందేహంగా నమ్మవచ్చు. క్రొత్త ఒడంబడిక గ్రంథాన్ని రాయించిన తరువాత ఆయన తిరిగి తన పాత పద్ధతికి వెళ్ళి, తాను మాట్లాడేందుకు ఎవరైనా ప్రవక్తను ఎందుకు ఎన్నుకోవాలి? మనుషులతో ఆయన చెప్పదలచుకున్నదంతా తన స్వంత కుమారునిద్వారా ఆయన చెప్పేశాడు.

(దూతలు మనకు సేవకులు. మీరెప్పుడైన దూతలను పిల్చి, పనులు అప్పగించారా? నీకు సేవ చేయడానికి 24 గంటలు వారు సిద్ధంగా ఉన్నారు 2రాజు. 19:35, కీర్తన 34:7, 91:11,12)

5.) గొర్రెపిల్ల (యేసు) రక్తము.

 (ప్రకటన గ్రంథము) 12:11

11.వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.Pastors Messages In Telugu

12:11 “రక్తాన్ని బట్టీ”– 1:5; 5:9; 7:14; మత్తయి 26:28; హీబ్రూ 9:14; 1 యోహాను 1:7-9.

(యేసు రక్తము, బలమైన దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కల్గియున్నది. యేసు రక్తమంటేనే పాతాళపు శక్తులన్నిటికీ హడల్ – నిర్గమ 12:22)

6.) పరిశుద్ధాత్మ శక్తి.

(జెకర్యా) 4:7

7.గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.Pastors Messages In Telugu

(పరిశుద్ధాత్మ శక్తి గొప్ప యుద్దోపకరణం. ఆ శక్తి ఎదుట ఏ శక్తి నిలువజాలదు – న్యాయా. 14:6, 3:10, 6:34, 11:29, అపొ.కా. 1:8, లూకా 24:49)

VII. ఉపవాసము యొక్క శక్తి.

 (యోవేలు) 2:12,13,14,15,16

12.ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13.మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.Pastors Messages In Telugu

14.ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15.సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.Pastors Messages In Telugu

16.జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

(లోకము, శరీరము, సాతానుతో పోరాడి గెలవాలంటే ఉపవాసమే ఆయుధం1 దిన  20:5-13)

  • భౌతికంగా జరిగే యుద్దాలకంటే, ఆత్మ సంబంధంగా జరిగే యుద్ధమే చాలా కఠినమైనది. ఆధ్యాత్మిక సంగ్రామంలో నీవు గెలిస్తే, భౌతికమైన సంగ్రామం ఏమంత కష్టం కాదు!

బైబిల్ లో అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం క్లిక్ చేయండి.. క్లిక్  హియర్.. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.