మంచి తీర్మానాలు|good resolutions-messages for pastors1

Written by biblesamacharam.com

Published on:

 మంచి తీర్మానాలు

good resolutions-messages for pastors

తీర్మానాలు లేకపోతే… ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపపడవలసి యుంటుంది. భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానం! తీర్మానం ప్రమాణం వలె ఉండునట్లు చూసుకుందాం! భక్తులు చేసిన తీర్మానాలు కొన్ని… ఇవిగో…

1. రూతు తీర్మానం.

(నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది ఓ మోయాబీయురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటది? మెస్సీయాకు ఆమె పితరురాలు అయ్యింది. ఎంత గొప్ప భాగ్యం!)

 (రూతు) 1:16

16.అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;

1:16 A రూతు 2:11-12; 2 సమూ 15:21; 2 రాజులు 2:2-6; కీర్తన 45:10; యెషయా 14:1; B మత్తయి 8:19; అపొ కా 21:13; 2 కొరింతు 6:16-18; 1 తెస్స 1:9; C యెహో 24:18; హోషేయ 13:4; లూకా 24:28-29; D దాని 2:47; యోహాను 13:37; ప్రకటన 14:4; E దాని 4:37

2.) సమూయేలు తీర్మానం.

(ప్రార్థన చేయుదును – లేని యెడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా?)

 (మొదటి సమూయేలు) 12:23

23.నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

12:23 “ప్రార్థించక పోవడంవల్ల”– ఇలా చెయ్యమని దేవుడు చెప్పినదాన్ని చెయ్యకపోవడం చెయ్యవద్దన్న దాన్ని చెయ్యడం రెండూ సమాన పాపమే. సంఖ్యా 32:23; మత్తయి 25:41-46 చూడండి. ఈ రెండు రకాల దోషాలు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కీర్తన 51:4 చూడండి.

3.)  యెహోషువ తీర్మానం.

(ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు. స్థిరబుద్ధి గలవారు కారు. మూర్ఖపు ప్రవర్తన గలవారు. అలాంటివారి మధ్యలో – మీరెవరిని సేవింపకోరుకున్నను, నేనును నా యింటివారును యెహోవానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ అవిధేయులూ తిరుగుబోతులూ వాళ్ల మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేక పోతున్నాను అంటున్నావా? యెహోషువను చూడండి)

 (యెహొషువ) 24:15

15.యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

24:15 ఆది 18:19; నిర్గమ 23:24, 32-33; 34:15; ద్వితీ 13:7; 29:18; న్యాయాధి 6:10; రూతు 1:15-16; 1 రాజులు 18:21; కీర్తన 101:2; 119:106, 111-112; యెహె 20:39; యోహాను 6:67-68; అపొ కా 11:23

4.) ఎస్తేరు తీర్మానం.

(హామాను ద్వారా ఆగం అయ్యే పరిస్థితి రాగా అట్టే ఆలస్యం చేయకుండా, అత్యవసరమైన పరిస్థితుల్లో నడుం కట్టి – నేనును నా పనికత్తెలును ఉపవాసముందుము అంటూ యూదులందరినీ తన ప్రార్ధనలచే రక్షించుకున్న ధీరురాలు!)

4:16 “ఉపవాసం”– ప్రార్థన అని లేదు గాని సందర్భాన్ని బట్టి అలా అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రజలు సహజంగా ఆయన సన్నిధానంలోనే ఉపవాసం చేస్తారు (న్యాయాధి 20:26; 1 సమూ 7:6; 2 సమూ 12:16; ఎజ్రా 8:21, 23; నెహెమ్యా 9:1-3; యెషయా 58:3; యిర్మీయా 14:12).

5.) దావీదు తీర్మానం – కీర్తన 132:5

(ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావీదు చేసిన తీర్మానం – యెహోవాకు నేనొక స్థలం చూచువరకు నా కన్నులకు నిద్ర రానియ్యను. ఇదీ, ఆయన చేసిన రోషం గల తీర్మానం. నీవు వెళ్ళే మందిరంలో ఏముందో ఏం లేదో తెల్సుకొని దానికై ప్రయాసపడ్తున్నావా? లేక ప్రక్కకు తప్పుకుంటున్నావా?)

132:5 A ఎఫెసు 2:22; B 1 దిన 22:7; 2 దిన 2:6; అపొ కా 7:46-49; C 2 సమూ 6:17; 1 రాజులు 8:27; 1 దిన 15:3, 12; యెషయా 66:1

బ్రతుకులను మలుపు తిప్పే భక్తుల తీర్మానాలు విన్నారా! తిని కూర్చోవడమే నీ తీర్మానమైతే, రేపు తృణీకరింపబడ్తావ్!

good resolutions-messages for pastors

బైబిల్లో మీకు తెలియని అనేక ప్రశ్నలకు సమాధశనం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ క్లిక్ చేసి మా యూట్యూబ్ చానెల్ దర్శించండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

3 thoughts on “మంచి తీర్మానాలు|good resolutions-messages for pastors1”

  1. మంచి తీర్మానం ప్రతి దేవుని బిడ్డకు (క్రైస్తవ బిడ్డకు) అవసరం
    Good masses brother

    Reply
  2. మంచి తీర్మానాలు మెస్సేజి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి

    Reply

Leave a comment

error: restricted