క్రీ.పూ ప్రవచించారు|Fulfilled Prophecies at the Birth of Christ|2

యేసు జన్మిస్తాడాని క్రీ.పూ ప్రవచించారు 

Fulfilled Prophecies at the Birth of Christ

1.)  యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును.

(యెషయా గ్రంథము) 11:1

1.యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

11:1 10:33-34లో ప్రవక్త అష్షూరువారిని ఎత్తయిన చెట్లతో పోలుస్తూ దేవుడు వారిని కూల్చివేస్తాడని చెప్పాడు. ఇక్కడ చిగురు లేక చిన్న కొమ్మ గురించి చెప్తున్నాడు. ఈ అంకురం లేక కొమ్మ 7:14లోనూ 9:6-7లోనూ ఉన్న అభిషిక్తుడు, కుమారుడు, శిశువు తప్ప మరెవరూ కాదు. ఆయన సర్వాతీతుడైన దేవుని అవతారం, ప్రపంచాన్ని భావి కాలంలో పరిపాలించబోతున్నవాడు. యెష్షయి దావీదు తండ్రి. ఈ కొమ్మ పుట్టేది దావీదు వంశంనుండి.

11:1 A యెషయా 4:2; 9:7; 11:10; 53:2; యిర్మీయా 23:5; 33:15; జెకర్యా 3:8; 6:12; అపొ కా 13:22-23; రోమ్ 15:12; ప్రకటన 5:5; 22:16; B మత్తయి 1:6-16; C 1 సమూ 17:58; D రూతు 4:17; లూకా 2:23-32

“మొద్దు”– 6:13 చూడండి. దావీదు రాజ్యం అష్షూరు, బబులోను, రోమ్ వారి చేతుల్లో దాదాపు పూర్తిగా నాశనమై పోయినట్టే. చెట్టు పోయింది, వేరు మాత్రం మిగిలింది.

“కొమ్మ”– 4:2; యిర్మీయా 23:5; 33:15; జెకర్యా 3:8; 6:12.

 (యిర్మీయా) 23:5

5.యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

23:5 “కొమ్మ”– బైబిలు ప్రవక్త గ్రంథాలలో అభిషిక్తునికి ఇచ్చిన పేరిది (33:15; యెషయా 11:1; జెకర్యా 3:8; 6:12). మానవావతారంలో ఆయన దావీదు వంశానికి చెందినవాడు (లూకా 1:30-33; రోమ్ 1:5). రాజుగా ఆయన పరిపాలన వర్ణన అనేక పాత ఒడంబడిక లేఖనాల్లో కొద్దిగా కనిపిస్తుంది (ఉదా।। కీర్తన 2:6-9; 45:1-7; 72:5-7; యెషయా 9:6-7; 11:1-9; 32:1-3; జెకర్యా 14:9-21). యెషయా 2:2-4 నోట్స్ చూడండి.

23:5 A యెషయా 4:2; 9:7; 11:1-5; 32:1-2; 52:13; 53:2; జెకర్యా 3:8; 6:12-13; లూకా 1:32-33; B యెషయా 40:9-11; 53:10; యిర్మీయా 22:3; 23:6; 30:3, 9; 31:27, 31-38; 33:14-16; దాని 9:24; హోషేయ 3:5; ఆమోసు 9:11; జెకర్యా 9:9; యోహాను 1:45; హీబ్రూ 8:8; ప్రకటన 19:11; C కీర్తన 45:4; 72:1-2; 80:15; యిర్మీయా 22:15, 30; యెహె 17:2-10, 22-24; 34:29; మత్తయి 2:2; యోహాను 1:49

(యిర్మీయా) 33:15

15.ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. జెకర్యా

33:15 ఈ వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు గురించినవి. 23:5-6 నోట్స్ చూడండి. యూదాకు, ఇస్రాయేల్‌కు దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ వారు బబులోనునుండి తిరిగి వచ్చిన సందర్భంలో పూర్తిగా నెరవేరలేదు.

33:15 A యెషయా 11:1-5; B యెషయా 4:2; యిర్మీయా 23:5-6; జెకర్యా 3:8; C కీర్తన 72:1-5; జెకర్యా 6:12-13; హీబ్రూ 7:1-2; ప్రకటన 19:11; D 2 సమూ 23:2-3; కీర్తన 45:4, 7; యెషయా 9:7; 32:1-2; 42:21; 53:2; యెహె 17:22-23; యోహాను 5:22-29; హీబ్రూ 1:8-9

2.) కన్యక గర్భాన పుట్టు కుమారుడు ఇమ్మానుయేలు.

(యెషయా గ్రంథము) 7:14

14.కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

7:14 ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను స్పష్టంగా తెలియజేసే ప్రవచనం ఇది. పవిత్రాత్మ మత్తయిచేత ఇలా రాయించాడు. కనుక ఈ విషయం మనకు తెలుసు. మత్తయి 1:18-25 చూడండి. ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు”. ఈ పేరు పరిపూర్ణంగా ఒక్క యేసుప్రభువుకే చెల్లుతుంది. కేవలం ఆయనే దేవుని అవతారం (యెషయా 9:6-7; యోహాను 1:1, 14; మొ।।). 700 సంవత్సరాల తరువాత జరిగిన ఒక మానవాతీతమైన అద్భుత సంభవానికి ఈ వచనం ఆశ్చర్యకరమైన ప్రవచనం, భవిష్యత్ వాక్కు. కన్యకు సంతానం కలగడం ఒక సూచనగా చెప్పబడింది. దేవుని నుండి వచ్చిన సూచన ఏదైనా నిజంగా ప్రత్యేకమైనదిగా, అసాధారణమైనదిగా ఉండాలి. ఒక యువతికి, పెండ్లికాని యువతికి అయినా సరే, పిల్లవాడు పుట్టడంలో పెద్దగా విశేషమేమీ లేదు. అయితే పురుషునితో సంపర్కం లేని యువతికి, బిడ్డ పుట్టడం దైవికమైన అద్భుతమే. ఇది కేవలం ఆహాజుకు కాదు దావీదు వంశమంతటికీ సూచన (వ 14లో మీకూ అంటూ బహువచనం ప్రయోగం కనిపిస్తుంది). ఈ వచనం రెండు విధాలుగా నెరవేరేది అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ తరువాత వచ్చే వచనాలు యెషయా కాలంలోని చారిత్రాత్మక విషయాల గురించినవి. కన్యకు కుమారుడు పుట్టడం అప్పట్లో జీవిస్తూ ఉన్న ప్రజలకు ఒక సూచనగా ఉండాలని వారి వాదం. బహుశా ఇది నిజమే కావచ్చు. అయితే యెషయా కాలంలో ఇది నెరవేరిన వైనాన్ని పవిత్రాత్మ మనకు వెల్లడించలేదు. ఆ కాలంలో ఇలా ఎవరైనా పుట్టడం, ఆ శిశువుకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడం గురించి ఎక్కడా రాసి లేదు. అది ఎలా ఉన్నా భవిష్యద్వాక్కులకు వెంటనే జరిగే నెరవేర్పూ దీర్ఘకాలం తరువాత జరిగే నెరవేర్పూ ఈ రెండూ ఉండవచ్చునని అనుకోవచ్చు. యెషయా 8:18 దీనికి ఒక ఉదాహరణ కావచ్చు.

7:14 A ఆది 3:15; యెషయా 8:8, 10; 9:6; యిర్మీయా 31:22; మత్తయి 1:23; లూకా 1:31, 35; యోహాను 1:1-2, 14; 1 తిమోతి 3:16; B ఆది 30:6; 1 సమూ 4:21; రోమ్ 9:5; C ఆది 4:1-2, 25; D ఆది 16:11; 30:8; 1 సమూ 1:20

 (మత్తయి సువార్త) 1:21,22

21.తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

1:21 “యేసు”– వ 1. పాపులైన మనుషుల్ని పాపవిముక్తుల్ని చేసి రక్షించడానికే యేసుప్రభువు వచ్చాడు, వారిని నాశనం చెయ్యడానికి కాదు (లూకా 19:10; యోహాను 3:17). వారిని వారి పాపాల తాలూకు శిక్ష నుంచి, దాని శక్తిప్రభావాల నుంచి విడుదల చేసి, దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతిన్యాయాలు, ధన్యత, శాంతి, ఆనందాలు ఉండే స్థితిలోకి తేవడానికి ఆయన వచ్చాడు (లూకా 4:18-19; అపొ కా 26:18). ఆయన మనుషులను వారి పాపాల్లో రక్షించడు, వారి పాపాలనుంచి రక్షిస్తాడు. ఆయన ప్రజలు ఎవరంటే ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచినవారు (యోహాను 1:12-13), దేవుడు ఆయనకు ఇచ్చినవారు (యోహాను 6:37; 17:6).

1:21 “యేసు”– వ 1. పాపులైన మనుషుల్ని పాపవిముక్తుల్ని చేసి రక్షించడానికే యేసుప్రభువు వచ్చాడు, వారిని నాశనం చెయ్యడానికి కాదు (లూకా 19:10; యోహాను 3:17). వారిని వారి పాపాల తాలూకు శిక్ష నుంచి, దాని శక్తిప్రభావాల నుంచి విడుదల చేసి, దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతిన్యాయాలు, ధన్యత, శాంతి, ఆనందాలు ఉండే స్థితిలోకి తేవడానికి ఆయన వచ్చాడు (లూకా 4:18-19; అపొ కా 26:18). ఆయన మనుషులను వారి పాపాల్లో రక్షించడు, వారి పాపాలనుంచి రక్షిస్తాడు. ఆయన ప్రజలు ఎవరంటే ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచినవారు (యోహాను 1:12-13), దేవుడు ఆయనకు ఇచ్చినవారు (యోహాను 6:37; 17:6).

22.ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

1:22 క్రొత్త ఒడంబడిక గ్రంథంలో చాలా భాగం పాత ఒడంబడిక వాగ్దానాల నెరవేర్పును తెలిపే సంఘటనలు కనిపిస్తాయి. బైబిలంతా సంపూర్ణంగా దేవుని ఆత్మావేశంవల్ల రాయబడిందని నమ్మేందుకు ఇది బలమైన కారణం. దేవుడు తానే స్వయంగా తన ప్రవక్తలద్వారా మాట్లాడిన విషయం గమనించండి. 2:15; 4:4; 15:4; 22:43-44; అపొ కా 1:16; 4:25; 28:25; హీబ్రూ 1:5, 8, 10, 13; 3:7; 4:3, 7; 5:5-6; 7:21; 8:8; 10:5, 15; 13:5 చూడండి. 2 తిమోతి 3:16; 2 పేతురు 1:21 కూడా చూడండి.

1:22 A 1 రాజులు 8:15; మత్తయి 2:23; లూకా 24:44; B 1 రాజులు 8:24; మత్తయి 13:35; C ఎజ్రా 1:1; మత్తయి 2:15; 13:21; యోహాను 10:35; 12:38-40; 15:25; 17:12; 18:9; 19:36-37; అపొ కా 3:18; D మత్తయి 5:17; 8:17; 12:17; E లూకా 21:22; అపొ కా 13:27-29

3.)  యూదా బేత్లహేములో జన్మించును.

 (మీకా) 5:2

2.బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

5:2 దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. బేత్‌లెహేం గ్రామం ఉన్న ప్రాంతం ఎఫ్రాతా – రూతు 1:2; 4:11; 1 సమూ 17:12. బేత్‌లెహేం జెరుసలంకు 10 కి.మీ. దక్షిణంగా ఉన్న గ్రామం.

“పరిపాలించబోయేవాడు”– ఇది ఆయన కార్యకలాపాల గురించి చెప్తున్నది. ఈ భవిష్యద్వాక్కు అభిషిక్తుడైన యేసుక్రీస్తును గురించినది. ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వమే, మానవుడుగా ఆయన జన్మ స్థలాన్ని తెలియజేస్తున్నది. మత్తయి 2:4-6 చూడండి. దేవుని కుమారుడుగా ఆయన శాశ్వతుడు. ఉత్పత్తి, ఆరంభం అంటూ ఆయనకు లేవు – యెషయా 9:6; కీర్తన 90:2; యోహాను 1:1. మానవ చరిత్ర అంతటిలోనూ ఆయన తన చర్యలు జరిగిస్తూనే ఉన్నాడు.

5:2 A ఆది 48:7; 49:10; 1 సమూ 17:12; కీర్తన 90:2; యెషయా 9:6-7; 11:1; యెహె 17:22-24; జెకర్యా 9:9; మత్తయి 2:6; 28:18; లూకా 1:31-33; యోహాను 7:42; B ఆది 35:19; రూతు 4:11; 1 సమూ 10:19; సామెత 8:22-23; యెషయా 53:2; యిర్మీయా 30:21; యెహె 37:22-25; ఆమోసు 9:11; 1 కొరింతు 1:27-28; కొలస్సయి 1:17; హీబ్రూ 7:14; 13:8; 1 యోహాను 1:1; ప్రకటన 1:11-18; 19:16; C నిర్గమ 18:21; 1 దిన 2:50-51; 4:4; 5:2; కీర్తన 102:25-27; యెహె 34:23-24; లూకా 2:4-7; 23:2, 38; యోహాను 1:1-3; 19:14-22; D నిర్గమ 18:25; ద్వితీ 1:15; 1 సమూ 8:12; 17:18; 23:23; 1 దిన 2:54; కీర్తన 132:6; యిర్మీయా 13:5-6; ప్రకటన 2:8; 21:6

(మత్తయి సువార్త) 2:5

5.అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.

2:5 క్రీస్తు జన్మానికి 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్న ఈ అద్భుతమైన భవిష్యద్వాక్కు మీకా 5:2లో ఉంది. ఓ సంగతి గమనించండి – ఈ మతాధికారులకు, పండితులకు అభిషిక్తుడు వస్తాడనీ ఆయన జన్మస్థానం ఫలానా చోటు అనీ తెలుసు గాని ఆయన్ను చూచేందుకు గానీ ఆయన్ను గౌరవించేందుకూ ఆరాధించేందుకూ గానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మనుషులకు తెలిసినదాన్ని బట్టి వారు దేవుని దృష్టికి అంగీకారం కారు. వారి హృదయ స్థితే అతి ప్రాముఖ్యం.

2:5 A రూతు 1:1; B రూతు 2:4; యోహాను 7:42; C ఆది 35:19; యెహో 19:15; రూతు 1:19; 4:11; 1 సమూ 16:1

 (యోహాను సువార్త) 7:42

42.క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.

4.)  మోషే వంటి ప్రవక్త మీలో నుండి వచ్చును.

  (ద్వితీయోపదేశకాండము) 18:16

16.ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.

18:16 A నిర్గమ 20:19; B ద్వితీ 5:23-28; 9:10; C హీబ్రూ 12:19

 (లూకా సువార్త) 24:19,27,44

19.ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

27.మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

44.అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.

 (యోహాను సువార్త) 1:45

45.ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.

1:45 ఇలా మాట్లాడేందుకు పాత ఒడంబడిక గ్రంథంతో బాగా పరిచయం అవసరం. లూకా 24:27, 44 పోల్చి చూడండి. ఇతడు యోసేపును యేసు తండ్రిగా చెప్తున్నాడు. ఆయన అసలైన తండ్రి దేవుడు (5:17-18; లూకా 1:35). యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు యోసేపు ఆయనకు చట్టబద్ధమైన తండ్రి.

1:45 A ఆది 22:18; 49:10; ద్వితీ 18:18-22; యెషయా 4:2; 7:14; 9:6; 53:2; మీకా 5:2; జెకర్యా 6:12; 9:9; మత్తయి 2:23; 21:11; మార్కు 14:67; లూకా 2:4; 3:23; 4:22; 24:27, 44; యోహాను 5:45-46; 18:7; 21:2; అపొ కా 22:8; B ఆది 3:15; మత్తయి 13:55; మార్కు 6:3; యోహాను 1:46-48; 6:42; 18:5; 19:19; అపొ కా 2:22; 3:6; 10:38; 26:9

5.)  నక్షత్రము యాకోబులో ఉదయించును.

 (సంఖ్యాకాండము) 24:17,19

17.ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.

24:17-19 ఇవి చాలా ఏళ్ళ తరువాత రాబోయే రాజైన దావీదు గురించిన మాటలు కావచ్చు, లేక శరీర సంబంధంగా దావీదు సంతతివాడైన యేసు ప్రభువును గురించిన వాక్కులు కావచ్చు. దావీదు మోయాబును, సేయీరు(ఎదోం)ను కూడా ఓడించాడు. ఇక్కడ బిలాము పలికిన వాక్కులు దావీదు ద్వారా నెరవేరాయి (2 సమూ 8:2, 14). అయితే దావీదు కంటే క్రీస్తు ఈ వచనాలకు సరిగ్గా సరిపోతాడు. యాకోబు నక్షత్రం, రాజ దండం క్రీస్తే. భవిష్యత్తులో ఆయన లోకాన్నంతటినీ జయిస్తాడు (ఆది 49:10; యెషయా 9:6-7; మత్తయి 2:2; లూకా 1:30-33; హీబ్రూ 1:8; ప్రకటన 19:11-16).

19.యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.

6.)  ఎందుకు జన్మించెను? (పరిచర్య).

 (యెషయా గ్రంథము) 42:6,7

6.గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

42:6 A కీర్తన 45:6-7; యెషయా 41:13; 42:1; 43:1; 49:6, 8; 51:4-5; 60:1-3; యిర్మీయా 23:5-6; లూకా 2:32; యోహాను 8:12; అపొ కా 13:47; 26:23; 1 పేతురు 2:9; B యెషయా 26:3; 32:1; 45:13; 49:1-3; యిర్మీయా 33:15-16; మత్తయి 26:28; లూకా 1:69-72; రోమ్ 3:25-26; 15:8-9; 2 కొరింతు 1:20; గలతీ 3:15-17; హీబ్రూ 1:8-9; 7:26; 8:6; 9:15; 12:24; 13:20; C హీబ్రూ 7:2

7.యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

 (యెషయా గ్రంథము) 61:1,2,3

1.ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2.యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3.సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 (లూకా సువార్త) 4:18,19

18.ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19.ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.