జర్మనీ మిషనరీ రిచర్డ్ ఆర్టిల్|richard artle missionary inspiring story|telugu|1

జర్మనీ మిషనరీ రిచర్డ్ ఆర్టిల్

సాక్ష్యము

richard artle missionary

   నేటి సేవకులకున్న భారమును నాటి మిషనరీల భారముతో పోల్చుకుంటే, నిజముగా మనము చేస్తున్నది సేవేనా? నాటి మిషనరీలు, భక్తులు ఎంతో త్యాగము చేసి మార్గము సరాళము చేసినను, సరళమైన త్రోవలో సేవచేయుటకే ఎంతగానో యిబ్బంది పడిపోతున్నారు. 

   పంతొమ్మిదవ శతాబ్దపు ప్రారంభములో జర్మనీకి చెందిన యొక క్రైస్తవ మిషనరీ సంస్థ నాగాలాండ్  అడవిప్రాంతములో నివసించుచుండిన అడవి మనుష్యులుకు సువార్త ప్రకటించి వారిని దేవునిలోనికి నడిపింప నెంచి, ఆ సంస్థవారు ఒకరి తరువాత నొకరిని పంపుతూ, ఆరుగురు మిషనరీలను పోగొట్టుకొన్నది. 

   ఆరుగురు మిషనరీలు అడవి మనుష్యుల చేత చంపబడియుండుట గమనించిన ఆ సంస్థ కమిటీ కూడి మాటలాడుతూ ఇప్పటికే ఆరుగురిని మనము చంపుకొన్నాము గనుక యిక ఆ ప్రాంతములకు మిషనరీలను పంపబోమని నిర్ణయించుచుండగా వారిలో ఒకరైన దైవజనులు రిచర్డ్ ఆర్టిల్ లేచి నిల్చుండి అందుకని వారిని నరకాన్ని పంపలేము, ఆ ఆత్మలు కూడా దేవునిదృష్టికి బహు విలువైనవి కావున, ఆ ప్రాంత ప్రజలను దేవునిలోనికి నడిపించుటకు నేను వెళ్ళెదనని చెప్పగా ఆ సంస్థ పెద్దలందరూ వద్దు, వెళ్ళవద్దు ఇప్పటికే ఆరుగురిని మనము కోల్పోయాము నిన్నుకూడా మేము పోగొట్టుకోలేమని బలవంతము చేసినను… 

    రిచర్డ్ ఆర్టిల్ దృఢ నిశ్చయముగా, నేను చావను నిశ్చయముగా వారిని రక్షణ అనుభవములోనికి తీసుకొని వచ్చేంతవరకు నేను చావను, నిశ్చయముగా దేవుడే నాకు తోడైయుండి యీ పరిచర్యను నాకు దీవెనకరముగా చేయగలడని చెప్పి, బలవంతముగా జర్మనీ నుండి నాగాలాండ్కు పంపబడెను. 

    పూర్వము పంపబడిన ఆరుగురు చంపబడిన విధానమును గమనించినపుడు, అడవి మనుష్యులకు తెల్లగా ఉండిన మిషనరీలను చూడగానే యిదేదో క్రొత్త జంతువనుకొని ప్రాణముతోనే చీల్చుకొని చంపితినియున్నారు. దీని జ్ఞాపికతో ఉంచుకొన్న ఆర్టిల్ ఆ అడవిలోనికి మంచి రాత్రిజామున ప్రవేశించి ఒకచెట్టుమీద కూర్చుండి రెండు మూడు రోజులు వారిచర్యలను పరిశీలిస్తూ వచ్చాడు. 

     స్నానమంటే తెలీక, మురికిగా ఉంటూ, వారికంటపడిన ప్రతి జీవిని కొట్టిచంపి పచ్చిగానే తింటూ వస్తుండగా గమనించిన ; రిచర్డ్ ఆర్టిల్, తెల్లగా ఉంటున్న తనదేహమునకు నల్లనిరంగు వేసికొని ఆ మనుష్యులను పోలి దిగంబరిగా సంచరిస్తూ వారిలో ఒకడై పోయాడు. అయితే రుచికరమైన భోజనము చేయుటకు అలవాటుపడిన ఆర్టిల్ కుందేలును పట్టుకొని దానిచంపి పచ్చిగానే తినుటకు ప్రారంభించెను, తనకు వాంతి వచ్చినను సమర్ధించుకొంటూ రెండుమూడు మాసాలు గడిపాడు. 

   ఆపై ఒకరోజు ఉడుమును పట్టుకొని పచ్చిగానే తినబోవుచుండిన యొకని యొద్దకు వెళ్ళి చేసైగ చేసి దీని యిలాగు తినుటకంటే కాల్చుకొని తిందుమా? అని చెప్పి రాయికి రాయిని కొట్టి నిప్పురాబెట్టి అక్కడి ఆకులు, పుల్లలను కాల్చి ఆ మంటలో ఉడుము కాల్చిన పిమ్మట తుంచుకొని తింటుంటే వారికందరికి ఆశ్చర్యముగాను, ఆనందముగా ఉండి, యింకా యేయే విధము భోజ్యము చేయవచ్చో చెప్పమని అడుగుతూ ఆ ప్రాంత ప్రజలందరూ ఆర్టిల్ దగ్గరకు వచ్చుచుండగా, యితను చల్లగా వారికి నాయకుడాయెను. ఆ ప్రకారము వారికి పల వెరైటీస్ చూపుతూ, నేర్పుతూ వారిపై పెత్తనం రాగానే 

    మొదటిగా సాంఘికపరంగా వీరిలో చైతన్యం తేవాలని ప్రయత్నించి, వారిని అడవి అంచులకు నగరము యొక్క సరిహద్దులకు తీసుకొని రాగానే వారందరు బయటి ప్రపంచమును చూచి ఆశ్చర్యమొంది మనము కూడా వారిలాగే ఆనందముగా ఉండాలంటే ఏం చెయ్యాలి? యిప్పుడే మనము బయటి కెల్లుదుమా? అని అడుగగా ఆర్టిల్ వారందరిని చూడండి వారెంతో సౌందర్యముగాను, క్రమముగా వస్త్రధారణ చేసికొనియున్నారు. వారివలె మనము వస్త్రాలు ఏ ధరిస్తే వెళ్ళవచ్చును గాని వస్త్రాలు లేకుండ  బయటికి వెళ్ళమంటే వారందరు మనల్ని ! చంపేస్తారని చెప్పడముతో 

    ఈ మనుష్యులు, ఏలాగైతేనేమి మమ్మల్ని  ఒక్కసారి తీసికొనిపొమ్మని బతిమాలగా, ఆర్టిల్- ఇబ్బందేమీ కాదుగాని మీరందరు శుభ్రముగా స్నానముచేసి వారిని పోలి దుస్తులు వేసుకొంటారా? అట్లయితే నేను మిమ్మును తీసుకొని పోతానని చెప్పినందుకు వారందరు ఒక్కమాటగా నీవు చెప్పినట్టే వింటాము గాని మనకు బట్టలు ఏలాగని అడుగగా – అలాగైతే నేనెలాగైనా ఏర్పాటు చేస్తాను; మనకెవరు వాటిని సహాయము చేస్తారో వారికి హానిచేయక వారు చెప్పినట్టుగా మనము చేయగలిగితే నిశ్చయముగా మీరు ఆశించిన రీతిగానే నేను ఏర్పాటు చేయగలనని చెప్పి, వారిని మానసికంగా సిద్ధము చేసి, ఆపై ఆపై జర్మనీ నుండి నిధులను రప్పించి మిషనరీలను పిలువనంపి జీవితములో తొలిసారిగా స్నానము చేయించి, దుస్తులచేత అలంకరించి వారిని చక్కపరచగా ఆనంద సాగరములో వారు మునిగితేలారు. అప్పుడు వారు అనగా జర్మనీ నుండి వచ్చిన వారు రిచర్డ్ ఆర్టిల్ శ్రమకు సామర్ధ్యమునకు ఆశ్చర్యమొందారు. సాంఘికపరమైన భద్రత కల్పించగా వారు ఆర్టిల్ని దేవునిగా భావించి పూజింపనెంచగా; ఆర్టిల్ యేసుక్రీస్తు ప్రేమను గూర్చి రాజ్యసువార్తను గూర్చి తెలియచెప్పగా అడవిమనుష్యులు మనవంటి మనుష్యులై దేవునియందు విశ్వసించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి, పౌరషముగల దేవుని బిడ్డలుగా మారారు. 

   అట్టి భయంకరమగు అడవిజాతి ప్రజలను రక్షణలోనికి నడిపించుటకు, తన సుఖ సౌఖ్యములు ప్రక్కనబెట్టి, ఆర్టిల్కు అలవాటు లేకపోయిన కుందేళ్ళను, ఉడుములను పచ్చిగానే తినుచు, క్రక్కుడు వచ్చినను, మ్రింగుడు పడకుండినను సహించి, ప్రార్థించి సహనముతో అన్నిటిని తాళుకొని మొదటిగా సాంఘిక సేవను ప్రారంభించి, వారిలో మానవతను పంచి; పెంచి ఆపై దైవసేవను ప్రారంభించి వారినందరిని దేవునికి స్వంతము చేసాడు. 

     నిజముగా ఆత్మల భారము గలవారిలాగే శ్రమించి ఆత్మలాధాయము చేసెదరు. ఆర్దికముపైనే గురినిలిపిన వారు ఆత్మలను ఎంతమాత్రము పట్టించుకోలేరు. చివరి దినములలో మనమందరము ఆర్థిక భారముతో కాక ఆత్మల భారముతో ముందుకెళ్లుదము. దేవుడు అట్టివారిని దీవించును గాక! 


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి

క్లిక్ హియర్

Our youtube chanel….click here

Leave a comment

error: dont try to copy others subjcet.