2000 సం.క్రితం దేవుడెవరు | Who Was God 2000 Years Ago Telugu Bible

2000 సం.క్రితం దేవుడెవరు?

Who Was God 2000 Years Ago Telugu Bible

విమర్శ: యేసుక్రీస్తు జన్మించి 2000 సం॥రాలే కదా! అలాగునే యేసే దేవుడైతే అంతకు పూర్వము దేవుడే లేడా? అలాగు వున్నట్లయితే ఆయన ఎవరు? 

 జవాబు: సువార్తికులు, పాష్టర్లు, సేవకులు విశేషముగా, విశ్వాసులు సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్న అడుగుటను బట్టి (1) దైవత్వమును గూర్చి తెలియనివారు (2) క్రీస్తును విశ్వసించటానికి మనసు లేనివారు (3) అమాయకత్వము గలవారని గ్రహించాలి. 2000 సం॥రాల పూర్వము దేవుడు లేడా? అని ప్రశ్నించుట అమాయకత్వాన్ని వెల్లడపరుస్తోంది. దేవుడు లేనిది సృష్టిలేదు. సర్వసృష్టికి కారణభూతుడు దేవుడే, మీరడగవచ్చు సృష్టికి కర్తయైన వానిని విడిచి, 2000 సం॥రాలకు ముందు పుట్టిన యేసును ఏలాగు దేవుడంటారు? అని. 

 ఆస్థికులైన వారెల్లరు అంగీకరించే ఓ వాస్తవము, సృష్టియావత్తు ఓంకారమగు శబ్దము నుండి కలిగినదని ‘ఓం’ దీనిని గ్రీకు భాషలో ‘లోగాస్’, హెబ్రీ భాషలో ‘డాబస్’ ఇంగ్లీష్ భాషలో (ది వోర్ట్) అన్నారు. తెలుగులో ‘వాక్యము’ అని అర్ధమైయున్నది. ఆదియందు దేవుడు వాక్యమైయుండెను. యోహాను (1:1) వాక్యమనగా పదముల సముదాయము, పదమనగా అక్షరములు పొందిక, అక్షరమనగా నశియింపనిది, దీనినే బ్రహ్మశబ్ధమన్నారు. ‘బ్రహ్మ’ అంటే ‘ఆత్మ’ శబ్ధము’ అనగా ‘స్వరము’ దేవుడు ఆత్మ గనుక ఆత్మ స్వరూపుడైన దేవుడు భూమి కలుగనుగాక, ఆకాశము కలుగునుగాక, వెలుగుకలుగునుగాక అంటు తన వాక్ శక్తి చేతనే సర్వమును సృష్టించాడు. మానవుని సృజించినాడు. వీనికి అన్ని అధికారము లిచ్చి ఒక హెచ్చరిక అనగా మంచి చెడు మి శ్రితమైన పండ్లును తినవద్దు అన్నాడు. ఆదామవ్వలు సాతానుచేత మోసము చేయబడి దేవుని మాటను ఉల్లంఘించి, పాపము కట్టుకొన్నారు. అలాగే ఆ పాపపు బీజము వారి తరములన్నిటను వేరుపారింది. వారి పాపములను పరిహరించు నిమిత్తము మోషే ద్వారా పది ఆజ్ఞల నిచ్చి బలుల విధానమును గూర్చి చెప్పాడు దేవుడు. వీరు ఆ పది ఆజ్ఞలను నెరవేర్చలేక ఇంక పాపము కట్టుకొన్నారు. కావున దేవుడు తన స్వహస్తములతో నిర్మించుకొన్న మానవజాతి నాశనము కాకుండ వారు నిత్యజీవము పొందాలంటే మానవుల నిమిత్తము దేవుడే నిత్యబలిగా మారి తన శుద్ధ రక్తప్రోక్షణ ద్వారా రక్షణ పంచిపెట్టాలను కొన్నాడు. కావున ఆదియందు బ్రహ్మశబ్దమై యున్న దేవుడు అనగా ఆత్మయును వాక్యమునై యున్న మహోన్నతుడు, శరీరాకరముతో ఈ లోకమునకు అరుదెంచవల్సి వచ్చింది. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు (యెహాను 1:1-3) వాక్యమే దేవుడు దేవుడే వాక్యము, సమస్తము ఆయన మూలముగా కలిగెను. 

 యోహాను 1:14 లో గమనించినచో “ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” అని వ్రాయబడియున్నది Who Was God 2000 Years Ago Telugu Bible

 ఆదియందు ఓంకార స్వరూపుడుగాను అనగా బ్రహ్మశబ్ధముగాను వాక్యముగా వున్న దేవుడు మానవజాతికి పాపవిమోచన ప్రసాదించు నిమిత్తమై గత రెండు వేల సంవత్సరాల క్రితము శరీరము దాల్చి ఈ లోకానికొచ్చాడు. అప్పుడాయన యేసు అను పేరుతో పిలువబడ్డాడు. ఆయన ఆత్మయై శరీరముతో ధరణికొచ్చాడు. కాబట్టి అభిషిక్తుడను అర్థమిచ్చు ‘క్రీస్తు’ అనే బిరుదు పొందాడు. ఆయనే వాక్యమై సర్వమును సృష్టించిన సర్వాధికారి గనుక ‘ప్రభువు’ అని పిలిచారు, కాబట్టి ప్రియ పాఠకులారా! ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి 2000 సం॥రాలే కదా! అంతకు ముందు దేవుడెవరు అంటే దడుచుకోకండి. ధైర్యముగా సమాధానము చెప్పుటకు సిద్ద మనస్కులు కండి. ఒక పర్యాయము యూదులు ప్రభువైన యేసుక్రీస్తునే ఈలాగు ప్రశ్నించారు’ అందుకు యూదులు నీకింకను ఏబది సంవత్సరములైనను లేవే నీవు అబ్రహామును చూచితివా? అని ఆయనతో చెప్పగా యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను వున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 8:57 – 58) అని యేసు స్పష్టం చేశాడు. కావున మీరు మిమ్ములను ప్రశ్నించువారికి సూటిగా సమాధాన మిచ్చునట్లు సిద్దమనస్కులుకండి. దేశాన్ని దేవునికి స్వంతం చేయండి ప్రభువు మీకు తోడుండునుగాక!Who Was God 2000 Years Ago Telugu Bible


For Pdf Download ….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.