ధేవుని ప్రేమ | Gods Love Sunday School Stories In Telugu 1

ధేవుని ప్రేమ

Gods Love Sunday School Stories In Telugu

 దట్టంగా మంచు కురుస్తున్న ఒక రాత్రి, అమెరికన్ ప్రెసిడెంట్ అవకముందు “రీగన్” కార్లో వేగంగా వెళ్తున్నాడు. అలా వెళ్తూండగా ఒక పెద్ద రాయి వచ్చి వెనుక భాగాన పెద్ద చప్పుడుతో బలంగా తగిలింది. ఒక్కసారిగా కంగారుపడి రోడ్డు పక్కగా కారు ఆపుచేసి దిగాడు రీగన్. 

 అక్కడో కుర్రవాడు చేతిలో మరోరాయితో సిద్ధంగా నిలబడి వున్నాడు. కట్టలు తెంచుకునే కోపంతో రీగన్, అతడి చెంప బ్రద్దలు కొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణచుకుని – “ఏయ్, పిచ్చెక్కిందా? ఎందుకిలా చేసావ”ని నిలదీసాడు. 

 అప్పుడా కుర్రవాడు, ప్రవాహం లాగ వెళ్తూన్న కార్లను చూపిస్తూ – “ఏం చెయ్యను? రోడ్డు మీద కాలినడకన నడుస్తూన్న వారు ఎవరూ లేరు. గంటసేపటినుంచీ చేత్తో ఆపుతే ఎవరూ కారు ఆపటం లేదు” అన్నాడు. Gods Love Sunday School Stories In Telugu

 “అందుకని రాయితో కొడతావా? ఇంతకీ ఎందుకు కొట్టావు చెప్పు?” అతణ్ణి పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్న ఆవేశాన్ని బలంగా అణుచుకుంటూ అడిగాడు రీగన్. 

 అప్పుడు ఆ కుర్రవాడు రోడ్డుకి ప్రక్కగా చక్రాల కుర్చీలోంచి గడ్డిలో పడిపోయిన ఓ వృద్ధుణ్ణి చూపించాడు… “నేనొక్కడినే ఎత్తి కూర్చోపెట్టలేకపోయాను. గంట నుంచీ ఎవరూ ఆగటం లేదు” అన్నాడు. రోడ్డు ప్రక్కన వరుసగా చెట్లు వున్నాయి. ఆ చెట్లని ఆనుకుని ఎత్తయిన కాలిబాట వుంది. ఈవెనింగ్ (సాయంత్రం) వాక్కి జనం ఆ కాలిబాట మీద నడుస్తారు. చక్రాల కుర్చీ అక్కణ్ణుంచీ క్రిందపడిపోయింది. అది అలా జారుకుంటూ దారిప్రక్కన చెట్ల మధ్యకు దూసుకునివచ్చింది. Gods Love Sunday School Stories In Telugu

 కుర్రవాడు ఒక్కడే ఆ వృద్ధుడి బరువు మోయలేకపోయాడనుకొన్నాడు రీగన్. వృద్ధుడిని ఎత్తి కుర్చీలో సరిగ్గా కూర్చోపెట్టి ఆ కుర్రవానితో“పెద్ద వాళ్ళని  షికారుకి తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా నడపాలి కుర్చీని” అన్నాడు. 

 ఆ కుర్రవాడు అయోమయంగా రీగన్ వైపు చూస్తూ – “ఆయన నాకేమి కాడే” అన్నాడు. అంతటితో రీగన్ ఆశ్చర్య చకితుడయ్యాడు. “ఏమీ కాని వాని కొరకు… ఈ చలిలో… మంచు దట్టంగా కురుస్తూంటే… యింత గొప్ప ప్రేమను చూపించావా?” అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో వెనుదిరిగాడు రీగన్. 

 రీగన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఆ కారుని తనతో పాటే వుంచుకున్నాడు. మీటింగుల్లో ఈ సందర్భం గూర్చి చెప్పాల్సివస్తే, “దానిమీద రాయి దెబ్బ నాకు దేవుని ప్రేమకు గుర్తుగా కనపడుతుంది” అని చెప్పేవాడు!  Gods Love Sunday School Stories In Telugu

 పిల్లలూ, కథ చదివారు కదా! అమెరికా ప్రెసిడెంట్ అంతటివానిని ప్రభావితం చేసింది ఈ చిన్న సంఘటన. మనం కూడా ఆపదలో నున్నవారికి సహాయం చేస్తే, మనలోని దేవుని ప్రేమను అనేకులు చూడగలుగుతారు. ప్రభువు మనల్ని ఎలాగు ప్రేమించాడో, మనం కూడా ఇతరులను ప్రేమించవలసి యున్నది. 

 మంచి సమరయుని కథలో యేసయ్య ఏమన్నాడో తెలుసా? – “కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు – అతనిమీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు – నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను” (లూకా 10:36,37). 

 వృద్ధులనూ, పేదలనూ, బలహీనులనూ మనం ఆదుకొని, వారికి సహాయం చేస్తే, ఖచ్చితంగా మనం మన ప్రభువుకే సహాయం చేసినవారమవుతాం! 

 “”బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును” అని బైబిలు సెలవిస్తోంది (సామెతలు 19:17). 


For Pdf Download….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.