666 ముద్ర అంటే ఏమిటి ?
What is 666 in the Bible telugu
“మరియు ఆ మృగము యొక్క ప్రతి మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనివారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కొద్దివారుగాని, గొప్పవారుకాని, ధనికులు గాని, దరిద్రులుగాని, స్వతంత్రులు గాని, దాసులుగాని అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు. ఇందులో జ్ఞానము కలదు” (ప్రకటన 13:15-18).
క్రీ॥శ॥ 95-96 సంవత్సరాలలో పత్మాసు ద్వీపమందు భక్తుడైన యోహానుండగా ప్రభువైన యేసుక్రీస్తు తనకు ప్రత్యక్షమై ప్రకటన గ్రంథము వ్రాయించెను. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథమే – ప్రవచన గ్రంథము. ప్రవచనము అనగా సుదీర్ఘకాలము తరువాత సంభవింపబోవు సంగతులనుగూర్చి ముందుగానే తెలియ జేయుటను ప్రవచనమని అందురు.
క్రీ॥శ॥ 95-96 మధ్యకాలములో అంత్యకాలమందు సంభవింపబోవు వాటిని గూర్చి యేసుక్రీస్తు యోహానుకు తెలియజేసిన వాటిలో నొకటి 666 అను మర్మము. దీనిని గూర్చి బైబిలునందు వ్రాయబడినట్టే ప్రస్తుతకాలమందు జరుగుచుండగా ప్రపంచ మందు చూడకలుగుచున్నాము. దానిని నా పాఠకులైన మీకు తెలియజేసి ఆయన రాకడకు ఆయత్తపరచవలెనన్న ఆరాటము. అందుకే వాటిని గూర్చి మీకు వ్రాయుటకు పూనుకొన్నాను.ప్రకటన 13వ అధ్యామందున్న క్రీస్తు విరోధి వాని అధికారము, వాడు నిలువబెట్టు మృగముయొక్క ప్రతిమ, మొదలగు క్రీస్తువిరోధి యొక్క పరిపాలన యేసుక్రీస్తు రెండవ రాకడ తరువాతే కదా? అలాంటప్పుడు రెండవ రాకడకు ముందు క్రీస్తు విరోధి రాకడ ఏలాగు జరుగునని కొందరిలో ధర్మసందేహాలు కలుగుట పొరపాటేమి కాదు, కాని లేఖనములను మరింత జాగ్రత్తగా పరిశోధింపబద్ధులమైయున్నాము.
“మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు (2థెస్స 2:3). యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి వ్రాయుచున్న పౌలు థెస్సలోనికలో ఉన్న సంఘమును బలపరుస్తూ ఈలాగు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు రాకడ వచ్చుటకు ముందుగా ప్రపంచమంతట భ్రష్టత్వము సంభవించాలి. ఆపై నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడాలి, అప్పుడే ఆ దినము వచ్చునని భక్త పౌలు చెప్పుచున్నాడు. నాశనపాత్రుడుగు పాపపురుషుడని చెప్పబడినది రానున్న ప్రపంచ నియంతయగు క్రీస్తు విరోధిని గూర్చియే. కావున యేసుక్రీస్తు రాకడకు ముందు నాశనపాత్రుడగు క్రీస్తు విరోధి బయలుపడాలి. అనంతరము వాడు ప్రభుత్వమును పొంది ఏడు ఏండ్లు సర్వప్రపంచమును తనకిష్టమొచ్చి నట్లుగా పరిపాలన చేస్తాడు.ఆ పాలన కాలమందున వాడు 666 సంఖ్యగల ముద్రను ఉపయోగించి, ప్రపంచమంతటిని తన కనుమేరలో ఉంచుకొంటాడని యేసుక్రీస్తు పత్మాసు ద్వీపములో యోహానుద్వారా వ్రాయించాడు. నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడాలని చెప్పి ఊరుకోలేదు. బైబిలు ఎక్కడనుండి రావలెనని కూడా బైబిలు పేర్కొనియుండుట ఆశ్చర్యమైయున్నది.
“ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్న కొమ్ము మొలచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను” (దానియేలు 8:9). దానియేలునకు కలిగిన దర్శనమందు నాలుగు కొమ్మలకు మధ్య మొలచిన చిన్న కొమ్మనుగూర్చి ప్రవచన పరిశోధకులందు రానున్న ప్రపంచ నియంతయగు క్రీస్తు విరోధి సిరియ లేదా గ్రీసుదేశము పుట్టునని ఎదురుచూచుచుండగా 1955 సం॥ సిరియా దేశమందు సామిల్ హమ్మదు అనునొకడు జన్మించియున్నాడు. వాడు పుట్టినప్పుడు వానినొసట కొంత వాపుగా ఉండెనుగాని దానిద్వారా బిడ్డ ఏడ్చుటయైనను క్రుంగుటయైనను ఏదియు లేకుండెను. ఆ బాలుడు ఎదుగుచుండిన కొలది నొసట నుండిన వాపు మూడు అంకెలుగా బయలుదేరెను. ఆ మూడు అంకెలు 666గా మారెను. దీనిని గమనించిన వారి Family Doctor యైన డా॥ నిమ్రోను – ఆరువందల అరువదియారు సాతానుయొక్క లేదా క్రీస్తు విరోధి సంఖ్యని బైబిలునందు వ్రాయబడి యున్నది గనుక దాని సర్జరి చేయమంటారా? యని అడిగినందుకు సామిల్ హమ్మదు నేను ఈ సంఖ్యతో జన్మించక పూర్వము మా కుటుంబీకులు ఒకపూట అన్నము కొరకు కూడా ఇబ్బందిపడేటివారు. నేనెప్పుడు ఈ సంఖ్యతో పుట్టానో అప్పుడే ఆస్తి, అంతస్థు, కారు బంగళా మరియు Money power and men power మాకు వచ్చాయి గనుక దీని సర్జరీ చేయుట నాకిష్టములేదని అన్నాడు. దీనిని 1994 సెప్టెంబరు 15 భాగ్య Fort night పత్రికలో ముద్రించిరి. E.E.C లో సభ్యత్వము వహించుచున్న రాజ్యాలు, ప్రవచన పరిశోధకులు సమస్త నాయకుల కనుదృష్ఠి సామిల్ హమ్మదుపై పెట్టి యున్నారు. అనగా నాశనపాత్రుడగు పాపపురుషుడు ఏ దిక్కున నుండి వచ్చునని ప్రవచన పరిశోధకులు ఎదురుచూచారో ఆ ప్రకారమే సిరియాలో పుట్టి ఆరువందల అరువదియారు సంఖ్యను నొసటను కలిగియున్నాడు అంటే పౌలు చెప్పిన పాప పురుషుడు బయలు పడినట్టే.వీడి పరిపాలన కాలమందు చాకచక్యముగా 666 సంఖ్యగల ముద్రను కుడిచేతిమీదనైనను లేదా నొసటి మీదనైనను వేయించుకొనునట్లు బలవంతము చేయునని, ఆ ముద్రగల వారే క్రయవిక్రయములు చేయుటకు అధికారము గలవారని వాడు ప్రకటించునని ప్రకటన గ్రంథము చెప్పియుండుట మీరు చదివియున్నారు.2012 సం||లో ఐరోపా ఖండమంతయు మైక్రోచిప్ అను పేరుతో ఒక చిపన్ను ఆ ప్రజలందరు ధరించియున్నారు. ఆ చిప్ కేవలము బియ్యపు గింజంతేయున్నది. దీనిని గూర్చి అంతకు పూర్వము అనగా 2006 డిసెంబర్ 6 నాటి దినమౌతుంది. దినపత్రికలో ముద్రించినపుడు ఆ చిప్లో 666 ఉన్నదని వెల్లడిచేయడమైంది.
2012 ఐరోపా నందు ప్రవేశిస్తే, మనకు చాలా దూరముగా ఉన్నదని భావించాను. 2016 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురై G.H ఆసుపత్రిలో పుట్టిన పిల్లలకు లేసర్ ద్వారా ఆ చివు Inset చేసారు. అంతమాత్రమే కాకుండా చెన్నైలోని తండైయారు పేటలోనున్న ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఆ చిపన్ను పరిచయము చేసి, దాని వేయించు కోవల్సిందని ఒత్తిడి చేయసాగారు. దీనినిబట్టి అర్ధము చేసికోంది. ఆయన అనగా యేసుక్రీస్తు రాకడ ఎంత సమీపముగా ఉన్నదో?కాబట్టి ప్రియులారా, పాఠకులారా! మీరెల్లరు ఏమరుపాటు నుండి విడువబడక సిద్ధముగా ఉండి ఆయన రాకడలో ఎత్త బడుటకు తగిన పరిశుద్ధత కలిగియుండాలనిఆశిస్తున్నాను.
బైబిల్ లో మీకు తెలియని విషయాలు తెలుసుసకోవడానికి క్లిక్ చేయండి.