అబద్ద బోధకుల లక్షణాలు |22Warning Signs of False Teachers| telugu

అబద్ద బోధకుల – లక్షణాలు 

Warning Signs of False Teachers

దేవుని మందపైన తోడేళ్ళు దాడి చేసి గొఱ్ఱెలను ఈడ్చుకుని పోయి చీల్చి వేస్తున్నా, కావలి వారి వంటి కాపరులు కునికి నిద్ర పోతున్నారు. సంఘము లోనికి దొంగలు దూరి గొర్రెలను తోలుకుపోతున్నా, జీతగాళ్ళ వంటి కాపరులు కనిపెట్టకుండ, కనికరం లేకుండా, కసాయిశాలకు వాటిని వెళ్ళి పోనిస్తున్నారు!

“కొంతమంది మనం సత్యం బోధిస్తే చాలును, తప్పుడు బోధలపై దాడి చేయనక్కరలేదు; గొఱ్ఱె చర్మాల్లో వున్న తోడేళ్ళను గూర్చి ‘హెచ్చరిక’ చేయనక్కరలేదు అని అంటారు. ఈనాడు చాలామంది కాపరులు మోసపు తోడేళ్ళను పొగడ్డం, ప్రేమించడం, ప్రఖ్యాతి గాంచినది. కాని, ఎప్పుడైతే కాపరి తోడేళ్ళ గూర్చి ప్రశంసిస్తూ మాట్లాడతాడో, ఇక గొఱ్ఱెలకు శ్రమ!” అని కాల్వరి కంటెండర్ పత్రిక పేర్కొంది.

“తోడేలుకు కనికరం చూపుట గొఱ్ఱెలకు క్రూరత్వాన్ని చూపడమే” అని వ్రాసాడో ప్యూరిటన్ భక్తుడు.

“అబద్ధబోధను సహించి, భరించేంత కనికరమును చూపే ప్రేమను కలిగియుండుటకు నేను అనుమతింపబడలేదు. ఎప్పుడైతే విశ్వాసానికి, బోధకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు ప్రేమ లేక ఓర్పు, సహనము లేక కనికరము కాదు కావల్సింది…. కేవలం కోపం, వాదం మరియు వినాశనమే – అయితే మన ఆయుధం దేవుని వాక్యమే అయి ఉండాలి!” అని రోషంతో వ్రాసాడు మార్టిన్ లూథర్. (తీతు 1:9) చదవండి.

“తన యజమాని పై దాడి జరిగినప్పుడు కుక్క మొరుగుతుంది. దేవుని సత్యంపై దాడి జరుగుతున్నప్పుడు నిశ్శబ్ధంగా చూస్తు ఊరకుంటే నేను పిరికిపందనే అవుతాను” అన్నాడు జాన్ కాల్విన్ ! 

యేసు ప్రభువు శ్రమల ఖడ్గమును గూర్చి, ధనాపేక్షను గూర్చి, సుఖభోగాల్ని గూర్చి, హెచ్చరించుటయే కాక ఎక్కువగా పరిసయ్యుల “పులిసిన పిండి” అను దొంగబోధను గూర్చి హెచ్చరించాడు!

పులి పిండి చిన్నగా ప్రారంభమై, రహస్యంగా పనిచేస్తూ, నిశ్శబ్దంగా ముద్దలోపల ప్రబలుతూ, మెల్లగా ముద్దంతటిని పులియజేస్తుంది. తప్పుడు బోధలు ఎవరి హృదయంలో నాటబడతాయో వారిని పాడు చేస్తాయి.

“ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు….” (2 కొరింథీ 11:14-15).

ఇందుచేత అంత త్వరగా అనేకులు వారిని గుర్తించలేకపోతున్నారు! వారిలో కూడా “వెలుగు” వుందని వారి బోధలో కూడా “నీతి” వుందని చులకనగా వంచనకు గురైపోతున్నారు. ప్రియ క్రైస్తవులారా, మనం కన్నులు తెరవాల్సిన “కాలం” వచ్చింది. విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడైన క్రీస్తును చూడవలసిన “ఘడియ” వచ్చింది. సత్యస్వరూపియైన పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడాల్సిన “సమయం” ఇదే!

గోధుమలతోపాటు గురుగులు పెరిగినట్లు సంఘ ప్రారంభం నుండి తప్పుడు బోధలు ప్రబలుతూ వచ్చాయి. అయితే వాటిని గుర్తించి జాగ్రత్త పడుటలో దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు!!

“సత్య సువార్త” కన్న ఈనాడు “అసత్య సువార్త” ఎక్కువగా ప్రకటింపబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేవుని సంఘము తరుగుతూ వుంటే సాతాను సమూహాలు విపరీతముగా పెరుగుతూ వున్నాయి!! ఈ కల్ట్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నట్టు నిపుణుల అంచన.

“ప్రవక్తలు అబద్ద ప్రవచనములు పలికెదరు… అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము” (యిర్మీయా 5:31) ప్రస్తుతం ప్రతిచోట ఇదే ఎక్కువగా జరుగుతోంది! ఈ పుస్తకంలో క్రైస్తవ లోకంలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన కల్న ఎక్స్పోస్ చేయుటకు ప్రభువు సహాయం చేసారు.

“కల్ట్” అన్న ఆంగ్లపదం “కల్టస్” అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. దాని అర్థం “దేవుని యెడల భయభక్తులు” లేక “దేవుని ఆరాధించుట.” మూల అర్థమును బట్టి అది మతపరమైనదని గ్రహించవచ్చును. కాని అది నిజ దేవుని యెడల భయభక్తులు లేక నిజ దేవుని ఆరాధించుట కాదు! “అబద్ధముతో నిండి – వాక్యానుసారముగా స్థాపింపబడిన సంఘానికి భిన్నంగా, ఒకరు లేక ఇద్దరు నాయకుల ఆద్వర్యాణ ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడిన వేరైన మత గుంపు” ను కల్గా భావించవచ్చును.

అనేక క్రైస్తవ కల్ట్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలామణి అవుతున్నాయి! వారి మూల ధ్యేయం సువార్తీకరణ కాదు, క్రైస్తవీకరణ (ప్రొటెస్టంట్ క్రైస్తవుల్ని తమ గుంపుల్లోనికి చేర్చుకొని భ్రష్టుల్ని చేయం!) కల్ట్ను నిజ క్రైస్తవ్యం నుండి ఎట్లు గుర్తించరు?

కల్ట్ యొక్క లక్షణాలు : 

1. బైబిల్ని వక్రీకరించి తప్పుడు అర్థాలను తీసి బోధిస్తారు. వాక్యానికి కలుపుతారు లేక దాని నుండి తీసివేస్తారు.

2. బైబిల్ అధికారాన్ని ప్రశ్నించి దానిని దేవుని వాక్యముగా గుర్తించరు.

3. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ కాదు కాని విశ్వాసంతో పాటు క్రియలు వుండాలని వాదిస్తారు.

4. వారు ఆరాధించే దేవుడు బైబిల్లో బయలుపరచబడిన దేవుడు కాడు (2 కొరింథీ 11:3 లోని వేరే యేసు).

5.మూల సిద్ధాంతాలను తారుమారు చేసి మార్చవేస్తారు. దేవుని ప్రత్యక్షత పూర్తిగా బైబిల్లో వున్నా, ఇంకా ప్రత్యక్షతలు కలుగుతూనే వుంటాయని నమ్ముతారు.

6. బైబిల్తోపాటు వేరే గ్రంథాలను, వ్రాతలను కూడా దైవ వాక్యముగా భావిస్తారు.

7. బహిరంగంగా ఒకటి బోధిస్తారు. రహస్యంగా మరొకటి బోధిస్తారు.

8. మేమే ‘శేషము’, మా గుంపే దేవుని ప్రజలు, క్రీస్తు వధువు.మిగతా క్రైస్తవులు దేవుని సంబంధులు కారని ప్రకటిస్తారు.

9. తప్పుడు ప్రవచనాలు ప్రకటిస్తారు – తేదీలు నిర్ణయిస్తారు.

10. నిజ క్రైస్తవ్యాన్ని బహుగా దూషిస్తారు, ఖండిస్తారు.

11.యేసుని దేవునిగా నమ్మరు, దేవుని కుమారునిగా అంగీకరించరు,ఆయనకు వ్యతిరేకంగా బైబిలు భిన్నంగా బోధిస్తారు.

12. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని త్రోసిపుచ్చుతారు, వ్యక్తి కాదు కేవలం శక్తి అనిమభ్యపెడతారు.

13. విశ్వాస సంబంధమైన ప్రశ్నలకు జవాబులన్ని ఎరుగుదమని అతిశయిస్తారు (ద్వితీయో 29:29)

14. గుంపు నాయకుడు, దేవునికి ప్రజలకు మధ్య నాయకుడిగా నిలబడి అధికారం చెలాయిస్తాడు.

15. గుంపు నాయకుడు లేక నాయకులు ప్రవక్తలని, వారి ద్వారానే దేవుడు  మాట్లాడతాడని చెబుతారు.

16. విశ్వాసుల నమ్మకత్వాన్ని దేవునికి, సంఘానికి మధ్య విభజిస్తారు.గుంపులకే కట్టుబడి వుండేట్లు చేస్తారు.

17. లోకంలోని ఇతరులకు తాము వ్యతిరేకంగా వుంటూ అందరిని దూరం చేస్తారు.

18. అంత్యదినాల గూర్చి మరియెక్కువగా నొక్కి వక్కానిస్తారు – తప్పుడు లెక్కలు కడతారు.

19. మనిషి, ఆత్మపై నిత్యత్వముపై వేరు వేరు భావాలు కలిగి యుంటారు.

20. మానవుని స్వభావమును గూర్చి – పాపమును గూర్చి బైబిల్కి  వ్యతిరేకమైన అవగాహన కలిగియుంటారు.

21. కొందరు విచ్చలవిడి జీవితాన్ని ప్రోత్సహిస్తే మరి కొందరు నియమ నిబంధనలతో కట్టుదిట్టం చేస్తారు. విపరీతాలను పోషిస్తారు.

22. తమ సభ్యుల శరీర, ఆత్మ, ఆస్తుల మీద, కుటుంబాల మీ  సర్వాధికారం చేస్తారు!

ఇటువంటి కల్ట్ గుంపులను మీరు ఎదుర్కొనప్పుడు జాగ్రత్త!! లేక ఒకవేళ వాటిలో మీరు వుంటే వెంటనే వాటి నుండి బయటపడి వాటిని విసర్జించండి… అనేకులకు స్పిరిచ్యువల్ ఫిల్టర్స్ లేక వాటి బారిన పడిపోతున్నారు! కిల్లర్ కల్ట్స్ నుండి క్రీస్తు యేసు మాత్రమే నిన్ను రక్షించగలడు. నీ కన్నులెత్తి ఎల్లప్పుడు ఆయన వంకే చూడు. ఆయన వాక్య సత్యమును తెలుసుకో. సత్యము మిమ్మును స్వతంత్రుల్ని చేయును గాక!


ప్రసంగ శాస్త్రం అనే subjcet నేర్చుకోవడానికి కిందహ ఉన్న బటన్ క్లిక్ చేయండి.

click here

3 thoughts on “అబద్ద బోధకుల లక్షణాలు |22Warning Signs of False Teachers| telugu”

Leave a comment

error: dont try to copy others subjcet.