నోవహు జలప్రళయం|noahs flood fact or fiction scientists answer|

నోవహు జలప్రళయం కథా

లేక చరిత్రలో జరిగిన వాస్తవమా

noahs flood fact or fiction scientists answer

విమర్శ : బైబిలు నందు చరిత్ర, దేవుని ప్రవచనవాక్యములేకాక, అనేకమైన కథలున్నాయి. అందులో అద్భుత కల్పన కథ జలప్రళయ కథయని  బైబిలును విమర్శించియున్నారు. బైబిలోలోని ‘జలప్రళయము” కల్పన కథ? లేక చరిత్రలో జరిగిన వాస్తవమా? 

జవాబు : పరిశుద్ధగ్రంథమగు బైబిలునందు వ్రాయబడియున్న సంఘటనటలన్నియు చరిత్రలే గాని కవి కలమునుండి వెలువడిన కల్పనలు కావు. ఒక వేళ కొందరు తమ దృష్టికి తామే జ్ఞానులమను కొనువారు, బైబిలునందు గొప్ప గొప్ప పొరపాట్లు కనిపెట్టేసామని తలంచుకొనువారు సహజంగా ఆలోచించిన సత్యాన్ని కొంతయిన అర్థము చేసికొనగలరు. వారు భావించినట్టు బైబిల్ నందు కల్పనలుంటే బైబిల్ గ్రంథము కూడ మిగిలిన గ్రంథముల వలె ఏదోక చోట మూలపడియుండేది. అలాగుకాక ప్రపంచ ప్రజలలో అత్యధిక హృదయాలలో పరిశుద్ధగ్రంథము నివసిస్తున్నదంటే కారణమేమిటి? అది తదితర గ్రంథముల వలె కవి కలములనుండి కాక, దేవుని హృదయమునుండి బయలు దేరినదని సామాన్యముగా గ్రహింపగలరు. 

నోవహు దినములో సంభవించిన జలప్రలయము కథ? లేదా చరిత్రలో జరిగిన వాస్తవమా? పరీక్షించండి! సత్యాన్ని అన్వేషించండి. క్రీ॥శ॥ 1882 సం॥ “బ్రిటీష్ మ్యూజియము”నకు చెందిన డా॥స్మిత్ “నీనెవె”లో పురావస్తు పరిశోధనలు చేస్తుండగా Gilvamesh eprc అనుబడు కొన్ని శిలా శాసనములు కనుగొన్నాడు. డా॥స్మిత్ కనుగొనిన గిల్వామెస్ శిలా శాసనములలో నోవహు జలప్రళయమును గూర్చి వ్రాయబడి యున్నది. 

క్రీ.శ॥ 1883 సం॥నందు “పెరోసస్” అను భూగర్భ పరిశోధకుడు గ్రీకు దేశములో “పెర్షియా” ప్రాంతములో త్రవ్వకాలు చేస్తుండగా గ్రీకులనాటి నాణెములను కనుగొన్నాడు. పెరోసస్ కనుగొనిన నాణెములకు ఒక వైపు ఒకే కొమ్ముగల మేకపోతు బొమ్మగుర్తును, మరోవైపు అలలపై తేలుతున్న ఓడ యొక్క గుర్తులున్నవి. యిందువలన గ్రీకుల కాలము నుండి కూడ నోవహు జలప్రళయము నిజమని నమ్మబడు చున్నదని భూగర్భ పరిశోధకుడైన పెరోసస్ తెలియజేస్తున్నాడు. 

క్రీ.శ॥ 1955 సం॥ ఫ్రాన్స్ దేశమునకు చెందిన శాస్త్రజ్ఞులు యిద్దరు అనగా ఫెర్నాండో, నావరా అరారాతు కొండకెల్లి నోవహు ఓడను వెదకి యున్నారు. ఎందుకనగా నోవహు ఓడ అరారాతు కొండపై నిలిచినట్లు బైబిల్ చెప్పుచున్నది. అంచేత వీరు అరారాతు కొండకెల్లి పరిశోధిస్తుండగా ఆ పర్వతము మంచుచేత కప్పబడియున్నందున అత్యధిక సమయము పరిశోధించలేకపోయినన వారు జరిగించిన కొద్దిపాటి పరిశోధనలో ఒక చక్క పలకను తీసికొనివచ్చారు. దానిని BORDEAUX విశ్వవిద్యాలయానికి అప్పగించగా వారు దాని పరిశీలించి యిది దాదాపు 5000 సంవత్సరాల క్రిందటిది. దీనికి కీలు పూయబడినందున చెడిపోలేదని BORDEAUX యూనివర్సిటీ తెలియజేసింది. 

అంతమాత్రమేకాక అమెరికాలోని Institute of Creation Reaserch వారి ఆధ్వర్యములో 300 మంది విజ్ఞానులు అరారాతుకు వెళ్ళి పరిశోధనలు ప్రారంభించారు. చివరికి వారు కూడ ఫెర్నాండో, నావరా తెచ్చిన చెక్కను పరిశీలించిన బోర్డ్ ఎక్స్ చెప్పినట్టు అది నోవహు యొక్క డోయేనని స్పష్టం చేసారు. 

మరియు మొదటి శతాబ్దములోని చరిత్రకారుడైన ప్లేవియస్ జోషియస్ రచించిన (యాంటి క్విటీ ఆఫ్ ది జ్యూస్) అను గొప్ప చరిత్రాత్మ గ్రంథము నందు నోవహు జలప్రళయమును గూర్చి సాక్ష్యమియ్యబడియున్నది. నోవహు జలప్రళయం నిజమేననుట సత్యాన్వేషికి పైనిచ్చిన ఆధారములే చాలు. కొన్ని వేల సంఖ్యలో ఆధారములు నావద్ద వున్నవి. బైబిల్లోని జలప్రళయం అబద్ధం కాదు. నిజమని గ్రహించండి! 

రచయిత

dr. j. vasanta babu gaaru


ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి కిందఉన్న లింకు క్లిక్ చేయండి

click here

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a comment

error: dont try to copy others subjcet.