పాస్టర్లు రెవరెండ్ అని పిలువబడుటకు అర్హులా|Are Preachers To Be Called Reverend5

ప్రశ్న: రెవరెండ్ అనగా నేమి? మనుష్యులు రెవరెండ్ అని పిలువబడుటకు అర్హులా? లేదా అనర్హులా? దీనిని గూర్చి బైబిల్ ఏమంటుంది? 

Are Preachers To Be Called Reverend5

జవాబు: రెవరెండ్ (Reverend) అనగా పూజనీయుడు, పూజార్హుడు లేదా పూజింప తగినవాడని భావము. నిర్గమ కాండము 20:1-4 లో దేవుడైన యెహోవాను తప్ప దేని (ఎవరినైనను పూజింపకూడదని ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు.

కావున పూజార్హుడు దేవుడు. పూజచేయు వాడు భక్తుడు, పూజచేయవల్సిన భక్తుడు ఏలాగు పూజార్హుడు కాగలడు? అలాగైనచో భక్తులైన వారు Reverend అని పిలువబడుట న్యాయమా? అది ఎంతమట్టుకు సమంజసమో ఆలోచించండి!

దానియేలు 3 వ అధ్యాయము 28 మరియు 29 వచనములలో “నెబుకద్నెజరు షడ్రకు, మేషాకు, అబేద్నగోయను వీరి దేవుడు “పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, యే దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విదముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఏ జనములలోగాని, ఏ రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని, షడ్రకు, మేషాకు, అబేద్నగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియులుగా చేయ బడును; వాని యిల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండవలెను” నెబుకద్నెజరు అంటున్నాడు. షడ్రకు, మేషాకు, అబేద్నగోల దేవుడే పూజార్హుడని! దేవాది దేవుడైన యెహోవా కాక ఇంకెవ్వరు మానవులలో పూజార్హులు కాగలరు? పరిశుద్ధగ్రంథమంతటిలో రెవరెండ్ అను పదము కీర్తన 111:9 లో మాత్రమే ఉన్నది. “తెలుగు బైబిల్ నందు” ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపతగినది” అనుంది. ఇంగ్లీష్ బైబిల్ నందు “He sent redemption unto his people, he hath commnded his covenant for ever holy and reverend is his name” అనుంది. సృష్టికర్తయైన దేవుడు తప్ప ఇంకెవ్వరును రెవరెండ్ అని పిలువబడుటకు యోగ్యులు, అర్హులు కారని దేవుని నామము పేరిట బహు ధైర్యముగా చెప్పుచున్నాను. ఈ రోజుల్లో యేసు గుడ్డాన్ని బాగు చేసాడు, కుంటోన్ని బాగుచేసాడు అని నాలుగు మాటలు చెబితే చాలు వెంటనే వారి పేరును ముందు రెవరెండ్ అనుంచుకొంటారు. అలాగు వ్రాయించుకొనుటయైనను, వేదికలలో పిలిపించుకొనుటయైనను మానవునికి తగదని ప్రభువు పేరిట హెచ్చరిస్తున్నాను.    Rev ఏమిటి?  . Reverend అనగా పూజార్హుడు అని అర్థము కావున ఆ బిరుదు దేవునికి తప్ప వేరొకరికి చెందదు,  పేరునకు ముందున్న Rev ఏదనగా Reverent అని చెప్పాను. రెవరెంట్ అనగా మాన్యుడు లేదా సద్భక్తుడని అర్థమైయున్నది అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:8 లో అలాగుననే పరిచారకులు మాన్యులై యుండవలెను. అని వ్రాయబడినది దీన్ని english bible లో చూచినట్లయితే like wise deacons must be reverent అనుంది. Reverent అనగా భక్తిగలవాడని LIFCO నిఘంటువు తెలియజేస్తోంది. కావున 1 రాజులు 4:9లో వ్రాయబడినట్లు దేవునియందు భక్తిగల Reverent నే గాని Reverend కాదని స్పష్టం చేసాను.  కావున దేవుడే రెవరెండ్, మానవుడు కాదు, దైవజనుడు ఇక మీద Reverent అని పిలువ బడుటకే ప్రయత్నించండి


ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి కింద క్లిక్ చేయండి.

click here

Leave a comment

error: dont try to copy others subjcet.