త్రిత్వ వివరణ.
Trinity Explanation In Telugu
త్రిత్వం క్రైస్తవ వేదాంతశాస్త్రంలో ఒక ప్రధానమైన సిద్ధాంతం. త్రిత్వం మరొక మాటలో దేవత్వం (Godhead) అని కూడా చెప్పవచ్చు. మానవులంగా దేవత్వాన్ని గ్రహించటం కష్టం. అయితే తనకు తాను దేవుడు మానవాళికి ప్రత్యక్షమయ్యాడు కనుకనే కొంతవరకు మానవులు దేవుని అర్థం చేసుకోగలరు. దేవుని ప్రత్యక్షత ముఖ్యంగా యేసుక్రీస్తు నందు, సృష్టిలో అనగా మానవులకు కూడా అని అర్థం ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్య క్షతను గురించి మనకు బైబిల్లో నివేదించబడింది. కనుక బైబిల్ను ఆధారంగా తీసికొని త్రిత్వ సిద్ధాంతాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం.
త్రిత్వం అనే మాట బైబిల్లో కనుపించదు. అయితే త్రిత్వ సిద్ధాంత నిర్మాణానికి బైబిల్లో ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. మౌలే (Moule) అనే వేదాంతి ఈ విధంగా అన్నాడు. “మొదట దేవుని యొక్క ఏకత్వాన్ని (oneness of God) తదుపరి దేవుని బహుళత్వాన్ని గురించి బైబిల్ గ్రంధం ఏమి చె బుతుందో, అలాగే త్రిత్వంలోని తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు. వారి దైవత్వాన్ని గురించి బైబిల్ ఏమి చెప్పుతుందో తెలిసికొందాం.
దేవుని ఏకత్వం
యూదులకు యెహోవా ఒక్కడే దేవుడు. ఆయన వారికి అద్వితీయ దేవుడు (God is one and he is unique) దేవుని ఏకత్వాన్ని గురించి పాత నిబంధనలో అనేక చోట్ల ప్రసావించబడింది. మోషే ద్వారా దేవుడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు” అనునది (నిర్గకా. 20:2-3). ఇతర దేవుళ్ళను, దేవతలను కొలిచే ప్రజల మధ్య ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ విధంగా ఇశ్రాయేలీయులు తమ దేవుని యందు విశ్వాసముంచారు. “మన అద్వితీయుడగు యెహోవా” అని తమ దేవుని గురించి ఇశ్రాయేలీయులు గట్టిగా చెప్పుకున్నారు. (ద్వి.కా. 6:4). ఈ ఆజ్ఞలలో ఉన్నవాటిని తమ పిల్లలు ఆభ్యసించాలని, వాటిని గురించి అన్నివేళల మాట్లాడుకోవాలని సూచనలుగా వాటిని తమ చేతులు మీద వ్రాసుకొవాలని, కన్నుల నడుమ బాసికాలుగా కట్టుకోవాలని దేవుడు ఆజ్ఞాపింపచాడు (ద్వి.కా. 6:7-9). దీనిని బట్టి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతం యూదులలో ఎంత బలమైనదో కనిపిస్తుంది. ఇంకా పాత నిబంధనలో దేవుని ఏకత్వాన్ని గురించి అనేక చోట్ల కనబడుతుంది(ద్వి.కా.6 13;ని. కా15 :10; జెక 14 :9).
క్రొత్త నిబంధనలో కూడా ఒక్కడే దేవుడు అని స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఏకత్వాన్ని గురించి యేసుక్రీస్తు మానవుడుగా అనేక సందర్భాలలో బయలుపరచాడు (మార్కు 10:17-19). ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని చింతింపనవసరం లేదని బోధస్తూ “నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగున అలంకరించిన యెడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును గదా” అని యేసు దేవుని గురించి సెలవిచ్చాడు (మత్త 6:30). దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే పరలోకమందు తండ్రి సమస్తం అనుగ్రహిస్తాడని యేసు తెలిపాడు. ఈ మాటలో తండ్రి దేవుడై ఉన్నాడనే సత్యం కనిపిస్తుంది (మత్త 6:33).
ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు యేసుతో ఆజ్ఞ లలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ప్రశ్నించగా “నీ పూర్ణహృదయముతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనని”అతనితో చెప్పెను (మత్త22:36-37). ఈ మాటలలో కూడా దేవుడు ఒక్కడే అనేది కన్పిస్తుంది. ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞయైనను అనగా దేవుడొక్కడే అనే ఆజ్ఞను కూడా మీరిన యెడల అన్ని ఆజ్ఞ లను మీరినట్లుగా యాకోబు తన పత్రికలో తెలిపాడు. (2:10). తన పత్రికలలో అనేక చోట్ల దేవుడొక్కడే అని పౌలు తెలిపాడు. ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తూ “ప్రభువు ఒక్కడే, విశ్వాసమ ఒక్కటే, బాప్తిస్యమొక్కటే, అందరికి తండ్రియైన దేవుడొక్కడే అని పౌలు తెలియజేసాడు (4:4-5) విగ్రహార్పితం గురించి మాట్లాడుతూ విగ్రహం ఒట్టిదే అని చెప్పి ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడులేడని పౌలు తెలియజేసాడు (4:4-5). (1 కొరింథీ8:5). కనుక పాతనిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడొక్కడే అనే భావం స్పష్టంగా కనిపిస్తుంది.
దేవుని బహుళత్వం
ఇలాగే దేవుని బహుళత్వం (Plurality of God) అనే భావం కూడా బైబిల్లో కనిపిస్తుంది. పాత నిబంధనలో దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, దేవుని ఆత్మ అనే మాటలు మూర్తీ (plurality) కలిగి ఉన్నట్లు చూడగలం. దేవుని వాక్యం మాట్లాడినట్లు (ఆది. కా15:1-5), దేవుని ఆత్మ వ్యక్తులపైకి వెళ్ళినట్లు ( 1 సమూ 10:10; 19:20), అలాగే జ్ఞానం ఘోషించినట్లు (సామె 8,9 అధ్యాయాలు) బైబిల్లో ఉన్నది. ఈ లేఖన భాగాలు, అందలి విషయాలు దేవుని బహుళత్వాన్ని తెలుపుతున్నాయి. తండ్రియైన దేవుడు, వాక్య రూపంలో యేసుక్రీస్తు, జలములపై ఆత్మ అల్లాడటంలో దేవుని సృష్టికార్యంలో బహుళత్వం కనిపిస్తుంది. దేవుని మానవుని సృష్టించిన విధానంలో కూడా దేవుని బహుళత్వం కనిపిస్తుంది. “మన స్వరూపంలో, మన పోలిక చొప్పున నరులను చేయుదము” అని దేవుడే చెప్పుటం మనం చూడగలం (ఆది. కా 11:7). పై సంఘటనలోని “మనము” అనే మాట దేవుని బహుళత్వాన్ని తెలుపుతుంది. ఈ విధంగా పాత నిబంధనలో దేవుని బహుళత్వం కనబడుతుంది.
ఇలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని బహుళత్వం చూడగలం. “తండ్రీ; నా యందు నీవును నీయందు నేనును ఉన్న లాగున” అనే మాటలు యేసు చేసిన ప్రార్థనలో కనబడతాయి (యోహా 17:21). అలాడే “క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ”(రోమా 8:9) అనే మాటలలో కూడా దేవుని బహుళత్వం కనబడుతుంది. యేసు బాష్మీస్మం తీసికొనిన సందర్భంలో పరిశుద్ధాత్మ ఆయన మీద పావురం రూపంలో దిగడం, “ఇదిగో ఈయన నాకుమారుడు ఈయన యందు నేనాదించుచున్నాను” అని యేసును దృష్టించి దేవుడు పలికిన మాటలు దేవుని బహుళత్వాన్ని తెలుపుతున్నాయి. (మత్త.3:16-17). పౌలు కొరింథీ సంఘానికి రెండవ ఉత్తరం వ్రాసి చివరిలో సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు చెప్పుతూ “ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకరందరికి తోడై ఉండును గాక” అని ఆశీస్సులు అందించాడు. ఈ ఆశీర్వాద వచనంలో త్రిత్వంలోని ముగ్గురుఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకా దేవుని గ్రంథంలో అనేకచోట్ల దేవుని బ హుళత్వం మనకు కనబడుతుంది.
- త్రిత్వంలోని ముగ్గురి దేవత్వం (Deity of the three in the Trinity)
త్రిత్వంలోని తండ్రి, కుమారుడు, పరిశుద్దాతుడు- ఈ ముగ్గురు దేవత్వం కలిగి ఉన్నారు. The three are God, but one God-the triune, త్రియేక దేవుడు. ఈ ముగ్గురు ఒకే దేవుడని, ఒకే దేవత్వం కలిగి ఉన్నారని మనం విశ్వసించాలి. దీనికి సంబంధించిన విషయాలు ఇంకా కొన్ని తర్వాత చదువుకొందాం. ముందుగా ఈ ముగ్గురు దేవత్వం కలిగి ఉన్నారనే సత్యాన్ని గమనిద్దాం.
పాత నిబంధనలో కొన్ని చోట్ల మాత్రమే తండ్రి అనే మాట కనబడుతుంది. అయితే యూదులు దేవుడ్ని తమ తండ్రి ఒప్పుకొంటారు. “నాకు తండ్రివి నీవే అబ్రాహాము మమ్ములను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్ములను అంగీకరించకపోయినను యెహోవా నీవే మాతండ్రివి, అనాదికాలము నుండి మా విమోచకుడవని నీకు పేరు గదా” (యెష 63:16) అని ఇశ్రాయేలీయులులలో శేషంగా ఉన్నవారు తెలియచేస్తున్నారు. దేవుడు తమకు తండ్రియని ఇశ్రాయేలీయులు యెషయా ప్రవచనంలో, మలాకీ (మలాకీ 2:10) పలుమార్లు వ్యక్తంచేయబడింది. యెహోవా ఒక్కడే తమకు దేవుడని, తండ్రియని ఇశ్రాయేలీయులు విశ్వసిస్తున్నట్లుగా పాత నిబంధనలో ఉన్నది.
క్రొత్త నిబంధనలో యేసు తండ్రి దేవుడు అని ఇంకా స్పష్టంగా తెలిపాడు. తండ్రి తనకు దేవుడుగా ఉన్నట్లు పలుమార్లు యేసు తెలుపుతున్నాడు. పక్షుల కంటే, అడవి పూవుల కంటటే మానవులను పరలోకపు తం & ఉ ఎరడి ప్రేమించి పోషిస్తున్నాడని యేసు తెలుపుతున్నాడు. తండ్రి దేవుడనే సత్యం యేసు మాటలలో మనకు అర్థమవుతుంది. (మత్త 6:26 -33). తండ్రి దేవుడుగా తనకు అప్పగించిన పనిని జరిగిస్తున్నట్లు యేసు తెలిపాడు. తన మరణానికి ముందు యేసు ప్రార్థించాడు. ఆ ప్రార్ధనలో తండ్రి దేవుడనే సత్యం యేసు వ్యక్తం చేశాడు (యోహా17) పౌలు కూడ తన పత్రికలో అనేకచోట్ల తెలియచేశాడు (గలతీ 1:4; ఎఫెసీ 1:2; ఫిలిప్పీ 1:2; ఫిలిప్పీ 1:2; 1థెస్స 1:1; 2 థెస్స 1:2 ). ఈ లేఖన భాగాలలో పౌలు ‘తండ్రియైన దేవుడు’ అని పలుమారులు ఉపయోగించాడు. అలాగే యాకోబు 1:17; 1 పేతురు 1:1 లలో తండ్రి దేవుడని కనబడుతుంది.
త్రిత్వంలో రెండవవాడు యేసుక్రీస్తు దైవత్వం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుకు దైవత్వం లేదనేవారు లేకపోలేదు. అయితే లేఖనాలను పరిశీలన చేస్తే వారి భావం తప్పని గ్రహించవచ్చు. క్రీస్తు పుట్టుక, పునరుత్థానం, ఆరోహణలో క్రీస్తు దైవంగా కనుపిస్తాడు. ఆయన అధికారంతో మాట్లాడటం, పాపాలు, క్షమించడం, అద్భుతాలు జరిపించటం, ఆయన ముందు జ్ఞానం, పునరుత్థానం ఇవన్నీ క్రీస్తు దైవత్వాన్ని తెలుపుతాయి. మరీ ముఖ్యంగా యోహాను తన సువార్త ప్రారంభం నుండి చివర వరకు క్రీస్తు దైవత్వాన్ని మిక్కిలిగా తెలియజేస్తాడు (ఉదా కొల1:1-22 ) . మిగతా పత్రికలలో కూడా ఈ సత్యం మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక, ప్రకటన గ్రంథం మరి ఎక్కువగా క్రీస్తు దైవత్వాన్ని తెలుపుతాయి.
పరిశుద్ధాత్ముడు కూడా దైవత్వం కలిగియున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడని పాతనిబంధన, ముఖ్యంగా క్రొత్త నిబంధన తెలియజేస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని క్రీస్తు పరిశుద్ధాత్ముని ‘ఆయన’ అనే సర్వనామం వాడటంలో కనబడుతుంది. అంతేకాదు ఆయన దైవం, కొన్ని మాటలు గమనిద్దాం. పరిశుద్దాత్ముడు ఆదరణకర్త (యోహా 14:6), జ్ఞాన సహితుడు(1 కొరింథీ 2:10) వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని, దైవం అని చక్కగా కనబడుతుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా పరోక్షంగా కనబడతాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మగా సర్వవ్యాపకుడుగా (కీర్త 104:30; యోబు 33:4) జీవాత్మగా (యోహా 3:6-8) తెలియచేయబడింది.
పైన ఉదహరించబడిన విధంగా త్రిత్వంలోని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దైవత్వం కలిగి ఉన్నారని, ఈ ముగ్గురు ఒకే దేవుడని, ఆయన బహుళత్వంగా, ఏకత్వంగా ఉన్నారని మనం చూచాం.
మిషనరీ చరిత్రల కొరకు.. click here