అంశం: ఏ చెవులు నీవి.
Pastors Messages Pdf Telugu
మూలవాక్యము : చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు.
(యెషయా గ్రంథము) 55:3
3.చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
55:3 A ఆది 17:7; కీర్తన 78:1; సామెత 4:20; యిర్మీయా 32:40; మత్తయి 11:28; యోహాను 10:27; B యెషయా 54:8; 61:8; యోహాను 5:24-25; 6:37; అపొ కా 13:34; C లేవీ 18:5; 2 సమూ 7:8-17; 23:5; కీర్తన 89:28, 35-37; 119:112; యిర్మీయా 30:9; 33:20-21, 26; 50:5; యెహె 37:24-25; మత్తయి 17:5; యోహాను 8:47; హీబ్రూ 13:20; D మత్తయి 13:16; యోహాను 6:44-45; 7:37; రోమ్ 10:5
1.) దురద చెవులు.
(రెండవ తిమోతికి) 4:3
3.ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
“దురద చెవులు కలిగి”– ఇలాంటివారు తమకిష్టం వచ్చినట్టు చేస్తూ తమ చెవులకు ఇంపైన విషయాలనే వినపడాలని ఇష్టపడతారు. “ఏది నిజం?” అని కాదు వారి ప్రశ్న. “ఏది నన్ను సంతోషపరుస్తుంది?” అనేదే వారికి ముఖ్యం (దీన్ని వారు మాటలతో పైకి చెప్పరు). సత్యమంటే వారికి ఇష్టం లేదు. ఎందుకంటే సత్యం వారి జీవిత విధానానికీ, వారికిష్టమైనదానిని చేయడానికీ అడ్డుపడుతుంది. అందుకే వారు సత్యం అనే వెలుగుకు దూరంగా చీకట్లోకి తొలగిపోతారు. ఇదే వారి గొప్ప పాపం, దోషం – యోహాను 3:18-20. దేవుడిచ్చే పాపవిముక్తి, రక్షణ పొందాలంటే అన్నింటికంటే ముఖ్యంగా దేవుని సత్యాన్ని ఆశించాలి. కానీ ఈ మనుషులు దేవుని సత్యాన్ని ఆశించరు సరిగదా ఆశించాలనుకోరు కూడా. 2 తెస్స 2:10-12 చూడండి.
2.) ధన్యకరమైన చెవులు.
(మత్తయి సువార్త) 13:16
16.అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
3.) దాసుని చెవులు.
(నిర్గమకాండము) 21:6
6.వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
21:6 కొందరు యజమానులు తమ బానిసలను ఎంత బాగా చూచుకునేవారంటే, ఆ బానిసలు జీవితాంతం అక్కడే నిలిచి సేవ చేయడానికి ఇష్టపడ్డారు. దేవునిపట్ల నిజ విశ్వాసికి పరిస్థితి ఇదే. ఇలాంటి స్థితిలోనే అతడు సంతోషిస్తాడు. అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలో కూడా క్రీస్తే విశ్వాసులకు ఉత్తమ ఆదర్శం (హీబ్రూ 10:7; కీర్తన 40:6-8; యోహాను 8:29; రోమ్ 15:8). క్రొత్త ఒడంబడికలో విశ్వాసులకు దాసులు, సేవకులు అని పేరు (రోమ్ 6:17-22).
4.) వినే చెవులు.
(యెషయా గ్రంథము) 55:3
3.చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
5.) శుద్ధి చేయబడిన చెవులు.
(లేవీయకాండము) 14:14
14.అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైనదాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను, దానిని చమరవలెను.
6.) వినేవాటిని విడిచిపెట్టని చెవులు.
(హెబ్రీయులకు) 2:1
1.కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.
7.) బుద్ధిగలవాని చెవులు.
(మత్తయి సువార్త) 7:24
24.కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
8.) తెరవబడిన చెవులు.
(మార్కు సువార్త) 7:35
35.అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.
9.) వినని చెవులు.
(యెషయా గ్రంథము) 42:20
20.నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.
10.) వినలేని చెవులు.
(రోమీయులకు) 11:8
8.ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
ప్రశ్నలు – జవాబులు .. click here
Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf Pastors Messages Pdf