చింతను చంపెయ్యండి – Bible Motivation Telugu

Written by biblesamacharam.com

Published on:

చింతను చంపెయ్యండి.

Bible Motivation Telugu

 మనం సమస్తం విడిచిపెట్టి దేవునిపై భారం వేద్దామని చెప్పుకుంటాం. పరిస్థితి ఆయన చేతిలోనే ఉందని ఒప్పుకుంటాం. ఇవన్నీ చెప్పుకోవడం వరకు మాత్రమే! ఆచరణలో మాత్రం తరచు ఇందుకు భిన్నంగానే ప్రవర్తిస్తాం. వాస్తవం ఏమిటంటే అన్నీ దేవునికి విడిచిపెట్టామని చెప్పుకుంటూనే ప్రతి పరిస్థితిలోను మన తెలివిని ఉపయోగించి నేర్పుతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తూంటాం. 

 అన్నిటిని ఆయనకే విడిచిపెట్టామని చెప్పుకుంటూనే అనేక విధాలుగా ఉపాయాలూ పన్నుతుంటాం. దేవునిపై భారం వేశామని అంటూనే, మన ఆలోచనకు తట్టిన ప్రయత్నాలన్నీ చేసేస్తుంటాం. 

 కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే సొంత ప్రణాళికల మీద ఆధారపడటం మనకు తగని విషయం. 

 సమస్తమూ ఆయనే చూసుకుంటాడు అని అంటుంటాం. కానీ దాని విషయమై ఆందోళన చెందుతూ ఉంటాం. ఆయన చేతుల్లోనే ఈ సంగతి ఉంచాను అని చెబుతాం. మళ్లీ ఆయన చేతుల్లోంచి లాక్కోటానికీ ప్రయత్నం చేస్తాం. 

 తిరుగుబాటు చేసే పిల్లలు గూర్చి… త్రాగుబోతైన భర్తను గూర్చి ఆయనకే అప్పచెప్పాను అంటామే గానీ భవిష్యత్తును గూర్చి బెంగపడతాం. వాళ్ల పరిస్థితి రేపు ఎలా ఉంటుందోనని హైరానా పడుతుంటాం. ఇదంతా విశ్వాసానికి వ్యతిరేకం. 

 ఒకానొక వ్యక్తి ఎల్లప్పుడు నిరాశపరుడై ప్రతిదానికీ సణుక్కుంటూ ఉండేవాడట. తన కథంతా వినడానికీ ఓ గంట సమయం ఖాళీగా ఉంటేనే తప్ప, అతని స్నేహితులెవ్వరూ “నువ్వెలా ఉన్నావు?” అంటూ అడగటానికి కూడా సాహసించేవారు కాదట. 

 కాని ఒకరోజు తానెంతో సంతోషంగా ఉండటం చూసి, తన మిత్రుడు అతనితో – “ఏమిటీ ఇంత సంతోషం… కారణమేమిటి?” అంటూ ప్రశ్నించాడు. 

 అతడు – “ఈ ప్రపంచంలో నేను విచారించ వలసిన ఒక్క చింత కూడా నాకు లేదు” అంటూ జవాబిచ్చాడు. దానికతని మిత్రుడు ఆశ్చర్యపడి, “ఇది చాలా వింతగా ఉందే! నీ సమస్యలన్నీ ఎలా పోగొట్టుకున్నావు?” అని అడిగాడు. అందుకతడు – నా సమస్యలన్నిటిని నాకంటే చక్కగా మోసే ఒక వ్యక్తి నాకు దొరికాడు. నా సమస్యలన్ని మోయటానికి అతనికి వారానికి ఐదువందల రూపాయాలు కూడా ఇస్తాను” అని చెప్పాడు. 

 ఆ స్నేహితుడు ఇంకా ఆశ్చర్యపోయి – “నిన్ను చూస్తే, ఒక్కపూట కూటి కొరకే ఎన్నో అవస్థలు పడుతున్నట్టుగా ఉన్నావు! మరి వారానికి ఐదువందల రూపాయలు ఎలా ఇస్తున్నావు?” అని ప్రశ్నించాడు. 

 అతడు – “దాని గురించి చింతించటం కూడా అతని సమస్యేగాని నా సమస్య కాదు” అంటూ జవాబిచ్చాడు. 

 మనం దేవునికి మన సమస్యలను అప్పగించినప్పుడు వాటిని పూర్తిగా ఆయన చేతికే విడిచిపెట్టాలి. మనమెన్నిసార్లు దేవుని యెదుట మన సమస్యలను ఉంచి ఆయన సన్నిధిని విడిచిన వెంటనే మరల వాటిని తలకెత్తుకుంటున్నాం? మనము వాటిని దేవునికప్పగించి వాటి గురించి ఆయనేమి చేయగలడా అని అదే పనిగా చింతిస్తూ ఉంటాం? 

 అలాంటి పరిస్థితులలో మనం ఆశించే వాటిని చేయటం దేవునికి సాధ్యమవుతుందా? అని చింతించటమే మన అసలు సమస్య. కాబట్టి చింతను చంపేద్దాం. 

 చితి చచ్చినవాన్ని కాలుస్తుంది – చింత బదికిన వానిని నిలువెల్లా కాల్చేస్తుంది! 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted