అంశం : యవ్వనము నందు
Sevakula Prasangaalu Telugu
మూలవాక్యము : నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము
(రెండవ తిమోతికి) 2:22
22.నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
2:22 1 తిమోతి 6:11; 2 పేతురు 1:3-9 చూడండి. గొప్ప అపాయం నుంచి పారిపోయినట్టు కొన్ని విషయాల నుంచి మనం పారిపోవాలి. ఇంకొన్ని విషయాల వెనుక పరుగెత్తాలి. యువకులలో కొన్ని చెడు కోరికలు చాలా బలమైనవి. వీటితో వ్యవహరించవలసిన ఉత్తమమైన మార్గం ఏమిటంటే వాటిని తృప్తిపరచుకునే అవకాశాలకు దూరంగా ఉండడమే.
2:22 A కీర్తన 66:18-19; 119:9; ప్రసంగి 11:9-10; 1 కొరింతు 6:18; 10:14; 1 తిమోతి 1:5; 4:12; 6:11; హీబ్రూ 12:14; 1 పేతురు 2:11; 3:11; 3 యోహాను 1; B 1 దిన 29:17-18; రోమ్ 14:19; 15:5-6; 1 కొరింతు 1:10; C అపొ కా 9:14; రోమ్ 14:17; 1 కొరింతు 1:2; 14:1; D కీర్తన 17:1; సామెత 6:5; 1 తిమోతి 2:8; E సామెత 15:8; 1 తిమోతి 1:14
1.) యవ్వనేచ్ఛలకు దూరముగా ఉండుట.
(కీర్తనల గ్రంథము) 78:63
63.అగ్ని వారి యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను. 119:9
78:63 A యిర్మీయా 7:34; B యిర్మీయా 16:9; C సంఖ్యా 11:1; ద్వితీ 29:20; 32:22; కీర్తన 78:21; యెషయా 4:1; యిర్మీయా 25:10
2.) పవిత్ర హృదయము కలిగియుండుట.
(కీర్తనల గ్రంథము) 119:9
9.(బేత్) యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
119:9 ఒక యువకుడు అడగతగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాల్లో ఒకటి. దీనికి జవాబు ఇందులోనూ తరువాతి వచనాల్లోనూ కనిపిస్తున్నది. జీవిత శుద్ధి ఎలా సాధ్యమంటే అది దేవుని వాక్కును అభ్యాసం చేయడం వల్ల (వ 9), అలా చేసేందుకు దేవుని కృపనూ బలాన్నీ వెదుకుతూ ఉండడం వల్ల (వ 10), ఆలోచనలకూ ఆశలకూ దేవుని వాక్కునే కేంద్రంగా చేసుకోవడం వల్ల (వ 11), దేవుని సహాయం మూలంగా ఆయన వాక్కుకు అర్థం నేర్చుకుంటూ (వ 12) నేర్చుకున్న తరువాత ఆ వాక్కును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల (వ 13), అందులో ఆనందిస్తూ, దాన్నే ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం వల్ల (వ 14-16) కలుగుతుంది.
119:9 ద్వితీ 6:6-9; 17:18; యెహో 1:7; 2 దిన 6:16; యోబు 1:5; 13:26; కీర్తన 1:1-3; 19:7-11; 25:7; 34:11; 78:4-8; 119:11, 97-105; సామెత 1:4, 10; 4:1, 10-17; 5:7-23; 6:20-35; 7:7; ప్రసంగి 11:9—12:1; లూకా 15:13; యోహాను 15:3; 2 తిమోతి 2:22; 3:15-17; తీతు 2:4-6; యాకోబు 1:21-25
3.) ప్రార్థన జీవితము కలిగియుండుట.
(సామెతలు) 15:8
8.భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయ ములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
“నిజాయితీపరుల ప్రార్థన”– వ 29; కీర్తన 145:18; యోహాను 9:31. తన ప్రజలు ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వారిని దీవించేందుకూ వారిలో, వారిద్వారా పని చేసేందుకూ ఆయన నిర్దేశించిన సాధనాలలో ప్రార్థన ఒకటి. వారి ప్రార్థనలు వినాలనీ వారితో కలిసిమెలసి ఉండాలనీ ఆయన కోరిక. కాబట్టి నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే ఆయన మురిసిపోతాడు.
4. నీతిని కలిగియుండుట.
(యోబు గ్రంథము) 36:7
7.నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
36:7 A కీర్తన 33:18; 34:15; B 1 సమూ 2:8; కీర్తన 113:7-8; C కీర్తన 112:7-10; జెఫన్యా 3:17; 2 తెస్స 3:3; 1 పేతురు 3:12; D ఆది 23:6; 41:40; 2 సమూ 7:13-16; 2 దిన 16:9; ఎస్తేరు 10:3; యోబు 1:3; 42:12; కీర్తన 78:70-72
5.) విశ్వాసమును కలిగియుండుట.
(యోహాను సువార్త) 3:18
18.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.
3:18 రోమ్ 8:1. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయనెంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారూ అంతే (రోమ్ 3:24-25; 5:1; ఎఫెసు 1:7; కొలస్సయి 2:13; 1 యోహాను 2:12). అందువల్ల వారికిక శిక్షావిధి లేదు. క్రీస్తును నమ్మనివారి సంగతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారి పాపాలకు దేవుడు చూపిన ఏకైక నివారణను వారు నిరాకరిస్తున్నారు. దేవుని అతి శ్రేష్ఠమైన ఉచిత వరాన్ని విసర్జించడం ద్వారా తమ పాపాల జాబితాలో పాపాలను ఇంకా కలుపుతూ, తమ అపనమ్మకం మూలంగా దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నారు (1 యోహాను 5:10). ఇలాంటివారికి శిక్ష విధించడం తప్ప మరేదీ మిగలదు. బైబిలు ఉపదేశంలో నమ్మకానికి ఉన్న ప్రాధాన్యతను మళ్ళీ గమనించండి.
6. ప్రేమను కలిగియుండుట.
(ద్వితీయోపదేశకాండము) 19:8
8.మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమా ణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చిన యెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు
19:8 A ఆది 15:18-21; నిర్గమ 23:31; 34:24; ద్వితీ 12:20; B ఆది 28:14; ద్వితీ 11:24-25; 1 రాజులు 4:21; ఎజ్రా 4:20
7.) సమాధానమును కలిగియుండుట.
(కీర్తనల గ్రంథము) 34:14
14.కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
34:14 A కీర్తన 37:27; సామెత 3:7; రోమ్ 12:18; హీబ్రూ 12:14; 1 పేతురు 3:11; 3 యోహాను 1; B రోమ్ 12:9; C రోమ్ 14:19; D 2 కొరింతు 13:11
8.) దర్శనము కలిగియుండాలి.
(యోవేలు) 2:28
28.తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.
“మీ కొడుకులు, కూతుళ్ళు”– అంటే ఇస్రాయేల్ ప్రజలు. ఇస్రాయేల్కు దేవుడు తన ఆత్మను ప్రసాదించడానికి సంబంధించిన వాగ్దానాలు మరి కొన్ని ఉన్నాయి. యెహె 36:27-28; 37:14; 39:29 చూడండి. ఈ వాగ్దానాల సందర్భాలను బట్టి చూస్తే వీటిని దేవుడు నెరవేర్చేకాలం భవిష్యత్తులోనే ఉంది. పెంతెకొస్తు దినాన ఆరంభం జరిగిందంటే భవిష్యత్తులో ఒక సారి చివరిగా ఇస్రాయేల్ పై ఆత్మను కుమ్మరించడం ఉండదని అర్థం కాదు.
All Pdf……….Download