దశమ భాగము ఇవ్వాలా వద్దా | Dhashama Bhaagamu Ivvala Vadda 5

దశమభాగం దేవునిది.

Dhashama Bhaagamu Ivvala Vadda

1.) దశమభాగం దేవుని సొమ్ము.

(లేవీయకాండము) 27:30

30.భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

“యెహోవాది”– దేవుని ప్రజలిచ్చే ఈ అర్పణలు దేవుని సేవకుల పోషణకోసం. ఇవ్వాలని దేవుడు చెప్పిన విధంగా వారు ఇవ్వకపోతే ఆ తప్పుకు రావలసిన ఫలితాలు వారు అనుభవిస్తారు. ఇవ్వడం గురించి 2 కొరింతు 9:15 నోట్, రిఫరెన్సులు.

27:30 A ఆది 28:22; B ఆది 14:20; 2 దిన 31:5-6, 12; నెహెమ్యా 10:37-38; 13:12; మలాకీ 3:8-10; మత్తయి 23:23; లూకా 11:42; 18:12; C సంఖ్యా 18:21-24; ద్వితీ 12:5-6; 14:22-23; నెహెమ్యా 12:44; 13:5; హీబ్రూ 7:5-9 Dhashama Bhaagamu Ivvala Vadda

(ద్వితీయోపదేశకాండము) 14:22

22.ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.

14:22 A ద్వితీ 12:17; B సంఖ్యా 18:21; ద్వితీ 12:6; నెహెమ్యా 10:37; C లేవీ 27:30-33; D ద్వితీ 26:12-15

2.) పదియవ వంతు చెల్లించిన యాకోబు.

(ఆదికాండము) 28:22

22.మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

28:22 “పదో భాగం”– 14:20; లేవీ 27:30; సంఖ్యా 18:21; ద్వితీ 14:22; మలాకీ 3:8. ఒక వ్యక్తి ఆదాయంలో పదో భాగం దేవుడు తన ప్రజలనుండి కోరుతున్న కనీసమైన అర్పణ. అయితే తన వాగ్దానాల నెరవేర్పుకోసం యాకోబుకు దేవుడు ఈ షరతు పెట్టలేదు.Dhashama Bhaagamu Ivvala Vadda

3.) దశమభాగం స్వాస్థ్యము.

 (సంఖ్యాకాండము) 18:2

2.మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెనుDhashama Bhaagamu Ivvala Vadda

18:2 A ఆది 29:34; B సంఖ్యా 3:6-13; 4:15; 8:19, 22; 16:40; 17:7; 18:4; 1 దిన 16:39-40; 2 దిన 30:16; యెహె 44:15

4.) దశమభాగము ఇచ్చిన హిజ్కియా.

(రెండవ దినవృత్తాంతములు) 31:5

5.ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.

31:5 A నెహెమ్యా 13:12; B సంఖ్యా 18:12; C నిర్గమ 22:29; 23:19; 34:22, 26; 35:5, 20-29; 36:5-6; 2 దిన 24:10-11; నెహెమ్యా 10:35-39; 12:44; 13:31; 1 కొరింతు 15:20; 2 కొరింతు 8:2-5; యాకోబు 1:18; ప్రకటన 14:4; D సామెత 3:9

5.) దశమభాగంంలో దశమ భాగం.

(సంఖ్యాకాండము) 18:26

26.నీవు లేవీయులతో ఇట్లనుమునేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.

  • ఎవరికి ఇవ్వాలి?

1.)  యాజకునికి.

 (నెహెమ్యా) 10:37

37.ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.

10:37 “పదో భాగాన్ని”– ఆది 14:20. లేవీ 27:30; మలాకీ 3:8-10. ఆలయంలో పని చేసేవారి పోషణ పదో భాగాలు అర్పణలవల్లే. దేవుని పని కొనసాగాలంటే ప్రజలు ఇలాంటి అర్పణలివ్వడం తమ బాధ్యత, అధిక్యత అని గమనించాలి.Dhashama Bhaagamu Ivvala Vadda

(హెబ్రీయులకు) 7:5

5.మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని

“పదో భాగం”– లేవీ 27:30; సంఖ్యా 18:24-28.

7:5 “లేవి”– పాత ఒడంబడికలోని యాజులంతా ఇస్రాయేల్ లోని లేవిగోత్రం నుంచే వచ్చారు (సంఖ్యా 1:48-53; 3:5-10). అహరోను లేవి గోత్రికుడు.

  •  ఇస్తే లాభం ఏమిటి?

(రెండవ దినవృత్తాంతములు) 31:5

5.ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.

1.) సమృద్ధి.

 (రెండవ దినవృత్తాంతములు) 31:10

10.యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులుచున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా

2.) పట్టజాలని దీవెనలు.

 (మలాకీ) 3:10

10.నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“నన్ను పరీక్షించండి”– అపనమ్మకం మూలంగా దేవుణ్ణి పరీక్షించకూడదు (నిర్గమ 17:2; ద్వితీ 6:16; కీర్తన 78:18, 41, 56; 106:14; 1 కొరింతు 10:9). దేవుడిక్కడ మాట్లాడుతున్నది వేరే రకమైన పరీక్ష. తన వాగ్దానాలను నమ్మి, లోబడి ఫలితాలు ఎలా ఉంటాయో చూడమని ఇస్రాయేల్‌తో అంటున్నాడు ఆయన మనందరికీ కూడా ఇలాంటి వాగ్దానమే ఇచ్చాడు – లూకా 6:38. నమ్మిక కలిగి, విధేయులై ధారాళంగా ఇచ్చేవారిని దీవించడమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనలో ఇలాంటి లక్షణాలేవీ లేకపోతే ఆయన దీవెనలను మనం ఆశించరాదు.

3.) పంటకు కాపుదల.

 (మలాకీ) 3:11

11.మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడుDhashama Bhaagamu Ivvala Vadda

3:11 A హగ్గయి 2:17; B ద్వితీ 11:14; యోవేలు 2:22; ఆమోసు 4:9; 7:1-3; C యిర్మీయా 8:13; యోవేలు 1:4, 12; 2:20; హబక్కూకు 3:17; జెకర్యా 8:12; D యోవేలు 1:7

4.) ఇవ్వకపోతే నష్టము ,శాపం.

(మలాకీ) 3:9

9.ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులైయున్నారు.

5.) దీవెన లేదు.

(మలాకీ) 3:10

10.నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6.) పంట నాశనం.

 (మలాకీ) 3:11

11.మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు Dhashama Bhaagamu Ivvala Vadda

 


మిషనరీ జీవిత చరిత్రల కోసం క్లిక్ చేయండి.. క్లిక్ హియర్ 

Leave a comment

error: dont try to copy others subjcet.