క్రిస్మస్ చేయవచ్చునా?
Can We Celebrate Christmas Telugu
ప్రశ్న : నేటి క్రైస్తవ సంఘాలలో కొందరు క్రీస్తు పుట్టిన దినమైన క్రిస్మసును సంఘముగా కొనియాడుచున్నారు. కొందరు ఆలాగు చేయుట సరికాదని భావిస్తున్నారు. ఆ దినమున కనీసము ప్రార్థనా కూడికను కూడ పెట్టక సంఘమును మూసియుంచుచున్నారు. గనుక క్రైస్తవుడు క్రిస్మసును చేయవచ్చునా? చేయ కూడదా?
జవాబు : క్రిస్మస్ చేయుట తప్పుకానేరదు. నా మట్టుకైతే ప్రతిరోజు ప్రతి నిత్యము క్రిస్మస్ చేస్తున్నాను. దేశమంత నాలాగే అను నిత్యం క్రిస్మస్ చేయాలని వాంఛిస్తు ప్రయాస పడు చున్నాను. మొదటిగా క్రిస్మస్ అనగా నేమి? తెలుసు కొందాము. “క్రిస్టోస్” అను గ్రీకు పదము మాస్ అనే లాటిన్ పదజాలమున కలయికే క్రిస్మస్ అని ధ్వనించడమైనది. “Chris+tMas” దీని అర్ధమేదనగా అభిషిక్తుని పూజ లేక క్రీస్తు ఆరాధన అని భావమై యున్నది. యిట్టి క్రిస్మసు ను నిత్యము నేను చేస్తున్నాను. నా దేశ ప్రజలంత చేయుటకు కృషి చేస్తున్నాను.
క్రిస్మసును క్రైస్తవులు ఎప్పటి నుండి అనుసరిస్తున్నారు? యేసుక్రీస్తు వారు 33 1/2 సంవత్సరాలు బ్రదికారు. మరియ యోసేపు ఒక సంవత్సరమైనను జన్మ దినోత్సవము చేసినట్లు బైబిల్ నందు ఆనవాలు కనిపించుట లేదు. మరియు ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడయినను, ఆయన ఆరోహణమై వెళ్ళినపుడయినను జన్మదినోత్సవమును అనుసరించినట్టుగాని తెలియట్లేదు. అయితే యిదెట్లు ప్రవేశమాయెను?
క్రీ.శ. 4వ శతాబ్దములో రోమా చక్రవర్తి యైన “కాన్ స్టేంటైన్” (Constantine) క్రీస్తును అంగీకరించి యుండెను. అతని దినముల యందే క్రైస్తవ్యమును ప్రపంచ మతముగా ప్రకటించెను. క్రైస్తవులను శిక్షించడము మాన్పించెను. రోమా రాజధానిలో “శని గ్రహ పూజను బహు బ్రహ్మాండముగా కొనియాడు దురు. కాన్స్టెంటైన్ క్రీస్తును అంగీ కరించిన పిమ్మట ఆయనలో ఈలాంటి తలంపు పుట్టింది. ఏ విధము చేతనైనను రోమాలో (Saturanlia) శని గ్రహ పూజను మాన్పింప నెంచి ఆలోచించి, వారు పూజ పునస్కారాలు చేయు దినమగు డిసెంబర్ 25న అభిషిక్తుని పూజయగు క్రిస్మసు అని ప్రకటిస్తే జనము లందరు యిక విశేషమైన శని గ్రహ పూజ మానుకొని క్రీస్తుపూజలు ప్రారంభమవుతా యని యెంచి కాన్స్టెంటైన్ అను రోమా చక్రవర్తి డిసెంబర్ 25వ తేదిని క్రీస్తు ఆరాధన దినముగాను లేక పుట్టుక దినముగాను ప్రకటించాడు. అప్పటి నుండి అనగా .శ. 400 సంవత్సరము డిసెంబర్ 25 నుండి క్రైస్తవ ప్రపంచములో క్రిస్మస్ అనబడు క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రారంభమైనాయి.
ఖగోళ శాస్త్రమును బట్టి చూచినపుడు డిసెంబర్ 24 రాత్రితో శీతాకాలము పూర్తి యవుతుంది. అంచేత 25న గంభీరముగా Saturnalia (శనిగ్రహ పూజలు) కొని యాడుదురు. గనుక సృష్టికి కాకా సృష్టి కర్తకు పూజ చేయాలన్న తాత్పర్యముతో కాన్స్టాంటైన్ ఆలాగు చేసాడు. నిజానికి ఆపైన రోమాలో శనిగ్రహ పూజలు తగ్గుముఖము పట్టాయని చరిత్ర సాక్ష్యమిస్తుంది. ప్రపంచ చరిత్ర నాయకుడు (Hero) గా క్రీస్తు మిగిలియుండుట జగమెరిగిన సత్యమైయున్నది. ఒకరు ఎప్పుడు పుట్టారు; ఎప్పుడు గిట్టారు అని చెప్పుటకు క్రీ.పూ. క్రీ.శ. అని గుర్తింపబడునట్లు చరిత్ర నాయకుడాయన. History Tells HIS STORY (History) కనుక చరిత్ర నాయకుడైన క్రీస్తు భూలోకమున పుట్టినది నిజము. ఆదియు అంతము అల్పయు ఓమెగయు ఆయనే. గనుక మరి ఏ కారణం చేతనో ఆయన పుట్టిన తేదిని సువార్తీకులైనను అపొస్తలులైనను గుర్తింప లేకపోయిరి.
యించేత ఏదోక దినమును ఆయన జన్మదినమును కొనియాడుట తప్పు కాదని క్రిస్మసును చేయువారి వాదన. యింకొక్కరి వాదమేదనగా డిసెంబర్ 25న చేస్తున్నది శని గ్రహ పూజ గనుక అది క్రిస్మసని చేయరాదని వాదింతురు. వాస్తవానికి డిసెంబర్ 25న క్రీస్తు పుట్టకపోయిన క్రీస్తు జన్మ దినమును కొనియాడువారు “శని గ్రహమున తలంచి పూజించుటయో, ప్రార్థించుటయో లేదు కదా? అపొస్తలుడును పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 1:15-17 వాక్య భాగములో అభిప్రాయ పడినట్టు ఏదోక విధంగా క్రీస్తును ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నారు. అటువంటి దినమొకటి లేకుంటే ఏడాది ఆరాధికులకు వాక్యమందించే అవకాశముండదు గదా? అట్టి వారికి మీరు పండుగ క్రైస్తవులని పేరిడినను ఆ దినమందైనా ఆత్మల భారముతో వాక్యోపదేశము చేయునప్పుడు పండుగ క్రైస్తవులు సంధింప బడగలరు గదా! కావున ప్రియ పాఠకులారా, క్రిస్టో – మాస్ అను క్రీస్తు ఆరాధన ఏడాది కొకసారి మాత్రము కాక కీర్తనకారుడు సూచించి న విధముగా దివారాత్రములు ధ్యానిస్తు ఆరాధిస్తు ఆనందించుడి!
“యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనం దించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు” (కీర్తన 1:2) అను లేఖనమును బట్టి క్రీస్తు ధ్యానారాధన యగు క్రిస్మసు అను దినము అనునిత్యము చేయుచుండవలెనని ఆశిస్తున్నాను. ఆలాగు చేయుడి. ప్రభువు నిశ్చయముగా మీయందు శ్రద్ధ నిలిపి దీవించును గాక!
రచయిత: Dr.vasantha babu gaaru.
wekipedia about christmas click here
ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి