...

క్రీస్తు జీవిత చరిత్ర|JESUS LIFE HISTORY TELUGU|PART1

క్రీస్తు జీవిత చరిత్ర

JESUS LIFE HISTORY TELUGU

A : ఉపోద్ఘాతము 

    మొదటి శతాబ్దపు పాలస్తీనా పరిస్థితి విదేశీయుల ఆక్రమణలో ఉన్న ఒక ఆధునిక దేశ పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు. విదేశీ సైన్యములు పాలస్తీనా వీధులలో కవాతు చేస్తూ ఉంటే వారి దురాక్రమణను వ్యతిరేకించు తీవ్రవాదులు పర్వతములలో తమ స్థావరములు ఏర్పరచుకొని అప్పుడప్పుడు సైన్యము మీద దాడులు చేస్తూ ఉండేవారు. విదేశీ అధికారులు ప్రజల చేత బలవంతపు చాకిరి చేయించేవారు, తరచు హింసాత్మక సంఘనలు జరుగుతూ ఉండేవి. అయితే రోమా చక్రవర్తులు తిరుగుబాటు దార్లను ఉక్కుపాదముతో అణచి వేసారు. 

    రోమనుల పాలనలో ఎదురవుతున్న అవమానములు, అధిక పన్నుల కారణముగా పాలస్తీనాలోని యూదులు అసంతృప్తితో లోలోపల రగులుతూ బాహ్యమునకు ఏమీ చెయ్యలేని మరియు రోమను పాలకులను ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు., అట్టి స్థితిలో ఉన్న వారిలో నుండి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ఆయన పాలస్తీనాలోని యూదుల స్థితిగతులపైన మాత్రమే కాక ప్రపంచ చరిత్ర అంతట మీద ప్రభావం చూపారు. 

ఆయన ఒక అనామక గ్రామంలో పుట్టి పెరిగారు

ముప్ఫై సంవత్సరముల వయస్సు వచ్చేవరకు వడ్రంగి వృత్తిలో కొనసాగారు

తరువాత మూడు సంవత్సరములు సంచార బోధకునిగా జీవితం గడిపారు

ఆయనకు స్వంత గృహము లేదు, ఆయనకంటూ ఓ కుంటుంబమూ లేదు

ఆయన ఏ కళాశాలలో విద్యనభ్యసింపలేదు

ఆయన జన్మించిన ప్రాంతము నుండి ఎక్కువ దూరము ప్రయాణించి ఎరుగరు

ఘనతను ఆపాదించగలిగిన పనులేవి ఆయన చేయలేదు

ఆయన యౌవనస్థునిగా ఉన్నప్పుడే ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది

ఆయన స్నేహితులు ఆయనను విడిచి పారిపోయారు

ఆయన విరోధులకు అప్పగింపబడ్డారు

వారు ఆయనను అపహాస్యం చేస్తూ, అనేక న్యాయస్థానాల చుట్టూ తిప్పారు

ఇద్దరు దొంగల మధ్య సిలువకు మేకులతో కొట్టారు

ఆయన సిలువలో వేదనననుభవిస్తుండగా తనకంటూ ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క స్వాస్థమైనటువంటి

పై వస్త్రము కొరకు ఆయనను సిలువ వేసినవారు చీట్లు వేసారు

ఆయన చనిపోయిన తరువాత వేరొకరి సమాధిలో ఆయన ఉంచబడ్డారు

ఆ తరువాత, 20 శతాబ్దములు ఏతెంచాయి గతించాయి

అనేకమంది గొప్ప రాజులు పరిపాలించారు చరిత్రలో కలసిపోయారు,

పేరెన్నికగల అనేక సామ్రాజ్యములు అధికారం చలాయించాయి, కాలగర్భంలో కలసిపోయాయి

తమ పధ ఘట్టనలతో అనేక రాజ్యాలను భీతిగొల్పిన సైన్యాలన్నీ,

ఆయాదేశాల విస్తారమైన నావికా దళాలన్నీ ఆయా రాజ్యాలను పరిపాలించిన ఘనత వహించిన,

పేరెన్నికగల రాజులందరు మానవ జీవితాల మీద చూపలేని ప్రభావమును

ఈ “ఒక్క ” వ్యక్తి  చూపగలిగారు ఆయనే యేసు క్రీస్తు

క్రీస్తు చరిత్రకు ఆధారములు : 

    క్రొత్త నిబంధనలోని నాలుగు సువార్తలలో పొందుపరచబడిన విషయములు తప్ప ఈ యేసు క్రీస్తు జీవితము, ఆయన బోధలను గూర్చి తెలిసికొనుటకు మరే ఆధారము అందుబాటులో లేదు. రోమా సామ్రాజ్యములో మూలన ఉన్న పాలస్తీనాలోని ఒక సంచార బోధకుని జీవితము రోమను చరిత్రకారుల దృష్టి పధములోనికి రాలేదు. ఒకరిద్దరు రోమను చరిత్రకారులు ఆయా సందర్భములలో ఒకటి రెండు సార్లు మాత్రమే యేసును గూర్చి తమ రచనలలో ప్రస్తావించారు. యూదు చరిత్రకారులు సైతం యేసును తమ రచనలలో విస్మరించారు. కేవలం జోసిఫస్ మాత్రమే తాను వ్రాసిన యూదుల చరిత్రలో ఒక్కచోట మాత్రమే యేసును గూర్చి వ్రాసాడు. 

    దీనిని బట్టి చూస్తే క్రీస్తు జీవితమునకు చెందిన విషయములన్నిటిని మనము కేవలము క్రొత్త’ నిబంధనలోని నాలుగు సువార్తల నుండి మాత్రమే సేకరించగలము. యేసు క్రీస్తు మరణించిన 30 సంవత్సరముల తరువాత మాత్రమే సువార్తలు కూర్చబడినాయి. ఈ సంవత్సరములన్నింటిలో యేసు జీవితమునకు, ఆయన బోధకు చెందిన విషయములన్నీ మౌఖిక పారంపర్యముల (Oral Traditions) రూపములోనే ఉన్నాయి. వాటన్నిటిని సేకరించిన సువార్తికులు నలుగురు (మత్తయి, మార్కు లూకా, యోహానులు) నాలుగు సువార్తలు వ్రాసారు. 

     అయితే ఒక వ్యక్తి జీవిత చరిత్రను నలుగురు వ్రాయుట ఎందుకు అన్న ప్రశ్న సహజంగా జనిస్తుంది. ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.( సువార్తలు క్రీస్తు జీవిత చరిత్రలు కాదు గాని క్రీస్తును గూర్చిన సాక్ష్యములు (Gospels are not biographies, but testimonies). కనుక నలుగురు రచయితలు తమ తమ ఉద్దేశ్యములకు, పరిస్థితులకు అవసరమయిన అంశములను ఎన్నుకుని, తమకు అనువైన పద్ధతిలో అమర్చి వ్రాసారు. ఈ ప్రక్రియ అంతటిని బట్టి సువార్తలు విశ్వసనీయతను ప్రశ్నించే అవకాశం ఎంతమాత్రము లేదు. ఎందుకంటే, 

  • *  సువార్తికులు నలుగురు క్రైస్తవులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
  • *“ సువార్తలలో చేర్చకుండా ఉపేక్షించదగిన విషయములను కూడా చేర్చి తమనిష్పాక్షికతను ప్రదర్శించారు. ఉదాహరణకు సువార్తలు వ్రాయు   సమయమునకు పేతురు సంఘ నాయకులలో అగ్రగణ్యుడైనప్పటికి అతని  తొందరపాటును గూర్చి, యేసును తిరస్కరించుటను గూర్చివ్రాయక మానలేదు. 
  • * సువార్తికులు యేసు జీవితమును తమ కళ్ళారా చూసినవారు, ఆయన బోధను  తమంతట తామే విన్నవారు, లేదా ప్రత్యక్షసాక్షులనుండి సేకరించి  వ్రాసారు. 
  • * యేసు ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకొనిన దేవుడు, యేసు ద్వారా సర్వలోకమును రక్షింపవలెనని నిర్ణయించిన దేవుడు ఆయన జీవితము, బోధనలను మరుగున పడిపోయేటట్లు చేయరు గాని భవిష్యత్ తరముల వారందరు ప్రయోజనం పొందునట్లు, అన్ని కాలములు, ప్రాంతముల ప్రజలకు అందుబాటులో నుండు నిమిత్తము నాలుగు సువార్తలను విశ్వసనీయమైన రీతిలో వ్రాయించారనుట నిర్వివాదమైన విషయం. 

ముందు నేర్చుకొనినట్లుగా నలుగురు సువార్తికులు తమదైన శైలిలో, తమ ఉద్దేశ్యములు, పరిస్థితులననుసరించి యేసు జీవితమును, బోధనలను గూర్చి వ్రాసారు. 

  •   మత్తయి యూదుల మత విశ్వాసములకు యేసు క్రీస్తుకు మధ్య గల సంబంధము మీద దృష్టిని కేంద్రీకరించాడు. పాత నిబంధనను నెరవేర్చుటకు మరియు తమ మతం పట్ల యూదుల నిర్లక్ష్య వైఖరిని బట్టి తీర్పు తీర్చుటకు యేసు ఈ లోకమునకు వచ్చారని మత్తయి వివరించాడు. పరిసయ్యుల వేషధారణ జీవితమును ఖండిస్తూ యేసు పలికిన మాటలను కేవలం మత్తయి మాత్రమే వ్రాసాడు. మత్తయి పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడినవాడై క్రీస్తును దావీదు కుమారునిగా, యూదులు అనేక ‘ సంవత్సరములుగా ఎదురుచూస్తున్న మెస్సీయగా చిత్రీకరిస్తూ యూదులనుద్దేశించి వ్రాసాడు.
  • మార్కు యేసు బోధలకంటే ఆయన చేసిన కార్యములపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ఆయనను అలుపెరగని దైవమానవ సేవకునిగా, పరిచారకునిగా, దాసునిగా చిత్రీకరిస్తూ రోమీయులనుద్దేశించి తన సువార్తను వ్రాసాడు. 
  •  లూకా గ్రీకులు, అన్యులనుద్దేశించి తన సువార్తను వ్రాస్తూ క్రీస్తును సంపూర్ణ మానవునిగా చిత్రీకరించాడు. సంపూర్ణ మానవుడైన యేసులో ప్రత్యక్ష పరచబడిన దేవుని కృప అనర్హులు అనబడు వారి మీద ఏవిధముగా క్రుమ్మరించబడినది వివరించాడు. 
  •  లోకమును రక్షించు నిమిత్తము తండ్రియైన దేవునిచే పంపబడిన దేవుని కుమారుడే యేసని వివరిస్తూ యోహాను తన సువార్తను వ్రాసాడు. ప్రజలందరు యేసు దేవుని కుమారుడైన క్రీస్తని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు వ్రాసానని యోహానే తన సువార్తలో పేర్కొన్నాడు (20:31). 

     యేసు జీవితము, పరిచర్యలను గూర్చి దీవెనకరమైన రీతిలో అర్ధము చేసికొనుటకు అవసరమయిన పూర్తీ సమాచారమును ప్రతి సువార్తికుడు తమ వంతు తాము అందించారు. ప్రతిసువార్త ఇతర సువార్తలను బలపరుస్తూ, స్థిరపరుస్తూ యేసును మరింత స్పష్టముగా చూచుటకు, ఆయనను మరింత విధేయతతో వెంబడించుటకు మనకు సహకరిస్తాయి.. 

ప్రశ్న. 

1.) ఒక్క వ్యక్తి(యేసు)జీవితమును గూర్చి నలుగురు వ్రాయడం ఎందుకు ?

(coment box లో మీ సమాధానం రాయండి ?)


వ్యాఖ్యాన శాస్త్రం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.

wekepedia jesus : క్లిక్ హియర్

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “క్రీస్తు జీవిత చరిత్ర|JESUS LIFE HISTORY TELUGU|PART1”

Leave a comment

error: dont try to copy others subjcet.
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.